1. రైతుల రైల్‌రోకో
బంద్ నేపథ్యంలో పంజాబ్, హరియాణాలోని 31 ప్రాంతాల్లో రైతులు రహదారులపై బైఠాయించారు. ఈ తరుణంలో దిల్లీ, అంబాలా, ఫిరోజ్‌పుర్ డివిజన్ మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. దేశంలో కొత్తగా 59,118 కేసులు
భారత్‌లో కరోనా కొత్త కేసులు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఒక్కరోజే 59 వేల మందికిపైగా కొవిడ్ బారిన పడ్డారు. మరో 257 మంది చనిపోయారు. 32 వేల మంది కోలుకున్నారు. ఈ ఏడాదిలో ఒక్కరోజు కేసుల్లో ఇదే అత్యధికం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. కమ్ముకొస్తున్న కరోనా
తెలంగాణలో మళ్లీ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా మరో 518 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ సోకి ముగ్గురు మృతి చెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. ముగిసిన కబడ్డీ క్రీడలు
జాతీయ స్థాయి సబ్ జూనియర్ కబడ్డీ ఛాంపియన్షిప్ - 2021 పోటీలు ఘనంగా ముగిశాయి. మొదటి రోజు వేదిక కూలి అపశ్రుతి జరిగినప్పటికీ... మళ్ళీ ఎటువంటి నష్టం జరగకుండా అధికార యంత్రాంగం పగడ్బందీ చర్యలు తీసుకుని క్రీడలను విజయవంతంగా ముగించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. 'ప్లాస్మా దాతలు ముందుకు రావాలి'
రాష్ట్రంలో అర్హులైన ప్లాస్మా దాతలు ముందుకొచ్చి దానం చేయాలని రాష్ట్ర ప్లాస్మా డోనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గూడూరు నారాయణ సూచించారు. 55 ఏళ్లు దాటని వారు ప్లాస్మా దానం చేయవచ్చని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. మోదీకి ఘన స్వాగతం
ప్రధాని మోదీ రెండు రోజుల పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్ రాజధాని ఢాకా చేరుకున్నారు. ఆ దేశ ప్రధాని షేక్ హసీనా మోదీకి ఘన స్వాగతం పలికారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. స్టాక్ మార్కెట్ల జోష్
స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 480 పాయింట్లకుపైగా ఎగబాకి 48,921 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ- నిఫ్టీ 150 పాయింట్లకుపైగా లాభపడి 14,479 వద్ద ట్రేడవుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. కిమ్ క్షిపణి పరీక్షలు!
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ మరోసారి క్షిపణి ప్రయోగం చేసింది ఉత్తర కొరియా. రెండు కొత్తతరం గైడెడ్ మిసైల్స్ అనుకున్న లక్ష్యాన్ని ఛేదించినట్లు ఆ దేశ మీడియా ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. కోహ్లీ అలా చేస్తే..
భారత కెప్టెన్ కోహ్లీ దూకుడు తమ జట్టుపై ఎలాంటి ప్రభావం చూపదని స్టోక్స్ అభిప్రాయపడ్డాడు. మెరుగ్గా మారేందుకు అనువైన దారినే ఎంచుకుంటామని తెలిపాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. ఆర్ఆర్ఆర్: అప్డేట్
మెగా అభిమానులకు సర్ప్రైజ్! మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ పుట్టినరోజు సందర్భంగా 'ఆర్ఆర్ఆర్' చిత్రంలోని నయా అవతార్‌ను శుక్రవారం (మార్చి 26) సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.