1. కాసేపట్లో జీహెచ్ఎంసీ నోటిఫికేషన్
ఈరోజు ఉదయం 10.30 గంటలకు జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ ఈసీ విడుదల చేయనున్నారు. రేపట్నుంచి నామినేషన్లు స్వీకరించే అవకాశం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. అన్ని పార్టీల కసరత్తు
హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల వేడి ప్రారంభమైంది. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే పార్టీలు దూకుడు పెంచుతున్నాయి. గ్రేటర్‌లో 23 శాసనసభా నియోజకవర్గాల పరిధిలో మొత్తం 150 డివిజన్లు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. ఆ పథకంలో అధికారుల చేతివాటం
రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన షాదీముబారక్, కల్యాణలక్ష్మి పథకంలో అవినీతిపర్వం కొనసాగుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో కొంతమంది రెవెన్యూ ఉద్యోగులు, సిబ్బందితోపాటు మరికొంతమంది ప్రజాప్రతినిధుల పాత్ర ఉండటంతో... అక్రమాల తతంగం గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. 'మా భావజాలమే గట్టెక్కిస్తుంది'
సొంత పార్టీపై కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ చేసిన విమర్శలను తప్పుబట్టారు రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్. పార్టీ అంతర్గత వ్యవహారాలను కపిల్ సిబల్ మీడియా ముందు ప్రస్తావించాల్సింది కాదని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. డిస్కమ్‌ల తిప్పలు
విద్యుత్‌రంగానికి వెన్నెముకగా ఉంటున్న డిస్కమ్‌లు ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంతో కుదేలవుతున్నాయి. కరోనా దెబ్బకు మరింత ఇబ్బంది పడుతున్నాయి. ఇప్పటికే థర్మల్‌విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి శాతం సగానికి పడిపోయింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. 100 రోజులపాటు నడ్డా పర్యటన!
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ఇప్పటి నుంచే సన్నాహాలు చేస్తోంది భాజపా. దీనిలో భాగంగానే దేశవ్యాప్తంగా 100 రోజుల పాటు పర్యటించనున్నారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. ప్రధాని చేతికి ఆర్థిక సంఘం నివేదిక
15వ ఆర్థిక సంఘం.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తన నివేదికను సమర్పించింది. 2021-22 నుంచి 2025-26 వరకూ కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పన్ను పంపిణీపై ఈ నివేదిక ఉంది. ఇటీవలే ఈ నివేదికను రాష్ట్రపతికి కూడా సమర్పించింది ఆర్థిక సంఘం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. మోడెర్నా ప్రకటనపై ట్రంప్-బైడెన్ హర్షం
కరోనా వ్యాక్సిన్‌పై మోడెర్నా చేసిన ప్రకటనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అధ్యక్ష ఎన్నికల విజేత జో బైడెన్ స్వాగతించారు. తన హయాంలోనే ఈ ఆవిష్కరణ జరిగిందని ట్రంప్ ట్వీట్ చేయగా.. వ్యాక్సిన్‌పై ప్రకటన భవిష్యత్తుపై ఆశలు పెంచుతోందని బైడెన్ పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. నాదల్, జకోవిచ్ ముందంజ
లండన్‌లో జరుగుతున్న ఏటీపీ ఫైనల్స్‌లో టెన్నిస్ దిగ్గజాలు రఫెల్ నాదల్, నొవాక్ జకోవిచ్ శుభారంభం చేశారు. సింగిల్స్‌లో ఆండ్రీ రుబ్లెవ్‌పై నాదల్ పైచేయి సాధించగా.. డిగో స్క్వాట్జ్‌మ్యాన్‌పై జకోవిచ్ విజయం సాధించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. తారగా.. రాణిగా!
రోజా అనగానే ఎవరికైనా మొదట ఆమె నవ్వే గుర్తుకొస్తుంది. ఆ నవ్వుతోనే మాయ చేసి ప్రేక్షకుల హృదయాల్ని దోచేశారు. దక్షిణాదిలో స్టార్ హీరోయిన్గా, విలక్షణ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.