ప్రజలకు సంబంధించిన అన్ని అంశాలను ప్రజల కోసం పూర్తి స్థాయిలో చర్చిస్తామని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. అర్థవంతమైన చర్చ జరిగేలా వర్షాకాల సమావేశాలను ఎన్ని రోజులైనా నిర్వహించాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని ఆయన చెప్పారు.
రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్న ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తోందని ఈటీవీ భారత్ ముఖాముఖిలో మంత్రి తెలిపారు.