ETV Bharat / city

ఈటీవీ భారత్​ ముఖ్యాంశాలు - టాప్​న్యూస్​@ 6AM

ETV BHARAT TOP NEWS
ETV BHARAT TOP NEWS
author img

By

Published : Oct 25, 2021, 6:18 AM IST

Updated : Oct 25, 2021, 10:06 PM IST

22:02 October 25

టాప్​న్యూస్​@ 10PM

  • 'అపోహలన్నీ పటాపంచలు చేశాం'

హైదరాబాద్ హైటెక్స్‌లోని హెచ్‌ఐసీసీలో తెరాస రాష్ట్ర ప్రతినిధుల మహాసభ (ప్లీనరీ) ప్రారంభమైంది. ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ హాజరై తెరాస జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు.

  • 'రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు నిరాధారమైనవి'

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై డీజీపీ కార్యాలయం (DGP Office) స్పందించింది. ఆయన చేసిన వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమైనవిగా పేర్కొంది. ఆ వ్యాఖ్యలు పోలీస్ శాఖ పరువుకు నష్టం కలిగించేవిగా ఉన్నాయని వెల్లడించింది.

  • 'ఆశ్రమ్' సెట్​పై భజ్​రంగ్​ దళ్ దాడి.. 

హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వెబ్​సిరీస్​ను తెరకెక్కిస్తున్నారని ఆరోపిస్తూ.. భజ్​రంగ్ దళ్​ కార్యకర్తలు.. 'ఆశ్రమ్​'(Ashram Web Series News) సెట్​పై దాడి చేశారు. సెట్​లోని సామగ్రి ధ్వంసం చేశారు. దర్శకుడిపై సిరా జల్లారు. ఈ దాడిని సినిమా సంఘాలు, పలువురు దర్శక నిర్మాతలు ఖండించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

  • 'కొత్త జట్లతో దేశవాళీ క్రికెటర్లకు మేలు'

వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్​లో పాల్గొనబోయే రెండు కొత్త జట్ల(ipl new team)ను ప్రకటించింది బీసీసీఐ. ఈ నేపథ్యంలో మాట్లాడిన బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ.. కొత్త జట్లతో మరింతమంది దేశవాళీ క్రికెటర్లకు అవకాశం లభిస్తుందని వెల్లడించారు.

  • ఇక వర్చువల్ దునియాలోనే!

మీలో ఎవరైనా 'మెటావర్స్'(Metaverse Internet) పదం విన్నారా? 'లేదు' అన్నది మీ సమాధానమైతే.. త్వరలోనే దీని గురించి తప్పక వింటారు. ఎందుకంటే ప్రపంచంలో విప్లవాత్మక మార్పులకు కారణమైన ఇంటర్నెట్​కు మరో తరంగా ఇది అందుబాటులోకి రానుంది. ఫేస్​బుక్(Facebook Metaverse) ఇప్పటికే దీనిపై పెద్ద ఎత్తున పని చేస్తోంది. ఇంతకీ ఏంటీ మెటావర్స్? అదెలా పనిచేస్తుంది?

20:54 October 25

టాప్​న్యూస్​@ 9PM

  • 'తెలుగుతల్లిని దూషించిన కేసీఆర్... ప్లీనరీలో'

ఇవాళ హైదరాబాద్ హెచ్​ఐసీసీలో జరిగిన తెరాస ప్లీనరీపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఆంధ్రా కాంట్రాక్టర్ల పెట్టుబడులతో ఎదిగిన పార్టీ తెరాస అని దుయ్యబట్టారు. ఉద్యమ సమయంలో తెలుగుతల్లిని తిట్టిన కేసీఆర్... ప్లీనరీలో అదే విగ్రహం పెట్టుకున్నాడన్నారు.

  • 'ఫేస్​బుక్' పేపర్స్ ప్రకంపనలు

పాండోరా పేపర్స్​ తరహాలో ఇప్పడు ఫేస్​బుక్ పేపర్స్ సంచలనంగా మారాయి. అమెరికా సహా భారత్​లో విద్వేష ప్రసంగాల వ్యాప్తిని ఫేస్​బుక్​ అడ్డుకోలేకపోతోందని, ప్రజాప్రయోజనాల కంటే దానికి లాభాలే ముఖ్యమని ఈ పత్రాలు బహిర్గతం చేశాయి. భారత్​లో నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఫేస్​బుక్ అనుకూలంగా వ్యవరిస్తోందని వెల్లడించాయి.

  • కేరళలో ఆందోళనకరంగా మరణాలు!

కేరళలో కరోనా కొత్త కేసులు(kerala cases today)భారీగా తగ్గాయి. తాజాగా 6,664 మందికి వైరస్​ పాజిటివ్​గా తేలింది. మరోవైపు.. మరణాల సంఖ్య గణనీయంగానే ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

  • 'తొలి సంపాదన తమ్ముడిదే'

తమ చిన్ననాటి జ్ఞాపకాలను ఓ ప్రత్యేక వీడియో ద్వారా వెల్లడించారు దేవరకొండ బ్రదర్స్​ విజయ్​, ఆనంద్​. తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ తొలి సంపాదనతోనే కుటుంబానికి ఆర్థికంగా భరోసా దక్కిందని విజయ్ తెలిపారు. ఇంకా పలు సంగతులను పేర్కొన్నారు. ఆ సంగతులు వారి మాటల్లోనే..

