1. ఇక సెలవు
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంతిమ సంస్కారాలు ముగిశాయి. దిల్లీ లోధి శ్మశాన వాటికలో సైనిక లాంఛనాలతో ప్రణబ్‌కు అంతిమ వీడ్కోలు పలికారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. బై.. బై గణేశా
భాగ్యనగర వీధులు గణేశుని నామస్మరణతో మారుమోగాయి. 11 రోజుల పాటు పూజలు చేసిన గణనాథుడిని గంగమ్మ ఒడికి చేర్చారు. ఇక ప్రసిద్ది గాంచిన ఖైరతాబాద్ మహా గణపతికి దారి పొడవునా బ్రహ్మరథం పట్టారు. చివరి సారి గణనాథుడిని చూసేందుకు హుస్సేన్ సాగర్ వద్దకు చేరుకున్నారు. భక్తుల కోలాహలం, గణేశుని నామస్మరణల మధ్య ఖైరతాబాద్ వినాయకుడు గంగ ఒడికి చేరాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. ప్రధానికి కేసీఆర్ లేఖ
జీఎస్టీ పరిహారంలో తగ్గే మొత్తం కోసం రాష్ట్రాలు అప్పులు తీసుకోవాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. కేంద్రమే అప్పు తీసుకొని రాష్ట్రాలకు పూర్తి పరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ప్రధానికి లేఖ రాశారు. రాష్ట్రాలకు రావాల్సిన జీఎస్టీ పరిహారంలో కోత విధించడం సమంజసం కాదని, రాష్ట్రాలు అప్పులు తీసుకోవాలన్న ప్రతిపాదన ఏ మాత్రం సబబు కాదని కేసీఆర్ స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. పరుగులు పెట్టించి మరీ..!
ఫోన్ దొంగలించేందుకు వచ్చిన కేటుగాళ్లను పరుగులు పెట్టించి మరీ పట్టుకుంది ఓ 15 ఏళ్ల బాలిక. పంజాబ్ జలంధర్ నగరంలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ నగర్లో కుసుమ కుమారి నడుచుకుంటూ వెళ్తుండగా ఇద్దరు దుండగులు బైక్‌పై వచ్చి ఆమె ఫోన్ లాక్కునే ప్రయత్నం చేశారు. ప్రతిఘటించిన బాలిక అందులో ఒకరిని బైక్ ఎక్కకుండా నిలువరించింది. దుండగుడు దాడి చేస్తున్నప్పటికీ వెరవకుండా పోరాడింది. బైక్ వెనుక పరిగెత్తి మరీ కేటుగాళ్లను పట్టుకునే ప్రయత్నం చేసింది. ఇది చూసిన చుట్టుపక్కలవారు ఆ దుండగుడ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాలిక ధైర్యాన్ని కొనియాడారు. ఈ దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. రష్యాకు రాజ్‌నాథ్ సింగ్
రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మరోసారి రష్యా వెళ్లనున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) రక్షణ మంత్రుల సమావేశానికి హాజరుకానున్నట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. వంట పాత్రలో ఆసుపత్రికి!
అకాల వర్షాలకు ఒడిశాలోని అనేక ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. రోడ్లన్నీ నీట మునిగాయి. వరదలకు అనేక గ్రామాలు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో జైపుర్ జిల్లాలోని రౌత్సహిలో.. పాము కాటుకు గురైన ఓ మహిళను వంట చేసేందుకు ఉపయోగించే పెద్ద డేసాలో ఆసుపత్రికి తరలించారు గ్రామస్థులు. వరద నీటిలోనే దాదాపు 3కి.మీల దూరం ఆ డేసా పట్టుకుని నడిచారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. మరొకరు బలి
కరోనా వ్యాప్తి దృష్ట్యా ఏర్పాటు చేసిన ఆన్లైన్ క్లాసులు ఆ కుటంబాన్ని తీరని విషాదంలోకి నెట్టాయి. స్మార్ట్ ఫోన్ కొనివ్వలేని పేదరికం ఆ తండ్రికి కంటికి రెప్పలా పెంచిన కూతుర్ని శాశ్వతంగా దూరం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. పసిడి మరింత ప్రియం
అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. దిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.418 పెరిగింది. వెండి కిలోకు రూ.2,246 పైకెగిసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. ఐపీఎల్‌కు దూరంగా హర్భజన్ సింగ్?
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఈ ఏడాది ఐపీఎల్ నుంచి తప్పుకోనున్నట్లు ఇటీవలే వార్తలు వినిపించాయి. అయితే, వాటిలో వాస్తవం లేదని ఫ్రాంచైజీ అధికారిక వర్గాలు తెలిపాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. సుశాంత్ కేసు మీడియా సర్కస్‌గా మారిపోయింది
సుశాంత్ రాజ్‌పుత్ కేసును మీడియా వక్రదృష్టితో చూడటం దురదృష్టకరమని బాలీవుడ్ నటి విద్యాబాలన్ పేర్కొంది. ఇటీవలే లక్ష్మీ మంచు చేసిన ట్వీట్‌కు స్పందనగా విద్య ఈ వ్యాఖ్యలు చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.