ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​ @1PM - ts news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ETV BHARAT TOP TEN NEWS
టాప్​ టెన్​ న్యూస్​ @1PM
author img

By

Published : Jul 24, 2020, 12:57 PM IST

Updated : Jul 24, 2020, 1:03 PM IST

1. దిశ నిందితుల ఎన్​కౌంటర్​పై సుప్రీంకోర్టులో విచారణ

దిశ నిందితుల ఎన్​కౌంటర్​పై సుప్రీంకోర్టు విచారణ చేసింది. పూర్తి నివేదిక ఇవ్వడానికి మరింత సమయం కావాలని జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ వేసిన అప్లికేషన్​పై చర్చించింది. కరోనా నేపథ్యంలో విచారణ ఆలస్యమవుతోందని... ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా గడువు కావాలని కమిషన్ కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి.

2. మంత్రి కేటీఆర్‌కు శుభాకాంక్షల వెల్లువ

పుట్టిన రోజు సందర్భంగా మంత్రి కేటీఆర్‌కు ప్రజాప్రతినిధులు, సీని ప్రముఖులు, తెరాస శ్రేణులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. హ్యాపీ బర్త్​డే కేటీఆర్ హ్యాస్ ట్యాగ్ ట్విట్టర్ ట్రెండింగ్​లో ఉంది. గిఫ్ట్​ ఏ స్మైల్ పేరుతో ఓ చిరునవ్వును... ఆయన పేరున కానుకగా ఇచ్చే కార్యక్రమంతో అభిమానులు ముందుకెళ్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి.

3.'కేటీఆర్ తనకంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ క్రియేట్​ చేసుకున్నారు'

కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్ రక్తదానం చేయడం చాలా అభినందనీయమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. కేటీఆర్ ఆయురారోగ్యాలతో మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి.

4. గహ్లోత్​​ సర్కార్​కు షాక్​- పైలట్​ వర్గానికి ఊరట

రాజస్థాన్​ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. హైకోర్టులో గహ్లోత్​ సర్కారుకు ఎదురుదెబ్బ తగిలింది. తిరుగుబాటు నేత సచిన్​ పైలట్​ వర్గం ఎమ్మెల్యేలకు హైకోర్టులో ఊరట లభించింది. శాసనసభ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా యథాతథస్థితి కొనసాగించాలని ఆదేశించింది కోర్టు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి.

5. బాబ్రీ మసీదు కేసులో అడ్వాణీ వాంగ్మూలం నమోదు

బాబ్రీ మసీదు కేసులో లఖ్​నవూలోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఎదుట భాజపా సీనియర్​ నేత ఎల్​కే అడ్వాణీ వాంగ్మూలం ఇచ్చారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాంగ్మూలం ఇచ్చారు అడ్వాణీ. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి.

6. నిమ్మగడ్డ కేసు: హైకోర్టు ఉత్తర్వులపై స్టేకు సుప్రీం నిరాకరణ

ఏపీకి సుప్రీంకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తలిగింది. నిమ్మగడ్డ రమేష్‌ విషయంలో స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి.

7. స్వాతంత్య్ర దినోత్సవాలకు కేంద్రం మార్గదర్శకాలు

ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవాల నిర్వహణకు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది కేంద్రం. కరోనా విజృంభిస్తున్న వేళ హోంశాఖ, వైద్య ఆరోగ్య శాఖ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది. కేంద్రం మార్గదర్శకాల్లో కీలక విషయాలు ఇవే. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి.

8. కరోనా సోకిందని తలుపులకు స్టీల్​ రేకులతో సీల్​!

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు యావత్​ దేశం చర్యలు తీసుకుంటోంది. కానీ, బెంగళూరు నగరపాలక సంస్థ అధికారులు తీసుకున్నంత కఠిన చర్యలు బహుశా ఇప్పటివరకు ఏ రాష్ట్రంలోనూ అమలు కాలేదేమో! భవనంలో ఓ వ్యక్తికి కరోనా సోకిందని.. రెండు ఇళ్లకు స్టీల్​ రేకులతో సీల్​ వేసి మరీ వైరస్​ వ్యాప్తిని కట్టడి చేశారు. బాధిత కుటుంబం సామాజిక మాధ్యమాల్లో ఈ సంగతి పంచుకున్నాక, తలుపులకు బిగించిన ఉక్కు కవచాన్ని తీసేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి.

9.చైనా కౌంటర్​: అమెరికా కాన్సులేట్​ మూసివేతకు ఆదేశం

అమెరికాలోని దౌత్య కార్యాలయం మూసివేతపై ప్రతికార చర్యలు చేపట్టింది చైనా. చెంగ్డు నగరంలోని అగ్రరాజ్య రాయబార కార్యాలయం మూసివేతకు ఆదేశించింది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి.

10. బాక్సర్ మైక్ టైసన్ రీఎంట్రీ.. 15 ఏళ్ల తర్వాత రింగ్​లో

సుప్రసిద్ధ బాక్సర్​ మైక్​ టైసన్.. దాదాపు 15 ఏళ్ల​ తర్వాత బాక్సింగ్​ రింగ్​లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. సెప్టెంబరు 12న రాయ్​ జోన్స్​ జూనియర్​తో ఎగ్జిబిషన్​ మ్యాచ్​లో తలపడనున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి.

Last Updated : Jul 24, 2020, 1:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.