ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @5PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ETV BHARAT TOP TEN 5PM NEWS
టాప్​టెన్ న్యూస్ @5PM
author img

By

Published : Mar 15, 2021, 4:50 PM IST

1. కేసీఆర్ కసరత్తు

ఆర్థికమంత్రి హరీశ్‌రావు, అధికారులతో సీఎం సమావేశమయ్యారు. బడ్జెట్ ప్రతిపాదనలపై సీఎం కేసీఆర్ తుది కసరత్తు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. 'ప్రసంగంలో పసలేదు'

ఆరేళ్ల నుంచి చెబుతున్న అంశాలనే గవర్నర్ మళ్లీ ప్రసంగించారని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. ప్రసంగంలో పస లేదంటూ ఆరోపించారు. పేదలకు కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. 'వారి కనుసన్నల్లోనే పోలీస్​ వ్యవస్థ'

భైంసా ఘటనపై భాజపా నాయకులు రాజ్​భవన్​లో గవర్నర్​ తమిళిసైను కలిసి ఫిర్యాదు చేశారు. పోలీసుల తీరుపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మండిపడ్డారు. మజ్లిస్‌ కనుసన్నల్లో పనిచేస్తున్నారని ఆరోపణలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. 'నిరవధిక సమ్మెకు సిద్ధం'

బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగ సంఘాలు హైదరాబాద్​లో రెండు రోజుల సమ్మెను ప్రారంభించాయి. ఆందోళనలో ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా నినాదాలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. 17 మందితో అజ్ఞాతంలోకి

ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మున్సిపల్‌ ఛైర్మన్​ ఎంపికపై వైకాపాలో క్యాంపు రాజకీయాలు మెుదలయ్యాయి. అధికార పార్టీకి చెందిన ప్రముఖ ప్రజాప్రతినిధుల మధ్య ఛైర్మన్ ఎంపికలో విభేదాలు తలెత్తాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. కమల్​, దినకరన్​ నామినేషన్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కోయంబత్తూర్​ సౌత్​ నియోజకవర్గం అభ్యర్థిగా నామినేష్​ దాఖలు చేశారు ఎంఎన్​ఎం అధినేత కమల్​ హాసన్​. ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్​ కోవిల్​పట్టి నియోజకవర్గానికి నామపత్రాలు సమర్పించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. మయన్మార్​లో మార్షల్​ చట్టం

మయన్మార్​లో అతిపెద్ద నగరమైన యాంగూన్​లోని ఆరు ప్రాంతాల్లో మార్షల్​ చట్టాన్ని అమలు చేసింది సైన్యం. నార్త్​ డగూన్​, సౌత్​ డగూన్​, డగూన్​ సైకన్​, నార్త్​ ఒక్కలప, లైయింగ్​ థార్​ యార్​, శ్వేపైత ప్రాంతాల్లో ఈ మార్షల్​ చట్టాన్ని సైన్యం ప్రయోగించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. 3 ముళ్లు వేసిన బుమ్రా

భారత స్టార్​ పేసర్​ జస్​ప్రీత్​ బుమ్రా పెళ్లిపీటలు ఎక్కాడు. అందరూ ఊహించినట్టుగానే టీవీ ప్రజెంటర్​ సంజనా గణేశన్​ను బుమ్రా పెళ్లాడాడు. ఈ విషయాన్ని సంజనా ఇన్​స్టాగ్రామ్​లో పంచుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. రికార్డు సృష్టించిన రొనాల్డో

స్టార్​ ఫుట్​బాల్​ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో సాకర్​ చరిత్రలో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. సెరీ ఏ లీగ్​లో కాగ్లియారీ జట్టుతో ఆదివారం జరిగిన మ్యాచ్​లో జువెంటస్​ ఫుట్​బాలర్​ రొనాల్డో.. హ్యాట్రిక్​ గోల్స్​తో తన జట్టుకు విజయాన్ని తెచ్చిపెట్టాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. 'మేజర్' గ్లింప్స్

అడివి శేష్-మహేశ్​బాబు కాంబినేషన్​లో తెరకెక్కుతున్న 'మేజర్' సినిమా గ్లింప్స్​ను విడుదల చేశారు. టీజర్​ను మార్చి 28న రిలీజ్ చేయనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.