ETV Bharat / city

టాప్‌టెన్‌ న్యూస్‌ @5PM

author img

By

Published : Nov 20, 2020, 5:07 PM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ETV BHARAT TOP TEN 5PM NEWS
టాప్‌టెన్‌ న్యూస్‌ @5PM

1. ముగిసిన నామినేషన్ల గడువు

జీహెచ్ఎంసీ ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసింది. మూడురోజులపాటు నామినేషన్లను స్వీకరించారు అధికారులు. ఇవాళ అత్యధికంగా 600కిపైగా నామినేషన్లు వచ్చినట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. జనసేనతో కలిసి పనిచేస్తాం : కిషన్​

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో జనసేనతో కలిసి పనిచేస్తున్నట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ ఎన్నికల్లోనే కాకుండా భవిష్యత్​లోనూ కలిసి పనిచేయనున్నట్లు ఆయన వివరించారు. హైదరాబాద్​లోని నాదెండ్ల మనోహర్ నివాసంలో ఇరుపార్టీల నేతలు సమావేశమయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. భాజపా గెలుపు మా ధ్యేయం: పవన్

జీహెచ్‌ఎంసీ ఎన్నికల నుంచి వైదొలుగుతున్నామని ప్రకటించారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. కార్యకర్తలు నిరుత్సాహం చెందవద్దని ఆయన కోరారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాజపా గెలవాలని ఆకాంక్షించారు. పార్టీ కార్యకర్తలు భాజపా విజయం కోసం పనిచేయాలని సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. ఆరోపణలను ఖండించిన కేటీఆర్​

చార్మినార్​ వద్ద భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్న సమయంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ చేసిన వాఖ్యలపై కేటీఆర్​ మండిపడ్డారు. అవాస్తవ ఆరోపణలతో ఎన్నికల వేళ రాజకీయం చేయడం సబబు కాదన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. ఎన్​కౌంటర్​పై మోదీ సమీక్ష

జమ్ముకశ్మీర్​లో జరిగిన నగ్రోటా ఎన్​కౌంటర్​, తదనంతర పరిణామాలపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కశ్మీర్ సరిహద్దుల్లో, వాస్తవాధీన రేఖ సమీపంలో ఇటీవల జరుగుతున్న పరిణామాలపై ప్రధాని చర్చించినట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. సిబ్బందిపై దాడి

ఉత్తర్​ప్రదేశ్​లోని షామ్లీ ప్రాంతంలో వైద్య బృందంపై ఓ యువకుడు దాడి చేశాడు. మురికివాడల్లో కరోనా కట్టడి కోసం నమూనాలు సేకరిస్తుండగా.. అర్వింద్​ అనే వ్యక్తి వారితో దురుసుగా ప్రవర్తించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. అంత్యక్రియల్లో 9 మంది మృతి

చైనాలో ఓ ట్రక్కు బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన జరుగుతున్న అంత్యక్రియల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 9 మంది మరణించారు. నలుగురు గాయపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. ఆమెకు ఉరిశిక్ష వాయిదా

అమెరికాలో ఓ మహిళకు మరణ శిక్షను అమలు చేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది ఫెడరల్​ కోర్టు. ఆమె తరఫు న్యాయవాదులు కరోనా బారిన పడగా.. ఈ నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. 'సిరీస్​లో నిర్ణయించేది​ వారే'

భారత్​-ఆస్ట్రేలియా సిరీస్​ల్లో బౌలర్లే ఫలితాలను నిర్ణయిస్తారని మాజీ క్రికెటర్​ జహీర్​ఖాన్ అభిప్రాయపడ్డాడు​. ప్రపంచస్థాయి అత్యుత్తమ బౌలర్లు ఇరుజట్లలో ఉండటమే ఇందుకు కారణమని అన్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. థియేటర్లలోనే ఆ హీరోల సినిమాలు

అగ్రహీరోలు సల్మాన్ ఖాన్, రణ్​వీర్ సింగ్, అక్షయ్ కుమార్​ల కొత్త సినిమాలు అన్ని థియేటర్లలోనే విడుదల కానున్నాయి. ఈ మేరకు ఆయా చిత్రబృందాలు ప్రకటనలు చేశాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.