ETV Bharat / city

Tank bund: పర్యాటకుల్లో మరింత జోష్‌ నింపేందుకు ట్యాంక్ బండ్​కు కొత్త హంగులు - ట్యాంక్ బండ్ తాజా వార్తలు

రెండు వారాలుగా నగరవాసి వారాంతాపు విహారానికి చిరునామాగా మారింది ట్యాంక్‌బండ్‌. ఇప్పుడు దీనికి తోడు కొత్త హంగుల్ని అద్ది పర్యాటకుల్లో మరింత జోష్‌ పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది.

Tank bund
Tank bund
author img

By

Published : Sep 12, 2021, 4:58 AM IST

Updated : Sep 12, 2021, 5:12 AM IST

గత వారం ట్యాంక్‌బండ్‌పై పర్యాటక సందడి ఉన్న చిత్రాలతో.. దీనికి సంగీతం తోడైతే ఇంకా బాగుంటుంది.. పరిశీలించండంటూ మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. స్పందించిన పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ హెచ్‌ఎండీఏ తరఫున పలు కార్యక్రమాలు చేసేందుకు ఆదేశాలిచ్చారు. సెప్టెంబరు 12 నుంచి ఇవి మొదలు కానున్నాయి.

నేడే షురూ..!: ఆదివారం సాయంత్రం సికింద్రాబాద్‌ ఏఓసీకి చెందిన భారత్‌ సైన్యం బ్యాగ్‌పైపర్‌ బృందం సంగీత ప్రదర్శనతో ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. దీంతోపాటు సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకూ పలువురు జానపద గాయకులు, రాక్‌బ్యాండ్స్‌, ర్యాపర్ల, కచేరీలు, నృత్య ప్రదర్శనలు ఉండనున్నాయి. ఆహార స్టాళ్లు కొలువుదీరనున్నాయి. అయితే ఆట, పాటకు అదనంగా సాగర్‌లో నిర్వహించే లేజర్‌ షో కనువిందు చేయనుంది.

ప్రత్యేక బస్సులు: వారాంతపు వేడుకలకు వచ్చే పర్యాటకుల కోసం ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు గ్రేటర్‌ హైదరాబాద్‌ ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వర్లు ప్రకటించారు. ప్రత్యేక వినోద కార్యమ్రాలున్న నేపథ్యంలో.. నేటి నుంచి మొదలయ్యే వినాయక నిమజ్జనాల్లో ట్యాంక్‌బండ్‌కు వచ్చే వాటికి రాత్రి 10గంటల తర్వాతే అనుమతి ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు.

ఇవీ చూడండి: Simhachalam temple: సింహాచలం ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు

Last Updated : Sep 12, 2021, 5:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.