21 రోజుల్లోనే రెట్టింపు కేసులు!
భారత్‌లో కొవిడ్ ఉగ్రరూపం కొనసాగుతోంది. రోజుకు వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతూ.. కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు వెలుగుచూశాయని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
త్యాగానికి ప్రతీక బక్రీద్
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్ కలిసి ముస్లిం సోదరులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ త్యాగానికి ప్రతీక అని.. ఇస్లాం సంప్రదాయంలో ఈ పండుగకు ప్రత్యే స్థానముందన్నారు. కొవిడ్ నేపథ్యంలో అందరూ నిబంధనలకు లోబడే పండుగను జరుపుకోవాలని తమిళిసై తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
కరోనాకు చంపే శక్తి లేదు
కరోనా వైరస్‌కు మనిషిని చంపే శక్తి లేదని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల అన్నారు. అప్రమత్తంగా లేకుంటేనే ప్రాణహాని ఉంటుందన్నారు. కొవిడ్ నియంత్రణకు ఎంతైనా ఖర్చుచేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈటల స్పష్టం చేశారు. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో ట్రూనాట్ పరీక్షల కేంద్రం, మమత ఆస్పత్రిలో ఆర్టీపీసీఆర్ ల్యాబ్‌ను మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ నామ, ఎమ్మెల్యే సండ్రతో కలిసి ఈటల ప్రారంభించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఎస్సీ, ఎస్టీలకు రక్షణ కల్పించాలి
తెరాస ప్రభుత్వంపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఎస్టీ, ఎస్టీలకు రక్షణ లేకుండా పోతోందని ఉత్తమ్ ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీలు, గిరిజనులపై ప్రతిరోజు ఏదో ఓ చోట హింసాకాండ జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
పోరాటం చేస్తాం
ఏపీ రాజధాని వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులకు గవర్నర్ ఆమోదముద్ర వేయడాన్ని తెదేపా అధినేత చంద్రబాబు తప్పుబట్టారు. గవర్నర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేశారు. ఈ నిర్ణయంపై న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఆరు రోజులకే... అమ్మ దూరం
బిడ్డకు జన్మనిచ్చి ఆరు రోజులైంది.. అమ్మతనాన్ని ఇంకా పూర్తిగా ఆస్వాదించనేలేదు. ఇంతలోనే మహమ్మారి సోకిందని తెలిసింది. వెంటనే చికిత్స కోసం బెంగళూరులోని దాదాపు 12 ఆసుపత్రులకు తిప్పారు కుటుంబసభ్యులు. అయితే పడకల్లేవని ఏ యాజమాన్యం చేర్చుకోలేదు. ఆఖరికి ఓ ఆసుపత్రిలో పడక దొరికింది. కానీ అప్పటికే ఆ తల్లి ఊపిరాగిపోయింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
కొలంబియా ముఠా అరెస్టు
ప్రత్యేక శిక్షణ పొంది కొలంబియా నుంచి భారత్‌కు వచ్చి చోరీలకు పాల్పడుతున్న ఓ ముఠాను బెంగళూరులో అరెస్టు చేశారు పోలీసులు. వారి నుంచి బంగారు ఆభరణాలు, కారు సహా.. చోరీ చేసిన సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
కరోనాతో తొలి శునకం మృతి
న్యూయార్క్ లో కరోనా పాజిటివ్ అని తేలిన తొలి శునకం మృతి చెందింది. అయితే అప్పటికే లింఫోమా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆ పెంపుడు కుక్క మరణానికి కొవిడ్-19 అసలు కారణమా కాదా అనేది స్పష్టత లేదు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
సఫారీల కోసం ప్రత్యేక విమానం!
ఐపీఎల్ కోసం దక్షిణాఫ్రికా ఆటగాళ్లను ప్రత్యేక విమానంలో యూఏఈకి తీసుకురావాలని ఫ్రాంఛైజీలు అనుకుంటున్నాయి. ఆదివారం జరిగే ఐపీఎల్ కౌన్సిల్ సమావేశం తర్వాత ఈ విషయమై స్పష్టత రానుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఎట్టకేలకు స్పందించిన రియా
సుశాంత్ ఆత్మహత్యకు తాను ప్రేరేపించలేదని చెప్పిన నటి రియా చక్రవర్తి.. ఆ వార్తల్లో నిజం లేదని చెప్పింది. ఈ విషయమై ఎట్టకేలకు ఓ వీడియోను విడుదల చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.