అమిత్ షాకు కరోనా
కొవిడ్ మహమ్మారికి సామాన్యులే కాకుండా పలువురు మంత్రులు, ప్రముఖులు బలవుతున్నారు. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో వైద్యుల సలహా మేరకు ఆయన ఆస్పత్రిలో చేరనున్నారు. కొవిడ్ ప్రాథమిక లక్షణాలు కనిపించడం వల్ల పరీక్షలు చేయించకున్నట్లు అమిత్ షా తెలిపారు. ప్రస్తుతం ఆరోగ్యం బాగానే ఉన్నట్లు ట్వీట్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
తమిళ గవర్నర్‌కు కరోనా
తమిళనాడు గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో గవర్నర్‌కు ఈరోజు పలు పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్యం నిలకడగా ఉన్నందున హోం ఐసోలేషన్‌లో ఉండాల్సిందిగా వైద్యులు సూచించారు. అయితే ఆసుపత్రి బృందం ఆయన ఆరోగ్యం పర్యవేక్షించనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
కరోనాను జయించిన బిగ్‌బీ
దాదాపు మూడువారాల పాటు కరోనాతో పోరాడిన బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, ఎట్టకేలకు కోలుకున్నారు. నానావతి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని చెబుతూ ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకుంటారని, నాన్న కోలుకోవాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు రాసుకొచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ప్రపంచానికి చాటిచెప్పండి
మహాకావ్యం రామాయణంలోని ధర్మాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకుని ప్రపంచం మొత్తానికి ఆ సందేశాన్ని వ్యాప్తి చేయాలని కోరారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఆగస్టు 5న అయోధ్యలో రామాలయ నిర్మాణం ప్రారంభం అవుతుండటంపై హర్షం వ్యక్తం చేశారు. రామాయణం, శ్రీరాముని గొప్పతనాన్ని తెలియజేస్తూ ఫేస్బుక్లో వ్యాసం పోస్ట్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
నగలు కాజేశారు
కరోనా అత్యవసర చికిత్స కోసం గత నెల 23 ఓ మహిళ బంజారాహిల్స్‌లోని సెంచరీ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ 25 అర్ధరాత్రి మృతిచెందారు. అనంతరం చేతి ఉంగరం, వజ్రాపు చెవి దుద్దులు, ముక్కుపుడక ఇతర ఆభరణాలు మాయమైనట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
అన్నపూర్ణ రాష్ట్రంగా మారింది
ఈ ఏడు వానకాలం, యాసంగి పంటకు సమృద్ధిగా నీళ్లు అందిస్తామని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకం గుడిపల్లి రిజర్వాయర్ నుంచి కల్వకుర్తి, అచ్చంపేట నియోజకవర్గాలకు సాగునీటిని విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
మూడు రోజులు వర్షాలే వర్షాలు
రాగల మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతోపాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఇక బెంగపడకండి
కరోనా బారినపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నావారు బెంగపడుకుండా మనో స్థైర్యం అందించాలంటోంది కేంద్రం. కుటుంబసభ్యులు స్నేహితులతో మాట్లాడేందుకు వీలు కల్పించాలని రాష్ట్రాలకు సూచించింది . చికిత్స సమయంలో రోగులకు మొబైల్ ఫోన్లు వాడేందుకు అనుమతివ్వాలంటూ రాష్ట్రాలకు లేఖ రాసింది కేంద్ర ఆరోగ్యశాఖ. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
సోనియాగాంధీ డిశ్చార్జ్
సాధారణ వైద్య పరీక్షల కోసం దిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ డిశ్చార్జ్ అయ్యారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ధోనీ చివరి మ్యాచ్ ఆడేశాడు
ఐపీఎల్, ధోనీ కెరీర్‌కు ఏమాత్రం ఉపయోగపడదని అన్నాడు మాజీ బౌలర్ నెహ్రా. భారత్ తరఫున మహీ చివరి మ్యాచ్ ఎప్పుడో ఆడేశాడని చెప్పాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.