ETV Bharat / city

ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు

etv bharat top news
etv bharat top news
author img

By

Published : Oct 20, 2021, 6:19 AM IST

Updated : Oct 20, 2021, 10:00 PM IST

21:53 October 20

టాప్​న్యూస్@10PM

కొనసాగుతున్న సిర్పూర్కర్‌ కమిషన్ విచారణ

దిశ హత్యాచార కేసులో(Disha rape and murder case) జస్టిస్ సిర్పుర్కర్‌ కమిషన్ (Justice Sirpurkar Commission) విచారణ చేపట్టింది. ఇదివరకే రాచకొండ సీపీ మహేశ్​ భగవత్, అప్పటి సైబరాబాద్ సీపీ సజ్జనార్​లను విచారించిన కమిషన్... తాజాగా శంషాబాద్ డీసీపీ ప్రకాశ్​రెడ్డిని విచారించింది.

పట్టాభి అరెస్టు..

ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిని పోలీసులు అరెస్టు చేశారు (TDP leader Pattabhi arrest). ఇవాళ మధ్యాహ్నం నుంచి పట్టాభి నివాసం వద్ద వేచి ఉన్న పోలీసులు రాత్రి 9గంటల సమయంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు

 వారికి రైతుబీమా, రైతుబంధు రద్దు

రాష్ట్రంలో గంజాయి సాగు, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని... మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్​...  పోలీస్, ఎక్సైజ్ శాఖల అధికారులను ఆదేశించారు (cm kcr review on drugs mafia in telangana). ప్రగతిభవన్​లో నిర్వహించిన పోలీస్, ఎక్సైజ్ శాఖ ఉన్నతస్థాయి సమావేశంలో అధికారులనుద్దేశించి సీఎం ప్రసంగించారు

మళ్లీ పెరిగిన కేసులు

కేరళలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. కొద్ది రోజులుగా 10వేల లోపే నమోదవుతున్న కొత్త కేసులు బుధవారం 11వేల మార్కును దాటాయి. కర్ణాటకలో మరో 462మంది వైరస్​ బారినపడ్డారు.

ఫేస్‌బుక్‌కు భారీ జరిమానా!

ఫేస్​బుక్​కు బ్రిటన్‌ కాంపీటీషన్‌ రెగ్యులేటర్‌ షాకిచ్చింది. అడిగిన వివరాలు సమర్పించే విషయంలో ఫేస్‌బుక్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని రూ.515 కోట్లు జరిమానాగా విధించింది.

20:47 October 20

టాప్​న్యూస్@9PM

  • వారికి రైతుబంధు రద్దు

  • చమురు సంస్థలతో మోదీ కీలక భేటీ

దిగ్గజ చమురు సంస్థల సీఈఓలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi news)భేటీ అయ్యారు. పెట్రోలియం నిక్షేపాల అన్వేషణ, ఉద్గారాల తగ్గింపు వంటి అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. ఈ సమావేశానికి (Modi meeting today) రిలయన్స్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. (Modi meeting with CEO)

  • వరుణుడి బీభత్సానికి  42మంది బలి

కేరళలో వర్షాల కారణంగా ఇప్పటి వరకు 42మంది మృతి చెందారు. మరో ఆరుగురు గల్లంతయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజల కోసం 304 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీరందరికీ ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందని సీఎం పినరయి విజయన్ వెల్లడించారు.

  • తాలిబన్ల దుశ్చర్య..  క్రీడాకారిణి తల నరికి..!

అఫ్గాన్​లో మహిళా అథ్లెట్లను లక్ష్యంగా చేసుకొని హత్యలకు (Taliban killing woman) పాల్పడుతున్నారు తాలిబన్లు. ఇటీవల అండర్‌-19 జాతీయ వాలీబాల్‌ క్రీడాకారిణిని దారుణంగా హత్య (Taliban killed athletes) చేశారు. ఆమె తల నరికి పాశవికంగా హతమార్చారు.

  • పంత్​కు ​ పాఠాలు!

టీ20 ప్రపంచకప్​లో(T20 World Cup 2021) భాగంగా ఆస్ట్రేలియాతో వార్మప్ మ్యాచ్​ ఆడింది భారత జట్టు. ఈ మ్యాచ్​ నేపథ్యంలో యువ వికెట్​ కీపర్,​ బ్యాట్స్​మన్​ రిషబ్​ పంత్​కు(Rishabh Pant news) కొన్ని సూచనలు చెబుతూ కనిపించాడు మెంటార్ ధోనీ(Dhoni Mentor). ఈ వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

19:53 October 20

టాప్​న్యూస్@8PM

చమురు సంస్థల సీఈఓలతో మోదీ 

 ' మరిచిపోలేని విధంగా నిర్వహిద్దాం'

తెరాస నిర్వహించతలపెట్టిన విజయగర్జనను విజయవంతం చేయాలని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (Ktr on Vijaya Garjana) శ్రేణులకు సూచించారు. ఈ మేరకు ఆయన ఇవాళ తెలంగాణ భవన్​లో వివిధ నియోజకవర్గాల నాయకులతో సమావేశమయ్యారు.

2022లో భారీగా పెరగనున్న  జీతాలు!

దేశంలోని ఉద్యోగులకు శుభవార్త! 2022లో అనేక సంస్థలు పెద్ద ఎత్తున వేతనాలు పెంచాలని (Salary hike news) యోచిస్తున్నట్లు ఓ సర్వేలో తేలింది. రాబోయే 12 నెలల్లో మెరుగైన వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉండటం వల్ల 2022లో ఆసియా-పసిఫిక్‌లోనే అత్యధికంగా వేతనాలు పెరుగుతాయని ఓ ప్రముఖ సంస్థ తన నివేదికలో పేర్కొంది. (Salary Budget planning report)

 గంజాయిపై స్పెషల్ డ్రైవ్

అటు పోలీసులు ఇటు ఎక్సైజ్ శాఖ ఎన్ని చర్యలు చేపట్టినా నిత్యం గంజాయి (Ganja in Hyderabad) పట్టుబడుతూనే ఉంది. గంజాయి సరఫరా చేసే మరో అంతర్ రాష్ట్ర నిందితుడి నుంచి పోలీసులు 40కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

వార్మప్​లో దూకుడు.. ఆసీస్​పై విజయం

ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్​లో టీమ్ఇండియా అదరగొట్టింది. ఆసీస్ విధించిన 153 పరుగుల లక్ష్యాన్ని 17.5 ఓవర్లలో ఛేదించి అసలు పోరుకు సిద్ధమైంది.

18:49 October 20

టాప్​న్యూస్@7PM

  • అలా తీసుకుంటనే యాంటీబాడీలు

తొలి డోసు తర్వాత గడువులోగా రెండో డోసు తీసుకోవాలని (should be take in two doses covid vaccine) ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు సూచించారు. సరైన వేళకు రెండో డోసు తీసుకుంటేనే యాంటీబాడీలు వస్తాయని స్పష్టం చేశారు.

  • అందుకే దళితబంధు

దళితబంధు ఇచ్చినా కేసీఆర్​కు ఓటేస్తారా.. అందుకు కారణమైన మీ హుజూరాబాద్​ బిడ్డకు ఓటేస్తారా ప్రజలే నిర్ణయించుకోవాలని భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. దళితబంధు పథకం మీ పట్ల ప్రేమతో కాదు.. నామీద ద్వేషంతోనే ఇచ్చారని విమర్శించారు. నియోజకవర్గంలోని కిష్టంపేట, రెడ్డిపల్లి గ్రామాల్లో ఉప ఎన్నిక ప్రచారం నిర్వహించారు.

  • దొంగతనం కోసం వచ్చి..!

దొంగతనం కోసం వచ్చి ఇంట్లో ఉన్న ఇద్దరు మహిళలపై అత్యాచారం చేశారు కొందరు దుండగులు. కత్తులు, గొడ్డళ్లతో ఇంట్లోని పురుషులపై దాడి చేసి బయటకు పంపించారు. అనంతరం ఈ దుర్మార్గానికి పాల్పడ్డారు. మరోవైపు, కేరళలో ఓ బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది. ప్రేమ పేరుతో మైనర్​ను లొంగదీసుకున్న నిందితుడు.. మరో నలుగురితో కలిసి అత్యాచారం చేశాడు.

  • ఓ ఇంటివాడైన 'జబర్దస్త్' ఫేమ్ 

'జబర్దస్త్‌' ఫేం ముక్కు అవినాష్‌ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అవినాష్‌ అభిమానులు, సినీ పరిశ్రమకి చెందిన పలువురు ప్రముఖులు నూతన దంపతులకి శుభాకాంక్షలు తెలిపారు.

  • పిల్లలు తప్పు చేస్తే మీకే  శిక్ష..!

పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులకు శిక్ష పడేలా కొత్త చట్టాన్ని(china news law) తీసుకురానుంది చైనా. ఇందుకు సంబంధించిన ముసాయిదాను సిద్ధం చేసింది. చిన్నారుల ప్రవర్తన చెడుగా ఉన్నా, నేరాలకు పాల్పడినా.. తల్లిదండ్రులకు భారీ జరిమానాతో పాటు ఐదు రోజుల జైలు శిక్ష విధించనుంది(china latest news).

17:51 October 20

టాప్​న్యూస్@6PM

  • గంజాయి వినియోగంపై యుద్ధం 

రాష్ట్రంలో గంజాయి సాగు, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని... మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్​...  పోలీస్, ఎక్సైజ్ శాఖల అధికారులను ఆదేశించారు (cm kcr review on drugs mafia in telangana).  

  • ' అలా అయితే 30 సార్లు దాడి చేయాలి'

భాజపా ఎంపీ అర్వింద్​పై ఎమ్మెల్యే జీవన్​ రెడ్డి (MLA Jeevan Reddy) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దమ్ముంటే తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు. కేటీఆర్​పై మరోసారి డ్రగ్స్ ఆరోపణలు చేస్తే కేసులు వేస్తామని హెచ్చరించారు. ఏపీలో జరిగిన దాడులపై స్పందించారు.

  • 'సీబీఎస్​ఈ' గుడ్​ న్యూస్

సీబీఎస్​ఈ విద్యార్థులకు.. ఆ బోర్డు (CBSE Exam news) తీపి కబురు చెప్పింది. చాలా మంది విద్యార్థులు.. అడ్మిషన్ తీసుకున్న పాఠశాలలకు దూరంగా ఉంటున్న నేపథ్యంలో.. పరీక్ష కేంద్రాన్ని మార్చుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు ప్రకటించింది.

  • సరిహద్దుల్లో మారని డ్రాగన్​ తీరు.. !

పొరుగుదేశం చైనా మళ్లీ పాత పంథానే అనుసరిస్తోంది. భారత సరిహద్దులకు భారీ ఎత్తున ఆయుధాలను తరలిస్తోంది. వాస్తవాధీన రేఖ వద్ద 100 రాకెట్​ లాంఛర్లను మోహరించింది. అయితే శీతాకాలంలో డ్రాగన్​ను ఎదుర్కొనేందుకు.. టెక్నాలజీని నమ్ముకుంది భారత్​. సరిహద్దుల వెంట భారీగా రాడార్లు, సెన్సర్లు, కెమెరాలు, మోషన్​ డిటెక్టర్లను ఏర్పాటు చేసింది.

  • టీమ్ఇండియా లక్ష్యం 153

భారత్​తో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్​లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 152 పరుగులు చేసింది. స్మిత్ అర్ధసెంచరీతో రాణించాడు.

16:53 October 20

టాప్​న్యూస్@5PM

  •  గురుకులాలకు  పచ్చజెండా

గురుకులాలు తెరిచేందుకు హైకోర్టు (Hich court on gurukulas) పచ్చజెండా ఊపింది. గురుకులాలు తెరవొద్దన్న గత ఆదేశాలను హైకోర్టు సవరించింది. ఇంటర్ పరీక్షల దృష్ట్యా ప్రారంభానికి ప్రభుత్వం అనుమతి కోరింది. విద్యా సంస్థల్లో కొవిడ్ జాగ్రత్తలు తీసుకున్నామని ఏజీ ప్రసాద్ తెలిపారు. గురుకులాల్లో ప్రత్యక్ష, ఆన్‌లైన్ బోధన చేపట్టాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

  • గంజాయిపై ఉక్కుపాదం మోపాలి

గంజాయి సాగు, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ​పోలీసులు, ఆబ్కారీ అధికారులతో సీఎం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.  

  • 'ముస్లిం వివాహం ఓ కాంట్రాక్టు..!'

హిందూ మతంలో జరిగినట్లుగా.. ముస్లిం వివాహం ధార్మికమైనది కాదని కర్ణాటక హైకోర్టు Karnataka High Court) పేర్కొంది. ముస్లిం వివాహం కాంట్రాక్టుతోనే మొదలవుతుందని, అది రద్దైనప్పటికీ.. మాజీ జీవిత భాగస్వామి పట్ల బాధ్యతలు విస్మరణకు గురికావని వ్యాఖ్యానించింది.

  •  సమంత పరువునష్టం దావా...

హైదరాబాద్​ కూకట్​పల్లి కోర్టు(Kukarpally Court)లో హీరోయిన్ సమంత పరువునష్టం కేసు (Samantha Defamation Suit) నమోదు చేశారు. సీఎల్ వెంకట్రావు (CL Venkatrao), సుమన్ టీవీ (Suman Tv), తెలుగు పాపులర్ (Telugu Populor Tv) టీవీపై ఆమె పరువునష్టం (Samantha Defamation Suit) దావా వేశారు. 

  • సంక్షోభంలో చైనా రియల్​ కంపెనీలు

చైనాలోని రియల్​ ఎస్టేట్​ రంగంలో సంక్షోభం(Chinese real estate crisis) ముదురుతోంది. ఇప్పటికే కొన్ని కంపెనీలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోగా.. ఇంకొన్ని సంస్థలు దివాలా దిశగా పయనిస్తున్నాయి. నెల రోజుల వ్యవధిలో చైనా రియల్‌ ఎస్టేట్ కంపెనీలు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోవడం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేస్తోంది.

15:55 October 20

టాప్​న్యూస్@4PM

  •  నేను లేఖ రాసినట్లు నిరూపిస్తారా?

దళితబంధు పథకం అమలును ఎన్నికల సంఘం నిలిపివేసిన వేళ... భాజపా, తెరాస పరస్పరం విమర్శలు( Huzurabad by election 2021) చేసుకుంటున్నాయి. ఎన్నికల ముందు పథకాలు ప్రకటించి ఈసీ పేరు చెప్పి ఆపుతారని భాజపా ఆరోపిస్తోంది. ఎన్నికల సంఘానికి పలువురు ఫిర్యాదు చేయడం వల్లే దళిత బంధు పథకం తాత్కాలికంగా నిలిచిందని తెరాస స్పష్టం చేస్తోంది

  • 'దమ్ముంటే నాతో పాదయాత్రకు రండి'

రాష్ట్రంలో సమస్యలు నేను నిరూపిస్తా.. లేవని మీరు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానంటూ వైఎస్​ఆర్​టీపీ అధ్యక్షురాలు వైఎస్​ షర్మిల (YS SHARMILA) ఛాలెంజ్​ చేశారు. దమ్ముంటే తాను తలపెట్టిన పాదయాత్రకు (praja prasthanam yatra)రావాలని సవాలు చేశారు. వైఎస్​ షర్మిల చేపట్టిన పాదయాత్ర చేవెళ్ల నుంచి ప్రారంభమైంది.

  • ప్రియాంకను అడ్డుకున్న పోలీసులు

ప్రియాంకా గాంధీ వాద్రా కాన్వాయ్​ను పోలీసులు అడ్డుకున్నారు. పోలీస్​ కస్టడీలో మరణించిన పారిశుద్ధ్య కార్మికుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న ఆమెకు అనుమతి నిరాకరించారు.

  • నడిరోడ్డుపై యువతి హత్య

దేశ రాజధానిలో ఘోరం జరిగింది. తన మాజీ ప్రేయసిని నడిరోడ్డుపై కత్తితో పొడిచి చంపాడు ఓ దుండగుడు. గంటల వ్యవధిలోనే నిందితులు పట్టుబడ్డారు.

  •  ఆర్యన్​ ఖాన్​కు బెయిల్ నిరాకరణ

డ్రగ్స్ కేసులో అరెస్టయిన బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్​ పెట్టుకున్న బెయిల్(Aryan Khan Bail) దరఖాస్తును తిరస్కరించింది ముంబయి ప్రత్యేక న్యాయస్థానం. ఆర్యన్​తో పాటు అర్బాజ్, మూన్​మూన్ ధమేచాల బెయిల్ పిటిషన్​ను కొట్టివేసింది.

14:45 October 20

టాప్​న్యూస్@3PM

రెండుపడక గదుల ఇళ్ల కేటాయింపుపై హైకోర్టులో విచారణ జరిగింది.  పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించట్లేదన్న భాజపానేత ఇంద్రసేనారెడ్డి దాఖలు చేసిన ఉన్నత న్యాయస్థానం ఇవాళ విచారణ చేపట్టింది. 

  •  'తెలంగాణలో ప్రాజెక్టులు వైఎస్​ఆర్​​ చలవే'

ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్​ రెడ్డి పాదయాత్ర ప్రభంజనం సృష్టించిందని వైఎస్​ విజయమ్మ అన్నారు. తెలంగాణలో ప్రస్తుతం కనబడుతున్న ప్రాజెక్టులన్నీ ఆయన వైఎస్​ఆర్ దూరదృష్టితో ఆలోచించినవేనని పేర్కొన్నారు. చేవెళ్లలో 'ప్రజా ప్రస్థానం' పాద యాత్ర సందర్భంగా.. సభలో ప్రసంగించిన విజయమ్మ.. చేవెళ్ల నుంచే ప్రతి సంక్షేమ పురుడు పోసుకుందని చెప్పారు.

  • పడవ బోల్తా- 10మంది గల్లంతు

ఉత్తర్​ప్రదేశ్​ లఖింపుర్​ ఖేరిలో మరో విషాదం చోటుచేసుకుంది. ఘాఘ్రా నదిలో పడవ బోల్తాపడింది. పడవలో ఉన్న 10 మంది నదిలో కొట్టుకుపోయారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​.

  • ప్రభాస్ సీక్రెట్ చెప్పిన హీరోయిన్ 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(prabhas birthday) చాలా ఎక్కువగానే మాట్లాడుతాడని హీరోయిన్ కృతిసనన్ చెప్పింది. కానీ కొత్తవాళ్లను కలిసినప్పుడు మాత్రం మాట్లాడేందుకు కాస్త సంకోచిస్తారని తెలిపింది.

  • వారితో ఆషామాషీ కాదు

పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టు (pak vs india match) పేరు వినగానే ముందుగా అనిశ్చితితో కూడిన ఆట గుర్తుకు వస్తుందనడంలో సందేహం లేదు. దీంతో కొన్నేళ్లుగా యూఏఈలోనే వివిధ జట్లతో పాక్‌ సిరీస్‌లు ఆడినప్పటికీ.. ఇప్పుడు అక్కడే జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో (T20 world cup 2021) ఆ జట్టును ఫేవరేట్‌ అని చెప్పలేని పరిస్థితి. 

13:00 October 20

టాప్​న్యూస్@1PM

  • సీఎం ఉన్నతస్థాయి సమావేశం

పోలీసులు, ఆబ్కారీ అధికారులతో సీఎం ఉన్నతస్థాయి సమావేశమయ్యారు. డ్రగ్స్‌ రవాణా అరికట్టే వ్యూహంపై అధికారులతో సీఎం కేసీఆర్  భేటీ అయ్యారు. డ్రగ్స్‌ విక్రయాలు అరికట్టే చర్యలపై అధికారులతో సీఎం   చర్చిస్తున్నారు. భేటీలో మంత్రులు మహమూద్‌ అలీ, శ్రీనివాస్‌ గౌడ్  పాల్గొన్నారు. 

  • యూపీ సర్కారుపై సుప్రీం అసహనం!

లఖింపుర్ ఖేరి (Lakhimpur Kheri case) ఘటనలో సాక్షులందరి వాంగ్మూలాన్ని రికార్డు చేయాలని ఉత్తర్​ప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. 44 మంది సాక్షుల్లో నలుగురి వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు యూపీ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.

  • సెప్టిక్‌ట్యాంక్‌లో జారిపడి చిన్నారి మృతి

హైదరాబాద్‌ చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సెప్టిక్‌ ట్యాంక్‌లో పడి ఏడేళ్ల బాలుడు అరవింద్ మృతి చెందాడు. పాపిరెడ్డి కాలనీలో గాలి పటం ఎగురవేస్తూ పక్కనే ఉన్న సెప్టిక్ ట్యాంక్‌లో పడి  మరణించాడు. నిన్నటి నుంచి బాలుడు కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా గాలింపు చేపట్టారు.  

  • ఇంజక్షన్​ వేసుకుని ఐపీఎల్ ప్లేఆఫ్స్​లో

ఐపీఎల్ ప్లేఆఫ్స్​ సమయంలో దినేశ్ కార్తిక్(dinesh karthik news) ఇంజక్షన్ వేసుకుని మ్యాచ్​ ఆడాడని తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ ఎస్ రామస్వామి చెప్పారు. మోకాలి గాయంతో సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీకి ఆడలేడని అనుకున్నామని అన్నాడు.

  • ఐఎంఎఫ్​కు గీత​ గుడ్​బై

అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్​)(IMF news) ముఖ్య ఆర్థికవేత్త​ గీతా గోపీనాథ్​.. తన విధుల నుంచి తప్పుకోనున్నారు. గతంలో పని చేసిన హార్వర్డ్​ యూనివర్సిటీకే ఆమె తిరిగి వెళ్లనున్నట్లు అధికారులు తెలిపారు.

11:48 October 20

టాప్​న్యూస్@12PM

  • కేరళకు మరో ముప్పు

కేరళను భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 39 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి కె. రాజన్​ తెలిపారు. మరోవైపు నేడు, రేపు ఆయా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం (Kerala Rain updates) ఉన్నట్లు భారత వాతావరణ శాఖ పేర్కొంది.

  • నయా మోసం.. వేలల్లో బాధితులు

రూ.10వేలు కడితే.. రోజుకు రూ.వేయి చొప్పున.. 150 రోజులకు రూ.1.5 లక్షలు తిరిగి చెల్లిస్తాం. అంటే.. 1.4 లక్షలు లాభమన్న మాట అంటూ ఐటీ కారిడార్‌(it corridor hyderabad) పరిధిలోని విద్యార్థులను నిండా ముంచేశారు. బాధితులు పదుల సంఖ్యలో ఉంటారని భావిస్తే.. వేలల్లో ఉండటంతో సైబరాబాద్‌ పోలీసులు కంగుతిన్నారు. 

  • ఆర్మీ బస్సు​ సమీపంలో భారీ పేలుడు

సిరియాలో భారీ పేలుడు (Syria Bomb Blast) సంభవించింది. రాజధాని దమాస్కస్​లో జరిగిన ఈ ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోగా మరికొంత మంది తీవ్రంగా గాయపడినట్లు (Syria Bomb Blast) స్థానిక మీడియా వెల్లడించింది.

  • కోహ్లీ వర్సెస్​ బాబర్​

టీ20 ప్రపంచకప్​లో(T20 worldcup schedule) భారత్​-పాకిస్థాన్​ మ్యాచ్​కు సమయం సమీపిస్తున్నది.​ చాలా కాలం తర్వాత ఇరు జట్ల మధ్య మ్యాచ్​ జరగనుండటం వల్ల అభిమానుల్లోనూ ఆసక్తిగా నెలకొంది. ఈ సందర్భంగా టీ20ల్లో కెప్టెన్స్ కోహ్లీ, బాబర్​ అజామ్​ రికార్డులు ఏంటో ఓసారి చూద్దాం.

  • 'రాధేశ్యామ్' టీజర్ వచ్చేస్తుందోచ్.

డార్లింగ్ ప్రభాస్ 'రాధేశ్యామ్' టీజర్​పై(radhe shyam teaser) క్లారిటీ వచ్చేసింది. అక్టోబరు 23న ప్రభాస్ పుట్టినరోజు(prabhas birthday) కానుకగా ఉదయం 11:16 గంటలకు టీజర్ రిలీజ్​ చేయనున్నట్లు వెల్లడించారు. ఇంగ్లీష్​లో ఉండే ఈ టీజర్​తో పాటు అన్ని భాషల సబ్​టైటిల్స్​ రానున్నాయి. 'హూ ఈజ్ విక్రమాదిత్య' అనే క్యాప్షన్​తో నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్(uv creations movies) ఈ విషయాన్ని ట్వీట్ చేసింది.

10:56 October 20

టాప్​న్యూస్@11AM

  • 'వారు ఎంతటి బలవంతులైనా విడిచిపెట్టేది లేదు'

గత ప్రభుత్వాల తప్పుడు చర్యల ఫలితంగానే.. దేశంలో అవినీతి పెరిగిపోయిందని అన్నారు మోదీ(Modi news). ఇప్పుడు తమ ప్రభుత్వం గొప్ప సంకల్పంతో.. అవినీతిపై పోరాటం చేస్తోందన్నారు. ప్రజలను, దేశాన్ని మోసం చేసేవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు (PM Modi news).

  • 'ఎక్సైజ్​' ఎస్సైలకు దర్యాప్తు అధికారమే లేదు

మాదకద్రవ్యాల నియంత్రణపై ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR review on drugs control news) సమీక్షించనుండటంతో క్షేత్రస్థాయిలో కార్యాచరణపై సందేహాలు నెలకొన్నాయి. నేరుగా ఎంపికైన 280 మంది ఎక్సైజ్‌(Excise Department Telangana) ఎస్సైలకు ఏడాదిన్నర దాటినా రెగ్యులర్‌ పోస్టింగులు లేకపోవడం ఇందుకు ప్రతిబంధకంగా మారిందనే చర్చ నడుస్తోంది.

  • 'బయోబబుల్​లో ఉండడం చాలా కష్టం.. కానీ'

బయోబబుల్​లో ఉండటం చాలా కష్టమని టీమ్​ఇండియా (T20 world cup 2021) ఓపెనర్ కేఎల్​ రాహుల్ అన్నాడు. గతేడాది యూఏఈలో జరిగిన ఐపీఎల్ నుంచి దాదాపు 13 నెలలుగా బయోబబుల్​లో​ ఉన్న నేపథ్యంలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

  • పెరిగిన బంగారం, వెండి ధరలు

బంగారం ధరలో (Gold Rate Today) బుధవారం స్వల్పంగా పెరుగుదల నమోదైంది. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.50 పెరిగింది. పసిడి బాటలోనే పయనించిన వెండి కిలోకు రూ.800కుపైగా ఎగబాకింది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పసిడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • నా సినిమాలు నేను చూడను: సేతుపతి

విభిన్న పాత్రల్లో నటిస్తూ, మక్కల్ సెల్వన్​ అని ఫ్యాన్స్ పిలిచే విజయ్ సేతుపతి(vijay sethupathi new movie).. తన సినిమాలు తాను చూసేందుకు భయపడతారు! ఇంతకీ ఏం జరిగింది? ఈ విషయం గురించి విజయ్ ఏం చెప్పారు.

09:43 October 20

టాప్​న్యూస్@10AM

  • ఏపీలో తెదేపా నేతల గృహనిర్బంధాలు

తెలుగుదేశం కార్యాలయం, నాయకులపై దాడులకు నిరసనగా తెలుగుదేశం రాష్ట్ర బంద్‌ చేపట్టింది. పిలుపునిచ్చిన నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా ఎక్కడికక్కడ తెలుగుదేశం నేతలను పోలీసులు గృహనిర్బంధం చేస్తున్నారు. పలు చోట్ల ఇళ్ల నుంచి బయటకు వచ్చిన నేతలను అరెస్ట్‌ (Tdp Leaders Arrest News) చేస్తున్నారు.

  • గాంధీ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం

సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో స్వల్ప అగ్నిప్రమాదం(Fire Accident at Gandhi Hospital) చోటు చేసుకుంది. షార్ట్‌ సర్క్యూట్‌తో విద్యుత్ ప్యానెల్ బోర్డులో మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది... మంటలు ఆర్పివేశారు. ఈ ఘటనలో జరిగిన నష్టం గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

  • దేశంలో మరో 14,862 మందికి కరోనా

దేశంలో కరోనా(Coronavirus update) కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 14,862 మంది​కి కరోనా (Coronavirus update) సోకగా.. మహమ్మారి ధాటికి(Covid cases in India) మరో 197 మంది ప్రాణాలు కోల్పోయారు. 19,446 మంది రికవరీ అయ్యారు.

  • మళ్లీ పెరిగిన చమురు ధరలు

చమురు ధరల పెంపు కొనసాగుతూనే ఉంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు((Petrol price hike)) మరోసారి పెరిగాయి. తాజాగా బుధవారం లీటర్‌ పెట్రోల్​పై 37 పైసలు‌, డీజిల్‌పై 38 పైసలు చొప్పున పెరిగాయి. ఈ మేరకు చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.106.19కు చేరగా.. డీజిల్​ ధర రూ.94.93కు పెరిగింది.

  • బ్యాట్​తో బౌండరీలు.. ట్విట్టర్​లో పంచులు..!

టీమ్​ఇండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్.. బ్యాటింగ్​ చేసినంత సులభంగా ట్వీట్స్​ చేస్తూ, అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాడు. బుధవారం అతడి పుట్టినరోజు సందర్భంగా (sehwag birthday) వీరూ పంచింగ్ ట్వీట్స్​తో పాటు అతడి నెలకొల్పిన రికార్డుల గురించి ప్రత్యేక కథనం.

08:58 October 20

టాప్​న్యూస్@ 9AM

  •  మహారాజుకూ తప్పని వివక్ష

ఆంగ్లేయుల కాలంలో భారతీయులు (Azadi Ka Amrit Mahotsav) చవిచూసిన వివక్ష అంతా ఇంతా కాదు. వారికి గులాం అన్న మహారాజులకు కూడా ఈ వివక్ష తప్పలేదు. ఆఖరికి బ్రిటీష్​ గవర్నరే ఆశ్చర్యపోయేలా వివక్షను ప్రదర్శించారు నాటి ఆంగ్లేయులు.

  • కొండచరియలు విరిగిపడి.. 21మంది మృతి

ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో నేపాల్​ చిగురుటాకులా వణికిపోతోంది. వానలు కారణంగా కొండ చరియలు విరిగిపడి 21 మంది చనిపోయారు. మరో 24 మంది ఆచూకీ గల్లంతైనట్లు స్థానిక అధికారులు తెలిపారు.

  • అవసరమైతే జట్టు నుంచి తప్పుకొంటా

జట్టుకు లాభిస్తుందని అనుకుంటే.. టీ20 ప్రపంచకప్ (T20 world cup 2021) నుంచి తప్పుకొంటానని ఇంగ్లాండ్ కెప్టెన్ మోర్గాన్ అన్నాడు. టీమ్​ఇండియాతో వార్మప్ మ్యాచ్​లో ఆడని నేపథ్యంలో, అతడిని ప్రశ్నించగా.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

  • 'శ్రీదేవి డ్రామా కంపెనీ' ప్రోమో

ఈటీవీలో(etv shows list) ప్రతి ఆదివారం మధ్యాహ్నం ప్రసారమయ్యే 'శ్రీదేవి డ్రామా కంపెనీ'(sridevi drama company latest promo) షోలో హాస్యమే కాకుండా అంతకు మించిన కంటెంట్​తో ఆకట్టుకుంటున్నారు. ఇంతకీ వచ్చే వారం షో ఎలా ఉండనుందో తెలియాలంటే ఈ ప్రోమో చూసేయండి.

07:41 October 20

టాప్​న్యూస్@ 8AM

  • అట్టుడికిన ఆంధ్రరాష్ట్రం

ఏపీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికార, ప్రతిపక్షాలు మాటల యుద్ధాల నుంచి ఏకంగా.. ప్రత్యక్ష దాడులకు దిగారు. తెదేపా నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. వారి కార్యాలయాలపై వైకాపా కార్యకర్తలు దాడులు చేశారు. విధ్వంసం సృష్టించారు. మంగళవారం సాయంత్రం దాదాపు ఒకే సమయంలో చాలా చోట్ల ఈ దాడులు జరిగాయి.

  • ఆర్టీసీకి దసరా కాసుల పంట

కరోనా సంక్షోభంతో నష్టాల ఊబిలో ఇరుక్కున్న టీఎస్​ఆర్టీసీ(TSRTC PROFITS DURING DUSSEHRA)పై దసరా పండుగ లాభాల వర్షం కురిపించింది. ఈసారి పండుగ నేపథ్యంలో ప్రత్యేకంగా ఛార్జీలు పెంచకపోయినా ఆర్టీసీ లాభాలను రుచిచూసింది. ప్రత్యేక బస్సుల(TSRTC PROFITS DURING DUSSEHRA) ద్వారా అదనపు ఆదాయంతో పాటు, ఒక్కరోజులోనే రికార్టు స్థాయిలో రూ. 14.79 కోట్ల ఆదాయాన్ని రాబట్టింది.

  • తగ్గుతున్న ఇంధన లభ్యత

ప్రపంచ దేశాల్లో ