ETV Bharat / city

ఈటీవీ భారత్​ ముఖ్యాంశాలు

ETV BHARAT TOP NEWS
ETV BHARAT TOP NEWS
author img

By

Published : Nov 4, 2021, 5:58 AM IST

Updated : Nov 4, 2021, 9:56 PM IST

21:32 November 04

టాప్​న్యూస్​@ 10PM

  • రాష్ట్రవ్యాప్తంగా దీపావళి వేడుకలు

రాష్ట్రంలో దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా టపాసుల మోత, వెలుగులే కనిపిస్తున్నాయి. కరోనాతో గతేడాది అంతంతమాత్రంగా జరిగిన వేడుకలు ఈ సారి నింగిని తాకుతున్నాయి. హైదరాబాద్​లో బాణాసంచా కాలుస్తూ సంబురాలు చేసుకుంటున్నారు. చిన్నారులు కేరింతలు కొడుతూ మతాబులు కాల్చుతున్నారు.

  • దేశంలో ఘనంగా దీపావళి

దేశమంతటా దీపావళి వేడుకలు అంగరంగవైభంగా జరుగుతున్నాయి. ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. పలుచోట్ల నరకాసుర వధ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

  • 'మీరే నా కుటుంబసభ్యులు'

జమ్ముకశ్మీర్​ రాజౌరీ జిల్లాలోని నౌషెరా సెక్టార్​లో జవాన్లతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. సైనికులకు మిఠాయిలు అందచేసి శుభాకాంక్షలు తెలిపారు. అమర జవాన్లకు నివాళులర్పించారు మోదీ. అనంతరం సైనికులను ఉద్దేశించి మాట్లాడారు.

  • ప్రపంచవ్యాప్తంగా దీపావళి సంబరాలు

దీపావళి శోభ ప్రపంచ నలుమూలలా వ్యాపించింది. వివిధ దేశాల్లోని హిందువులు ఈ ప్రత్యేక దినాన్ని సంబరంగా జరుపుకొంటున్నారు.

  • ఘనంగా కొత్త సంవత్ 

దీపావళికి భారత స్టాక్ మార్కెట్లు నిర్వహించే ప్రత్యేక మూరత్ ట్రేడింగ్ భారీ లాభాలు నమోదు చేసింది. సంవత్ 2078 తొలిరోజు గంట పాటు నిర్వహించిన ట్రేడింగ్​లో సూచీలు రికార్డు స్థాయిలో లాభాలు నమోదు చేశాయి. సెన్సెక్స్ 295 పాయింట్లు లాభపడి 60,067 పాయింట్ల వద్ద స్థిరపడింది. మరోవైపు నిఫ్టీ 87 పాయింట్లు లాభపడి 17,916 వద్ద స్థిరపడింది. 

20:55 November 04

టాప్​న్యూస్​@9PM

  •  టపాసుల మోతతో భాగ్యనగరం.!

  •  ఈసారి  సౌండ్లు  తగ్గనున్నాయి.. ఎందుకంటే..?

దీపావళి సంబురాల్లో వెలుగులు విరజిమ్మే మతాబులు చిన్నబోయాయి. కోనుగోలు దారులతో సందడిగా ఉండాల్సిన బాణాసంచా దుకాణాలు వెలవెలబోతున్నాయి. గల్లీలను మారుమోగించే పటాకుల శబ్దాలు కాస్తా తగ్గాయి. వీటన్నింటికీ కరోనా ఓ కారణమైతే.. అసలు కారణం మాత్రం వేరే ఉంది.. అదేంటంటే..

  •  రెండు కోట్ల బంగారం స్మగ్లింగ్​

రైల్లో అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ఓ వ్యక్తిని డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి దాదాపు 2 కోట్లు విలువ చేసే బంగారాన్ని స్వాధీనం (gold seized) చేసుకున్నారు.

  • ఆర్ఆర్ఆర్  అప్డేట్.. !

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో ఆర్​ఆర్ఆర్, సుమ కొత్త చిత్రం, ఒకే ఒక జీవితం, స్టూవర్ట్​పురం దొంగ, కార్పోరేటర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, 18 పేజీస్ చిత్రాల కొత్త సంగతులు ఉన్నాయి.

  • బాక్సింగ్ ఛాంపియన్​షిప్​లో ఆకాశ్​కు కాంస్యం

ప్రపంచ బాక్సింగ్​ ఛాంపియన్​షిప్​లో (Boxing World Championships) అద్భుత పోరాటంతో సెమీస్​ వరకు చేరిన భారత యువ బాక్సర్ ఆకాశ్​.. పోరాటం ముగిసింది. గురువారం సెమీఫైనల్లో ఓటమితో నిష్క్రమించిన (Akash Kumar Boxer) ఆకాశ్.. భారత్​కు అరంగేట్రంలోనే పతకం సాధించిపెట్టాడు.

19:55 November 04

టాప్​న్యూస్​@8PM

  •  సమోసాలతో దీపావళి  ఎక్కడంటే..!

  •  ఇవి తప్పనిసరిగా పాటించాల్సిందే..!

పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా జరుపుకునే పండుగ దీపావళి. మరి ఈ పండుగ రోజు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే జీవితం ఇంకా వెలుగుమయమవుతుంది. ఈ పర్వదినాన ఇంటిల్లిపాది సంతోషంగా ఉండాలంటే.. టపాసులు కాల్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేంటో చూద్దాం..

