1. ఇంగ్లాండ్ ఆలౌట్
పింక్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 81 పరుగులకు ఆలౌటైంది. 25 పరుగులు చేసిన బెన్ స్టోక్స్ ఆ జట్టు టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో అక్షర్ 5, అశ్విన్ 4 వికెట్లు తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. బ్యాలెన్స్ తప్పిన దీదీ స్కూటర్!
దేశంలో పెరిగిన ఇంధన ధరలను నిరసిస్తూ.. బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను నడిపారు. ద్విచక్ర వాహనం నడపడం అలవాటు లేని దీదీ ఒకానొక దశలో కిందపడబోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. నీరందేలా ప్రణాళికలు
సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్ట్‌ల ద్వారా తెలంగాణలోని నాలుగు నియోజకవర్గాలకు సాగు నీరందేలా ప్రణాళికలు తయారు చేయాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. 'ఆ చట్టాలతో పరిశుభ్రంగా ఉంచండి'
పల్లె, పట్టణ ప్రగతిపై స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్లు, పంచాయతీరాజ్, పురపాలక శాఖ సీనియర్ అధికారులతో సీఎస్ సోమేశ్‌కుమార్ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన చట్టాలను గ్రామపంచాయతీలు, పురపాలక సంఘాల్లో అమలు చేయాలని ఆదేశించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. 'వారికి ఓట్లు అడిగే హక్కు లేదు'
తెరాస, భాజపాలకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు అడిగే అర్హత లేదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. అన్ని వర్గాల పట్టభద్రులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. '20 రోజుల్లో ఎలా పరిష్కరిస్తారు'
నూతన రెవెన్యూ ట్రైబ్యునళ్లపై హైకోర్టు విచారణ జరిగింది. సహజ న్యాయసూత్రాలు అమలు చేయాలని పేర్కొంది. 20 రోజుల్లో ఎలా పరిష్కరిస్తారో తెలుసుకోవాలని ఉందని హైకోర్టు వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. మైనర్‌పై అత్యాచారం
హరియాణాలో 17ఏళ్ల మైనర్ యువతిపై కొందరు కిరాతకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. నిందితుల్లో ముగ్గురిని అరెస్టు చేయగా.. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. ప్రాజెక్టులకు మోదీ శ్రీకారం
తమిళనాడులోని కోయంబత్తూర్‌లో పర్యటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. నైవేలిలో నిర్మించిన థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని జాతికి అంకితం ఇచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. గుండెతో ఆలుగడ్డ కూర!
అమెరికాలో ఒళ్లు గగుర్పొడిచే దారుణ ఘటన జరిగింది. ఓ మహిళను చంపి ఆమె గుండెతో బంగాళదుంపలను కలిపి కూర వండాడు ఉన్మాది. ఆ ఆహారాన్ని తన కుటుంబసభ్యులకు తినిపించాలనుకున్నాడు. ఈ క్రమంలో.. తన మామ, అతని మనుమరాలిని కూడా హత్య చేశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. బాక్సాఫీస్ వార్
బాలీవుడ్లో వరుసగా విడుదల తేదీలను ప్రకటిస్తున్నారు దర్శకనిర్మాతలు. దీంతో కొన్ని చిత్రాల మధ్య పోటీ తప్పట్లేదు. ఈ ఏడాదిలో విడుదలయ్యే సినిమాల్లో ఏ రెండింటి మధ్య పోటీ ఆసక్తికరంగా ఉండనుంది? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.