ETV Bharat / city

ఈటీవీ భారత్​ ముఖ్యాంశాలు

ETV BHARAT TOP NEWS
ETV BHARAT TOP NEWS
author img

By

Published : Oct 22, 2021, 6:25 AM IST

Updated : Oct 22, 2021, 10:14 PM IST

21:35 October 22

టాప్​న్యూస్​@ 10PM

  • 'మోడల్ స్కూళ్ల నిర్మాణం వేగవంతం కావాలి'

గురుకులాలు, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు పునః ప్రారంభం నేపథ్యంలో అధికారులతో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్​ సమీక్ష నిర్వహించారు. నూతన భవన నిర్మాణాలు, విద్యార్థులకు కల్పిస్తున్న వసతులు, పురోగతిని సమీక్షించారు.

  • మళ్లీ పెరుగుతున్నాయి

కేరళలో కరోనా కేసులు(Kerala Corona Cases) మళ్లీ పెరిగాయి. ఆ రాష్ట్రంలో కొత్తగా 9,361 మందికి కొవిడ్ సోకినట్లు తేలింది. మరో 99 మంది వైరస్ ధాటికి ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటకలో 378 మందికి కరోనా నిర్ధరణ అయింది. మరో 11 మంది మరణించారు.

  • 'ఆన్‌లైన్‌ విద్యకు ప్రపంచ రాజధానిగా భారత్‌'

ఆన్‌లైన్‌ విద్యలో భారత్‌ ప్రపంచ రాజధానిగా అవతరించే అవకాశం ఉందని నీతి ఆయోగ్‌ సీఈఓ అమితాబ్‌ కాంత్‌ అన్నారు. ఈ రంగంలో ప్రైవేటు పరిశ్రమలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

  • 'మెంటార్​ ఏమీ చేయడు'

టీ20 ప్రపంచకప్​లో భారత్, పాకిస్థాన్​ జట్లు(Ind vs Pak T20 World Cup) ఫైనల్​లో తలపడితే బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు మాజీ దిగ్గజం సునీల్ గావస్కర్(Sunil Gavaskar News). మెంటార్​గా ధోనీ(Dhoni Mentor) బాధ్యతలపై కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు గావస్కర్.

  • అనన్యా పాండే సంపాదన ఎంతో తెలుసా?

డ్రగ్స్ కేసులో ఎన్సీబీ విచారణకు హాజరైంది బాలీవుడ్ నటి అనన్యా పాండే. షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్​ ఖాన్​తో చేసిన వాట్సాప్ చాట్​లో డ్రగ్స్ సంబంధించిన విషయాలు ఉన్నాయని.. అధికారులు ఆమెను ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఆమె లగ్జరీ లైఫ్​ గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

20:52 October 22

టాప్​న్యూస్​@ 9PM

  • హుజూరాబాద్​ నియోజకవర్గంలో ఉద్రిక్తత

కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామంలో తెరాస, భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ ప్రచారం సందర్భంగా ర్యాలీ నిర్వహించగా.. తెరాస కార్యకర్తలు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది.

  • ధర్మాగ్రహం

ఏపీ సీఎం జగన్‌ ఉన్మాదంతో రాష్ట్రాన్ని నాశనం చేయాలనుకుంటున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ఆక్షేపించారు. దీక్ష ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకాపా తీరుపై మండిపడ్డారు. తమది ధర్మపోరాటమని... ముమ్మాటికీ విజయం తమదేనని స్పష్టం చేశారు.

  • చివరి నిమిషంలో జోక్యం చేసుకోలేం

ఇంటర్‌ పరీక్షల్లో(TS Inter exams) తాము జోక్యం చేసుకోలేమని తెలంగాణ హైకోర్టు(Ts Hight Court) స్పష్టంచేసింది. ఈ నెల 25 నుంచి జరగాల్సిన ఇంటర్‌ మొదటి పరీక్షలు(TS Inter exams) రద్దు చేయాలంటూ తెలంగాణ రాష్ట్ర తల్లిదండ్రుల సంఘం దాఖలు చేసిన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం(Ts Hight Court) అత్యవసర విచారణ చేపట్టింది.

  • కేంద్రంపై తీవ్ర అసహనం

ట్రైబ్యునళ్ల నియామకం ఇష్టం లేకుంటే వినియోగదారుల రక్షణ చట్టాన్ని రద్దు చేయాలని కేంద్రంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. తమ అధికార పరిధిని దాటి ఖాళీలు భర్తీ చేయాలని కోరుతున్నామన్న న్యాయమూర్తులు.. ఈ విషయాన్ని తాము కోరాల్సి రావటం దురదృష్టకరమన్నారు.

  • విమెన్‌కు రెండురోజుల నెలసరి సెలవులు

మహిళలకు నెలసరి సమయంలో ఎదురయ్యే ఇబ్బందిని అర్థం చేసుకున్న ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ 'స్విగ్గీ' తన వద్ద పనిచేసే డెలివరీ విమెన్‌ సౌకర్యార్థం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా డెలివరీ పార్ట్‌నర్లకు ప్రతి నెలా రెండు రోజుల నెలసరి సెలవులు ప్రకటించింది. ఈ విషయాన్ని స్విగ్గీ ఆపరేషన్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మిహిర్‌ షా తన బ్లాగ్‌ పోస్ట్‌లో వెల్లడించారు.

19:53 October 22

టాప్​న్యూస్​@ 8PM

  • దోచుకున్నారు.. దాచుకున్నారు..!

తెలుగు అకాడమీ డిపాజిట్లను కొల్లగొట్టిన నిందితులు (Telugu Akademi FD Scam)... ఆ డబ్బులతో స్థిరాస్తులు కొనుగోలు చేసినట్లు సీసీఎస్ పోలీసులు గుర్తించారు. సదరు ఆస్తుల క్రయవిక్రయాలు జరగకుండా నిలిపివేయాలని, సీసీఎస్ పోలీసులు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీకి లేఖ రాయనున్నారు.

  • బర్త్​డే గిఫ్ట్​ ప్యాక్​లో..