19:46 October 25

టాప్​న్యూస్​@ 8PM

  • కస్టమ్స్‌ కార్యాలయంలో సీబీఐ సోదాలు

హైదరాబాద్ కస్టమ్స్‌ కార్యాలయంలో కేంద్ర దర్యాప్తు సంస్థ- సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. బషీర్‌బాగ్‌లోని కస్టమ్స్‌ కార్యాలయంలో సీబీఐ అధికారులు సోదాలు చేస్తున్నారు.  

  • ఐపీఎల్​లో రెండు కొత్త జట్లు

ఐపీఎల్-2022లో భాగంగా మరో కొత్త జట్లను ఎంపిక చేసింది బీసీసీఐ. ఇటీవలే ఇందులోసం బిడ్​లను ఆహ్వానించిన బోర్డు.. నేడు (అక్టోబర్ 25) ఆ జట్ల వివరాలను ప్రకటించింది. ఈ టెండర్ ప్రక్రియలో ముందంజలో నిలిచిన అహ్మదాబాద్, లఖ్​నవూ కొత్త ఫ్రాంచైజీలుగా వచ్చే ఏడాది బరిలోదిగనున్నాయి. 

  • కరోనాతో చైనా హై అలర్ట్​

3 నుంచి 11 ఏళ్ల వయసు పిల్లలకు కరోనా టీకా అందించేందుకు చైనా(China Vaccine News) సిద్ధమవుతోంది. ఇప్పటికే ఆ దేశంలోని ఐదు రాష్ట్రాల అధికారులు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు.. రష్యాలో కరోనా(Russia Coronavirus Cases) విజృంభణ కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో 37వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి.

  • దర్శకుడు పూరీకి విచిత్ర అనుభవం

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్(liger movie director)కు ముంబయిలోని ఓ ట్రాఫిక్​ సిగ్నల్​ వద్ద ఓ విచిత్ర అనుభవం ఎదురైంది. ఓ తెలుగు కుర్రాడు ఆయన్ను గుర్తుపట్టి సరదాగా ముచ్చటించాడు. వారిద్దరి(puri jagannadh liger) మధ్య జరిగిన సరదా సంభాషణలను ట్వీట్​ చేసి అభిమానులను ఆశ్చర్యపరిచింది నటి ఛార్మి.

  • నెట్టింట షమీపై విమర్శలు

టీ20 ప్రపంచకప్(t20 worldcup 2021)​లో భాగంగా పాకిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో భారత్ ఓడిపోయింది. అయితే ఈ ఓటమికి కారణం టీమ్ఇండియా పేసర్ షమీ(mohammed shami news) అంటూ కొందరు నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. దీనిపై స్పందించిన పలువురు మాజీలు.. ఇలాంటి కామెంట్లు సరికావని వ్యాఖ్యానించారు.

18:48 October 25

టాప్​న్యూస్​@ 7PM

  • 'అపోహలన్నీ పటాపంచలు చేశాం'

హైదరాబాద్ హైటెక్స్‌లోని హెచ్‌ఐసీసీలో తెరాస రాష్ట్ర ప్రతినిధుల మహాసభ (ప్లీనరీ) ప్రారంభమైంది. ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ హాజరై తెరాస జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు

  • యూపీలో కాంగ్రెస్​కు షాక్

ఉత్తర్​ప్రదేశ్​లో కాంగ్రెస్​కు(up congress news ) భారీ షాక్​ తగిలింది. పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతలు(up congress leaders) తృణమూల్​ కాంగ్రెస్​లో చేరారు. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో.. భాజపాను గద్దె దించేందుకు పోరాడతామని పేర్కొన్నారు.

  • మధ్యప్రదేశ్​లో కరోనా కొత్త రకం

కొవిడ్​ మహమ్మారి మరో కొత్త రూపు(Corona New Variant In India) దాల్చినట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్​లో ఆరుగురికి కొత్తగా ఏవై.4 కరోనా వేరియంట్ సోకినట్లు తేలింది. బాధితులంతా కొవిడ్​ టీకా పూర్తి డోసులు తీసుకున్నప్పటికీ.. వైరస్​ బారినపడటం ఆందోళన కలిగిస్తోంది.

  • 'టీమ్ఇండియా చేయాల్సింది చాలా ఉంది'

టీ20 ప్రపంచకప్​(t20 world cup news)లో భాగంగా పాకిస్థాన్ చేతిలో భారత్(ind vs pak t20)ఓడిపోవడం పట్ల పలువురు నిరాశచెందారు. ఈ నేపథ్యంలోనే స్పందించిన మాజీలు.. టీమ్ఇండియా మరింత బలంగా పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

  • సరికొత్త ఓఎస్​తో జియోఫోన్​ నెక్స్ట్

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జియోఫోన్ నెక్స్ట్​​ అప్​డేట్స్​(JioPhone Next update) వచ్చేశాయి. ఈ ఫోన్​ కోసం జియో, గూగుల్ సంయుక్తంగా 'ప్రగతి' ఆపరేటింగ్​ సిస్టమ్​ను అభివృద్ధి చేశాయి. కేవలం భారత్​ కోసమే ఈ ఓఎస్​ను రూపొందించినట్లు జియో పేర్కొంది. అలాగే ఈ స్మార్ట్​​ఫోన్ తయారీ, లాంచింగ్​ వెనుకున్న ఉద్దేశాన్ని తెలియచేస్తూ.. 'మేకింగ్​ ఆఫ్​ జియోఫోన్​ నెక్స్ట్​' పేరుతో ఓ వీడియోను విడుదల చేసింది జియో.

17:57 October 25

టాప్​న్యూస్​@ 6PM

  • 'తెలంగాణలో 'త్రీ ఐ' నడుస్తోందని చెప్పా'

హైదరాబాద్ హైటెక్స్‌లోని హెచ్‌ఐసీసీలో తెరాస రాష్ట్ర ప్రతినిధుల మహాసభ (TRS PLENARY)లో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR AT PLENARY) ప్రసంగించారు. అనంతరం ఆయన తీర్మానం ప్రవేశపెట్టారు.

