ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @3PM - ts news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధానవార్తలు.

ETV BHARAT TOP TEN NEWS
టాప్​టెన్ న్యూస్ @3PM
author img

By

Published : Sep 9, 2020, 3:00 PM IST

1. రెవెన్యూ చట్టం

రాష్ట్రంలో రెవెన్యూ సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చట్టింది. కొత్త రెవెన్యూ విధానానికి సంబంధించిన 4 బిల్లులను ముఖ్యమంత్రి కేసీఆర్​ శాసనసభలో ప్రవేశపెట్టారు. పూర్తి పారదర్శకత సేవలు అందించే లక్ష్యంతో బిల్లులు తెచ్చినట్లు స్పష్టం చేశారు. వీఆర్వో వ్యవస్థ రద్దవనుండగా రెవెన్యూ కోర్టుల స్థానంలో ట్రైబ్యునళ్లు ఏర్పాటు కానున్నాయి. భూవివాదాలపై ట్రైబ్యునళ్ల తీర్పే తుది నిర్ణయం కానుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

2. తహసీల్దార్లే జాయింట్‌ రిజిస్ట్రార్‌లు

రాష్ట్రంలో దశాబ్దాలుగా ప్రజలకు పీడగా మారిన భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం దిశగా తీసుకొచ్చిందే కొత్త రెవెన్యూ చట్టమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. కోట్లాది మంది పేద ప్రజలకు అవినీతిరహితంగా సేవలందించేలా రూపొందించిన చారిత్రక బిల్లును సభలో ప్రవేశపెట్టడం పూర్వజన్మసుకృతంగా సీఎం అభివర్ణించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

3. అక్బరుద్దీన్‌ వ్యాఖ్యలపై కేసీఆర్ గరంగరం

అసెంబ్లీలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్​కు, ముఖ్యమంత్రి కేసీఆర్​కు స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. కరోనా విషయంలో అక్బరుద్దీన్‌ వ్యాఖ్యలపై కేసీఆర్ శాసనసభలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

4. అదనపు కలెక్టర్​ ఇంట్లో అనిశా సోదాలు

మెదక్​ జిల్లా నర్సాపూర్‌ మండలం చిప్పలతుర్తి రైతు ఫిర్యాదు మేరకు అదనపు కలెక్టర్​ నగేశ్​ ఇంట్లో అనిశా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

5. కూజానే ముద్దు

వీధి వ్యాపారుల కోసం ఏర్పాటు చేసిన 'పీఎం స్వనిధి' లబ్ధిదారులతో ప్రధాని నరేంద్రమోదీ సంభాషించారు. మధ్యప్రదేశ్​లోని ఇండోర్​, గ్వాలియర్, రాయ్​సెన్​ జిల్లాలకు చెందిన వీధి వ్యాపారులతో మాట్లాడిన మోదీ.. తాగు నీటి కోసం ప్లాస్టిక్​ సీసాలకు బదులుగా కూజాలను వినియోగించాలని సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

6. ఇద్దరు చొరబాటుదారులు హతం

రాజస్థాన్​లో సరిహద్దులు దాటి దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించిన ఇద్దరు పాక్​ పౌరులను హతమార్చాయి భారత భద్రతా బలగాలు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

7. ఉపాధ్యక్షుడి కాన్వాయ్​పై బాంబు దాడి

అఫ్గాన్ ఉపాధ్యక్షుడి కాన్వాయ్​పై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో ఆయన స్వల్ప గాయాలతో బయటపడ్డారు. 10 మంది పౌరులు మృతి చెందగా... పలువురికి గాయాలయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

8. సీఈఓకు మూడేళ్ల జీతం 'సున్నా'

వొడాఫోన్​-ఐడియా ఎండీ, సీఈఓ రవీందర్ టక్కర్​కు మూడేళ్ల పాటు జీతం చెల్లించకూడదని సంస్థ నిర్ణయించింది. అయితే, ప్రయాణాలు, బస, వినోద, ఇతర ఖర్చులను సంస్థే భరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

9. తొలి సెంచరీ కోసం ఐదేళ్లు

వన్డేల్లో తొలి శతకం కోసం దిగ్గజ సచిన్ ఐదేళ్లు ఎదురుచూడాల్సి వచ్చింది. 77 వన్డేల తర్వాతే ఈ ఫార్మాట్​లో మూడంకెల స్కోరును చేయడం విశేషం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

10. కల నెరవేరింది

'వకీల్​సాబ్​' వల్ల పవన్​తో సినిమా చేయాలనే కల నెరవేరినట్లు చెప్పారు దర్శకుడు వేణు శ్రీరామ్​. ఈ ప్రాజెక్టు కోసం అల్లు అర్జున్ సినిమాను పక్కనపెట్టినట్లు పేర్కొన్నారు. ​ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.