ఫుడ్ డెలివరీ బాయ్స్ అని చెబుతూ మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్న ఇద్దరిని బెంగళూరులోని సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.60లక్షలు విలువ చేసే డ్రగ్స్​ స్వాధీనం చేసుకున్నారు.

  • అలా వచ్చి.. ఇలా వెళ్లేలోగా..

సాధారణంగా విద్యుత్​ వాహనాలకు(ఈవీ) పూర్తిగా ఛార్జింగ్ పెట్టాలంటే కనీసం మూడు లేదా నాలుగు గంటల సమయం పడుతుంది. అయితే.. కేవలం 15 నిమిషాల్లోనే ఈవీల బ్యాటరీలను ఛార్జింగ్ చేసుకోవచ్చని చెబుతోంది ఓ సంస్థ. ఇంతకీ అదెలా సాధ్యమంటే..?

  • అదే కారణం..!

దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్​ను(AB De Villiers News) 2019 వన్డే ప్రపంచకప్​లో ఎంపిక చేయకపోవడానికి కారణమేంటో తెలిపారు ఆ జట్టు మాజీ చీఫ్ సెలెక్టర్ లిండా జోండి(Linda Zondi Cricket). అతన్ని ఎంపిక చేస్తే ఇతర ఆటగాళ్లకు అన్యాయం చేసినట్లు అవుతుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.

  • 'మా' మహిళా భద్రత కోసం కమిటీ

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్​లోని మహిళల భద్రత కోసం ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు(maa president 2021) మంచు విష్ణు(manchu vishnu maa president) తెలిపారు. ప్రముఖ సామాజిక కార్యకర్త సునీతా కృష్ణన్ ఈ కమిటీకి గౌరవ సలహాదారుగా ఉంటారని వెల్లడించారు.

18:51 October 22

టాప్​న్యూస్​@ 7PM

  • షీటీమ్స్​కు పెరుగుతున్న ఫిర్యాదులు

మహిళలు, యువతులను వేధిస్తున్న వారిపై సైబరాబాద్‌ షీ-టీమ్​ బృందాలు కఠిన చర్యలు చేపడుతున్నాయి. వారిపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నారు. మహిళలపై వేధింపులకు అడ్డుకట్ట వేయడానికి సైబరాబాద్ పరిధిలో 11 షీ-టీమ్​ బృందాలు పనిచేస్తుండగా.. గత నెలలో మొత్తం 182 మంది బాధితులు పలు విధాలుగా ఫిర్యాదులు నమోదు చేశారు.

  • 'మోదీ ప్రభుత్వానివి తప్పుడు లెక్కలు'

 దేశంలో 21శాతం మందికి మాత్రమే రెండుడోసులు పంపిణీ చేసి 31శాతం మందికి వ్యాక్సిన్‌ పూర్తిచేసినట్లు ప్రధాని మోదీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ విమర్శించింది. కరోనాతో చనిపోయిన 4 లక్షల 53వేల మందికి సంతాపం తెలపకుండా.. ప్రధాని సంబరాలు చేసుకుంటున్నారని ధ్వజమెత్తింది.

  • చైనాలో మళ్లీ కరోనా వ్యాప్తి

చైనాలో మళ్లీ కరోనా (China Covid Latest News) కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. పర్యటకుల కారణంగా ఆ దేశంలో వైరస్​ బారిన పడే వారి సంఖ్య రోజురోజుకు క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వైరస్​ కట్టడి కోసం అక్కడి అధికారులు కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. 

  • 'ఆ రికార్డులు ఎవరూ పట్టించుకోరు'

టీ20 ప్రపంచకప్​లో(T20 World Cup 2021) భాగంగా భారత్, పాకిస్థాన్​ మ్యాచ్(Ind vs Pak T20) మరో రెండు రోజుల్లో జరగనుంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్​ మాజీ పేసర్ వసీమ్ అక్రమ్(Wasim Akram News) కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచకప్​ టోర్నీల్లో భారత్, పాకిస్థాన్ రికార్డులు ఏ ఆటగాడు పట్టించుకోడని అభిప్రాయపడ్డాడు.

  • 'ఆయన మృతికి వ్యాక్సిన్ కారణం కాదు'

కోలీవుడ్ నటుడు వివేక్(actor vivek death news) గుండెపోటు వల్లే చనిపోయారని స్పష్టం చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. కరోనా టీకా తీసుకోవడం వల్లే ఆయన చనిపోయారన్న వార్తల్లో నిజం లేదని వెల్లడించింది.

17:55 October 22

టాప్​న్యూస్​@ 6PM

  •  అలా అనడం ఆత్మవంచనే..!

పెట్రోల్​, డీజిల్​ ధరల పెరుగుదలకు కేంద్ర ప్రభుత్వమే కారణమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు ఆరోపించారు. తెరాసపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు ప్రజాస్వామ్యాన్ని అవమానపరచడమేనని ఆయన అన్నారు. తెరాస ఏడేళ్లుగా మోసం చేస్తోందని అనడం ఆత్మవంచనే అని పేర్కొన్నారు.

  • యుద్ధానికి సిద్ధం

వాస్తవాధీన రేఖ వెంబడి చైనా కవ్వింపులకు.. భారత్‌ దీటుగా బదులిస్తోంది. డ్రాగన్‌ పెద్దఎత్తున యుద్ధవిమానాలు, సైన్యాన్ని మోహరించగా.. మన దేశం సైతం అంతేస్థాయిలో క్షిపణి వ్యవస్థలను సరిహద్దులకు తరలిస్తోంది. యుద్ధం అంటూ వస్తే శత్రువుకు తగినరీతిలో బుద్ధి చెప్పడం కోసం అన్ని వ్యవస్థలను సిద్ధం చేస్తూ.. నిత్యం మాక్ డ్రిల్స్ నిర్వహిస్తోంది.

  • గన్​పౌడర్​ ఫ్యాక్టరీలో భారీ పేలుడు

రష్యాలో ఓ గన్​పౌడర్​ పరిశ్రమలో జరిగిన పేలుడులో 16 మంది మరణించారు. ఉత్పత్తి ప్రక్రియలో జరిగిన వైఫల్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.

  • ఐపీఎల్​ కొత్త జట్టుపై దీపిక- రణ్​వీర్ ఆసక్తి!

