ETV Bharat / city

టాప్‌టెన్‌ న్యూస్‌ @1PM - latest news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ETV BHARAT TOP TEN 1PM NEWS
టాప్‌టెన్‌ న్యూస్‌ @1PM
author img

By

Published : Aug 1, 2020, 1:00 PM IST

1. 'ట్రేసింగ్.. టెస్టింగ్​.. ట్రీటింగ్​'

హైదరాబాద్​ గచ్చిబౌలిలోని టిమ్స్ ఆసుపత్రిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​ రెడ్డి సందర్శించారు. రాష్ట్రంలో కరోనా పరీక్షలు తక్కువగా చేస్తున్నారని, పెంచాల్సిన అవసరం ఉందన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. సింగరేణి పంచాయతీ సర్పంచ్ ఆత్మహత్యాయత్నం

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం సింగరేణి పంచాయితీ సర్పంచ్ స్రవంతి ఉరివేసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి చేర్చారు. కొద్ది నెలల నుంచి పంచాయితీలో నిధుల దుర్వినియోగంపై చర్చ కొనసాగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. యాదాద్రీశుడి గోపురాలకు విద్యుత్ వెలుగులు

యాదాద్రీశుడి ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతోన్నాయి. అందులో భాగంగా ప్రధానాలయ గోపురాలకు రంగురంగుల మెరిసే విద్యుద్దీపాలను అమర్చి అధికారులు ట్రయల్​రన్​ నిర్వహించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. నడ్డివిరుస్తున్న ప్రైవేటు పరీక్షా కేంద్రాలు

కరోనా ఆపత్కాలంలోనూ ప్రైవేటు పరీక్ష కేంద్రాలు బాధితులను దోచుకుంటున్నాయి. ఆర్టీపీసీఆర్‌ పరీక్షకు రూ.2200 వసూలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కొన్ని ల్యాబ్‌ల్లో రూ.4 వేల వరకు వసూలు చేస్తున్నారు. రూ.50 ఉండే ఎక్స్‌రేకి రూ.500-1000 వరకు వసూలు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. నిరాడంబరంగా బక్రీద్​ వేడుకలు

కరోనా వేళ బక్రీద్‌ వేడుకలు నిరాడంబరంగా జరుగుతున్నాయి. ఉదయం ఈద్గాల వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. భారత్​కు అగ్రరాజ్యం మద్దతు

చైనాతో ఘర్షణ విషయంలో భారత్​కు అగ్రరాజ్యం నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోంది. వాస్తవాధీన రేఖ వెంబడి చైనా దురాక్రమణ, సైనిక ఘర్షణను.. అమెరికా పార్లమెంట్ సభ్యులే కాకుండా ఇతర నేతలు సైతం తప్పుబడుతున్నారు. భారత్​కు సంఘీభావంగా ప్రధానికి లేఖలు రాస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. 'ప్రతి కెప్టెన్​ కోరుకునే ఆటగాడు స్టోక్స్​'

ఇంగ్లాండ్​ క్రికెటర్​​ బెన్ ​స్టోక్స్​ ఉత్తమమైన ఆల్​రౌండర్​ అని ఆస్ట్రేలియా క్రికెటర్, రాజస్థాన్​ రాయల్స్​ కెప్టెన్​ స్టీవ్​ స్మిత్​ అన్నాడు. అటువంటి ఆటగాడిని ప్రతి కెప్టెన్​ తమ జట్టులో ఉండాలని కోరుకుంటారని పేర్కొన్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. విమానాలు ఢీ- చట్టసభ్యుడు సహా ఏడుగురు మృతి

అమెరికాలో జరిగిన విమాన ప్రమాదంలో ఓ శాసనసభ్యుడు సహా మొత్తం ఏడుగురు మరణించారు. రెండు విమానాలు ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. మండుతున్న ఎండలు

బ్రిటన్​లో ఎండలు మండిపోతున్నాయి. ఈ సంవత్సరంలోనే అత్యధిక ఉష్ణోగ్రత శుక్రవారం నమోదైంది. లండన్ పశ్చిమాన ఉన్న హీట్​త్రో ఎయిర్​పోర్ట్​ వద్ద 37.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు బ్రిటన్ వాతావరణ శాఖ తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. దర్శకుడు శేఖర్ కమ్ముల ఇంట విషాదం

ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి కమ్ముల శేషయ్య ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.