1. ఏడుగురు మృతి
బంగాల్ ముర్షీదాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. సుతి ప్రాంతంలో ఆటో, కారు ఢీకొని ఏడుగురు మరణించారు. 15 మంది గాయపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. విశాఖ ఉక్కు సీఎండీకి నోటీసు
విశాఖ ఉక్కు పరిశ్రమ ఉద్యోగుల ఆందోళన ఉద్ధృతమవుతోంది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సమ్మె నోటీసు ఇచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. డ్రోన్‌తో పిచికారి
వ్యవసాయ రంగంలో రైతుల అవసరాల మేరకు కొత్త ఆవిష్కరణలు రావాలని మంత్రి ఈటల రాజేందర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రంలో డ్రోన్ యంత్రంతో పంటలపై పురుగు మందుల పిచికారి కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. యాప్‌ల కేసులో మరొకరు
రుణ యాప్‌ల కేసులో మరో నిందితుడిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరులో చిన్నబ్బ రాజశేఖర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. సంయమనం పాటించాలి: దీదీ
నందిగ్రామ్‌లో జరిగిన దాడి విషయంలో పార్టీ కార్యకర్తలు సంయమనం పాటించాలని పశ్చిమబంగాల్ సీఎం మమతా బెనర్జీ కోరారు. కొన్నిరోజులపాటు చక్రాల కుర్చీలో తిరుగాడాల్సి ఉంటుందని అందుకు కార్యకర్తల సహకారం కావాలన్నారు దీదీ. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. 'యువతే మార్పు తేగలరు'
సమాజాన్ని మార్చే విషయంలో విద్యావంతులే శక్తివంతమైన ఏజెంట్లు అని అభిప్రాయపడ్డారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కొవింద్. దేశంలో విప్లవాత్మక మార్పులను విద్యావంతులే తీసుకురాగలరని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. తాజ్‌మహల్‌లో పూజలు అరెస్టు
ప్రంపంచ ప్రఖ్యాత పర్యాటక క్షేత్రం తాజ్‌మహల్‌లో పూజలు నిర్వహించారనే ఆరోపణలతో ముగ్గురని అరెస్టు చేసింది సీఐఎస్ఎఫ్. ఈ అరెస్టులను ఖండిస్తూ ఆందోళనకు దిగారు హిందూ మహాసభ కార్యకర్తలు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. ఆ దుర్ఘటనకు పదేళ్లు
జపాన్‌లో సునామీ వల్ల ఫుకుషిమా న్యూక్లియర్ కేంద్రం ధ్వంసమై నేటికి పదేళ్లు. నాటి ప్రమాదంలో మరణించిన వారికి జపాన్ చక్రవర్తి, ప్రధాని నివాళులర్పించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. కన్నేసిన కోహ్లీ
అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్ రికార్డులను వేదికగా కానుంది. అంతర్జాతీయ టీ20ల్లో 3 వేల మైలురాయికి టీమ్ఇండియా కెప్టెన్ మరో 72 పరుగుల దూరంలో ఉండగా.. అంతర్జాతీయ క్రికెట్లో 12 వేల పరుగుల నమోదు చేసేందుకు కోహ్లీ మరో 17 పరుగులు దూరంలో ఉండడం విశేషం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. నవ్వించే 'జాతిరత్నాలు'!
మహాశివరాత్రి కానుకగా విడుదలైన 'జాతిరత్నాలు'.. ప్రేక్షకుల్ని నవ్వించిందా? ఇంతకీ సినిమా ఎలా ఉంది? ఎంతలా ఆకట్టుకుంది? తెలియాలంటే ఈ సమీక్ష చదవాల్సిందే. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.