1. జీహెచ్ఎంసీలో 2, 226 నామినేషన్లు
జీహెచ్ఎంసీ ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసింది. మూడ్రోజులపాటు అధికారులు నామినేషన్లు స్వీకరించారు. గ్రేటర్ ఎన్నికలకు చివరిరోజు 1,561 నామపత్రాలు దాఖలయ్యాయి. నామినేషన్లు వేసిన అభ్యర్థులతో జోనల్ కమిషనర్ కార్యాలయాలు కిటకిటలాడాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. అభివృద్ధిని ప్రచారం చేయండి: కేటీఆర్
హైదరాబాద్ అభివృద్ధిపై పురపాలక శాఖ మంత్రి కేటీఆర్... ప్రగతి నివేదిక విడుదల చేశారు. 150 డివిజన్లలో సగం డివిజన్లు మహిళలకు ఇవ్వాలని సీఎం చట్టం తెచ్చారని మంత్రి వివరించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 85 డివిజన్లు మహిళలకే కేటాయించినట్లు స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. భాజపా విజయం కోసం పనిచేస్తాం: పవన్
జీహెచ్‌ఎంసీ ఎన్నికల నుంచి వైదొలుగుతున్నామని ప్రకటించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. కార్యకర్తలు నిరుత్సాహం చెందవద్దని ఆయన కోరారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాజపా గెలవాలని ఆకాంక్షించారు. పార్టీ కార్యకర్తలు భాజపా విజయం కోసం పనిచేయాలని సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. మంత్రోచ్ఛారణల నడుమ పుష్కరాలు
వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ తుంగభద్ర పుష్కరాలు సంప్రదాయబద్ధంగా ప్రారంభమయ్యాయి. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ వద్ద మాధవా నందస్వామి, కమలానందభారతి స్వామిజీ పుష్కరాలను ప్రారంభించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. కేసీఆర్ వ్యాఖ్యలపై బండి ఫైర్
వరద సాయంపై ఎస్‌ఈసీకి భాజపా లేఖరాసినట్టు సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఖండించారు. ముందుగా చెప్పినట్టుగానే మధ్యాహ్నం 12 గంటలకు భాగ్యలక్ష్మి ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. 'రైతుల ధర్నాతో వేల కోట్లు నష్టం'
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్‌లో రైతుల ఆందోళన వల్ల.. రూ. 2220 కోట్లు నష్టపోయినట్లు వెల్లడించింది భారతీయ రైల్వే. దిగ్బంధాల కారణంగా రవాణా కార్యకలాపాలకు తీవ్ర ఆటంకం కలిగినట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. 'అప్రమత్తత వల్ల భారీ ఉగ్రకుట్ర భగ్నం'
జమ్ముకశ్మీర్‌లో జరిగిన నగ్రోటా ఎన్కౌంటర్, తదనంతర పరిణామాలపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కశ్మీర్ సరిహద్దుల్లో, వాస్తవాధీన రేఖ సమీపంలో ఇటీవల జరుగుతున్న పరిణామాలపై ప్రధాని చర్చించినట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. డిసెంబర్లోనే ఫైజర్ వ్యాక్సిన్!
తాము అభివృద్ధి చేసిన కరోనా టీకా అత్యవసర వినియోగానికి అనుమతివ్వాలని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌కు ఫైజర్ దరఖాస్తు చేసింది. డిసెంబర్ నుంచి పరిమిత సంఖ్యలో వ్యాక్సిన్ వినియోగానికి అనుమతించాలని విజ్ఞప్తి చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
9. మహమ్మారి వేళలో.. ఫుట్‌బాల్
కరోనా వేళలోనూ భారత్ ఓ మెగాటోర్నీని ఘనంగా ప్రారంభించింది. గోవాలోని బంబోలిమ్ వేదికగా ఇవాళ్టి నుంచి ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్) 7వ సీజన్ ప్రారంభమైంది. తొలిపోరులో కేరళ బ్లాస్టర్స్, ఏటీకే మోహన్ బగాన్ తలపడుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. 'ఆ ప్రైవేట్ ఫొటోలు షేర్ చేయొద్దు'
కథానాయిక అమలాపాల్‌కు మద్రాసు హైకోర్టులో ఊరట లభించింది. ఆమె మాజీ ప్రియుడు, గాయకుడు భవిందర్ సింగ్ తన వ్యక్తిగత ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేయకుండా హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.