  • టాటాతో కేంద్రం డీల్

ఎయిర్ ఇండియాలో(Air India news) వాటా అమ్మకంపై టాటా సన్స్​ గ్రూపుతో రూ.18 వేల కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది కేంద్రప్రభుత్వం. ఈ మేరకు ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం తెలిపింది.

  • జడ్జి వ్యాఖ్యలు తీవ్రంగా బాధించాయి: హీరో విజయ్​

విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న లగ్జరీ కారు ట్యాక్స్ విషయంలో జడ్జి చేసిన వ్యాఖ్యలు తనను తీవ్రంగా బాధించాయని కోర్టును ఆశ్రయించారు తమిళ టాప్ హీరో విజయ్. తనను కించపరిచేలా ఉన్న వ్యాఖ్యలను తీర్పు నుంచి తొలగించాలని కోరారు.

  • 'పుష్ప' సాంగ్​ ప్రోమో.. 

మిమ్మల్ని పలకరించేందుకు మరిన్ని సినిమా అప్డేట్స్​ వచ్చాయి. ఇందులో 'పుష్ప', 'భాగ్​సాలే', 'రొమాంటిక్​', 'జైభీమ్​' చిత్ర సంగతులు ఉన్నాయి.

  • లంక, బంగ్లా ఆటగాళ్లకు జరిమానా

టీ20 ప్రపంచకప్(t20 worldcup 2021)​లో భాగంగా బంగ్లాదేశ్-శ్రీలంక (ban vs sri t20) మ్యాచ్ సమయంలో గొడవ పడిన ఇద్దరు ఆటగాళ్లకు జరిమానా విధించింది ఐసీసీ. నిబంధనలకు విరుద్ధంగా నడుచుకున్నందుకు జీతంలో కోత పెట్టింది.

16:48 October 25

టాప్​న్యూస్​@ 5PM

  • 'వారి డైలాగులకు చప్పట్లే కానీ.. ఓట్లు పడవు'

విజయ శాంతి మెదక్‌ ఎమ్మెల్యేగా పోటీ చేసే గెలవలేదు కానీ.. హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ను గెలిపిస్తారా.? అని మంత్రి హరీశ్‌ రావు ఎద్దేవా చేశారు. మెదక్‌ ఎంపీగా విజయశాంతి గెలవడానికి తానే కారణమన్నారు. సినిమా వాళ్ల డైలాగులకు చప్పట్లు కొడతారు కానీ ఓట్లు పడవని వ్యాఖ్యానించారు. హుజూరాబాద్ నియోజకవర్గం చల్లూరులో తెరాస అభ్యర్థి గెల్లుతో కలిసి హరీశ్‌ ప్రచారంలో పాల్గొన్నారు.

  • స్వలింగ వివాహాలకు చట్టబద్ధతపై ఆ రోజే క్లారిటీ!

స్వలింగ వివాహాలను హిందూ వివాహ చట్టం, ప్రత్యేక వివాహ చట్టాల పరిధిలో చేర్చాలని దాఖలైన పలు పిటిషన్లపై(same sex marriage in india) నవంబర్​ 30న తుది వాదనలు విననుంది దిల్లీ హైకోర్టు. ఆ రోజే దీనిపై తీర్పు వెలువరించే అవకాశం ఉంది.

  • సైనిక తిరుగుబాటు- ప్రధాని అరెస్ట్​!

సుడాన్​ ఆపద్ధర్మ ప్రధాని అబ్దుల్లా హమ్​డోక్​ సహా పలువురు సీనియర్​ అధికారులను అక్కడి సైన్యం అరెస్ట్​ చేసి తిరుగుబాటుకు తెరలేపింది(sudan coup 2021). ఈ విషయాన్ని ఆ దేశ సమాచార మంత్రిత్వశాఖ వెల్లడించింది. ప్రధానిని ఎక్కడికి తీసుకెళ్లారనే విషయంపై స్పష్టత లేదని వెల్లడించింది. దేశంలో అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు ప్రకటించారు ఆర్మీ జనరల్​ అబ్దెల్​ ఫతాహ్​ బుర్హాన్​. మరోవైపు.. సుడాన్​లో తాజా పరిస్థితులపై అమెరికా, ఐరోపా ఆందోళన వ్యక్తం చేశాయి(sudan latest news).

  • అనన్యా పాండే డుమ్మా

బాలీవుడ్‌ను కుదిపేస్తున్న(ananya pandey drugs) డ్రగ్స్‌ కేసు వ్యవహారంలో నటి అనన్యా పాండే నేడు (అక్టోబర్ 25) ఎన్‌సీబీ విచారణకు హాజరుకాలేదు. గతవారంలో రెండు సార్లు ఆమెను ప్రశ్నించిన అధికారులు సోమవారం మరోసారి విచారణకు రావాలని ఆదేశించారు(bollywood drug news). వ్యక్తిగత కారణాల వల్ల అనన్య ఈ విచారణకు హాజరుకాలేదని సమాచారం.

  • 'భారత్​పై విజయం సంతోషమే.. కానీ'

టీమ్ఇండియాపై గెలిచిన తరుణంలో ఆటగాళ్లు అతిచేయొద్దని సూచించాడు పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్(babar azam latest news). ఇక్కడకు వచ్చింది కేవలం భారత్​పై గెలవడానికి మాత్రమే కాదని గుర్తు చేశాడు.

