1. ఆర్థిక నష్టం, ఆలయ పనులపై రేపు సీఎం సమీక్ష
కొవిడ్ మహామ్మారి వల్ల తెలంగాణకు జరిగిన ఆర్థిక నష్టంపై సీఎం కేసీఆర్ శనివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, అధికారులు పాల్గొననున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. 'అతిపెద్ద ఎఫ్‌డీఐ'
తెలంగాణ చరిత్రలోనే అతిపెద్ద పెట్టుబడిని అమెజాన్ ప్రకటించింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఏర్పాటు చేయబోతున్న డేటా సెంటర్లను... సుమారు 20,761 కోట్ల రూపాయలతో మూడు ప్రాంతాల్లో నిర్మించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన ఉత్తమ్
హైదరాబాద్ వరద సహాయంలో భారీ కుంభకోణం జరిగిందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయమై రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్‌కు ఫిర్యాదు చేశారు. గవర్నర్‌తో ఫోన్లో మాట్లాడిన ఉత్తమ్.. జరిగిన కుంభకోణంపై సమగ్ర విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. పవార్‌ని కలిసిన మంత్రి
మహారాష్ట్రలో అభివృద్ధి చెందిన వ్యవసాయానికి శరద్ పవార్‌ను రైతులు ఆద్యుడిగా భావిస్తారని మంత్రి నిరంజన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. రైతుల సహకార వ్యవస్థ, సహకార పరిశ్రమలు, వ్యవసాయ విద్య, కృషి విజ్ఞాన కేంద్రాలు లాంటివి పవార్ కృషికి నిదర్శనమని కొనియాడారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. బిహార్ బరి: సర్వం సిద్ధం
బిహార్ అసెంబ్లీ ఎన్నికల తుది విడత పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. మూడోదశలో 78 స్థానాలకు శనివారం ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 2.34 కోట్ల మంది ఓటర్లు.. 1204 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. 'కరోనా అనంతరం సిద్ధంగా ఉండాలి'
కరోనా తర్వాత పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలన్నారు ప్రధాని మోదీ. కరోనాతో ఇటలీలో మృతి చెందిన వారికి భారతీయుల తరఫున సంతాపం తెలిపారు. శుక్రవారం జరిగిన భారత్-ఇటలీ వర్చువల్ సదస్సులో ప్రసంగించారు మోదీ. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. 'రికవరీలే అధికం'
భారత్‌లో రికవరీల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గత ఐదువారాల్లో కరోనా కేసుల కంటే కోలుకున్నవారే అధికంగా ఉన్నట్లు తెలిపింది కేంద్ర ఆరోగ్యశాఖ. అయితే మహారాష్ట్ర, కేరళ, దిల్లీ, బంగాల్ రాష్ట్రాల్లో కేసుల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. అధ్యక్ష ఫలితం!
అగ్రరాజ్యం అమెరికా అద్యక్ష పీఠం ఎవరిదన్న దానిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అయితే దీనిపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఐదు కీలక రాష్ట్రాల్లో కౌంటింగ్ కొనసాగుతున్న సమయంలో.. ట్రంప్ ఆధిక్యంలో ఉన్న జార్జియాలో బైడెన్ రేసులోకి వచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. కట్టుదిట్టంగా బౌలింగ్
వరుస ఓటములతో సతమతవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, హ్యాట్రిక్ విజయాలతో దూకుడు మీదున్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. నేడు జరిగే ఎలిమినేటర్ మ్యాచులో తలపడనున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. 'నా చూపులు అలసినవే'
సూర్య, అపర్ణ బాలమురళి ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం 'సూరారై పొట్రు'. తెలుగులో 'ఆకాశం నీ హద్దురా' పేరుతో విడుదలవనుంది. దీపావళి కానుకగా నవంబర్ 12న అమెజాన్ ప్రైమ్ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.