ETV Bharat / state

కాళేశ్వరం పేరుతో బీఆర్‌ఎస్‌ అవినీతి చేస్తే - కాంగ్రెస్‌ మూసీ పేరుతో చేస్తుంది : బండి సంజయ్ - Bandi Sanjay On Hydra Demolitions

Bandi Sanjay on Hydra : హైడ్రా తమ ప్రాణాలు తీశాకే ప్రజల ఇళ్ల కూల్చివేతలకు వెళ్లాలని కేంద్రమంత్రి బండి సంజయ్‌ అన్నారు. మరోవైపు కాంగ్రెస్‌ ప్రభుత్వం మూసీ పేరుతో దోపిడీకి తెర తీసిందని ఆరోపించారు. హైడ్రాకు చెక్‌ పెట్టేందుకు బీజేపీ వ్యూహరచన చేస్తుందని తెలిపారు.

Union Minister Bandi Sanjay On Hydra Demolitions
Union Minister Bandi Sanjay On Hydra Demolitions (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 30, 2024, 12:12 PM IST

Union Minister Bandi Sanjay On Hydra Demolitions : కాళేశ్వరం పేరుతో బీఆర్‌ఎస్‌ అవినీతి చేస్తే, మూసీ పేరుతో కాంగ్రెస్‌ రూ.లక్షన్నర కోట్ల దోపిడీకి తెర తీసిందని కేంద్రమంత్రి బండి సంజయ్‌ ఆరోపించారు. హైడ్రా తీరుతో ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సప్తగిరి కాలనీలో ఏర్పాటు చేసిన ‘స్వచ్ఛతా హీ సేవా’ కార్యక్రమంలో కేంద్రమంత్రితో పాటు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, నగర మేయర్ సునీల్ రావు, మున్సిపల్ కమిషనర్ చాహత్ వాజ్‌పేయి, స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు.

హైడ్రా కోసం బీజేపీ ఉద్యమిస్తుంది : ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన హైడ్రా పేరుతో కాంగ్రెస్‌ వసూళ్లకు తెర తీస్తుందని ఆరోపించారు. అయ్యప్ప సొసైటీ కూల్చివేత పేరుతో గత ప్రభుత్వం వసూళ్లు చేసిందని అన్నారు. పేదల ఇళ్లను కూలిస్తే అడ్డుకుంటామన్న ఆయన, ప్రజలకు బీజేపీ ఆయుధం కాబోతుందన్నారు. తమ ప్రాణాలు తీశాకే ప్రజల ఇళ్ల కూల్చివేతలకు వెళ్లాలని తెలిపారు. హైడ్రా దాడులపై బీజేపీ సింగిల్‌గానే ఉద్యమిస్తుందని హెచ్చరించారు. హైడ్రాకు చెక్ పెట్టేందుకు బీజేపీ వ్యూహరచన చేస్తుందని తెలిపారు. కిషన్‌రెడ్డి నేతృత్వంలో హైడ్రాపై పార్టీ నాయకుల చర్చల తర్వాత తమ కార్యాచరణ ఉంటుందని అన్నారు.

ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నా - హైడ్రా, ప్రభుత్వ తీరు మారడం లేదు : బండి సంజయ్ - Bandi Sanjay Fires On CM Revanth

వారి వల్లే జాతీయ స్థాయిలో పేరు : స్వచ్ఛత విషయంలో కరీంనగర్ శానిటైజేషన్ సిబ్బంది చేస్తున్న కృషి మరువలేనిదని బండి సంజయ్‌ అన్నారు. సపాయి కార్మికుల కృషి వల్లే శానిటైజేషన్ విషయంలో కరీంనగర్‌కు జాతీయ స్థాయిలో మంచి పేరు వచ్చిందన్నారు. కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధికి కేంద్రం పూర్తిగా సహకరిస్తోందన్నారు. అందులో భాగంగానే స్మార్ట్ సిటీ మిషన్ నిధులను మంజూరు చేసిందన్నారు.

రాజకీయాలకు అతీతంగా పని చేయాలి : రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే మ్యాచింగ్ గ్రాంట్‌ను విడుదల చేసి అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఎన్నికల వరకే రాజకీయాలని, ఆ తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేస్తేనే అభివృద్ధి సాధ్యమన్నారు. ఎన్నికల తర్వాత కూడా రాజకీయాలకే పరిమితమైతే ప్రజలు నష్టపోతారని తెలిపారు.

బీఆర్​ఎస్​, కాంగ్రెస్​లు​ డైవర్షన్​ పాలిటిక్స్​తో ఆటలాడుతున్నాయి: బండి సంజయ్​ - Bandi Sanjay Slams the TG Govt

విమోచనం కోసం జరిగిన పోరాటాలను నేటి తరానికి తెలియజేయకపోవడం బాధాకరం : బండి సంజయ్‌ - Hyderabad Liberation Day 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.