15:53 October 25

టాప్​న్యూస్​@ 4 PM

  • 'ఏపీలో పార్టీ పెట్టమంటున్నారు'

తెరాస పార్టీకి ఇతర రాష్ట్రాల్లోనూ మంచి ఆదరణ ఉందని తెరాస అధ్యక్షుడు కె.చంద్రశేఖర్​ రావు(KCR speech in trs plenary) అన్నారు. తెలంగాణలో తమను కలపాలంటూ పొరుగు రాష్ట్రాల్లో డిమాండ్లు వస్తున్నాయని తెలిపారు. దళిత బంధు ప్రకటించాక ఆంధ్రప్రదేశ్‌ నుంచి వేల సంఖ్యలో విజ్ఞాపనలు వస్తున్నాయని చెప్పారు. హైటెక్స్‌లో జరుగుతున్న తెరాస ప్లీనరీలో ఆయన వెల్లడించారు.

  • 'ప్రత్యేక మిషన్​​'

వైద్యరంగంలో మౌలిక వసతుల అభివృద్ధి లక్ష్యంగా కేంద్రం ప్రవేశపెట్టిన (Pm Modi Ayushman Bharat) ఆయుష్మాన్​ భారత్​ హెల్త్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ మిషన్​ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా పట్టణ ప్రాంతాల్లో 11,024 ఆరోగ్య కేంద్రాలను కేంద్రం నిర్మించనుంది.

  • ఏపీలో రాష్ట్రపతి పాలన?

ఏపీలో రాష్ట్రపతి పాలనతోపాటు డీజిపీని రీకాల్‌ చేయాలని... తెలుగుదేశం బృందం రాష్ట్రపతిని కోరింది. తెదేపా అధినేత చంద్రబాబు నేతృత్వంలో తెదేపా నేతల బృందం దిల్లీలో రాష్ట్రపతిని కలిసింది. తెదేపా నేతల విజ్ఞప్తికి రాష్ట్రపతి సానుకూలంగా స్పందించినట్లు నేతలు తెలిపారు.

  • మార్కెట్లకు స్వల్ప లాభాలు

దేశీయ స్టాక్​ మార్కెట్ (Stock Market today)​ సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 145 పాయింట్లు వృద్ధి చెందింది. నిఫ్టీ 10 పాయింట్లు పుంజుకుంది.

  • సినిమా కబుర్లు..

కొత్త సినిమా కబుర్లు వచ్చాయి. ఇందులో 'బంటీ ఔర్​ బబ్లీ', 'సత్యమేవ జయతే 2', 'జైభీమ్​' హిందీ ట్రైలర్​ సహా 'హీరో', 'వరుడుకావలెను', 'షెహ్జాదా' చిత్రాల సంగతులు ఉన్నాయి.

14:45 October 25

టాప్​న్యూస్​@ 3 PM

  • '24 గంటల్లోగా పీఆర్సీ ఇవ్వకపోతే'

 24 గంటల్లోగా తమకు పీఆర్సీ ఇవ్వకపోతే మంచినీటి సరఫరా నిలివేస్తామని జలమండలి ఉద్యోగులు స్పష్టం చేశారు. ఖైరతాబాద్‌ జలమండలి ఎదుట జల మండలి ఉద్యోగుల నిరసన చేపట్టారు.

  • నీట్​ పీజీ కౌన్సిలింగ్​కు బ్రేక్​.. 

తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు నీట్-పీజీ కౌన్సిలింగ్​ (NEET PG Counselling) నిర్వహించబోమని కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత న్యాయస్థానానికి స్పష్టం చేసింది.

  • ఈ వారంలో వచ్చే సినిమాలివే

ఈ వారం కూడా పలు సినిమాలు(movie release this week) మిమ్మల్ని అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఇంతకీ ఆ చిత్రాలేంటి? ఎందులో రిలీజ్ అవుతున్నాయి?

  • యాషెస్ టెస్టు సిరీస్​ కోసం..

యాషెస్ టెస్టు సిరీస్​ కోసం ఆల్​ రౌండర్ బెన్​ స్టోక్స్​ ఎంపికయ్యాడు. ఈ మేరకు ఆ దేశ క్రికెట్ బోర్డు, సోమవారం ఈ విషయాన్ని వెల్లడించింది.

  • 'వర్క్​ ఫ్రమ్​ హోం'కు స్వస్తి 

దేశంలో కొవిడ్​ కేసులు(corona cases in India) క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. టీకాల పంపణీ 100 కోట్లు దాటింది. ఈ పరిణామాలన్నీ త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొంటాయనే ఆశలు పెంచుతున్నాయి. దీంతో దిగ్గజ ఐటీ సంస్థలు తమ ఉద్యోగుల వర్క్​ ఫ్రం హోంకు ముగింపు పలికి.. వారిని ఆఫీసుకు రప్పించేందుకు కసతర్తు చేస్తున్నాయి.

14:05 October 25

టాప్​న్యూస్​@ 2 PM

  • మన పథకాలు వాళ్లకు నచ్చాయి..

తెరాస పార్టీకి ఇతర రాష్ట్రాల్లోనూ మంచి ఆదరణ ఉందని తెరాస అధ్యక్షుడు కె.చంద్రశేఖర్​ రావు అన్నారు. తెలంగాణలో తమను కలపాలంటూ పొరుగు రాష్ట్రాల్లో డిమాండ్లు వస్తున్నాయని తెలిపారు.

  • చిత్తశుద్ధితో కేసీఆర్ పని చేస్తున్నారు..

