1. ఫార్మాసిటీ వివాదం
హైదరాబాద్ ఫార్మాసిటీ ఏర్పాటు ప్రతిపాదన ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్‌లో ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయం ఎదుట రైతులు చేపట్టిన ధర్నాలో రైతు మహిపాల్ రెడ్డి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. షీర్వాల్ టెక్నాలజితో డబుల్ బెడ్ రూం ఇళ్లు
సంగారెడ్డి జిల్లా కొల్లూరులో రెండు పడక గదుల నిర్మాణాలను సభాపతి పోచారంతో కలిసి మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. ఏపీలో కేసులెన్నంటే?
ఏపీలో కొవిడ్ ఉద్ధృతి తగ్గడంలేదు. నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో చాపకింద నీరులా కరోనా వైరస్ విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 10,175 కరోనా కేసులు, 68 మరణాలు నమోదయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1,412 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో 9 మంది చొప్పున మృతి చెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. నియంత్రణ రేఖ మారుతుందా?
తూర్పు లద్దాఖ్‌లో భారత్ - చైనా మధ్య ఉద్రిక్తతలు నానాటికీ తీవ్రమవుతున్నాయి. విభేదాలను తగ్గించటంలో ఇప్పటికే ఇరుదేశాల మధ్య ఉన్న యంత్రాంగాలు విఫలమవుతున్నాయి. చైనా సరిహద్దు వెంబడి.. పాకిస్థాన్ నియంత్రణ రేఖ తరహా పరిస్థితులు ఏర్పడే దిశగా పరిణామాలు మారుతున్నాయని నిపుణులు భావిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. తగ్గిన జేఈఈ హాజరు శాతం
ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశం కోసం దేశవ్యాప్తంగా గతవారం నిర్వహించిన జేఈఈ- మెయిన్స్ పరీక్షకు 74 శాతం హాజరు నమోదైందని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. ఈ పరీక్షకు 8.58లక్షల దరఖాస్తులు రాగా 6.35లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాశారని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. దళిత ఓటరు ఎటువైపు?
బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో దళితులు కీలకంగా మారనున్నారు. మెజార్టీ స్థానాల్లో గెలుపోటములను నిర్ణయించునున్నారు. ఈ నేపథ్యంలో బిహార్‌లో అన్ని పార్టీల నేతలు వారిని ఆకర్షించే పనిలో నిమగ్నమయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. బీరుట్ పోర్టులో మరో ప్రమాదం
లెబనాన్ రాజధాని బీరుట్ నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించి.. సుమారు 2 వందల మంది ప్రాణాలు కోల్పోయిన నెలరోజుల్లోనే అక్కడ మరో దుర్ఘటన జరిగింది. బీరుట్ ఓడరేవులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న అగ్నికీలలతో దట్టమైన పొగ అలుముకుంది. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక శకటాలు రంగంలోకి దిగాయి. టైర్లు ఉండే గోదాములో చెలరేగిన మంటలు.. ఆ ప్రాంతమంతా వ్యాపించాయి. ఈ ప్రమాదానికి కచ్చిమైన కారణాలు తెలియరాలేదు. ఆగస్టు 4న జరిగిన మూడు వేల టన్నుల అమోనియం నైట్రేట్ పేలిన ఘటనలో 200 మంది చనిపోగా.. మరో 6,500 మంది గాయపడ్డారు. వేలాది భవనాలు దెబ్బతిన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. చైనా రాయబారికి చిక్కులు
ప్రముఖుల సామాజిక మాధ్యమాలను హ్యాక్ చేస్తోన్న సంఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. హ్యాకర్లు వాటిని ఆధీనంలోకి తెచ్చుకోవడమే కాకుండా విద్వేషపూరిత వ్యాఖ్యలను పోస్టు చేస్తున్నారు. తాజాగా ఇలాంటి బాధితుల జాబితాలో చేరారు బ్రిటన్‌లోని చైనా రాయబారి లీ షియామింగ్. ఆయన ట్విట్టర్ నుంచి ఓ అశ్లీల వీడియోకు లైక్ కొట్టారంటూ ఓ పోస్టు వైరల్ అవడంపై చైనా స్పందించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. సన్‌రైజర్స్ బలాలు, బలహీనతలు
ఈ ఏడాది ఐపీఎల్ కోసం అన్ని జట్లు కసరత్తులు చేస్తున్నాయి. టైటిల్ కోసం పోరు ఈసారి రసవత్తరంగా ఉండనుంది. కరోనా కారణంగా యూఏఈ వేదికగా జరగబోతున్న ఈ లీగ్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈసారి ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో రైజర్స్ ఎంతవరకు రాణిస్తుందో తెలుసుకుందామా. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. జోరులో బిగ్ బీ
ప్రఖ్యాత టీవీ షో కేబీసీ 12వ ఎడిషన్ షూటింగ్‌ను ప్రారంభించారు బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.