  • ఏ రాష్ట్రం ఎంత వ్యాట్ తగ్గించిందంటే...

పెట్రో భారం నుంచి కాస్త ఊరట కలిగించేలా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో చాలా రాష్ట్రాల్లో ధరలు దిగొస్తున్నాయి. ముఖ్యంగా అరడజనుకు పైగా ఉన్న భాజపా పాలిత రాష్ట్రాలు చమురుపై వ్యాట్​ను భారీగా తగ్గించాయి. తమ నిర్ణయంతో సామాన్యులకు లాభం చేకూరనున్నట్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. పెట్రోల్, డీజిల్​పై ఏ రాష్ట్రం ఎంత వ్యాట్ తగ్గించిందంటే...

  •  పునీత్​ రాజ్​కుమార్​కు ప్రతిష్టాత్మక అవార్డు

ఇటీవల కార్డియాక్ అరెస్ట్​తో మరణించిన పునీత్​ రాజ్​కుమార్​ను బసవ శ్రీ అవార్డు వరించింది. దీనిని ఆయన కుటుంబానికి అందజేయనున్నట్లు మురుగ మఠ్ స్వామిజీ తెలిపారు.

  • బాక్సింగ్​లో ఆకాశ్​కు కాంస్యం

18:46 November 04

టాప్​న్యూస్​@7PM

  • రాముడికి ముస్లిం మహిళ హారతి..!

ప్రతి దీపావళికి రాముడికి హారతి ఇచ్చే సంప్రదాయాన్ని కొనసాగించారు వారణాసికి చెందిన ముస్లిం మహిళ నంజీన్ అన్సారీ. స్వహస్తాలతో, భక్తి శ్రద్ధలతో రాముడికి (Prayers to Lord Rama) పూజలు చేశారు.

  • పాక్ సైనికులతో  దీపావళి వేడుకలు

భారత్​- పాక్ సరిహద్దుల్లో(India Pak border news) దీపావళి సంబరాలు ఘనంగా జరిగాయి. అట్టారీ- వాఘా సరిహద్దు(Wagah border news) వద్ద పాకిస్థాన్​ సైనికులకు భారత జవాన్లు మిఠాయిలు పంచి పెట్టారు. కశ్మీర్​ టీట్​వాల్​లోని సరిహద్దు ఒంతెనపైనే భారత్​- పాక్ జవాన్లు ఒకరికొకరు స్వీట్లు పంచుకుని దీపావళి శుభాకాంక్షలు చెప్పుకున్నారు.

  •  వాటితోనే బలవుతారు

కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్​ సిద్దిపేటలోని రంగదాంపల్లి చౌరస్తాలోని అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా.. మంత్రి హరీశ్​రావుపై ఈటల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సిద్దిపేటలో కూడా దళిత గర్జన పెట్టే రోజు వస్తుందిని.. దానికి తానే నాయకత్వం వహిస్తానని తెలిపారు.

  • లాభాలతో ప్రారంభం..

మూరత్ ట్రేడింగ్​లో స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో కొనసాగుతున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 368 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. నిఫ్టీ సైతం లాభాల్లో ఉంది. 

  • బంగ్లాపై కంగరూల ఘన విజయం.. 

గురువారం మ్యాచ్​లో బంగ్లాదేశ్​పై గెలిచిన ఆస్ట్రేలియా.. సెమీస్​ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది. తమ తర్వాత మ్యాచ్​లో వెస్టిండీస్​తో తలపడనుంది కంగారూ జట్టు.

17:54 November 04

టాప్​న్యూస్​@6PM

  • ఆ వేడుకలకు మోదీ తప్పక వస్తారు

కరోనా మహమ్మారి ప్రజల దరిదాపుల్లోకి రాకుండా ఉండాలనే ఉద్దేశంతో వచ్చే ఏడాది రామానుజ సహస్రాబ్ది వేడుకలు నిర్వహిస్తున్నట్లు త్రిదండి చినజీయర్‌ స్వామి వెల్లడించారు. వైరస్ కట్టడికి ప్రభుత్వ ఆదేశాలను అందరు పాటించాలని కోరారు.

  • నమ్ముకున్న వాటికే బలవుతారు

కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్​ సిద్దిపేటలోని రంగదాంపల్లి చౌరస్తాలోని అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా.. మంత్రి హరీశ్​రావుపై ఈటల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 

  • జనసేనాని సీరియస్.. ఎందుకంటే..!

చెరకు రైతుల ఆందోళనపై ప్రభుత్వం స్పందించకపోవడం వల్లే సమస్య తీవ్రమైందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. తీపిని పంచే చెరకు రైతుల జీవితాల్లో.. సర్కారు తీరు చేదు నింపిందని అన్నారు. బకాయిలను తక్షణమే ఇప్పించకపోవడం రైతులను వంచించడమేనని జనసేన అధినేత ధ్వజమెత్తారు.

  • మెగాస్టార్ మాస్ అప్డేట్

అగ్రకథానాయకుడు చిరంజీవి మరో కొత్త సినిమా అప్డేట్ వచ్చేసింది. నవంబరు 6న లాంఛనంగా ప్రారంభించడం సహా ఆరోజే చిత్రంలోని మెగాస్టార్ ఫస్ట్​లుక్​ను రిలీజ్ చేయనున్నారు.

  •  టీమ్​ఇండియాకు ఆ ఛాన్స్ ఉందా?

