1. దరఖాస్తుల వెల్లువ
రాష్ట్రవ్యాప్తంగా ఎల్ఆర్ఎస్కు భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. ఇప్పటి వరకు 70 వేల 193 దరఖాస్తులు వచ్చాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. నాగులుది ప్రభుత్వ హత్యే
నాగులు మృతి పట్ల మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విచారం వ్యక్తం చేశారు. నాగులుది ప్రభుత్వ హత్యేనంటూ ధ్వజమెత్తారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. విచారణకు సాయి హాజరు
బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఎస్.ఆర్.నగర్ పీఎస్‌లో విచారణకు సాయిరెడ్డి హాజరయ్యాడు. నిన్నటి నుంచి దేవరాజ్ రెడ్డిని విచారించిన పోలీసులు.. అతను ఇచ్చిన ఆధారాలకు అనుగుణంగా సాయిని విచారించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. బిహార్‌లో భారీ పెట్రోలియం ప్రాజెక్టు
బిహార్‌లో నిర్మించిన రూ.900 కోట్ల విలువైన పెట్రోలియం ప్రాజెక్టులను జాతికి అంకితమిచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీటిని ప్రారంభించారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కీలక ప్రాజెక్టులను ప్రారంభించటం ప్రాధాన్యం సంతరించుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. ఎయిమ్స్‌లో చేరిన షా
కేంద్ర హోంమంత్రి అమిత్ షా మళ్లీ ఆస్పత్రిలో చేరారు. సాధారణ వైద్య పరీక్షల కోసమే షా... ఎయిమ్స్‌లో చేరినట్లు వైద్యులు ప్రకటించారు. పార్లమెంటు సెషన్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ పరీక్షలు చేయించుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. శునకాలకు పెరిగిన క్రేజ్
విదేశీ జాతి శునకాలను వీడి.. స్వదేశంలోని కుక్కలను పెంచుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కర్ణాటకలోని ముధోల జాతి శునకాలకు విపరీతంగా డిమాండ్ పెరిగిపోయింది. ఒక్కో కుక్క ధర గతంలో రూ.9వేలుగా ఉంటే.. ఇప్పుడది రూ. 18వేలు పలుకుతోంది. మరి ఈ 'మోదీ మెచ్చిన శునకాల' ఎలా ఉంటాయి? వీటి ప్రత్యకతలేంటి? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. నేపాల్‌లో భారీ వర్షాలు
నేపాల్‌లో భారీ వర్షాలు, వరదలతో జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. తాజాగా సింధుపాల్‌చౌక్ జిల్లాలో రెండు చోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. 18 ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనల్లో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. 20 మందికిపైగా ఆచూకీ గల్లంతైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. సరిహద్దు వివాదం
స్టాక్ మార్కెట్లపై ఈ వారం.. భారత్-చైనా మధ్య జరుగుతున్న సరిహద్దు వివాదం చర్చల ప్రభావం ప్రధానంగా ఉండనుంది. వీటితోపాటు ద్రవ్యోల్బణం గణాంకాలు, అమెరికా ఫెడ్ నిర్ణయాలు మార్కెట్ల గమనాన్ని నిర్దేశించనున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. ఇక ఆటకు రెడీ
స్పాట్ ఫిక్సింగ్ కారణంగా నిషేధానికి గురైన టీమ్ఇండియా ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ శిక్షా కాలం ఆదివారంతో ముగిసింది. దీనిపై అతడు హర్షం వ్యక్తం చేశాడు. త్వరలోనే మళ్లీ దేశవాళీ క్రికెట్ ఆడతానని తెలిపాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. సుధీర్ స్టన్నింగ్ లుక్స్
'వి' సినిమా చిత్రీకరణ సమయంలో వర్కౌట్ చేసిన ఫొటోలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు హీరో సుధీర్‌బాబు. ఈ ఫొటోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.