ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @7PM - top ten news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధానవార్తలు.

ETV BHARAT TOP TEN NEWS
టాప్​టెన్ న్యూస్ @7PM
author img

By

Published : Sep 8, 2020, 7:00 PM IST

Updated : Sep 8, 2020, 7:28 PM IST

1. సీఎం కలిసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్

రాష్ట్ర ఎన్నికల కమిషనర్​గా విశ్రాంత ఐఏఎస్ అధికారి పార్థసారథి నియమితులయ్యారు. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర తొలి ఎన్నికల కమిషనర్​గా పనిచేసిన నాగిరెడ్డి ఇటీవల పదవీవిరమణ చేశారు. ఇప్పుడు ఆ స్థానంలో విశ్రాంత ఐఏఎస్ అధికారిని పార్థసారథిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్​ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

2. ఉస్మానియా కూల్చాల్సిందేనా?

హైదరాబాద్​లో ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణం వివాదంపై అనేక అంశాలను పరిశీలించాల్సిన అవసరం ఉందని హైకోర్టు తెలిపింది. ఆస్పత్రి నిర్మాణం కోసం ప్రస్తుత భవనం కూల్చాల్సిందేనా? వివాదాస్పద హెరిటేజ్ భవనం పక్కన పెట్టి మిగతా ప్రాంతంలో నిర్మించవచ్చా.. వంటి అనేక అంశాలను చూడాల్సి ఉందని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

3. ఆస్తుల జప్తు

బీమావైద్యల సేవల కుంభకోణంలో నిందితుల ఆస్తుల తాత్కాలిక జప్తునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఐఎంఎస్ సంయుక్త సంచాలకురాలు పద్మ, ఫార్మాసిస్టు నాగలక్ష్మి ఆస్తులకు జప్తునకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సంయుక్త సంచాలకురాలు పద్మ, ఆమె కుంటుంబసభ్యులు, బినామీల పేరు మీద రూ.8.55కోట్ల విలువైన ఆస్తుల జప్తునకు అనుమతిచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

4. ఆ ఐదుగురు మా దగ్గరే ఉన్నారు

అరుణాచల్ ​ప్రదేశ్​లో గల్లంతైన ఐదుగురు.. తమ వద్దే ఉన్నట్టు చైనా అంగీకరించింది. వారందరూ తమ భూభాగంలో కనిపించినట్టు వెల్లడించింది. వారిని వెనక్కి తీసుకొచ్చేందుకు చర్చలు జరుపుతున్నట్టు కేంద్రమంత్రి కిరణ్​ రిజిజు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

5. 400 ఏళ్ల నాటి చెరువు

ఆ చెరువు 12 గ్రామల దాహార్తిని తీరుస్తోంది. 400 ఏళ్ల క్రితం తవ్వించినట్లు చెబుతున్న చెరువును ఇప్పటివరకు ఇంకిపోవడం ఒక్కసారి కూడా చూడలేదట అక్కడి ప్రజలు. మరి ఆ చెరువు ఎక్కడ ఉంది. అసలు దాని వెనుకున్న కథేంటి? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

6. భాజపాకు కొత్త పార్టీల సవాల్​

2021లో జరగనున్న అసోం అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే రాజకీయ పార్టీలు సమాయత్తమవుతున్నాయి. అయితే ఈ సారి పోటీలో పలు కొత్త పార్టీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఎన్​డీఏ సహా కాంగ్రెస్​కు సవాల్​ విసురుతున్నాయి. అయితే అందరి ప్రధాన అస్త్రం ఒకటే 'సీఏఏ'. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

7. చైనా సెల్ఫ్​ గోల్

చాలా ఏళ్లుగా ప్రశాంతంగా ఉన్న వాస్తవాధీన రేఖను రణరంగంగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది చైనా. ఫలితంగా ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనివిధంగా అక్కడ తుపాకులు గర్జించాయి. సుమారు 45 ఏళ్ల తర్వాత సోమవారం రాత్రి తుపాకులతో గాల్లోకి కాల్పులు జరిపారు చైనా జవాన్లు. ఈ చర్యతో ప్రపంచ దేశాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

8. పబ్​జీ బ్యాన్

భారత్‌లో పబ్‌జీ, పబ్‌జీ లైట్‌ ఫ్రాంఛైజీగా ఉన్న టెన్‌సెంట్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించింది పబ్​జీ కార్పొరేషన్​. పబ్​జీ సహా చైనాకు చెందిన 118యాప్​లను భారత్​ నిషేధించిన కొద్ది రోజుల్లోనే సంస్థ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

9. ఆటగాళ్లంతా ఏం చేస్తున్నారో తెలుసా...?

ఐపీఎల్​ కోసం దుబాయ్​ చేరుకున్న తమ ఆటగాళ్ల గురించి ఆయా ఫ్రాంచైజీలు సామాజిక మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు తాజా విశేషాలను పంచుకుంటున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

10. ఉత్కంఠగా సుశాంత్​ కేసు!

సుశాంత్​ రాజ్​పుత్​ ఆత్మహత్య కేసులో డ్రగ్స్​ వ్యాపారులతో సంబంధం ఉందన్న కారణంతో రియా చక్రవర్తిని ఎన్​సీబీ అరెస్టు చేసింది. అయితే ఇప్పటికే సీబీఐ, ఈడీ విచారణ ఎదుర్కొన్న రియా.. ఎన్​సీబీ విచారణకూ హాజరైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

Last Updated : Sep 8, 2020, 7:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.