టీ20 ప్రపంచకప్​లో (T20 World Cup 2021) పాకిస్థాన్​, న్యూజిలాండ్​ చేతుల్లో ఓటమిపాలై సెమీస్​కు దూరమవుతున్న తరణంలో అఫ్గానిస్థాన్​పై గెలిచి ఇంకా పోటీలోనే ఉన్నామని చాటింది టీమ్​ఇండియా. అది అంత సులభం కాకున్నా.. అవకాశం మాత్రం లేకపోలేదు. ఎలాగంటే?

16:37 November 04

టాప్​న్యూస్​@5PM

  • చిన్నారులకు కరోనా టీకా..!

చిన్నారులకు కరోనా టీకా పంపిణీని (Vaccination for Kids) ప్రారంభించింది అగ్రరాజ్యం అమెరికా. కాలిఫోర్నియా, న్యూయార్క్ సహా అనేక రాష్ట్రాలు చిన్నారులకు టీకాలను (Kids Vaccine Covid) అందిస్తున్నాయి.

  • 'వాటిపై మీరు కూడా  ఆలోచించండి'

కేంద్ర ప్రభుత్వం లాగే రాష్ట్ర సర్కారు కూడా పెట్రోల్​, డీజిల్ ధరల తగ్గింపుపై ఆలోచించాలని భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు. సీఎం కేసీఆర్ కూడా ఈ విషయంపై దృష్టి పెట్టాలని సూచించారు, కేంద్రంపై విమర్శలు చేయడం సులభమే.. దానిని ఆచరణలో పెట్టాడమే కష్టమన్నారు

  • ఆ మాత్రల వినియోగానికి ఓకే..!

కరోనా చికిత్స కోసం మాత్ర (Pills for Covid treatment) అందుబాటులోకి వచ్చింది. మెర్క్ ఫార్మా తయారు చేసిన మాత్ర వినియోగానికి.. బ్రిటన్ నియంత్రణ సంస్థ అనుమతులు జారీ చేసింది.

  • మనకు ఆ ఛాన్స్ ఇంకా ఉందా?

  • దీపావళికి కొత్త సినిమా పోస్టర్ల కళకళ

దీపావళి పండగకు విషెస్ చెబుతూ, తెలుగు చిత్రబృందాలు కొత్త పోస్టర్లు విడుదల చేశాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు ఓ లుక్కేయండి.

15:55 November 04

టాప్​న్యూస్​@4PM

  •  కేటీఆర్​ ట్వీట్​.. ఎందుకంటే!

మిస్టర్​ డిపెండబుల్​ రాహుల్ ద్రవిడ్‌కు మంత్రి కేటీఆర్.. ట్విట్టర్​ వేదికగా అభినందనలు తెలిపారు. తన అత్యంత అభిమాన క్రికెటర్​ అయిన ద్రవిడ్​.. టీమిండియా జట్టుకు కోచ్​గా ఎంపిక కావటం పట్ల.. మంత్రి కేటీఆర్​ హర్షం వ్యక్తం చేస్తూ ట్విట్​ చేశారు

  • రానున్న మూడురోజులు జాగ్రత్త..!

ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో రానున్న 3 రోజులు మోస్తరు వర్షాలు(TS rains) కురుస్తాయని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం(TS weather Report) ప్రకటించింది. తూర్పు, ఈశాన్య దిక్కుల నుంచి గాలులు రాష్ట్రంలోకి వీస్తున్నాయని పేర్కొంది.

  • అడవిలోకి ఎస్పీ దంపతులు- ఏం జరిగిందంటే?

ఏనుగుల దాడిలో (elephant attack news today) గౌరెల్లా-పెండ్రా-మర్వాహీ జిల్లా ఎస్పీ, ఆయన భార్య తీవ్రంగా గాయపడ్డారు. గజరాజులను చూడటానికి సరదాగా వెళ్లిన క్రమంలో ఏనుగుల గుంపు వారిపై దాడికి పాల్పడినట్లు అధికారులు తెలిపారు. ఛత్తీస్​గఢ్​లో ఈ ఘటన జరిగింది.

  •  'పెద్దన్న'గా మెప్పించారా?

సూపర్​స్టార్ రజనీకాంత్ 'పెద్దన్న'(peddanna rajinikanth).. థియేటర్లలోకి వచ్చేసింది. మరి సినిమా ఎలా ఉంది? రజనీ హిట్​ కొట్టారా? లేదా అనేది తెలియాలంటే ఈ రివ్యూ చదివేయండి.

  • టీమ్​ఇండియాకు అండగా 'ది వాల్'

మిస్టర్‌ డిపెండబుల్‌గా పేరుగాంచిన రాహుల్‌ ద్రవిడ్‌(Rahul Dravid Coach News) టీమ్ఇండియా ప్రధాన కోచ్‌గా సరికొత్త ఇన్నింగ్స్‌ ఆరంభించనున్నాడు. హంగూ ఆర్భాటాలకు దూరంగా ఉంటూ అప్పగించిన బాధ్యతలను క్రమశిక్షణ, అంకితభావంతో శ్రద్ధగా నిర్వహించడం ద్రవిడ్‌ స్టైల్‌! 

14:30 November 04

టాప్​న్యూస్​@3PM

  • వారి మృతికి అదే కారణమా?

బిహార్​లో 24 గంటల వ్యవధిలో 20 మంది అనుమానాస్పద రీతిలో మరణించారు(illicit liquor death). కల్తీ మద్యం(Poisonous Liquor) సేవించడం వల్లే వీరు చనిపోయి ఉంటారని అధికారులు భావిస్తున్నారు.