అభివృద్ధి, సంక్షేమం కళ్లకు కనపడని వాళ్లే ముఖ్యమంత్రి కేసీఆర్​ను విమర్శిస్తున్నారని తెరాస సెక్రటరీ జనరల్​ కె. కేశవరావు (TRS Secretary General K. Keshavarao) మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపు, తెలంగాణ పట్ల ఉన్న అవగాహనను ప్లీనరీలో వివరించారు.

  • దివ్యాంగురాలిపై డాక్టర్​ అత్యాచారం

చికిత్స కోసం తన వద్దకు వచ్చిన దివ్యాంగురాలైన యువతిని అత్యాచారం చేశాడు ఓ కీచక డాక్టర్​. వైద్యం పేరుతో తన కామదాహాన్ని తీర్చుకున్నాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్ర ముంబయిలోని శాంటాక్రూజ్ ప్రాంతంలో జరిగింది.

  • తెలుగు సినిమాలకు జాతీయ అవార్డులు...

దిల్లీలో జరిగిన జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో(national film awards 2021) మహర్షి, జెర్సీ సినిమాలకు తలో రెండు అవార్డులు అందజేశారు. ఈ ఈవెంట్​కు ముఖ్యఅతిథిగా వెంకయ్యనాయుడు(venkaiah naidu family) విచ్చేశారు.

  • దాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న సూపర్​స్టార్..

దిగ్గజ సినీ నటుడు, తమిళ సూపర్​స్టార్ రజనీకాంత్.. ప్రఖ్యాత దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందుకున్నారు. 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా.. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.. రజనీకి ఫాల్కే అవార్డును అందజేశారు.

12:54 October 25

టాప్​న్యూస్​@ 1 PM

  • గులాబీ దళపతిగా మరోసారి కేసీఆర్‌...

హైదరాబాద్​ హైటెక్స్​లో తెరాస ప్లీనరీ(TRS Plenary meeting) అట్టహాసంగా ప్రారంభమైంది. తెరాస అధ్యక్షుడిగా కేసీఆర్​ మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

  •  అపోహలన్నీ పటాపంచలు చేశాం...

హైదరాబాద్ హైటెక్స్‌లోని తెరాస ప్లీనరీ సమైవేశానికి పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ హాజరై తెరాస జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు

  • రిక్షా డ్రైవర్​కు ఐటీ నోటీసులు..  

ఉత్తర్​ప్రదేశ్​ మథురా జిల్లాలోని బకల్​పుర్​ గ్రామానికి ఐటీశాఖ అధికారులు వెళ్లి ఓ వ్యక్తికి నోటీసులిచ్చారు. అతడు రూ.3కోట్ల పన్నుఎగవేతకు పాల్పడ్డాడడని ఆ నోటీసుల్లో ఉంది. అయితే ఆ వ్యక్తి ఓ సాధారణ రిక్షా డ్రైవర్​ కావడం గమనార్హం.

  • శృంగారం.. ఓ అత్యద్భుత కార్యం

మనం అన్నింటికీ ముందే సంసిద్ధమవుతుంటాం! అలాంటిది మన జీవితంలో అత్యంత కీలక అంశమైన లైంగిక జీవనం విషయంలోనూ ఇంతే సంసిద్ధత ప్రదర్శిస్తున్నామా? లేనే లేదంటున్నారు నిపుణులు!

  • పంత్ ఒంటిచేతి సిక్స్​లు.. ఊర్వశీ చీర్స్..!

పాక్​తో మ్యాచ్​లో పంత్​ ఒంటి చేతి సిక్స్​లతో స్టేడియంను హోరెత్తించాడు. అక్కడే ఉన్న బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా చీర్స్ చెబుతూ సంబరాలు చేసుకుంటున్న దృశ్యాలు కెమెరా కంటికి చిక్కాయి. పంత్, రౌతేలా డేటింగ్​లో ఉన్నట్లు గతంలో పుకార్లు వచ్చిన నేపథ్యంలో.. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశమైంది.

11:49 October 25

టాప్​న్యూస్​@ 12 PM

  • తెలంగాణ సరిహద్దుల్లో ఎదురుకాల్పులు..

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో ఎదురుకాల్పులు(maoist killed in telangana) జరిగాయి. ములుగు- బీజాపూర్‌ అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రేహౌండ్స్‌ బలగాలు- మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు.

  • మరోసారి పట్టుబడిన డ్రగ్స్..

మేడ్చల్ జిల్లాలో మరోసారి డ్రగ్స్ పట్టుబడ్డాయి. బాలానగర్​లో తనిఖీలు నిర్వహించిన ఎక్సైజ్ అధికారులు.. 12 ఎల్​ఎస్​డీ బోల్ట్స్​ డ్రగ్స్​ను స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ ఎక్కణ్నుంచి సరఫరా చేస్తున్నారు? ఎవరికి సరఫరా చేస్తున్నారనే విషయాలపై ఆబ్కారీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

  • 'పెట్రో' ధరలకు బ్రేక్​..

దేశంలో రికార్డు స్థాయిలో పెరుగుతున్న ఇంధన ధరలకు (Fuel Price Today) బ్రేక్​ పడింది. గత కొద్ది రోజులుగా చమురు ధరలను పెంచూతూ వస్తున్న సంస్థలు.. సోమవారం కాస్త విరామం ఇచ్చాయి.

  • గర్ల్​ఫ్రెండ్స్ కోసం వజ్రాలు చోరీ.. 

10మంది గర్ల్​ఫ్రెండ్స్ ఉన్న ఓ వ్యక్తి.. వారి కోరికలను తీర్చేందుకు భారీ దొంగతనాలకు(Ghaziabad Crime News)పాల్పడ్డాడు. వజ్రాభరణాలు, రత్నాలు, ఖరీదైన కార్లను చోరీ చేశాడు. చివరకు పోలీసులకు చిక్కాడు.