ఐపీఎల్​ కొత్త జట్టుపై(IPL New teams) బాలీవుడ్​ హాట్​ కపుల్​ రణ్​వీర్ సింగ్- దీపికా పదుకొణె(Deepika Padukone News) ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. ఓ ఫ్రాంచైజీని సొంతం చేసుకునేందుకు వారు బిడ్ దాఖలు చేసినట్లు సమాచారం.

  • 'నాట్యం' చిత్రబృందానికి ప్రశంసలు

ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి సంధ్యారాజు నిర్మించి, నటించిన చిత్రం 'నాట్యం'(natyam movie review). ఈ సినిమా నేడు (అక్టోబర్ 22) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో చిత్రబృందంపై ప్రశంసలు కురిపించారు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, నటుడు బాలకృష్ణ.

16:48 October 22

టాప్​న్యూస్​@ 5PM

  • 'అబద్ధాలు ఆడటం కేసీఆర్ లక్షణం'

దళితబంధుపై తెరాస అసత్యప్రచారాలు చేస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. భాజపా... కాంగ్రెస్​తో ఎప్పటికీ పొత్తు పెట్టుకోదని స్పష్టం చేశారు. బూజునూరులో హుజూరాబాద్​ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్​తో కలిసి కిషన్ రెడ్డి ప్రచారం చేశారు.

  • భీకర పోరు

కశ్మీర్​ లోయలో భీకర ఎన్​కౌంటర్ జరుగుతోంది. గడిచిన 12 రోజులుగా భద్రతా సిబ్బంది.. ఉగ్రమూకల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. తాజాగా కొనసాగుతున్న ముష్కరుల వేట.. 2003లో జరిగిన 'ఆపరేషన్‌ సర్ప్‌వినాశ్‌'ను గుర్తు చేస్తుంది. సైన్యం సర్వశక్తులు ఒడ్డి ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు పోరాడుతోంది.

  • 15 సెకన్లలోనే ఐఫోన్ 13 ప్రో హ్యాక్​!

యాపిల్ కొత్త ఫోన్ ఐఫోన్ 13 ప్రో ను (Iphone 13 pro news) 15 సెకన్లలోనే హ్యాక్ చేశారు చైనా హ్యాకర్లు. అంతర్జాతీయ కాంపిటీషన్​లో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. భారీ బహుమానం కూడా గెలుచుకున్నారు.

  • బబుల్​ ట్రబుల్​

క్రికెట్​లో స్కిల్స్​, సెలక్షన్​, ఫిట్​నెస్ లాంటివి ప్రధానంగా ఉండేవి. ప్రస్తుతం మాత్రం మెంటల్ హెల్త్​ (మానసిక ఆరోగ్యం) లాంటి మరో సమస్య క్రికెటర్లను వేధిస్తోంది. బయోబబుల్​ రూపంలో ఈ కొత్త సమస్య వచ్చిపడింది. మరి టీమ్​ఇండియా ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటుందంటే?

  • 'ఇకపై ఏ నిర్ణయమైనా ఆయనదే..'

'మా' ఎన్నికల సీసీ ఫుటేజీ కావాలని ఎన్నికల అధికారి(maa elections 2021) కృష్ణమోహన్​ను కోరారు ప్రకాశ్ రాజ్. దీనిపై స్పందించిన ఆయన.. ఎన్నికల తర్వాత జోక్యం చేసుకోవడానికి తనకెలాంటి అధికారాలు లేవని స్పష్టం చేశారు.

15:51 October 22

టాప్​న్యూస్​@ 4PM

  • ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు

హుజూరాబాద్‌ ఎన్నికల్లో (Huzurabad by elections 2021) గెలిచేందుకు అభ్యర్థులు ప్రచారాలతో పాటు నగదును, మద్యంను కూడా అస్త్రాలుగా వాడేస్తున్నారు. పోలీసుల తనిఖీల్లో ఇప్పటివరకు రూ.1.80 కోట్ల డబ్బును స్వాధీనం చేసుకున్నారు. హుజూరాబాద్‌లో రూ.6.11 లక్షల విలువైన మద్యం సీజ్ చేశారు.

  • మరో రెండు వారాలు ఆగాల్సిందే!

ఏదైనా టీకాకు అనుమతులివ్వాలంటే సమయం పడుతుందని(WHO covaxin news), రెండు వారాలు ఆలస్యమైనా.. అన్నింటినీ పరిగణనలోకి తీసుకొనే చర్యలు చేపట్టాలని డబ్ల్యూహెచ్​ఓకు చెందిన ఓ అధికారి వెల్లడించారు. దీంతో దేశీయ కరోనా టీకా కొవాగ్జిన్​కు డబ్ల్యూహెచ్​ఓ అత్యవసర వినియోగానికి సంబంధించిన అనుమతులకు మరో రెండు వారాలు పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  • వారాంతంలోను నష్టాలే..

అమ్మకాల ఒత్తిడి, అంతర్జాతీయ ప్రతికూల పరిణామాలతో దేశీయ స్టాక్​ మార్కెట్ (Stock Market today)​ సూచీలు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్​ 102 పాయింట్లు కోల్పోగా.. నిఫ్టీ 63 పాయింట్లు నష్టపోయింది.

  • రోహిత్​ అంటేనే ఎక్కువ ఇష్టం

పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు టీమ్​ఇండియా ఆటగాళ్లను బాగా ఆదరిస్తారని తెలిపాడు ఆ దేశ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్(Shoaib Akthar News). కోహ్లీ కంటే రోహిత్​ శర్మ అంటే వారికి ఎక్కువ ఇష్టమని తెలిపాడు. మరో రెండు రోజుల్లో భారత్, పాక్​ మ్యాచ్(Ind vs Pak T20 World Cup) జరగనున్న నేపథ్యంలో అక్తర్(Shoaib Akhtar on India) ఈ వ్యాఖ్యలు చేశాడు.

  • నాట్యం మెప్పించిందా..?

ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి సంధ్యారాజు(sandhya raju movies) ప్రధాన పాత్రలో న‌టిస్తూ.. స్వీయ నిర్మాణంలో రూపొందించిన చిత్రం 'నాట్యం('Natyam Movie Review). రోహిత్ కోరుకుండ దర్శకత్వం వహించిన ఈ సినిమా నేడు (అక్టోబర్ 22) థియేటర్లలో విడుదలైంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఎలా ఉందో సమీక్ష ద్వారా తెలుసుకుందాం.
 
14:35 October 22

టాప్​న్యూస్​@ 3PM

  • ఆ విషయంలో జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు

ఇంటర్ పరీక్షలు రద్దుచేయాలన్న తల్లిదండ్రుల సంఘం పిటిషన్‌పై హైకోర్టు అత్యవసర విచారణ జరిపింది. ఇంటర్ పరీక్షల్లో జోక్యం చేసుకోలేమని  హైకోర్టు ప్రకటించింది. 

  • ఘరానామోసం

మహబూబాబాద్ జిల్లాలో ఘరానా మోసం బయటపడింది. ఏటీఎంలో నగదు పెట్టే సిబ్బందే.. ఆ నగదును కాజేసిన సంఘటన చోటుచేసుకుంది. ఏటీఎంలో పెట్టాల్సిన నగదును కొంత మంది సిబ్బంది విడతల వారీగా కొట్టేశారు. రూ.52 లక్షలు కాజేసిన ఈ ముఠా.. మోసం బయటకు పొక్కకుండా ఏటీఎంను తగులబెట్టించి డబ్బు కాలిపోయిందని నాటకం ఆడించింది.

  • 19వ అంతస్తు నుంచి పడి

మహారాష్ట్ర ముంబయిలోని ఓ బహుళ అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం(Mumbai fire news) జరిగింది. లాల్‌బాగ్‌ ప్రాంతంలోని అవిగ్యాన్‌ పార్క్‌ సొసైటీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో 19వ అంతస్తులో మంటలు చెలరేగాయి. భారీ మంటలు ఎగిసిపడుతుండగా.. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. ఈ క్రమంలో ప్రాణాలు రక్షించుకునేందుకు ప్రయత్నిస్తూ ఓ వ్యక్తి భవనంపై నుంచి కిందపడిపడి.. మరణించాడు.

  • టీకా ఆఫర్​

భారత్​ టీకా పంపిణీలో 100 కోట్ల మార్కును (100 Crore Vaccine) చేరుకున్నందుకు గానూ మోహిత్​ అనే ఓ చిరుతిళ్ల వ్యాపారి స్థానికులకు బంపర్​ ఆఫర్​ ఇచ్చారు. పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్​ పూర్తయిన వారు తన షాప్​కు వస్తే గుజరాత్​లోని సంప్రదాయ వంటకమైన 'లోచో'ను ఉచితంగా ఇస్తానని ప్రకటించారు.

  • డ్రగ్స్ గురించి ఆర్యన్​తో జోక్ చేశా

హీరోయిన్ అనన్య పాండే.. డ్రగ్స్​ కేసులో పలు విషయాలు చెప్పింది. ఆర్యన్​ చాట్​లో భాగంగా డ్రగ్స్ గురించి జోక్ చేశానని తెలిపింది.

14:00 October 22

టాప్​న్యూస్​@ 2PM

  • భాజపా తీరుపై సీఈవోకు తెరాస ఫిర్యాదు

తెరాస నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిశారు. హుజూరాబాద్ ఉపఎన్నికల వేళ... నియోజకవర్గంలో భాజపా అక్రమాలకు పాల్పడుతోందని ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సీఈవోను కోరారు.

  • 'డెంగీ' విజృంభణ- 

డెంగీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్​లో మేకపాలకు డిమాండ్​ పెరిగింది. వ్యాపారులు లీటర్​ పాలు రూ.400కు విక్రయిస్తున్నారు. మేక పాలకు, డెంగీకి ఏంటి సంబంధం అనుకుంటున్నారా? ఈ స్టోరీ చదివేయండి.

  • సెల్​ ఫోన్​​ మింగేసిన ఘనుడు

సాధారణంగా చిన్నపిల్లలు తెలియకుండా.. చిన్న చిన్న వస్తువులను మింగుతుంటారు. కానీ ఇక్కడ అన్నీ తెలిసిన ఒక పెద్ద మనిషి.. ఏకంగా సెల్​ఫోన్​నే (Man swallows phone) మింగేశాడు. మొబైల్ ఫోన్​ను మింగడం ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఈ స్టోరీ చదివేయండి మరి.

  • ఐపీఎల్ కొత్త జట్లు ఆ నగరాల నుంచే..!

ఐపీఎల్​లో కొత్త జట్లు (ipl new teams) అహ్మదాబాద్​, లక్నో నగరాల నుంచి రానున్నట్లు సమాచారం. అహ్మదాబాద్​ నుంచి అదానీ గ్రూప్స్​.. మాంచెస్టర్ యూనైటెడ్​ ప్రీమియర్ లీగ్ లక్నో తరపున వేలంలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది.

  • 'మా' ఎన్నికల్లో వైకాపా జోక్యం: ప్రకాశ్​రాజ్

ఇటీవల జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్​ ఎన్నికలపై ప్రకాశ్​రాజ్ ట్వీట్ చేశారు. ఈ ఎలక్షన్​లో వైకాపా జోక్యం ఉందని అన్నారు. విష్ణు వెంట ఉన్న వైకాపా కార్యకర్త ఫొటోను విడుదల చేశారు.

13:09 October 22

టాప్​న్యూస్​@ 1PM

  • తెరాస అధ్యక్ష పోటీకి నామినేషన్లు ?

తెరాస అధ్యక్ష పదవికి మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల (TRS President Election 2021) గడువు ముగియనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్​ను ప్రతిపాదిస్తూ మరో 2 నామినేషన్లు (Nominations for TRS President Election 2021) దాఖలయ్యాయి. కేసీఆర్​ను అధ్యక్షుడిగా ప్రతిపాదిస్తూ ఇప్పటివరకు 18 నామినేషన్లు (Nominations for TRS President Election 2021) వచ్చాయి.

