ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్@ 3PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధానవార్తలు.

ETV BHARAT TOP TEN NEWS
టాప్​టెన్ న్యూస్@ 3PM
author img

By

Published : Aug 3, 2020, 2:59 PM IST

వెల్లివిరిసిన అభిమానం

హైదరాబాద్ కొండాపూర్​లోని మంత్రి హరీశ్​రావు నివాసంలో రక్షా బంధన్​ను పురస్కరించుకుని తెరాస మహిళా నాయకులు ఆయనకు రాఖీ కట్టారు. సోదరీ, సోదరులు ఇంట్లోనే ఉంటూ... సురక్షిత వాతావరణంలో, ఆనందోత్సాహాల మధ్య పండుగను జరుపుకోవాలని మంత్రి కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

అక్కాచెల్లెళ్ల కోరికేంటో తెలుసా?

అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల పండుగ రాఖీ. సోదరి ఆప్యాయంగా రక్షాబంధన్‌ కట్టగానే సోదరులు ఆమెకు ప్రేమతో కానుకలు ఇస్తారు. కరోనా ప్రభావంతో ఈసారి రాఖీ పండుగ జరుపుకోలేని వారికి ఈ మాటలే రక్ష. మరి మీరు శ్రద్ధగా వినండి. ఆమె చెబుతున్న విషయాలు తప్పకుండా పాటించి ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి నుంచి రక్షణ పొందండి! పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

భూకబ్జాలపై నజర్​

తెలంగాణ ఏర్పాటయ్యాక వరంగల్ నగరంలో భూములకు గిరాకీ పెరిగింది. ఈ సమయంలో ప్రజలకు సేవకులుగా ఉండాల్సిన కొంత మంది నేతలు భూ వ్యవహారాల్లో తలదూర్చుతూ సమాజానికి మచ్చ తెస్తున్నారు. పోలీసుల తీరుపై నిఘా వర్గాలు ఆరా తీశాయి. ఎక్కడెక్కడ భూకబ్జాలకు పాల్పడిందీ.. వారి వెనుక ఎవరు ఉందీ.. వీరికి పోలీసు శాఖలో ఎవరు సహకరిస్తుందీ వివరంగా సీపీకి నివేదిక ఇవ్వడం చర్చనీయాంశమైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

కరోనా కర్రీ రుచి చూశారా?

ప్రపంచమంతా ఇప్పుడు కరోనా మయం. ఈ మహమ్మారి ధాటికి అనేక వ్యాపారాలు నిలిచిపోయాయి. అయితే ఈ సవాళ్ల నుంచే కొందరు అవకాశాల్ని వెతుక్కుంటూ వినూత్న రీతిలో వ్యాపారాలు చేస్తున్నారు. రాజస్థాన్‌లోని ఓ రెస్టారెంట్ కరోనాపై అవగాహన కల్పించేలా కొవిడ్ కూరలు, మాస్కు రోటీలను అందిస్తూ వినియోగదారులను ఆకర్షిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

భారత్‌లో 2 కోట్ల పరీక్షలు

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 2 కోట్ల 2 లక్షలకు పైగా కరోనా నిర్ధరణ‌ పరీక్షలు పూర్తి చేసినట్లు ఐసీఎంఆర్‌ వెల్లడించింది. ఆదివారం ఒక్కరోజే 3లక్షల 81వేల శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. జులై 30న ఒక్కరోజే రికార్డుస్థాయిలో 6లక్షల 42వేల పరీక్షలు చేసినట్లు తెలిపింది. వైరస్​ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో పరీక్షల సామర్థ్యాన్ని భారీగా పెంచే దిశగా చర్యలు చేపడుతోంది కేంద్రం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ఐసోలేషన్​లో ఐటీ మంత్రి

ఐటీ, టెలికాం మంత్రి రవిశంకర్​ ప్రసాద్​ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. శనివారం సాయంత్రం ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసినట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

జైలుపై ఐఎస్ ఉగ్రదాడి

అఫ్గానిస్థాన్​లో ఓ జైలుపై దాడికి పాల్పడింది ఐఎస్ ఉగ్రసంస్థ. ఈ ఘటలో 21 మంది మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటన సమయంలో కొంతమంది ఖైదీలు జైలు నుంచి తప్పించుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

తయారీ రంగం డీలా

కరోనా ప్రభావంతో తయారీ రంగం ఇంకా అనిశ్చితి ఎదుర్కొంటోంది. దేశవ్యాప్తంగా అన్​లాక్ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ.. జులైలోనూ తయారీ రంగ పీఎంఐ తగ్గినట్లు ఓ సర్వే ద్వారా తెలిసింది. పీఎంఐ తగ్గటం ఇది వరుసగా నాలుగో నెల కావడం గమనార్హం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

మెక్​గ్రాత్​తో ఆడతా

ఒకవేళ అవకాశమొస్తే దిగ్గజ బౌలర్ మెక్​గ్రాత్​తో ఆడాలనుకుంటున్నట్లు రోహిత్​ శర్మ చెప్పాడు. ఓ నెటిజన్​ ప్రశ్నకు ఇలా సమాధానమిచ్చాడు. ప్రస్తుతం ఐపీఎల్​ కోసం సిద్ధమవుతున్నాడు హిట్​మ్యాన్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

బాధలో అమితాబ్

తన కుమారుడు అభిషేక్ బచ్చన్ వేగంగా కోలుకుని, త్వరలో ఇంటికొస్తాడని భావిస్తున్నారు ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్. ఈయనకు తాజాగా కరోనా నెగటివ్ వచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.