  • యుద్ధ వీరుల బయోపిక్స్..

దేశం కోసం ఎంతో శ్రమించి, అవసరమైతే ప్రాణాలు అర్పించిన వీరులు ఎంతోమంది ఉన్నారు. అలాంటి యుద్ధవీరుల కథలో నటించడం గర్వంగా ఉందంటున్నారు యువ కథానాయకులు, నాయికలు. ఇంతకీ ఆ నటీనటులు ఎవరు? ఆ సినిమాలేంటి?

10:50 October 25

టాప్​న్యూస్​@ 11AM

  • తెరాస ప్లీనరీ సమావేశం..

తెరాస ప్లీనరీ సమావేశానికి మంత్రి కేటీఆర్ చేరుకున్నారు. భారీ భద్రత ఏర్పాట్ల నడుమ కాసేపట్లో ప్లీనరీ సమావేశం ప్రారంభమైంది. గులాబీమయంగా మారిన హైటెక్‌ సిటీలో సాయంత్రం వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. 

  • పదిహేనేళ్ల స్వప్నం సాకారం..

రాకెట్లలో ఉపయోగించే ఇంధనం హైడ్రాజైన్‌ హైడ్రేట్‌(HH news)ను హైదరాబాద్‌లోని ఐఐసీటీ దేశీయంగా అభివృద్ధి చేసింది. ఒకటిన్నర దశాబ్దాల కృషిలో ఎన్నో సవాళ్లు, వైఫల్యాలు ఎదురయ్యాయి. నాయకత్వం ఇచ్చిన ప్రోత్సాహం, మద్దతుతో శాస్త్రవేత్తల బృందం సాధించి చూపించింది.

  • స్వల్పంగా పెరిగిన బంగారం ధర..

బంగారం (Gold Rate Today), వెండి (Silver price today) ధరలు సోమవారం స్వల్పంగా పెరిగాయి. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో మేలిమి పుత్తడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • పాక్ ఆటగాడికి కోహ్లీ హగ్..

టీ20 ప్రపంచకప్​లో (T20 world cup 2021 updates) తమ తొలి మ్యాచ్​లో పాక్ విజయం సాధించింది. మహమ్మద్​ రిజ్వాన్(79), బాబార్(68) చెలరేగి ఆడి భారత్​పై గెలిచారు. అయితే.. మ్యాచ్​ అనంతరం క్రీజులో ఉన్న వీరిని భారత జట్టు కెప్టెన్ కోహ్లీ అభినందించాడు.

  • వర్ష రొమాంటిక్ డ్యాన్స్.

ఈటీవీలో ప్రసారమయ్యే పలు ప్రోగ్రామ్స్​లో కనిపిస్తూ, అలరిస్తున్న వర్ష.. 'శ్రీదేవి డ్రామా కంపెనీ'(sridevi drama company promo) కొత్త ఎపిసోడ్​లో అదరగొట్టింది. 'చెప్పమ్మా చెప్పమ్మా' పాటకు రొమాంటిక్​గా డ్యాన్స్ చేసి ఆకట్టుకుంది.
 
09:45 October 25

టాప్​న్యూస్​@ 10 AM

  • ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు...

ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు(Intermediate First Year Exams Started) ప్రారంభమయ్యాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరగనుంది.  

  • సముద్రంపాలైన 2800 టీఎంసీల నీరు..

రాష్ట్రంలో కురిసిన వర్షాలు, ఎగువ నుంచి వచ్చిన వరదతో ఈ ఏడాది తెలంగాణ ప్రాజెక్టులు(Irrigation projects in Telangana) నీళ్లతో కళకళలాడాయి. ఈయేడు నీరు కడలిపాలు కూడా ఎక్కువగానే అయింది. 2800 టీఎంసీల నీరు సముద్రంపాలైంది.

  • నడ్డివిరుస్తున్న ఇంధన ధరలు...

వాహనదారులు, డ్రైవర్లకే కాదు.. వినియోగదారులకూ ధరల మంట తప్పడం లేదు. తెలుగు రాష్ట్రాలకు ప్రతి రోజూ ఇతర రాష్ట్రాల నుంచి వాహనాల్లో వచ్చే నిత్యావసరాలు, ఇతర సరకుల ధరలు మండిపోతున్నాయి.

  • తొలి జికా కేసు..

ఉత్తర్​ప్రదేశ్​లో తొలి జికా కేసు నమోదైంది. వాయుసేనకు చెందిన ఓ అధికారికి సోకినట్లు వెల్లడైంది. బాధితుడిని కలిసిన మరో 22 మందికి కూడా వైరస్‌ లక్షణాలు ఉండటం వల్ల వారి రక్త నమూనాలను కూడా లాబొరేటరీకి పంపినట్లు అధికారులు పేర్కొన్నారు.

  • హార్దిక్​ భుజానికి గాయం..

టీ20 ప్రపంచకప్(T20 World Cup 2021)​​లో పాకిస్థాన్​తో మ్యాచ్​ సందర్భంగా టీమ్​ఇండియా ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్య(Hardik Pandya News) గాయపడ్డాడు. గాయం నుంచి కోలుకొని తదుపరి మ్యాచుల్లో ఆడినా.. అతడు బౌలింగ్ చేయడం అనుమానమే అనే విశ్లేషణలు వస్తున్నాయి.

08:48 October 25

టాప్​న్యూస్​@ 9AM

  • ఇండియా ఓటమికి కారణాలు..