  • జవాన్లతో మోదీ దీపావళి వేడుకలు

  •  భాగ్యలక్ష్మి ఆలయంలో  గవర్నర్​ పూజలు

చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం దగ్గర సందడి వాతావరణం నెలకొంది. దీపావళి పురస్కరించుకొని ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. గవర్నర్‌ తమిళిసై (governor Tamilsai Soundarajan)తో పాటు భాజపా, తెరాస నేతలు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

  •  కొవిడ్​ బాధితులు..వాటితో బీకేర్​ఫుల్!

వెలుగులు విరజిమ్మే పండుగ దీపావళి. సంబరాల్లో ప్రత్యేకమైన టపాసులను కాల్చడం అందరికీ ఓ సరదా.అయితే.. కరోనాతో ఈసారి ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నాయి. వేడుకల్లో పాల్గొనేటప్పడు చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆరుబయట టపాసులు కాల్చాలని సూచిస్తున్న వైద్యులు... ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరుతున్నారు.

  • ఆ సాంగ్​తో థియేటర్లలో పూనకాలే!

అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న 'పుష్ప'కు సంబంధించిన ఓ అప్​డేట్ ఇచ్చింది చిత్రబృందం. ప్రస్తుతం 1000 మంది డ్యాన్సర్లతో ఓ పాట షూట్ చేస్తున్నామని వెల్లడించింది.

13:48 November 04

టాప్​న్యూస్​@2PM

  • గర్భంలోనే శిశువు మృతి

మెదక్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సేవలకు అంతరాయం ఏర్పడింది. బుధవారం రాత్రి ప్రసవం కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళ గర్భంలోనే ఆడశిశువు మృతి చెందింది. కాన్పు చేసే సమయంలో పాప చనిపోవడంతో.. వైద్య సిబ్బందిపై మహిళ బంధువులు దాడి చేశారు. దీంతో వైద్యులు విధులు బహిష్కరించి ఆస్పత్రి ఎదుట ధర్నా నిర్వహించారు.

  • పంజాగుట్టలో ఐదేళ్ల బాలిక మృతదేహం

హైదరాబాద్‌ పంజాగుట్ట పీఎస్ పరిధిలోని ద్వారకాపురి కాలనీలో... ఓ బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఓ దుకాణం ముందు పాప మృతదేహం పడి ఉండటంతో... స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని బాలిక మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు.

  • దీపావళికి ఆ గ్రామం దూరం

దేశం మొత్తం దీపావళి వేడుక జరుపుకుంటున్న నేపథ్యంలో ఓ గ్రామం మాత్రం ఆ పండగంటేనే భయపడుతోంది. దీపావళి రోజు ఆగ్రామంలో ఎవరూ బయటకు వెళ్లరు. ఇళ్లముందు దీపాలు పెట్టరు. పిండివంటలు చేసుకోరు. కారణం ఏంటో తెలుసుకోవాంటే? ఈ స్టోరీపై ఓ లుక్కేయాల్సిందే.

  • అందుకే ఓడిపోయాం: రోహిత్

టీ20 ప్రపంచకప్​లో(T20 World Cup 2021) భాగంగా తొలి రెండు మ్యాచ్​ల్లో భారత జట్టు ఘోర వైఫల్యానికి కారణం ఏంటో వివరించాడు ఓపెనర్ రోహిత్ శర్మ(Rohit Sharma News). రెండు ఓటములతోనే టీమ్​ఇండియా బలహీనమైన జట్టుగా మారదని అన్నాడు. మాజీ సారథి రాహుల్‌ ద్రవిడ్‌(Rahul Dravid Coach) టీమ్‌ఇండియా కొత్త కోచ్‌గా ఎంపికవ్వడంపై రోహిత్‌ హర్షం వ్యక్తం చేశాడు.

  • 1000 మంది డ్యాన్సర్లతో 'పుష్ప' సాంగ్

12:32 November 04

టాప్​న్యూస్​@1PM

  • వెలుగులోకి సంచలన విషయాలు

రంగారెడ్డి జిల్లా మంచిరేవుల ఫాంహౌస్‌లో పేకాట కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ప్రధాన నిందితుడు గుత్తా సుమన్‌కు పలువురు ప్రముఖులు, పలువురు ప్రజాప్రతినిధులతో సంబంధాలు ఉన్నాయని పోలీసుల విచారణలో తేలింది.

  • పిల్లల్ని కిరాతకంగా చితకబాదిన తల్లి

పిల్లలు అల్లరి పనులు చేస్తుంటారు. అమ్మకు విపరీతంగా విసుగు తెప్పిస్తుంటారు. అయినా.. సహనంతో వ్యవహరిస్తూ, కన్నబిడ్డలను సరైనదారిలో నడిపిస్తుంది అమ్మ. కానీ అమ్మతనానికే (mother beats child news) మచ్చ తెచ్చే సంఘటన తాజాగా దిల్లీలో జరిగింది. విచక్షణ కోల్పోయిన తల్లి పసిపిల్లల్ని చితకబాదిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు కాగా.. అవి వైరల్​గా మారాయి.

  • అమెరికాలో కాల్పుల మోత

అమెరికా వర్జీనియాలో (us mass shooting latest news) కాల్పులు కలకలం సృష్టించాయి. ప్రజలపై విచక్షణా రహితంగా ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు మృతి చెందారు.