  • దళితబంధు నిలిపివేతపై మరో రెండు వ్యాజ్యాలు

హుజూరాబాద్‌లో దళితబంధు నిలిపివేతపై హైకోర్టులో(TS High Court news) మరో రెండు వ్యాజ్యాలు(pil in high court on dalit bandh suspension in huzurabad) దాఖలయ్యాయి. భాజపా నేత చంద్రశేఖర్, కాంగ్రెస్ నేత జడ్సన్‌ ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేశారు. మల్లేపల్లి లక్ష్మయ్య దాఖలు చేసిన పిల్‌ హైకోర్టులో ఇవాళ విచారణకు రాగా.. అన్ని పిటిషన్లను కలిపి సోమవారం విచారిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది.

  • కూలిన మూడంతస్తుల భవనం

శిథిలావస్థకు చేరిన మూడంతస్తుల భవనం కూలి.. ఐదుగురు మరణించిన ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు గాయపడగా.. శిథిలాల కింద మరికొందరు ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.

  • లాకర్‌ను ఉపయోగిస్తున్నారా?

బంగారం.. విలువైన పత్రాలు.. దాచుకోవడానికి నమ్మకమైన చోటు బ్యాంకు లాకర్‌(bank locker rules) అని చాలామంది విశ్వాసం. ఒకవేళ లాకర్‌లో పెట్టిన వస్తువులు మాయమైతే ఏమిటి పరిస్థితి? ఈ విషయం ఎప్పుడైనా ఆలోచించారా? లాకర్‌ను ఉపయోగించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? తెలుసుకుందామా..

  • అవే టీమ్ఇండియాకు ప్రమాణం కాదు

వార్మప్​ మ్యాచులు భారత జట్టు ఫామ్​ నిర్ధారించడానికి ప్రమాణం కాదని మాజీ క్రికెటర్ యువరాజ్​ సింగ్ అన్నాడు. అయినప్పటికీ టీమ్​ఇండియా (T20 world cup 2021) బలంగా ఉందని అభిప్రాయపడ్డాడు. రెండో టీ20 ప్రపంచకప్​ని తన ఖాతాలో వేసుకునే అవకాశాలున్నాయని అభిప్రాయం వ్యక్తం చేశాడు.

11:44 October 22

టాప్​న్యూస్​@ 12PM

  • ఘోర రోడ్డుప్రమాదం

హరియాణా ఝజ్జర్​లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఓ కారును వెనుకనుంచి మరో వాహనం ఢీకొనగా.. అది మరో ట్రక్కుపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 8 మంది మరణించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు. మరొకరికి గాయాలయ్యాయి. 

  • ఏటీఎంలో అగ్నిప్రమాదం

సంగారెడ్డి జిల్లా సదాశివపేట ఎస్‌బీఐ ఏటీఎంలో అగ్నిప్రమాదం(fire accident) చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగి... ఏటీఎం యంత్రంలోని నగదు దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

  • పారిశుద్ధ్య కార్మికురాలి నిజాయతీ

ఓ పారిశుద్ధ్య కార్మికురాలు చెత్త సేకరిస్తుండగా తనకు లభించిన 100 గ్రాముల బంగారాన్ని పోలీసులకు అప్పగించింది. మేరీ నిజాయతీని స్థానికులు ప్రశంసిస్తున్నారు.

  • కాల్పుల్లో 8 మంది మృతి

అమెరికాలో కాల్పులు కలకలం రేపాయి. తాజాగా వాషింగ్టన్​లోని టకోమాలో జరిగిన కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు మెక్సికోలోని ఓ రెస్టారెంట్​లో జరిగిన కాల్పుల్లో ఓ భారతీయ మహిళ ప్రాణాలు వదిలింది.

  • సినిమా షూటింగ్​లో ప్రమాదం

న్యూ మెక్సికోలో జరుగుతున్న ఓ సినిమా షూటింగ్​లో ప్రమాదం చోటు చేసుకుంది. అనుకోకుండా డమ్మీ గన్​ వల్ల ఓ మహిళా మృతి చెందింది.

10:48 October 22

టాప్​న్యూస్​@ 11AM

  • ‘100కోట్ల మైలురాయి’.. నవ భారత్‌కు ప్రతీక

‘‘టీకా పంపిణీలో 100 కోట్ల డోసులు అనేది కేవలం సంఖ్య కాదు. దేశ సంకల్ప బలం. దేశ చరిత్రలో సరికొత్త అధ్యాయం. నవ భారతానికి ప్రతీక’’ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కొనియాడారు. కరోనా మహమ్మారి కోరలు వంచే వ్యాక్సినేషన్‌లో భారత్‌ సరికొత్త చరిత్రను లిఖించిన సందర్భంగా ప్రధాని నేడు దేశ ప్రజలనుద్దేశించి కీలక ప్రసంగం చేశారు. 

  • హార్స్ రైడింగ్ క్లబ్‌లో సోదాలు

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్​నగర్​ హార్స్ రైడింగ్ క్లబ్​లో పోలీసులు సోదాలు నిర్వహించారు. బుధవారం రాత్రి జరిపిన ఈ సోదాల్లో 20 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. యువతీయువకులు గంజాయి సేవించినట్లు గుర్తించారు. ముందస్తు సమాచారంతో  సోదాలు జరిపినట్లు పోలీసులు తెలిపారు. 

  • ట్రాఫిక్ వాలంటీర్​గా సాఫ్ట్​వేర్ ఇంజినీర్

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా పనిచేస్తూ జీవితం హాయిగా సాగిపోతుందిగా.. చాలు అనుకోలేదు ఆయన. తన దినచర్యలో కొంత సమయం సమాజం కోసం కేటాయిస్తున్నారు. రోజులో ఏదో ఒక సమయంలో కొంత కుదుర్చుకుని ట్రాఫిక్‌నూ నియంత్రిస్తూ పలువురి ప్రశంసలందుకుంటున్నారు.

  • T20 WORLD CUP: బ్రెట్‌ లీ జోస్యం..

