ETV Bharat / city

టాప్​ 10 న్యూస్ @9AM - latest news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ETV BHARAT TOP TEN NEWS 9 AM
టాప్​ 10 న్యూస్ @9AM
author img

By

Published : Jun 27, 2020, 8:52 AM IST

1. ఆగని పెట్రో వాత.. 21వ రోజూ ధరలు పైపైకి

దేశంలో వరుసగా 21వ రోజూ పెట్రోల్​, డీజిల్ ధరలు పెరిగాయి. దేశ రాజధాని దిల్లీలో లీటర్​ పెట్రోల్ ధర శనివారం 25 పైసలు పెరిగి రికార్డు స్థాయికి చేరింది. డీజిల్​ ధర లీటర్​పై దాదాపు 21 పైసలు పెరిగింది. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

2. రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. 237కు చేరిన మరణాలు

రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కొవిడ్‌ కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం తాజాగా 985 మందికి కరోనా సోకింది. రాష్ట్రంలో బాధితుల సంఖ్య 12,349కు పెరిగిందని వైద్యారోగ్యశాఖ తెలిపింది. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

3. కరోనా ఎఫెక్ట్​: అయోమయంలో అంకుర సంస్థలు

కరోనా అన్ని రంగాలనూ కుదిపేస్తోంది. అంకుర సంస్థలపైనా దీని ప్రభావం తీవ్రంగా పడింది. ఆదాయం తగ్గిపోవడం, నిర్వహణకు తగిన నిధులు లేకపోవడం వల్ల గత రెండేళ్లలో ఏర్పాటైన కొన్ని అంకురాల (స్టార్టప్‌ల) కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచిపోగా.. మరికొన్ని మూసివేత దిశగా వెళ్తున్నాయి. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

4. అమానవీయ ఘటనపై సీఎంవో తీవ్ర ఆగ్రహం

ఏపీలోని పలాసలో అధికారులు మానవత్వాన్ని మరిచారు. నిబంధనలు తుంగలో తొక్కి.. కరోనా రోగి మృతదేహాన్ని జేసీబీతో తరలించారు. అధికారుల తీరుపై విమర్శలు గుప్పుమన్నాయి. ఘటనపై ముఖ్యమంత్రి కార్యాలయం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

5. ఆకాశమే హద్దుగా అంతరిక్ష ప్రయోగాలు

అంతరిక్షరంగంలో ప్రయోగాలను విస్తరించేందుకు ప్రైవేటు సంస్థలకు భాగస్వామ్యం కల్పిస్తున్నప్పుడు మిశ్రమ స్పందన లభించింది. ఇస్రో మాజీ ఛైర్మన్ డాక్టర్​ మాధవన్​ నాయర్​ లాంటివారూ దీనిని వ్యతిరేకించారు. అయినప్పటికీ కేంద్ర మంత్రి వర్గం తాజా సంస్కరణలకే మొగ్గుచూపింది. ఫలితంగా ఉపగ్రహ ప్రయోగ సేవలు, రాకెట్లు మొదలగు నిర్మాణ ప్రక్రియ మరింత వృద్ధి చెందుతుందని ఇస్రో ఛైర్మన్​ శివన్​ అంటున్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

6. పాఠాలకు కొత్తరూపు..

కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్న దృష్ట్యా భారత్‌ లాంటి దేశంలో పూర్తిస్థాయి తరగతి గది బోధన సాధ్యం కాకపోవచ్చన్నది నిపుణుల అంచనా. వచ్చే విద్యాసంవత్సరంలో కొంతమేరకు బోధన తరగతి గదిలోనూ, మరికొంత ఆన్‌లైన్‌ ద్వారానూ అవసరమన్న ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

7. 'షటిల్'​ ఎగిరేందుకు అవకాశమివ్వండి!

హైదరాబాద్​లో బ్యాడ్మింటన్ సాధన చేసేందుకు శిబిరాలకు అనుమతి ఇవ్వకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు పలువురు షట్లర్లు. త్వరలో అనుమతివ్వాలని కోరుతున్నారు. అన్ని జాగ్రత్తలూ పాటిస్తూ సాధన సాగిస్తామని అన్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

8. డేవిస్​​, ఫెడ్​కప్​ వచ్చే ఏడాదికి వాయిదా

ప్రతిష్టాత్మకమైన టెన్నిస్ టోర్నీలు డేవిస్​, ఫెడ్​కప్​లు వచ్చే ఏడాదికి వాయిదా వేశారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

9. చైనా అధికారుల వీసాలపై అమెరికా ఆంక్షలు

చైనా అధికారుల వీసాలపై అమెరికా ఆంక్షలు విధించింది. హాంకాంగ్​ స్వయం ప్రతిపత్తి విషయంలో భంగం కలిగించడం.. వారి హక్కులను చైనా ఉల్లంఘిస్తోందనే ఆరోపణల నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

10. రవితేజ-రానాల సినిమాకు దర్శకుడు అతడే!

'అయ్యప్పనుమ్​ కోషియుమ్' తెలుగు రీమేక్​ను యువ దర్శకుడు సాగర్ చంద్ర తెరకెక్కించనున్నారు. త్వరలో ఈ విషయమై అధికారిక ప్రకటన రానుంది. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.