  • టీమ్​ఇండియాపై​ ఫిక్సింగ్ ఆరోపణలు

టీ20 ప్రపంచకప్​లో అఫ్గానిస్థాన్​పై ఘన విజయం సాధించిన అనంతరం భారత జట్టుపై(IND vs AFG T20) మ్యాచ్​ ఫిక్సింగ్ ఆరోపణలు చేశారు పలువురు పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు. ఈ మేరకు ట్విట్టర్​లో ట్రోల్స్​ చేశారు. దీనిపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు అసహనం వ్యక్తం చేశారు.

  • 'మంచి రోజులు వచ్చాయి' మెప్పించిందా?

సంతోష్ శోభన్, మెహ్రీన్ జంటగా మారుతి తెరకెక్కించిన చిత్రం 'మంచి రోజులు వచ్చాయి'(Manchi Rojulu vchayi review). నేడు (నవంబర్ 4) ప్రేక్షకుల ముందుకు వచ్చిందీ సినిమా. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఎలా ఉందో సమీక్ష ద్వారా తెలుసుకుందాం.

12:05 November 04

టాప్​న్యూస్​@12PM

  • జమ్ముకశ్మీర్​లో ప్రధాని మోదీ

దీపావళి వేడుకలను భారత సైనికులతో జరుపుకోనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Modi Diwali with army). జమ్ముకశ్మీర్​ రాజౌరీ జిల్లాలోని నౌషెరా సెక్టార్​లోని నియంత్రణ రేఖ వద్దగల ఆర్మీ ప్రధాన కార్యాలయానికి(Modi in Jammu Kashmir) చేరుకుని సైనికులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. సరిహద్దులోని పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

  • మహిళలకు పోలీసుల డ్రైవింగ్‌ శిక్షణ

రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ట్రాఫిక్‌ పోలీసులు యువతీ యువకులు, మహిళలకు డ్రైవింగ్‌లో శిక్షణ ఇస్తున్నారు. బైకులు నడిపేందుకు అవసరమైన లైసెన్స్‌ను పొందేందుకు ముందుగా గోషామహల్‌, బేగంపేటలోని ట్రాఫిక్‌ శిక్షణ కేంద్రంలో నడపాలన్న అంశంపై అవగాహన కల్పిస్తున్నారు.

  • రష్యాలో కూలిన విమానం

బెలారస్​కు చెందిన కార్గో విమానం రష్యాలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు. మృతుల్లో ముగ్గురు బెలారస్​కు సిబ్బంది కాగా.. మరో ఇద్దరు చొప్పున రష్యా, ఉక్రెయిన్​ దేశాలకు చెందినవారిగా అధికారులు గుర్తించారు. బెలారస్​ వైమానిక దళానికి చెందిన ఏఎన్​-12 విమానం.. రష్యాలోని తూర్పుసెర్బియాలో ల్యాండ్​ అయ్యే క్రమంలో ఈ దుర్ఘటన జరిగినట్లు తెలిపారు.

  • దుమ్మురేపిన భారత్.. హైలైట్స్

టీ20 ప్రపంచకప్​లో భాగంగా బుధవారం అఫ్గానిస్థాన్​పై ఘన విజయం సాధించి టోర్నీలో తొలి గెలుపు నమోదు చేసింది టీమ్​ఇండియా. ఈ మ్యాచ్​ హైలైట్స్​ చూసేయండి మరి..

  • 'అఖండ' టైటిల్ సాంగ్ టీజర్​

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను(balayya boyapati movies) దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'అఖండ'. తాజాగా దీపావళి పురస్కరించుకుని ఈ చిత్ర టైటిల్ సాంగ్ టీజర్(akhanda title song)​ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ నెల 8న పూర్తి పాటను రిలీజ్ చేయనున్నారు.

10:53 November 04

టాప్​న్యూస్​@11AM

  • చేతిలో పేలిన ఎయిర్‌గన్

సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం సలాఖపూర్‌లో ఎయిర్‌గన్ (airgun) కలకలం రేపింది. నిన్న రాత్రి సలాఖపూర్‌లో ఎయిర్‌గన్ పేలి యువకుడు మృతి (young man was killed when an airgun exploded) చెందాడు. ప్రమాదవశాత్తు యువకుడి చేతిలో ఎయిర్​గన్​ పేలడంతో... యువకుడు మృత్యువాతపడ్డాడు. 

  • 'అన్నాత్తే' విడుదల వేళ రూ.1కే దోశ

సూపర్​స్టార్​ రజినీకాంత్​పై అభిమానాన్ని తమిళనాడు తిరుచ్చికి చెందిన ఓ హోటల్​ యజమాని వినూత్నంగా చాటుకున్నారు. అన్నాత్తె సినిమా(rajinikanth new movie) విడుదల సందర్భంగా కేవలం రూపాయికే దోశ అందిస్తున్నారు. హోటల్​ పేరు సైతం అన్నమలైగా పెట్టటం గమనార్హం.

  • దీపావళికి అధికారిక సెలవు

అమెరికాలోనూ దీపావళి (diwali in usa 2021) అధికారిక పండగగా వెలుగొందనుందా? అంటే అవుననే అనిపిస్తోంది. దీపావళిని సెలవు దినంగా (diwali in us holiday) ప్రకటించాలని ప్రతిపాదిస్తూ ఆ దేశ చట్టసభ సభ్యురాలు కరోలిన్‌ బి మలోనే ప్రతినిధుల సభ(హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్​)లో బిల్లును ప్రవేశపెట్టారు.

