1. పక్కా కుట్రతోనే చైనా కాల్పులు
తూర్పు లద్దాఖ్‌లో కాల్పుల కలకలంతో సరిహద్దులో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. అయితే చైనా ఉద్దేశపూర్వకంగానే ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు సమాచారం. సోమవారం సాయంత్రం.. ముఖ్పారీ శిఖరం వద్ద 50మంది పీఎల్ఏ సైనికులు.. భారత్ సైనిక స్థావరంవైపు దూసుకొచ్చినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
2. ఎంసెట్‌కు సర్వం సిద్ధం
ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగం పరీక్షలకు సర్వం సిద్ధమైంది. ఈనెల 9 నుంచి 14 వరకు.. రోజుకు రెండు సెషన్లలో పరీక్ష జరగనుంది. తెలంగాణ, ఏపీలలో 102 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. పీవీకి భారతరత్న ఇవ్వాలి
మాజీ ప్రధాని, తెలంగాణ బిడ్డ, పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని ఉభయసభలు ఏకగ్రీవంగా తీర్మానించాయి. ఆర్థిక సంస్కరణల పితామహుడిగా.. భూసంస్కరణలకు ఆద్యుడిగా దేశానికి పీవీ ఎనలేని సేవలు అందించారని ముఖ్యమంత్రి సహా అన్ని పక్షాల నేతలు కొనియాడారు. పీవీ మన ఠీవి, నవభారత రూపశిల్పి అని సీఎం స్మరించుకున్నారు. శాసనసభ ప్రాంగణంలో పీవీ తైలవర్ణ చిత్రం ఏర్పాటు చేస్తామని సభాపతి తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. రోజుకు ఆరు నిమిషాలే ఇస్తే ఎలా?
అసెంబ్లీలో మాట్లాడనివ్వటంలేదు. బయట సీఎం అపాయింట్ మెంట్ ఇవ్వట్లేదు.. అలాంటి అసెంబ్లీ ఇంకెందుకు. కేసీఆర్ ఫామ్ హౌస్‌లో అసెంబ్లీ పెట్టుకోవాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. రోజుకు ఆరు నిమిషాలే ఇస్తే ఎలా అని ఎమ్మెల్యే సీతక్క ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. ఆస్తుల జప్తు
బీమావైద్యల సేవల కుంభకోణంలో నిందితుల ఆస్తుల తాత్కాలిక జప్తునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఐఎంఎస్ సంయుక్త సంచాలకురాలు పద్మ, ఫార్మాసిస్టు నాగలక్ష్మి ఆస్తులకు జప్తునకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సంయుక్త సంచాలకురాలు పద్మ, ఆమె కుంటుంబసభ్యులు, బినామీల పేరు మీద రూ.8.55కోట్ల విలువైన ఆస్తుల జప్తునకు అనుమతిచ్చింది పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. ఏపీలో కేసులెన్నంటే?
ఏపీలో కరోనా ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. కొత్తగా మరో 10,601 మందికి కొవిడ్ సోకింది. వీటితో మొత్తం బాధితుల సంఖ్య 5,17,094కు చేరింది. మహమ్మారితో 73 మంది బలయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. దేశంలో ఒక్కరోజే 75 వేల కేసులు
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. సోమవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 75 వేల 809 మందికి వైరస్ సోకింది. మరో 1133 మంది మరణించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. 2021లో భారత వృద్ధి రేటు ఎంతంటే?
భారత్‌లో కరోనా లాక్డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో రికార్డు స్థాయిలో జీడీపీ పతనమైంది. ఈ నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు అంచనాను -10.5 శాతానికి కుదించింది ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. కసిగా బాదుతున్న పంత్
దిల్లీ క్యాపిటల్స్ యువ ఆటగాడు రిషబ్ పంత్ కసిగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈసారి ఐపీఎల్లో సత్తాచాటి టీమ్ఇండియా జట్టులో చోటు పదిలం చేసుకోవాలని భావిస్తున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. రియా అరెస్టుపై బాలీవుడ్ స్పందన
సుశాంత్ రాజ్‌పుత్ కేసు విచారణలో భాగంగా రియా చక్రవర్తిని ఎన్సీబీ అధికారులు అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే పలువులు బాలీవుడ్ సెలబ్రిటీలు ట్విట్టర్ వేదికగా స్పందించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.