1. హైదరాబాద్ మేయర్‌కు కరోనా పాజిటివ్
హైదరాబాద్ మహానగర పాలక సంస్థ మేయర్ బొంతు రామ్మోహన్‌కు కరోనా పాజిటివ్ నిర్ధరణయింది. శనివారం మేయర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు ర్యాపిడ్ టెస్ట్ చేయించుకున్నారు. ఎటువంటి లక్షణాలు లేనప్పటికీ మేయర్ బొంతు రామ్మోహన్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. మొక్కలు తిన్న మేకలు.. యజమానులకు జరిమానా
ఖమ్మం జిల్లా కేంద్రంలో హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలు తిన్న ఏడు మేకలను పురపాలక సిబ్బంది బంధించింది. సోమవారంలోపు మేకకు మూడు వేల చొప్పున జరిమానా చెల్లించి తీసుకు వెళ్లాలని కమిషనర్ ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. మోసపోతున్న అమాయకులు
పోలీసులు, మీడియా ఎంత అవగాహన కల్పించినా కొంత మంది మోసపోతూనే ఉన్నారు. అమాయకత్వంతో సైబర్ నేరగాళ్ల వలలో పడి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. మోసపోయామని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. కాంగ్రెస్ శ్రేణుల అరెస్టు
దళిత కుటుంబానికి చెందిన రేవల్లి రాజాబాబు హత్యకు నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ విభాగం తలపెట్టిన ఛలో మల్లారం కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి భూపాలపల్లి జిల్లాలోని మల్లారం గ్రామానికి తరలివెళ్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకొని అరెస్టు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. 3 వేల మంది కరోనా రోగులు మిస్సింగ్
కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న కర్ణాటక బెంగళూరులో 3 వేల మందికి పైగా కరోనా రోగుల ఆచూకీ గల్లంతవడం కలకలం రేపుతోంది. ఏం చేయాలో దిక్కుతోచక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. వారి జాడ కోసం విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. బలనిరూపణకు కాదు, కరోనాపై చర్చకే!
రాజస్థాన్ అసెంబ్లీని ఎలాగైనా సమావేశపరచాలనే వ్యూహరచనలో భాగంగా బలనిరూపణ అంశాన్ని సీఎం అశోక్ గహ్లోత్ పక్కకు పెట్టినట్లు సమాచారం. రాష్ట్రంలో కొవిడ్ తీవ్రత, ఇతర బిల్లులపై చర్చించేందుకే సమావేశాలు ఏర్పాటుచేయాలనే కారణాలతో గవర్నర్ ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. కార్గిల్ యుద్ధం ఎలా జరిగిందో తెలుసా?
' కార్గిల్ విజయ్ దివస్' సందర్భంగా భారత సైన్యం ఓ ఆసక్తికర వీడియోను విడుదల చేసింది. ఇందులో ఆనాటి యుద్ధ ఘట్టాలను కళ్లకు కట్టేలా చూపించారు. ఇది ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. 'కరోనాతో క్రికెట్ సహజీవనం తప్పదు'
ఇంగ్లాండ్ పర్యటనకు ముందే పాకిస్థాన్ క్రికెటర్లకు కరోనా సోకిన వేళ.. ఆ దేశ క్రికెట్ బోర్డు సీఈఓ వసీమ్ ఖాన్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. క్రికెట్, కరోనాతో సహజీవనం చేయాల్సి ఉంటుందని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. వస్త్ర పరిశ్రమ పతనాన్ని అడ్డుకున్న ఫేస్‌మాస్క్!
ఫేస్‌మాస్క్‌లు.. ప్రస్తుతం మన జీవితాల్లో భాగమైపోయిన నిత్యావసర వస్తువు. మార్చి నెల ముందు వరకు ఆస్పత్రులు, ఫ్యాక్టరీల్లో మాత్రమే వాడే మాస్క్‌లు.. కరోనా కారణంగా ప్రతి ఒక్కరు వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. మొక్కలు నాటిన మెగా బ్రదర్స్
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో లక్ష మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించారు. ఇందులో మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్ సహా దర్శకులు అనిల్ రావిపుడి, బోయపాటి శ్రీను పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.