  • బిగ్​ బాష్​ లీగ్​లో ఉన్ముక్త్

ఆస్ట్రేలియాలో జరిగే బిగ్​ బాష్ లీగ్(Big Bash League 2021)లో ఆడేందుకు సిద్ధమవుతున్నాడు టీమ్​ఇండియా అండర్-19 జట్టు మాజీ సారథి ఉన్ముక్త్ చంద్(Unmukt Chand news). తద్వారా ఈ లీగ్​లో ఆడబోతున్న తొలి భారత ఆటగాడిగా నిలవనున్నాడు.

  • ​ దీపావళి.. కొత్త అప్​డేట్స్

దీపావళి పురస్కరించుకుని టాలీవుడ్ సినిమాలకు సంబంధించిన వరుస అప్​డేట్స్​ రిలీజ్ అవుతున్నాయి. నాగార్జున 'బంగార్రాజు' చిత్రబృందం అందరికీ పండగ శుభాకాంక్షలు తెలుపుతూ ఓ వీడియో విడుదల చేయగా, పవన్ కల్యాణ్ 'భీమ్లా నాయక్', విజయ్ దేవరకొండ 'లైగర్'​ నుంచి కొత్త పోస్టర్లు విడుదలై అలరిస్తున్నాయి.

09:50 November 04

టాప్​న్యూస్​@10AM

  • మోదీ దీపావళి శుభాకాంక్షలు

దీపావళి పండగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్​ షా, కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​గాంధీ.. దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపావళి ప్రజల జీవితాల్లో వెలుగునింపాలని ఆకాంక్షించారు.

  • తగ్గిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

దీపావళి పర్వదినం వేళ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌లపై ఎక్సైజ్‌ సుంకం తగ్గిస్తు తీసుకున్న నిర్ణయం అమల్లోకి వచ్చింది. లీటరు పెట్రోల్‌పై రూ.5, లీటరు డీజిల్‌పై రూ.10 చొప్పున తగ్గాయి.

  • అక్టోబరు నెల ఆల్‌టైం రికార్డు

మద్యం అమ్మకాల్లో తెలంగాణ రాష్ట్రం ఆల్ టైం రికార్డు (Record Level Liquor Sales) సృష్టించింది. దసరా పండుగ (dasara festival), హుజూరాబాద్ ఉప ఎన్నికలు (huzurabad bypoll) జరగడంతో అక్టోబర్ నెలలో ఏకంగా రూ.2,653 కోట్లు విలువైన మద్యం (Liquor Sales) అమ్ముడు పోయింది. లిక్కర్ అమ్మకాల కంటే బీర్ల విక్రయాలు ఎక్కువ జరిగాయి.

  • పసిడి, వెండి ధరలు ఇలా..

దీపావళి రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం (Gold Rate Today), వెండి ధరలు (Silver price today) స్థిరంగా ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లో ప్రస్తుత పసిడి, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

  • ఆచార్య నుంచి 'నీలాంబరి' సాంగ్

మెగాస్టార్ చిరంజీవి, రామ్​చరణ్ ప్రధానపాత్రల్లో కొరటాల శివ తెరకెక్కిస్తున్న చిత్రం 'ఆచార్య'(acharya movie). తాజాగా ఈ సినిమాలోని 'నీలాంబరి' సాంగ్​(neelambari song acharya)ను విడుదల చేసింది చిత్రబృందం.

08:53 November 04

టాప్​న్యూస్​@9AM

  • డోసు తీసుకోనివారు ఎంతమందంటే

తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకుని.. రెండో డోసు స్వీకరించడానికి 35 లక్షల మంది ముందుకు రాలేదని వైద్యారోగ్య శాఖ అంచనా వేసింది. 18-44 ఏళ్ల మధ్య వారికే 55% డోసులు వేసుకున్నారని వెల్లడించింది. దీపావళి నేపథ్యంలో ప్రభుత్వ కేంద్రాల్లో నేడు టీకాలకు సెలవు ప్రకటించింది.

  • నిందితుడికి విముక్తి ఉత్తర్వు రద్దు

2019 సెప్టెంబరులో కేరళ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులు చెల్లవంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ)లోని నిబంధనల కింద అరెస్టు అయిన ఓ వ్యక్తిని ఆయా ఆరోపణల నుంచి విముక్తి చేస్తూ కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసింది.

  • సచిన్ దాతృత్వం

క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్(Sachin News) మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. తన సేవా సంస్థ ద్వారా అసోం కరీమ్​గంజ్​ జిల్లా ఆస్పత్రికి రెటినాల్ కెమెరాలు సాయంగా అందించారు.

  • టాస్ ఎప్పుడు గెలుస్తావ్?

టీమ్​ఇండియా సారథి విరాట్​ కోహ్లీకి(Virat Kohli Toss Loss) అస్సలు కలిసిరాసి అంశం ఏదైనా ఉందంటే.. అది టాసే. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్​లోనూ అదే జరిగింది. ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్​ల్లోనూ విరాట్ టాస్ ఓడిపోయాడు. ఈ నేపథ్యంలో విరాట్ టాస్​ రికార్డుపై ఓ లుక్కేయండి.

  • షూటింగ్​కు బైబై చెప్పిన ప్రభాస్

రెబల్​స్టార్ ప్రభాస్(prabhas movies) హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'ఆదిపురుష్'. తాజాగా ఈ సినిమాలో తన పాత్ర షూటింగ్​ను ముగించుకున్నారు ప్రభాస్. వచ్చే ఏడాది ఆగస్టు 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

07:44 November 04

టాప్​న్యూస్​@ 8AM

  • దీపావళి విశిష్టత ఏంటి?

