ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @3PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధానవార్తలు.

ETV BHARAT TOP TEN NEWS
టాప్​టెన్​ న్యూస్​ @3PM
author img

By

Published : Aug 6, 2020, 2:59 PM IST

రైతుబీమా నిధులు విడుదల

రైతుబీమా పథకానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఈ మేరకు వ్యవసాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ఆన్​లైన్​ తరగతులు వద్దు

ఆన్​లైన్​ తరగతుల ప్రభావం పిల్లలపై మానసికంగా, శారీరకంగా ఉంటుందని హైకోర్టు తెలిపింది. ఆన్‌లైన్‌ తరగతులు నిషేధించాలన్న పిటిషన్‌పై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ పిటిషన్ వేయగా ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

రాజధాని ఏర్పాటులో మా పాత్ర లేదు

ఆంధ్రప్రదేశ్​ రాజధాని ఏర్పాటు రాష్ట్రం పరిధిలోని అంశమేనని.. ఇందులో కేంద్ర ప్రభుత్వం ప్రమేయం ఉండబోదని కేంద్రం స్పష్టం చేసింది. రాష్ట్రాల రాజధానిపై నిర్ణయం కేంద్రం పరిధిలోనిదా, రాష్ట్రం పరిధిలోనిదా అనే అంశంపై దాఖలైన పిటిషన్​పై ఏపీ హైకోర్టులో కేంద్ర హోంశాఖ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ప్రేమికుల సజీవ దహనం

ఉత్తరప్రదేశ్​లోని కర్చా గ్రామంలో ఓ ప్రేమ జంటకు నిప్పు అంటించి, సజీవ దహనం చేశారు యువతి కుటుంబసభ్యులు. పరువు హత్య కింద కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

డ్రాగన్​పై భారత్​ ఫైర్​

తమ అంతర్గత వ్యవహారాల్లో చైనా జోక్యాన్ని తిరస్కరిస్తున్నట్టు భారత్​ ప్రకటించింది. కశ్మీర్​ అంశాన్ని ఐరాస భద్రతా మండలిలో లేవనెత్తడానికి చైనా చేసిన ప్రయత్నం నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసింది. అర్థంలేని ప్రయత్నాలు చేసే ముందు సరైన అవగాహనకు రావాలని సూచించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

మళ్లీ రాజపక్సే

శ్రీలంక పార్లమెంటరీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. భారీ భద్రత నడుమ 64 కేంద్రాల్లో ఓట్లను లెక్కిస్తున్నారు. శుక్రవారం ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది. రాజపక్స సోదరులకే మళ్లీ ప్రజలు పట్టం కట్టే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

అధ్యక్ష బరిలో తెలుగు మహిళ

భారతీయ-అమెరికన్ వైద్యురాలు హిరల్ తిపిర్నేని అగ్రరాజ్య రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. నవంబరులో జరగనున్న దిగువ సభ ఎన్నికలకు అరిజోనా 6వ కాంగ్రెసెనల్ జిల్లాకు డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ఎంపికయ్యారు. రిపబ్లికన్ల కంచుకోటలో కొత్త చరిత్ర సృష్టించడమే లక్ష్యంగా ప్రచారం సాగిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ట్రంప్​కు ట్విట్టర్​ షాక్​

కరోనా వైరస్‌కు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ చేసిన పోస్టులు తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని ట్విట్టర్​, ఫేస్​బుక్​లు చర్యలు చేపట్టాయి. ఈ మేరకు టీమ్​ ట్రంప్ పేరుతో ఉన్న ట్రంప్ ప్రచార ఖాతాపై పాలసీ నిబంధనల ఉల్లంఘన కింద చర్యలు తీసుకున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఆ వీడియోను తమ ప్లాట్​ఫామ్​ల నుంచి డిలీట్​ చేశాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ఎంఐ బ్రౌజర్​ ప్రో! నిషేధం

జులైలో భారత్​ నిషేధించిన 47 చైనా యాప్​లలో స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ షియోమీ ఎంఐ బ్రౌజర్​ ప్రో ఉన్నట్టు కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ 47 యాప్​ల పేర్లను ప్రభుత్వం ప్రకటించలేదు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

మరో నటుడు ఆత్మహత్య

టీవీ నటుడు, మోడల్ సమీర్ శర్మ(44).. ముంబయిలోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇతడు హే రిస్తా హై ప్యార్​ కే, జ్యోతీ, కహానీ ఘర్ ఘర్ కీ, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ ధారావాహికలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.