1. కాసేపట్లో ప్రారంభం కానున్న ఆరో విడత హరితహారం
రాష్ట్రంలో అటవీ విస్తీర్ణాన్ని 33 శాతానికి పెంచడమే లక్ష్యంగా తలపెట్టిన ఆరో విడత హరితహారం కార్యక్రమం కాసేపట్లో ప్రారంభం కానుంది. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. హోంమంత్రి కార్యాలయంలో కరోనా.. ఐదుగురికి వైరస్
రాష్ట్రంలో కరోనా రోజురోజుకూ విజృంభిస్తోంది. తాజాగా హోంశాఖ మంత్రి మహమూద్ అలీ కార్యాలయంలోనూ కొవిడ్ కలకలం నెలకొంది. బుధవారం మరో ఐదుగురు భద్రతా సిబ్బంది ఈ వైరస్ బారినపడ్డారు. ఫలితంగా మిగిలిన సిబ్బందిలో ఆందోళన నెలకొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. బిహార్ సమరం: కాలం చెల్లిన కులం కార్డు!
అక్టోబరు- నవంబరు మధ్య కాలంలో జరిగే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపునకు కరోనా, వలస కార్మికుల సమస్యలను ఆయుధాలుగా మలచుకోవాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయి. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలైన జేడీయూ, భాజపా, ఎల్జేపీల మధ్య సఖ్యత ఉండి, వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని 243 అసెంబ్లీ సీట్లలో ఎవరు ఎన్ని సీట్లకు పోటీచేయాలనే అంశాన్ని సామరస్యంగా తేల్చుకున్నాయి. ప్రతిపక్షాల్లో ఎన్ని లుకలుకలున్నా కులం తురుఫు ముక్క తమను గెలిపిస్తుందని అవి ఆశపెట్టుకుంటున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. పెట్రో మోతతో వాహనదారులపై పెనుభారం
కొద్దిరోజులుగా పెరుగుతున్న పెట్రో ధరలు వాహనదారులకు షాక్ ఇస్తున్నాయి. వాహనదారులకు తెలియకుండానే జేబులకు చిల్లులు పడుతున్నాయి. బుధవారం నగరంలో పెట్రోల్ ధర రూ.82.77 ఉండగా డీజిల్ ధర రూ.78.04 ఉంది. ఈ లెక్కన సామాన్యుడిపై సుమారు రూ.2.2 కోట్లు, డీజిల్‌పై రూ.2.7 కోట్లు అదనపు భారం పడింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. జమ్ముకశ్మీర్‌లో ఎన్కౌంటర్
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. సోపోర్ జిల్లాలోని హర్ద్శివ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రత దళాలకు మధ్య గురువారం ఉదయం ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు ముష్కరులను హతమార్చాయి బలగాలు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. సచిన్ తెందుల్కర్ డూప్‌కు కరోనా కష్టాలు
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ డూప్ బల్వీర్ చాంద్.. తాజాగా లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయినట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. అంతే కాకుండా అతనితో పాటు తన కుటంబ సభ్యులకు కరోనా వైరస్ సోకిందని బాధపడ్డాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. ఇంటినే ఆస్పత్రిగా మార్చి కరోనాపై షూటర్ విజయం
భారత షూటర్ సమరేష్ సింగ్‌తో పాటు అతని కుటుంబం కరోనాపై విజయం సాధించింది. ఇందుకోసం ఏకంగా తన ఇంటినే ఆస్పత్రిగా మార్చేశారు. ప్రస్తుతం వైరస్‌పై అవగాహన కల్పిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. సుంకాల వివాదం లేకుండా చైనా దిగుమతులు ఆపొచ్చు!
భారత్- చైనాల మధ్య ఘర్షణల నేపథ్యంలో చైనా ఉత్పత్తుల దిగుమతులను ఆపేయాలనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఆ దేశ ఉత్పత్తులను మానేయాలంటే సుంకాల రూపంలో అనేక వివాదాలున్నాయి. ఈ తరుణంలో దేశీయ ఉత్పత్తులను కాపాడేందుకు.. ఎలాంటి పన్నులు లేకుండానే చైనా దిగుమతులను అడ్డుకోవచ్చని వాణిజ్యరంగ నిపుణులు సూచిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. పాకిస్థాన్‌ను గ్రే లిస్టులోనే కొనసాగిస్తూ ఎఫ్ఏటీఎఫ్ నిర్ణయం
ఉగ్రసంస్థలకు ఆర్థికసాయం అందకుండా కట్టడి చేయడంలో విఫలమైన పాకిస్థాన్‌ను గ్రే లిస్టులోనే ఉంచాలని ఎఫ్ఏటీఎఫ్ నిర్ణయించింది. అక్టోబర్‌లోపు ఉగ్రవాద నిర్మూలనకు తగిన చర్యలు తీసుకోకపోతే బ్లాక్ లిస్టులో చేర్చుతామని హెచ్చరించింది. పాకిస్థాన్ గ్రే లిస్టులో కొనసాగితే.. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, యూరోపియన్ యూనియన్ నుంచి ఆర్థిక సాయం పొందడం కష్టమవుతుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. రూ.70 కోట్లకు జాన్వీ కపూర్ సినిమా!
శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ నటించిన 'గుంజన్ సక్సేనా'ను నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసిందని సమాచారం. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.