దీపావళి (Diwali Festival) అంటేనే వెలుగుల పండుగ. అమావాస్య చీకట్లను చీల్చుతూ ఎటుచూసినా దీపాల సొబగులే.. అంబరాన్నంటే సంబరాలే. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా హిందువులంతా ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకొనే ఈ దీపావళి విశిష్టత ఏమిటి? ఈ వేడుక ఎన్ని రోజులు? దీపాలు ఎక్కడ వెలిగించాలి?

  • రోడ్డెక్కిన అన్నదాత

సన్నధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలంటూ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా రైతులు ఆందోళనకు దిగారు. కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతోందని, రెండు రోజులుగా వర్షం కురుస్తుండటంతో ధాన్యం ట్రాక్టర్లలోనే తడిసిపోతోందంటూ మిర్యాలగూడ, వేములపల్లి, సూర్యాపేట జిల్లా పాలకవీడు మండల కేంద్రాల్లో రైతులు బుధవారం రాస్తారోకో చేశారు. వేములపల్లి మండల కేంద్రం వద్ద నార్కట్‌పల్లి - అద్దంకి రహదారిపై అన్నదాతలు ధర్నా చేయడంతో కొన్ని వందల వాహనాలు నిలిచిపోయాయి.

  • క్వాడ్‌లో భారత్ భాగస్వామ్యం

బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ప్రాజెక్టు(బీఆర్‌ఐ)తో పశ్చిమాసియా, ఆఫ్రికాల్లో చైనా ఆర్థికంగా పాగా వేయడం భారత్‌, అమెరికాలనే కాదు- యూఏఈని సైతం కలవరపెడుతోంది. చైనాతోపాటు టర్కీ పోకడలూ పశ్చిమాసియాను చీకాకు పరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయెల్‌, యూఏఈలతో కూడిన కొత్త క్వాడ్‌లో దిల్లీ భాగస్వామి అయింది. కొత్త క్వాడ్‌తో ఇజ్రాయెల్‌, యూఏఈలకు దగ్గరైన భారత్‌ అదే సమయంలో ఇరాన్‌ను దూరం చేసుకోకుండా జాగ్రత్త వహించాలి.

  • కేంద్రం బాటలో పలు రాష్ట్రాలు

ఇంధన ధరల భారం నుంచి సామాన్యుడికి ఉపశమనం కలిగిస్తూ.. పెట్రోల్, డీజిల్​పై ఎక్సైజ్​ సుంకాన్ని కేంద్రం తగ్గించింది. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాలు కూడా చమురు ధరలపై వ్యాట్​ను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. ఏయే రాష్ట్రాలు, ఎంత మేర వ్యాట్​ తగ్గించాయంటే..?

  • అదే నా బలం.. నా శైలి అంతే

తనదైన కామెడీతో ప్రేక్షకులను నవ్విస్తూనే సందేశం ఇవ్వగల దర్శకుడు మారుతి(maruthi director movies). ఆయన తాజాగా తెరకెక్కించిన చిత్రం 'మంచి రోజులు వచ్చాయి'(manchi rojulu vachayi release date). ఈ సినిమా నేడు (నవంబర్ 4) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో విలేకర్లతో ముచ్చటించిన మారుతి.. పలు విషయాలు పంచుకున్నారు.

07:40 November 04

టాప్​న్యూస్​@ 7AM

  • కొవాగ్జిన్​కు 'ప్రపంచ' గుర్తింపు

భారత్​ బయోటెక్​ రూపొందించిన కొవాగ్జిన్​ టీకా అత్యవసర వినియోగానికి (Covaxin WHO Approval) డబ్ల్యూహెచ్​ఓ ఆమోదం తెలిపింది. డబ్ల్యూహెచ్​ఓ ఆమెదం పొందిన టీకాల జాబితాలో కొవాగ్జిన్​ చేరడం మంచి పరిణామం అన్నారు డబ్ల్యూహెచ్​ఓ డైరెక్టర్​ టెడ్రోస్​ అధనోమ్​.

  • గాంధీ కోరిన దీపావళి వెలుగులివీ

భారత స్వాతంత్య్రోద్యమంలో పండగలు ప్రముఖ పాత్ర పోషించాయి. ప్రజల్లో స్ఫూర్తి రగిల్చేందుకు ఆ పర్విదనాలను ఉపయోగించేవారు నేతలు. స్వాతంత్య్రానికి ముందు, ఆ తర్వాత దీపావళి పండగను(diwali celebration) జరుపుకోవటంపై తనదైనశైలీలో ప్రజల్లో స్ఫూర్తి నింపారు మహాత్మ గాంధీ(Mahatma Gandhi). ఆనాటి గాంధీజీ మాటలను ఓసారి గుర్తు చేసుకుందాం.

  • లక్ష్మీదేవి మిమ్మల్ని వరించాలంటే

ముల్లోకాలకూ వెలుగుపంచేది ఆ దీపలక్ష్మి అయితే... మన ఇంటికి వెలుగులుతెచ్చేది గృహలక్ష్మి అయిన ఇల్లాలు.. ఏం చేస్తే ఆ సిరుల లక్ష్మి మనల్ని కనికరిస్తుంది? గృహలక్ష్మిని గౌరవించే విధానం ఎలాంటిది? అవి తెలుసుకుని మన జీవితాల్లో వెలుగులు నింపుకొందాం..