ఐసీసీ టోర్నీలో తొలిసారి పాక్ చేతిలో (T20 world cup 2021) టీమ్​ఇండియా ఓటమి పాలైంది. ఇంతకీ భారత్ ఓడిపోవడానికి (pak vs india match) కారణలేంటి? ఎక్కడ తప్పు జరిగింది?

  • నిర్లక్ష్యం వద్దు.. 

కొంత ఆలస్యమైనా, కచ్చితంగా టీకా రెండో డోసు తీసుకుంటేనే కొవిడ్‌ నుంచి రక్షణ లభిస్తుందని వైద్యశాఖ స్పష్టం చేస్తోంది. రెండో డోసు పొందని వారు రాష్ట్రంలో సుమారు 36.55 లక్షల మంది ఉండడంతో వీరిపై దృష్టి పెట్టింది.  

  • పెళ్లికి వెళ్లి వస్తుండగా...

మేడ్చల్ జిల్లా కీసర మండలం యాద్గార్​పల్లి వద్ద ఔటర్​ రింగ్ ​రోడ్డుపై ప్రమాదం జరిగింది. డివైడర్​ను కారు ఢీకొట్టడం వల్ల కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.  

  • బరువెక్కుతున్న బాల్యం..

కరోనా ముందుతో పోలిస్తే ఆ తరవాత ఎక్కువగా పిల్లలు ఊబకాయం బారిన పడినట్లు అమెరికా వైద్య సంఘం పత్రిక అధ్యయనంలో తేలింది. కొవిడ్ సమయంలో చిరుతిళ్లు ఎక్కువగా తినడం, టీవీలు, ఫోన్లకు అతుక్కుపోవడం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల అధిక బరువు సంతరించుకున్నారు.

  • నాలో నాకు నచ్చేది అదే...

తప్పు జరిగినప్పుడు ముందుగా ఆత్మ విమర్శ చేసుకుంటానని హీరోయిన్ శ్రుతిహాసన్ చెబుతోంది. తనలో తనకు నచ్చేది నిజాయతీనే అని వెల్లడించింది.

07:53 October 25

టాప్​న్యూస్​@ 8AM

  • తెరాస 20 ఏళ్ల ప్రస్థానం..

మఖలో పుట్టి పుబ్బలో మాయం అవుతుంది’- రెండు దశాబ్దాల క్రితం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవించిన తరుణంలో ఆనాటి రాజకీయ విమర్శకులు అన్న మాట ఇది! అందరి అంచనాలనూ అధిగమిస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి నేడు ద్విదశాబ్ది ఉత్సవాలను జరుపుకొంటోంది. స్వతంత్ర భారత రాజకీయ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకుంది.

  • కేసీఆర్ ఎన్నిక లాంఛనమే..

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షునిగా కేసీఆర్ మరోసారి ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. తెరాస పార్టీ ద్విదశాబ్ద వేడుకల్లో భాగంగా ఇవాళ నిర్వహిస్తోన్న తెరాస ప్లీనరీ సమావేశంలో ఈ విషయాన్ని లాంఛనంగా ప్రకటించనున్నారు.  

  • దేశాన్ని రక్షించండి..  

మూడు రోజుల జమ్ముకశ్మీర్​ పర్యటనలో భాగంగా.. కేంద్ర హోంమంత్రి అమిత్​ షా అంతర్జాతీయ సరిహద్దును సందర్శించారు. అక్కడి జవాన్లతో ముచ్చటించారు. దేశాన్ని జవాన్లు రక్షించాలని, వారి కుటుంబాల సంక్షేమాన్ని మోదీ ప్రభుత్వం చూసుకుంటుందని హామీనిచ్చారు.  

  • ప్రముఖ టాలీవుడ్ నటుడు మృతి..

అనారోగ్యంతో కొన్నాళ్ల నుంచి బాధపడుతున్న నటుడు రాజబాబు.. ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయనకు పలువురు నటీనటులు సంతాపం తెలుపుతున్నారు.

  • పాక్​ ఆటగాళ్లతో ధోనీ ముచ్చట్లు..  

టీ20 ప్రపంచకప్​లో భారత జట్టుపై అజేయ విజయం సాధించింది పాక్ జట్టు. అయితే.. మ్యాచ్ అనంతరం టీమ్​ఇండియా మెంటార్ ధోనీ పాక్​ ఆటగాళ్లతో కొంతసేపు ముచ్చటించాడు. ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. 

06:50 October 25

టాప్​న్యూస్​@ 7AM

  • పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామం...

పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామంగా మారిందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రక్షణ రంగంలో వెమ్ టెక్నాలజీస్ సంస్థ వెయ్యి కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడం అభినందనీయమని మంత్రి కేటీఆర్ అన్నారు.

  • ప్రభుత్వ చర్యలపై ప్రజల హర్షం...

డబుల్‌ రిజిస్ట్రేషన్లు జరగకుండా.. రాష్ట్రప్రభుత్వం పక్కాగా చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో... నూతన విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ విధానంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

  • 'భాషను మరిచిపోతే సంస్కృతీ దూరం'

ప్రాచీన తెలుగు సాహిత్యాన్ని భావితరాలకు మరింత చేరువ చేయాల్సిన అవసరముందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. వంగూరి ఫౌండేషన్‌ ఆఫ్‌ ఆమెరికా 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు సభా విశేష సంచికను ఆయన ఆవిష్కరించారు.

  • ఈసారి ఏ మాయ జరగలేదు...

