ETV Bharat / city

Viveka Murder Case: సునీల్‌ యాదవ్​కు నార్కో పరీక్షలపై కోర్టులో వాదనలు - వివేకా హత్య కేసు వార్తలు

ఏపీ మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సునీల్​ యాదవ్​కు రిమాండ్​ను పొడిగిస్తూ జమ్మలమడుగు మెజిస్ట్రేట్​ ఉత్తర్వులు జారీ చేశారు. సునీల్​కు నార్కో పరీక్షల అనుమతిపై సీబీఐ దాఖలు చేసిన పిటిషన్​పై కోర్టులో వాదనలు జరిగాయి. ఈ మేరకు సెప్టెంబరు 1 వరకు రిమాండ్​ను పొడిగించింది.

Viveka Murder Case
వివేకా హత్య కేసు
author img

By

Published : Aug 18, 2021, 6:05 PM IST

ఆంధ్రప్రదేశ్​ మాజీమంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సునీల్‌ యాదవ్​కు రిమాండ్ పొడిగించారు. సెప్టెంబరు 1 వరకు పొడిగిస్తూ జమ్మలమడుగు మెజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేశారు.

సునీల్‌కు నార్కో పరీక్షలు

సునీల్‌కు నార్కో పరీక్షలకు అనుమతివ్వాలని కోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. నార్కో పరీక్షల పిటిషన్‌పై జమ్మలమడుగు కోర్టులో వాదనలు జరిగాయి. న్యాయస్థానం విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. పులివెందుల మెజిస్ట్రేట్ సెలవులో ఉండడంతో జమ్మలమడుగు కోర్టులో వాదనలు జరిగాయి. నార్కో పరీక్షల పిటిషన్‌పై ఈ నెల 27న పులివెందుల కోర్టులో విచారణ జరగనుంది.

కొనసాగుతున్న సీబీఐ విచారణ

వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ 73వ రోజు కొనసాగుతోంది. పులివెందుల ఆర్ అండ్ బీ అతిథి గృహంలో సీబీఐ విచారణకు కడప ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి వై.ఎస్.భాస్కర్ రెడ్డి, అవినాష్‌ రెడ్డి చిన్నాన్న వైఎస్ మనోహర్ రెడ్డి వరుసగా రెండోరోజు హాజరయ్యారు. నిన్న ఇద్దరినీ ప్రశ్నించిన సీబీఐ అధికారులు.. ఇవాళ మళ్లీ విచారణకు రావాలని ఆదేశించారు. వైఎస్ భాస్కర్ రెడ్డి పులివెందుల వైకాపా ఇన్​ఛార్జ్‌ కాగా.. మనోహర్‌రెడ్డి పులివెందుల మున్సిపల్ వైస్‌ ఛైర్మన్‌గా ఉన్నారు. వివేకా హత్య జరిగిన తర్వాత వైఎస్ కుటుంబ సభ్యులతో పాటు దాదాపు 20 మంది ఘటనా స్థలంలో ఉన్నారు. భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి ఆరోజు మృతదేహాన్ని చూసేందుకు వెళ్లారు. సీబీఐ అధికారులకు ఉన్న అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది. వివేకా కుమార్తె సునీత హైకోర్టుకు సమర్పించిన 15 మంది అనుమానితుల జాబితాలో వీరిద్దరూ ఉన్నారు. వీరికంటే ముందుగానే వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి సీబీఐ విచారణకు వెళ్లారు. ఎర్ర గంగిరెడ్డితో వీరికున్న సంబంధాలను బేరీజు వేసుకోవడానికి పిలిచినట్లు తెలుస్తోంది.

ఇటు.. కడప జైలు అతిథి గృహంలో సీబీఐ అధికారుల మరో బృందం అనుమానితుల విచారణ చేస్తోంది. సుంకేశుల గ్రామానికి చెందిన జగదీశ్వర్ రెడ్డి, సునీల్ బంధువు భరత్ కుమార్ యాదవ్, పులివెందులకు చెందిన నాగేంద్ర, మహబూబ్ బాషా, కుమార్ అనే వ్యక్తులను సీబీఐ ప్రశ్నిస్తోంది. మరోవైపు.. కడప జైలు అతిథి గృహంలో సీబీఐ అధికారులను వివేకా కుమార్తె సునీత కలిశారు. దర్యాప్తు సాగుతున్న కేసు వివరాలను అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. రెండు గంటలకు పైగానే ఆమె సీబీఐ అధికారులతో చర్చించారు.

ఇదీ చదవండి: Child marriage: కాసేపట్లో పెళ్లి... అధికారుల ఎంట్రీతో ఆగిపోయింది..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.