1. జగిత్యాల కలెక్టరేట్ వద్ద రైతుల ధర్నా
మొక్కజొన్న రైతులు ఆందోళనను ఉద్ధృతం చేస్తున్నారు. మహాధర్నాకు పిలుపునిచ్చిన అన్నదాతలు.. జగిత్యాల కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా జగిత్యాల పట్టణం, రూరల్ ప్రాంతాల్లో పోలీసులు 144 సెక్షన్‌ను విధించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. ముంపు ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన
భాగ్యనగరంలో కేంద్ర బృందం రెండో రోజు పర్యటిస్తోంది. నాగోల్, బండ్లగూడ చెరువుల నుంచి ఓవర్ ఫ్లో అయి నాలాల్లోకి వస్తున్న వరద నీరు, ముంపుతో జరిగిన నష్టం గురించి అధికారులు, స్థానిక ప్రజల నుంచి వివరాలు తెలుసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటాం: ఎస్పీ
నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ కోటిరెడ్డి పేర్కొన్నారు. కిడ్నాప్ చేసిన రెండు గంటల్లోనే చంపడం వల్ల బాలుడిని కాపాడలేకపోయామని అన్నారు. నిందితుడు సాగర్‌ను ఇవాళ రిమాండ్‌కు తరలిస్తామని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. దుబ్బాక ప్రజలు తేల్చుకోవాలి: హరీశ్‌రావు
కాంగ్రెస్, భాజపాలతో రైతులకు అన్యాయం తప్పదని మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు. రైతు సంక్షేమానికి పాటు పడుతున్న ఏకైక పార్టీ తెరాసనేని వెల్లడించారు. రాజక్కపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన... కారు గుర్తుకే ఓటు వేయాలని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. ఎన్డీఏదే మళ్లీ అధికారం: మోదీ
బిహార్‌లో మళ్లీ ఎన్డీఏ కూటమి అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఎన్నికల ప్రచారంలో భాగంగా సాసారమ్ బహిరంగ సభలో ప్రసంగించారు. ఆర్టికల్ 370 పునరుద్ధరణ ప్రకటనను తీవ్రంగా తప్పుపట్టారు మోదీ. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. బిహారీలకు ఉచిత టీకాపై క్లారిటీ
కొవిడ్-19 వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే.. బిహార్ ప్రజలకు ఉచితంగా అందిస్తామని భాజపా ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొనటం వివాదాస్పదమైంది. విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న వేళ.. కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ అంశంపై స్పందించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. 'పేదరికంలోకి 17 కోట్ల మంది'
కొవిడ్ మహమ్మారి సృష్టించిన ఆర్థిక సంక్షోభంతో సుమారు 15 నుంచి 17.5 కోట్ల మంది తీవ్ర పేదరికంలో కూరుకుపోయే ప్రమాదముందని ఐక్యరాజ్యసమతి అంచనా వేసింది. అసంఘటిత రంగం, పర్యావరణంపై ఆధారపడి జీవించేవారే ఇందులో ఎక్కువగా ఉంటారని ఓ నివేదికలో పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. 'ఎన్నికల్లో ఎవ్వరినీ వదిలిపెట్టను'
నవంబర్ 3న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలను ప్రపంచ దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి. కొన్ని దేశాలు ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని అగ్రరాజ్యం అరోపిస్తుంది. అయితే అలాంటి దేశాలకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. వీళ్లు తలుచుకుంటే మారిపోతుంది!
ప్రతి సీజన్‌లాగే ఈ ఐపీఎల్‌లోనూ కొందరు ఆటగాళ్లు తమ బ్యాటింగ్‌తో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు. బరిలోకి దిగితే ఇక గెలుపు తమదే అన్నట్లుగా పరుగుల వరద పారిస్తున్నారు. అవతలి ఎండ్‌లో బ్యాటర్‌కు అండగా నిలుస్తూ అవసరమైనప్పుడు తమ బ్యాట్ పవర్‌ను చూపిస్తూ ఆకట్టుకున్న ఆటగాళ్లపై ప్రత్యేక కథనం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. 'రాధేశ్యామ్' మోషన్ పోస్టర్
ప్రేక్షకులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న రాధేశ్యామ్ మోషన్ పోస్టర్ అలరిస్తోంది. ట్రైన్ డోర్ దగ్గర ప్రభాస్, పూజా హెగ్డే నిల్చున్న స్టిల్ ఆకట్టుకుంటోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.