ఎంసెట్ సహా అన్ని ప్రవేశ పరీక్షల దరఖాస్తుల స్వీకరణ గడువును ఉన్నత విద్యా మండలి మరోసారి పొడిగించింది. మే 15 వరకు ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. లాక్డౌన్ కారణంగా ఎంసెట్, ఈసెట్, ఐసెట్, పీజీఈసెట్, లాసెట్, పీజీఎల్ సెట్, ఎడ్ సెట్, పీఈసెట్ దరఖాస్తుల గడువు పొడిగించినట్టు పేర్కొన్నారు. మే 2 నుంచి జరగాల్సిన పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. జూన్లో ఎంట్రన్స్ టెస్ట్లు నిర్వహించాలని భావిస్తున్న ఉన్నత విద్యా మండలి... లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత పరిస్థితులను బట్టి తుది నిర్ణయం తీసుకోనుంది.
ఇదీ చూడండి: కరోనాను పసిగట్టేందుకు శునకాలకు ప్రత్యేక శిక్షణ!