టీ20 ప్రపంచకప్​లో (T20 world cup 2021) ఇప్పటివరకు ఉన్న రికార్డ్​ను పాక్ బ్రేక్​ చేసింది. భారత్ ఆధిపత్యానికి అడ్డుకట్ట వేసింది. ఒక్క వికెట్​ కూడా కోల్పోకుండా లక్ష్య ఛేదనలో విజయం సాధించింది. అభిమానులు ఊహించినట్లు మ్యాచ్ చివరి వరకు ఏ మాయ జరగలేదు.

  • రొమాంటిక్' చూశాక పూరీ ఏడ్చారు...

'రొమాంటిక్' చిత్ర విశేషాలను డైరెక్టర్ అనిల్ పాదూరి చెప్పారు. సినిమా చూసిన తర్వాత పూరీ సర్ ఏడ్చారని తెలిపారు. ఈ నెల 29న థియేటర్లలోకి రానుంది 'రొమాంటిక్'.

04:47 October 25

టాప్​న్యూస్​@ 6AM

  • ఇరవయ్యేళ్ల గులాబీ ప్రస్థానం..

గులాబీజెండా రెండు దశాబ్దాలు(20 years of trs party) పూర్తి చేసుకుంది. మలిదశ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన గులాబీ దళపతి కేసీఆర్.. ప్రత్యేక తెలంగాణ సాధకుడిగా చరిత్ర సృష్టించారు. స్వీయ రాజకీయ అస్థిత్వం పేరిట తిరుగులేని శక్తిగా..... తెరాసను తీర్చిదిద్దారు. బంగారు తెలంగాణ లక్ష్యసాధన దిశగా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ఏప్రిల్ 27న ఇరవై వసంతాలు పూర్తి చేసుకున్న గులాబీ పార్టీ(20 years of trs party).. 21వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది.

  • నేడే తెరాస ప్లీనరీ..

తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీని పెద్దఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సమావేశానికి హాజరుకానున్న సుమారు 6వేలకుపైగా ప్రతినిధులు.. కేసీఆర్​ను పదోసారి పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. రాజకీయ, అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించి రాష్ట్ర, జాతీయ అంశాలపై తీర్మానాలు చేయనున్నారు. ప్లీనరీ దృష్ట్యాహైటెక్స్ పరిసరాలతోపాటు హైదరాబాద్ నగరాన్ని గులాబీమయం చేశారు.

  • నగరంలో ట్రాఫిక్​ ఆంక్షలు..

తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు, నేతలు, అభిమానులు హాజరుకానున్న నేపథ్యంలో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. వాహనాల్లో అధిక సంఖ్యలో ప్లీనరీకి కార్యకర్తలు హాజరు కానుండటంతో జేఎన్‌టీయూ, మాదాపూర్‌, గచ్చిబౌలి, హైటెక్స్‌ ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

  • నేటి నుంచే ఇంటర్​ పరీక్షలు..

ఇవాళ్టి నుంచి నవంబర్ 3వ తేదీ వరకు జరగబోయే ఇంటర్మీడియట్ పరీక్షల(inter exams in telangana) కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ ప్రకటించారు. హైదరాబాద్ నాంపల్లిలోని బోర్డు కార్యాలయంలో ఇంటర్మీడియట్ పరీక్షల(inter exams 2021) ఏర్పాట్లపై వివరాలను ఆయన వెల్లడించారు. 

  • భాష మర్చిపోతే సంస్కృతి దూరం..

  • పాక్​ సరిహద్దు తెరవాలి..

పాకిస్థాన్​, అఫ్గానిస్థాన్​ మధ్య ఉన్న సరిహద్దును మూసివేయడంపై నిరసన చేపట్టారు అఫ్గాన్ పౌరులు. చమన్‌ సరిహద్దు (Chaman Border News) వద్ద ఆందోళనకు దిగారు.

  • వాడేసిన గ్లవ్స్​తో​ దందా..

థాయిలాండ్ నుంచి వాడి పారేసిన మెడికల్ గ్లవ్స్ పెద్దఎత్తున అమెరికాకు దిగుమతి అవుతుండటం కలకలం రేపింది. కరోనా విజృంభణతో డిమాండ్ అధికంగా ఉన్న నేపథ్యంలో థాయ్​లోని కొన్ని సంస్థలు ఈ అక్రమాలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు.

  • రిలియన్స్​కు హరిత ఇంధనం..

హరిత ఇంధన వ్యాపారంపై భారీగా పెట్టుబడులు పెడుతోంది రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (Reliance News). వచ్చే 5 ఏళ్లలో మొత్తం పన్నుకు ముందు లాభం(ఎబిటా)లో 10 శాతాన్ని ఈ వ్యాపారం నుంచే రిలయన్స్​ సాధించే అవకాశం ఉందని బెర్న్‌స్టీన్‌ నివేదిక వెల్లడించింది.

  • పాక్​పై భారత్​కు తొలి ఓటమి​..

టీ20 ప్రపంచకప్​లో (T20 worldcup 2021) భాగంగా టీమ్​ఇండియాతో జరిగిన మ్యాచ్​లో పాకిస్థాన్​ (IND Vs PAK) ఘన విజయం సాధించింది. పది వికెట్ల తేడాతో గెలుపొందింది. ప్రపంచకప్​ చరిత్రలో భారత్​పై పాక్​కు ఇది తొలి విజయం కాగా.. పాక్​పై భారత్​కు ఇది తొలి ఓటమి.

  • స్టార్​ల సినిమాలు వచ్చేస్తున్నాయి..

టాలీవుడ్ అగ్రనటులు పనన్ కల్యాణ్, మహేశ్​ బాబు నటిస్తోన్న సినిమాల విడుదల తేదీలు వాయిదా పడినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాల రిలీజ్​ డేట్​పై క్లారిటీ రానుంది.

Last Updated : Oct 25, 2021, 10:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.