  • తప్పుదోవ పట్టిస్తున్నారు'

ముస్తాక్​ అలీ ట్రోఫీ నేటి(నవంబర్ 4) నుంచి ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో టీమ్​ఇండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్(Gambhir News) యువ ఆటగాళ్లకు పలు సూచనలు చేశాడు. యువ ఆటగాళ్లు ఈ టోర్నీని బాగా ఉపయోగించుకోవాలని తెలిపాడు.

  • ఆ సన్నివేశాలు సినిమాకు హైలైట్

విశాల్(vishal actor new movie), ఆర్య ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం 'ఎనిమీ'(enemy release date). ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నేడు (నవంబర్ 4) ప్రేక్షకుల ముందుకు రానుంది(enemy release date). ఈ నేపథ్యంలో చిత్ర విశేషాలు విలేకర్లతో పంచుకున్నారు విశాల్.

05:22 November 04

టాప్​న్యూస్​@ 6AM

  • కొవాగ్జిన్​ అత్యవసర వినియోగానికి డబ్ల్యూహెచ్​ఓ అనుమతి

కొవాగ్జిన్ టీకా అత్యవసర వినియోగానికి డబ్ల్యూహెచ్​ఓ (Covaxin WHO Approval) అనుమతించింది. టెక్నికల్ అడ్వైజరీ గ్రూపు సిఫార్సును పరిశీలించిన డబ్ల్యూహెచ్​ఓ ఈ నిర్ణయం తీసుకుంది.

  • దీపావళి రోజు ఇవి తప్పనిసరిగా పాటించాల్సిందే..!

  • గంజాయి విక్రేతలుగా పోలీసులు

కంచే చేను మేసిన చందంగా మారింది ఉమ్మడి ఖమ్మం జిల్లా పోలీసుల తీరు. సీఎం కేసీఆర్​ ఆదేశాలతో గంజాయి అక్రమ రవాణాపై (Ganja Smuggling in khammam) ఉక్కు పాదం మోపిన పోలీసు శాఖకు ఖమ్మం జిల్లాలోని కొందరు ఖాకీలు షాకిచ్చారు. స్మగ్లర్ల ఆట కట్టించాల్సిన పోలీసులే గంజాయి సరఫరాదారులుగా మారుతుండటం ఉమ్మడి ఖమ్మం జిల్లా పోలీసు శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

  • హుజూరాబాద్‌లో కాంగ్రెస్​ ఓట్లు ఏమయ్యాయి?

గాంధీభవన్‌లో ఏఐసీసీ రాష్ట్ర ఇంఛార్జి మాణికం ఠాగూర్‌ నేతృత్వంలో జరిగిన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం వాడీవేడిగా జరిగింది. హజూరాబాద్‌లో కాంగ్రెస్‌కు అత్యంత తక్కువగా మూడువేల ఓట్లే రావడం ఏమిటి? పార్టీ ఓట్లు ఏమయ్యాయి? అనే రెండు అంశాల ప్రాతిపదికగా సుదీర్ఘంగా సమావేశం జరిగింది. ఫలితాలను విశ్లేషించేందుకు కమిటీని ఏర్పాటుచేయాలని నిర్ణయించారు.

  • అభినందన్‌ వర్ధమాన్‌కు పదోన్నతి!

భారత వైమానికదళ వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌కు(Abhinandan Varthaman) పదోన్నతి లభించింది. వింగ్​ కమాండర్‌ నుంచి గ్రూప్‌ కెప్టెన్‌గా నియమిస్తూ భారత వైమానికదళం ఉత్తర్వులు జారీ చేసింది.
 
  • 'ఇవి.. కరోనాను అడ్డుకునే సరికొత్త యాంటీబాడీలు'

కరోనా తీవ్రతను గణనీయంగా తగ్గించే సరికొత్త యాంటీబాడీలను(Corona Antibody) అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇవి వివిధ కరోనా వైరస్‌ల కారణంగా తలెత్తే ఇన్‌ఫెక్షన్లను సమర్థంగా అడ్డుకుంటాయని నిర్ధరించారు.

  • యూపీలో జికా వైరస్​ కలకలం

ఉత్తర్​ప్రదేశ్​ కాన్పుర్​లో జికా వైరస్(Zika Virus In Kanpur)​ వ్యాప్తి కలకలం సృష్టిస్తోంది. బుధవారం కొత్తగా 25 మందికి వైరస్​ సోకినట్లు తేలింది. ఫలితంగా మొత్తం వైరస్​ బాధితుల సంఖ్య 36కు చేరింది.

  • టీమ్​ఇండియా ఘనవిజయం

అఫ్గాన్ జట్టుపై గెలిచిన టీమ్​ఇండియా.. పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచింది. అయితే భారత జట్టు సెమీస్ అవకాశాలు.. మనతో పాటు ఇతర జట్ల మ్యాచ్​ ఫలితాలపై ఆధారపడి ఉంది.

  • 'రాధేశ్యామ్'కు సీక్వెల్?

డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్​కు క్రేజీ న్యూస్! సంక్రాంతి రానున్న 'రాధేశ్యామ్' సినిమాకు సీక్వెల్​ కూడా ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్​లో తెగ చర్చనీయాంశమవుతోంది.

Last Updated : Nov 4, 2021, 9:56 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.