1. తెలంగాణ తల్లడిల్లుతోంది!
రాష్ట్రంలో.... కరోనా కేసుల సంఖ్య 22 వేలు దాటింది. శనివారం అత్యధికంగా 1,850 మందికి వైరస్ నిర్ధరణ అయినట్లు... వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. మరో ఐదుగురి మృతితో మృతుల సంఖ్య 288కి చేరింది. కేసుల సంఖ్య పెరుగుతున్నందున.. IAS అధికారుల కమిటీని ప్రభుత్వం రంగంలోకి దించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. తెలంగాణ లాస్ట్!
తెలంగాణలో బుజ్జాయిలు తక్కువ మంది ఉన్నారట. నాలుగేళ్లలోపు బాలల జనాభాలో బిహార్ మొదటి స్థానంలో ఉంటే... తెలంగాణ చివరి స్థానంలో ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. సాగు"బడి"
కరోనా వైరస్ విస్తృతితో విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఎప్పుడు తెరుచుకుంటాయో... చదువు ఎప్పుడు గాడిన పడుతుందో తెలియని పరిస్థితి. అనుకోకుండా వచ్చిన ఖాళీ సమయాన్ని... గ్రామీణ ప్రాంత విద్యార్థులు వ్యవసాయంపై మక్కువతో క్షేత్రాల్లోకి దిగి పొలం పనులు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. కొవిడ్‌కు చౌకైన పరికరం
కరోనా నిర్ధరణ పరీక్షల కోసం చౌకైన సెంట్రిప్యూజ్ను తయారుచేశారు భారత సంతతి శాస్త్రవేత్త మను ప్రకాశ్. పేద దేశాల్లో వైరస్ పరీక్షలను పెంచేందుకు ఇది వీలు కలిగిస్తుందని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. కొత్త ఒరవడి
భారత్‌లో వ్యవసాయ పరిశోధన, విస్తరణ విద్య పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు ప్రధాని నరేంద్ర మోదీ. వ్యవసాయ అనుబంధ రంగాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టాల్సిన అవసరముందన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. గురువే దైవం
గురుపౌర్ణమి సందర్భంగా ఫేస్బుక్లో తన మనోగతాన్ని తెలియజేశారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. తల్లిదండ్రుల తర్వాత స్థానాన్ని గురువుకే భారతీయులు ఇచ్చారని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. అమెరికా లవ్స్ ఇండియా
యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు.. అమెరికా 244వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ట్వీట్ చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. దీనిపై స్పందించిన ట్రంప్... మోదీకి ధన్యవాదాలు చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. లిన్ డాన్ ఇకలేరు..
తన ఆటతీరుతో బ్యాడ్మింటన్ ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాడిగా పేరు తెచ్చుకున్న చైనా షట్లర్ లిన్ డాన్.. శనివారం ఆటకు వీడ్కోలు పలికాడు. సోషల్‌మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. వేతనాల్లో భారీ కోతలు
కొవిడ్-19 ప్రభావం ప్రజా రవాణాపై అధికంగా పడింది. బస్సులు, రైళ్లు, విమానాలతో పాటు క్యాబ్‌లలో ప్రయాణానికీ పలు ఆంక్షలుండగా, అందుబాటులో ఉన్న వాటిలో వెళ్లేందుకు ప్రజలూ వెనుకాడుతున్నారు. వినోద రంగమైతే పూర్తిగా మూతబడింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. ఆర్జీవీపై కేసు
మిర్యాలగూడ ప్రణయ్ హత్యోదంతం ఆధారంగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ఇటీవలే దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ప్రకటించారు. దీనిపై అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ ప్రణయ్ తండ్రి బాలస్వామి పిటిషన్ దాఖలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.