1. కాగ్ నివేదిక
2018 మార్చి, 2019 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరాలకు గానూ కాగ్ ఇచ్చిన నివేదికను అసెంబ్లీకి ప్రభుత్వం సమర్పించింది. ఉభయసభల్లో కాగ్ నివేదికపై చర్చించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. రూ.246 కోట్లతో పార్కుల అభివృద్ధి
తెలంగాణలో రూ.246 కోట్లతో 15 ఎకో టూరిజం పార్కులు అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర పర్యాటక మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. గతంలో పర్యాటకం అంటే ప్రైవేట్ పరం చేయడమేనని భావించారని విమర్శించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. 'బీమా వర్తింపుపై నిర్ణయం తీసుకుంటాం'
సాగు కూలీలకూ రైతుబీమా పథకాన్ని వర్తింపజేయడం విధానపరమైన అంశమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. త్వరలోనే దానిపై ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. 'ప్రతిపక్షాలు స్పందించలేదు'
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశానికి పనికివచ్చే మాదిరి ఉందని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ఎన్నికల మానిఫెస్టోలో లేని అంశాలు కూడా అమలు చేశారని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. 'ఆయన బతికుంటే మరోలా పరిస్థితులు'
బంగ్లాదేశ్ తొలి అధ్యక్షుడు బంగబంధు హత్యకు గురికాకపోయి ఉంటే మన ఉపఖండం మరోలా ఉండేదన్నారు ప్రధాని మోదీ. ఆయనది సరిహద్దులు, విభజనలు వంటి పరిమితులకు మించిన దృక్కోణమని కొనియాడారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. 'అన్యాయం, అహంకారం'
సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన భారత్ బంద్‌కు రాహుల్ గాంధీ మద్దతు తెలిపారు. 'సత్యాగ్రహం'తోనే.. దురాగతాలు, అన్యాయం, అహంకారం అంతమవుతాయని దేశ చరిత్ర చెబుతోందని ట్వీట్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. ఏకైక క్షయ రహిత జిల్లా
దేశంలో ఏకైక క్షయ రహిత జిల్లాగా నిలిచింది కశ్మీర్‌లోని బుద్గాం. మొత్తం 65 జిల్లాలు దరఖాస్తు చేసుకోగా.. బుద్గాం స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. టాటా సన్స్‌కు ఊరట
సైరస్ మిస్త్రీ వివాదంలో టాటా సన్స్‌కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. సైరస్ మిస్త్రీని సంస్థ ఎగ్జిక్యుటివ్ ఛైర్మన్ పదవి నుంచి తప్పించడాన్ని అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. మనకు మరో స్వర్ణం
50 మీటర్ల త్రీ పొజిషన్ మిక్స్డ్ విభాగంలో భారత్ స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. ఈ విషయాన్ని భారత క్రీడా సమాఖ్య ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. మన రేలంగి మావయ్య!
నటుడిగా, ప్రతినాయకుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా చెరగని ముద్రవేశారు ప్రకాష్‌రాజ్. చిత్రసీమలో అంతటి గొప్ప పేరు తెచ్చుకున్న ప్రకాష్‌రాజ్.. అదే స్థాయిలో వివాదాల్లోనూ కేంద్రబిందువుగా మారారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.