టీ20 ప్రపంచకప్‌ను (T20 world cup 2021) సొంతం చేసుకునే అవకాశం భారత్‌కే ఎక్కువగా ఉందని ఆసీస్‌ మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ బ్రెట్‌లీ విశ్లేషించాడు. ఈ టోర్నమెంట్​లో అత్యధిక పరుగులు చేసే బ్యాటర్​గా రాహుల్​.. షమి అధిక వికెట్లు తీసే బౌలర్​గా ఉంటాడని అభిప్రాయపడ్డాడు.

  • ఏపీ​, తెలంగాణలో పసిడి ధర ఎంతంటే?

బంగారం ధర (Gold Rate Today) శుక్రవారం స్థిరంగా ఉంది. మరోవైపు వెండి ధర (Silver price today) స్వల్పంగా తగ్గింది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో మేలిమి పుత్తడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి..

09:52 October 22

టాప్​న్యూస్​@ 10AM

  • తిరుమల శ్రీవారి టికెట్లు విడుదల

తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల(TTD TICKETS)ను తితిదే విడుదల చేసింది. సర్వదర్శనం టికెట్లను ఆన్‌లైన్ ద్వారా విడుదల చేశారు. వర్చువల్‌ క్యూ పద్ధతిలో దర్శన టికెట్లు విడుదల కాగా... వర్చువల్ క్యూ, వోటీపీల ద్వారా టిక్కెట్లను కేటాయిస్తారు. సర్వర్లపై ఒత్తిడి తగ్గించేందుకు వర్చువల్ క్యూ విధానంలో టికెట్లు అందిస్తారు. 

  • నిమిషాల్లో రూ.10 లక్షలు ఖాళీ

సైబర్ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పోలీసులు కేటుగాళ్ల ఆగడాలకు ఎన్ని అడ్డుకట్టలు వేసినా.. వారి మోసాలను ఆపలేకపోతున్నారు. ఈ సైబర్ నేరగాళ్లు ముఖ్యంగా ఎస్బీఐ ఖాతాదారులనే టార్గెట్ చేసుకుంటున్నారు. వారి ఖాతా కేవైసీ అప్​డేట్ చేయాలని.. లేకపోతే సేవలు నిలిచిపోతాయని, బ్యాంకు ఖాతా రద్దవుతుందని భయపెడుతూ మోసాలకు తెగిస్తున్నారు. లక్షల రూపాయలు దోచేస్తున్నారు. తాజాగా ఏకంగా విమాన పైలెట్​కే టోకరా వేసిన ఘటన హైదరాబాద్​లో చోటుచేసుకుంది.

  • మార్కెట్లలో జోరు

స్టాక్ ​మార్కెట్లు (Stock market news) శుక్రవారం సెషన్​ను లాభాల్లో ప్రారంభించాయి. సెన్సెక్స్​ మళ్లీ 61 వేల మార్క్​ ఎగువకు చేరింది. 200 పాయింట్ల లాభంతో 61 వేల 130 వద్ద కొనసాగుతోంది. 

  • ఈ వివాదాలు ఎప్పటికీ మర్చిపోలేరు!

టీ20 ప్రపంచకప్​లో(T20 world cup 2021 schedule)భాగంగా అక్టోబర్​ 24న భారత్​-పాకిస్థాన్​ మధ్య మ్యాచ్​ జరగనుంది(pak india match 2021). అయితే ఇరు జట్ల మధ్య పోరు అంటే ఆషామాషీ కాదు. ఆటగాళ్ల దూకుడు ప్రదర్శన, కొట్లాట, కవ్వింపులు ఉంటాయి. గతంలో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్​లే ఇందుకు నిదర్శనం. ఓ సారి ఆ వివాదస్పద సంఘటనలను గుర్తుచేసుకుందాం..

  • ఇంటర్నేషనల్​ ఫిల్మ్ ఫెస్టివల్

ఇద్దరు స్టార్ డైరెక్టర్లకు సత్యజిత్ రే జీవిత సౌఫల్య పురస్కారాలను అందజేయనున్నారు. ఇంటర్నేషనల్​ ఫిల్మ్ ఫెస్టివల్​ ఆఫ్ ఇండియాలో వీటిని ప్రదానం చేయనున్నారు. ఈ వేడుకలకు తొలిసారిగా ఓటీటీ నిర్వహకులను ఆహ్వానించారు.

08:44 October 22

టాప్​న్యూస్​@ 9AM

  • మీరు సరిదిద్దుకోలేని తప్పు చేశారు: చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌, డీజీపీ సవాంగ్ సరిదిద్దుకోలేని తప్పు చేశారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిన ఇద్దరికీ శిక్ష పడేవరకు వదిలిపెట్టనని హెచ్చరించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఏం చేయాలో చేసి చూపిస్తానని ప్రతినబూనారు. 'ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరాటం' పేరిట 36 గంటల దీక్ష చేపట్టిన చంద్రబాబు... మద్దతుగా వచ్చిన పార్టీ కార్యకర్తలు, అభిమానులకు దీక్షాస్థలి నుంచే అభివాదం చేశారు. రాత్రి పదిన్నర తర్వాత నిద్రకు ఉపక్రమించారు.

  • 'చైనాతో చర్చలు.. ప్రతిసారి ఫలితాలు రావు'

ఈ నెల 11న జరిగిన భారత్​- చైనా సరిహద్దు చర్చల(india china border news) నేపథ్యంలో ఆర్మీ చీఫ్​ జనరల్​ ఎమ్​ఎమ్​ నరవణె కీలక వ్యాఖ్యలు చేశారు(india china news). చైనాతో జరిగే చర్చల్లో ప్రతిసారీ ఫలితాలు రావాలి అని ఆశించకూడదన్నారు.

  • పండగ సమయంలో కొలువుల జాతర

ఇ-కామర్స్‌ రంగంలో భారీ ఎత్తున తాత్కాలిక నియామకాలు జరుగుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా వినియోగదారు సెంటిమెంటు, గిరాకీ పెరగడం ఇందుకు కారణం. ఈ నేపథ్యంలోనే అక్టోబరు-డిసెంబరులో తాత్కాలిక సిబ్బంది నియామకాల్లో 400 శాతం వృద్ధి కనిపిస్తోందని క్వెస్‌ కార్ప్‌ అనుబంధ సంస్థ టాస్క్‌మో తెలిపింది.

  • ప్రసారహక్కుల ద్వారా రూ.36 వేల కోట్లు!

ఐపీఎల్​ ఆదాయం మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. బ్రాడ్​కాస్టింగ్ హక్కుల విలువ డబుల్​ కానున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడొస్తున్న మొత్తం కంటే రెట్టింపు డబ్బులు బీసీసీఐ సొంతం కానున్నాయి. ఇంతకీ ఆ మొత్తం ఎంతంటే?

  • హాస్య నటుడు వైవా హర్ష వివాహం

'వైవా' సిరీస్‌తో నటుడిగా గుర్తింపు తెచ్చుకుని.. ప్రస్తుతం పలు సినిమాల్లో హాస్యనటుడిగా రాణిస్తున్నారు హర్ష. బుధవారం రాత్రి ఆయన ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టారు. హైదరాబాద్​కు చెందిన అక్షరతో ఆయన వివాహం ఘనంగా జరిగింది. నగరంలోని ఓ ప్రముఖ ఫంక్షన్‌ హాల్‌ ఈ వేడుకకు వేదికగా మారింది.

07:51 October 22

టాప్​న్యూస్​@ 8AM

  • ప్రేమను నిరాకరించిన యువతికి యువకుడి గిఫ్ట్

ప్రేమను నిరాకరించిన అమ్మాయిలను అదే పనిగా వెంటపడి వేధించే అబ్బాయిల గురించి మనకు తెలుసు. వేధింపులను దాటి.. వారిపై యాసిడ్ దాడులు, నరికి చంపడాలు చూశాం. కానీ తన ప్రేమను నిరాకరించిందని ఆ యువతిని కటకటాల వెనక్కి పంపేందుకు ప్రయత్నించాడు ఓ యువకుడు. ఆమెను జైలుకు పంపేందుకు అతడు పన్నిన కుట్రను చూసి పోలీసులే అవాక్కయ్యారు. ఇంతకీ అతడు ఏం చేశాడంటే..

  • ' రెండు సంతకాలు చేస్తే.. రూ.300 కోట్లు ఇస్తామన్నారు'

మేఘాలయ గవర్నర్​ సత్యపాల్​ మాలిక్ (Satyapal Malik News)​ సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్ముకశ్మీర్​ గవర్నర్​గా ఉన్న సమయంలో ఓ వ్యాపారవేత్త సహా ఆర్ఎ​స్ఎస్​తో అనుబంధం ఉన్న వ్యక్తులకు చెందిన దస్త్రాలపై సంతకాలు పెడితే రూ.300 కోట్లు వస్తాయని కార్యదర్శలు చెప్పారని తెలిపారు.

  • ఆగని పెట్రో బాదుడు

దేశంలో ఇంధన ధరలు (Fuel Price Today) మరోసారి పెరిగాయి. లీటర్​ పెట్రోల్​, డీజిల్​పై 35 పైసలు చొప్పున పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి.

  • చైనా 'బొమ్మ'ల్లో ప్రమాదకర రసాయనాలు

కొన్ని మేడ్​-ఇన్​-చైనా బొమ్మలపై(made in china toys) ప్రమాదకర రసాయనాలు కోటింగ్​ చేసినట్టు అమెరికా అధికారులు గుర్తించారు(us china news). అనంతరం వాటిని జప్తు చేశారు. కాగా.. ఈ తరహా బొమ్మలు భారత్​లోనూ ఎక్కువగా లభిస్తుండటం, పిల్లల కోసం తల్లిదండ్రులు వాటిని అధికంగా కొనుగోలు చేస్తుండటం గమనార్హం(india china news).

  • బాలకృష్ణ మెచ్చిన ట్రైలర్

నందిత శ్వేతా, మాన్యం కృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'జెట్టి'. సుబ్రమణ్యం పిచ్చుక దర్శకుడు. కె.వేణు మాధవ్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా త్వరలో తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే హీరో బాలకృష్ణ ట్రైలర్‌ విడుదల చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

06:38 October 22

టాప్​న్యూస్​@ 7AM

  • పోటాపోటీగా ఎన్నికల ప్రచారం

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక సమీపిస్తున్న వేళ నేతలు ప్రచారం జోరు పెంచారు. గ్రామాలు చుట్టేస్తూ ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. హామీలు గుప్పిస్తూ గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఒక్క ఓటు కూడా పక్కకు వెళ్లకుండా తమ పార్టీకే పడాలని నేతలు అన్ని విధాల కృషి చేస్తున్నారు.

  • ఆ దేశంలో మళ్లీ లాక్​డౌన్

రష్యాలో (Russia covid cases) కరోనా విలయతాండవం చేస్తోంది. కొత్త కేసులు, మరణాలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో 11 రోజుల పాటు కఠిన లాక్​డౌన్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

  • 'పరారీలోని నిందితునికి బెయిల్‌  వద్దు'

నేరం చేసి తప్పించుకున్న నేరస్తుడు ముందస్తు బెయిల్‌కి అర్హత లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు పట్నా హైకోర్టు ఇచ్చిన తీర్పును జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ ఏఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం పక్కన పెట్టింది.

  • సరిహద్దుల్లో నిత్యం.. మృత్యువుతో యుద్ధం!

భారత్-చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో సైన్యం అనునిత్యం అప్రమత్తంగా ఉంటూ పహారా కాస్తోంది. అయితే.. ఈ ప్రాంతంలో ​ ఆయుధం వాడకూడదన్న నిబంధనను ఆసరాగా చేసుకుని.. గల్వాన్​లో విరుచుకుపడింది చైనా. ఈ ఘటనతో భారత సైనిక వ్యూహం పూర్తిగా మారిపోయింది. 

  • దీపావళి నుంచి చిరు కొత్త సినిమా

ఇప్పటికే పలు చిత్రాలతో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi new movie).. దీపావళి నుంచి మరో సినిమాలో నటించేందుకు సిద్ధమవుతున్నారు. మాస్ మసాలా కథతో ఇది తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.

06:04 October 22

టాప్​న్యూస్​@ 6AM

  • రంగంలోకి సీఎం కేసీఆర్​..

హుజురాబాద్‌ ఉప ఎన్నిక ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రచారంలో భాగంగా రెండు రోజులపాటు ముఖ్యమంత్రి కేసీఆర్‌ రోడ్‌షోలు నిర్వహణకు కసరత్తు జరుగుతోంది. ఎన్నికల సంఘం నిబంధనల నేపథ్యంలో బహిరంగ సభకు ప్రత్యామ్నాయంపై నేతలు దృష్టి సారించారు. మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్ సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశమై షెడ్యూలు రూపకల్పన చేసి నేడు సీఎంకు పంపనున్నట్లు తెలుస్తోంది.

  • అనిశా వలలో మరో తిమింగలం..

ఏసీబీ అధికారుల వలకు మరో అవినీతి తిమింగలం చిక్కింది. జీపీఏ రద్దు, భూమి రిజిస్ట్రేషన్ విషయంలో లక్షల రూపాయలు డిమాండ్ చేసి లంచం స్వీకరిస్తుండగా.. ఏసీబీ అధికారులు దాడి చేసి రాజేంద్రనగర్ సబ్ రిజిస్ట్రార్ హర్షద్ అలీని పట్టుకున్నారు. ఈ వ్యవహరంలో అతడికి సహరించిన డాక్యుమెంట్ రైటర్ వాసును కూడా అదుపులోకి తీసుకున్నారు. సబ్​రిజిస్ట్రార్ పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నట్లు అనిశా అధికారులు గుర్తించారు. దాడుల సమయంలో అతడు ఏసీబీ అధికారులను ముప్పుతిప్పలు పెట్టాడు.

  • లిఫ్ట్​ ఇచ్చినందుకు ఏకంగా..

కూతురుని కళాశాలలో వదిలేశారు. కారులో ఒక్కడే ఊరికి తిరుగుప్రయాణమయ్యాడు. సాయంత్రమైంది. కొంత దూరం వెళ్లాక.. రోడ్డుపై ఇద్దరు వ్యక్తులు లిఫ్ట్​ అడిగారు. "అసలే సాయంత్రమైంది. వాళ్లకు ఎలాంటి పనుందో..? లిఫ్ట్​ ఇస్తే పోయేదేముంది.. కాసింత పుణ్యమొస్తుంది.." అనుకున్నాడు. ఇద్దరినీ ఎక్కించుకున్నాడు. వాళ్లను ఎక్కించుకున్నాక కానీ.. అర్థకాలేదు.. 'పుణ్యం మాట దేవుడెరుగు.. అయ్యో పాపం అనాల్సిన పరిస్థితి వచ్చింది' అని..!

  • టీకా మైలురాయి.. దేశ ప్రజల విజయం!

కొవిడ్​పై పోరులో భాగంగా ఈ ఏడాది జనవరి 16న ప్రారంభమైన వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కొద్ది రోజుల్లోనే 100కోట్ల డోసులు పూర్తి చేసుకోవడం నిజంగా దేశ ప్రజల విజయమే. టీకా తయారీ మొదలు.. క్షేత్రస్థాయిలో పంపిణీ వరకు ఎంతో మంది సహకారం లేకుంటే ఈ బృహత్తర కార్యక్రమం ఇంత విజయవంతం అయ్యేదికాదంటే అతిశయోక్తి కాదు. ప్రజలంతా నమ్మకమైన భాగస్వాములుగా జతకూడితే ఫలితాలు ఎంత అద్భుతంగా ఉంటాయో దేశీయ టీకా పంపిణీ కార్యక్రమం చాటిచెప్పింది..

  • కశ్మీర్​లో ఇంటర్నెట్ సేవల నిలిపివేత..

జమ్ముకశ్మీర్​లో ఇంటర్నెట్​ సేవలను నిలిపివేశారు అధికారులు. అంతేగాక వందల సంఖ్యలో ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారు. ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో భాగంగానే ఇలా చేస్తున్నట్లు స్పష్టం చేశారు పోలీసులు. అయితే ఈ నెల 25న జమ్ముకశ్మీర్​లో అమిత్​ షా పర్యటన నేపథ్యంలోనే అధికారులు చర్యలు చేపడుతున్నట్లు సమాచారం.

  • నేపాల్​లో వరద బీభత్సం ..

నేపాల్​లో కుండపోత వర్షాలు అతలాకుతలం సృష్టిస్తున్నాయి. వరదల ధాటికి 104 మంది మృతి చెందినట్లు ఆ దేశ హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

  • బ్యాంకు రుణాల మంజూరులో వృద్ధి..

దేశ ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటున్న క్రమంలో బ్యాంకుల రుణాలు, డిపాజిట్లలో గణనీయమైన వృద్ధి నమోదవుతున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. అక్టోబర్ 8తో ముగిసిన పక్షం రోజుల వ్యవధిలో బ్యాంకు రుణాలు 6.48శాతం, డిపాజిట్లు 10.16శాతం వృద్ధి సాధించినట్లు తెలిపింది.

  • విజయాన్ని నిర్ణయించేది నాయకత్వమే

భారత్, పాకిస్థాన్ టీ20 మ్యాచ్​(Ind vs Pak T20) త్వరలోనే జరగనున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హేడెన్(Matthew Hayden on India) కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్ విజయాన్ని నిర్ణయించేది కెప్టెన్ సారథ్యం వహించిన తీరే అని అన్నాడు.

  • పార్టీలే కారణమా..?

డ్రగ్స్ కేసులో షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్(aryan khan news)ను అరెస్ట్ చేసిన ఎన్సీబీ.. ఈ విషయంలో నటి అనన్యా పాండే(ananya pandey latest news)ను ప్రశ్నించింది. దీంతో వీరిద్దరి గురించి నెట్టింట తెగ చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వీరికి సంబంధించిన చాలా ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

  • రీతూను ఇంప్రెస్​ చేస్తోన్న నాగశౌర్య..

నాగశౌర్య, రీతూ వర్మ జంటగా నటిస్తోన్న చిత్రం 'వరుడు కావలెను'(varudu kaavalenu movie). తాజాగా ఈ సినిమా ట్రైలర్​ను విడుదల చేశారు నటుడు దగ్గుబాటి రానా.

Last Updated : Oct 22, 2021, 10:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.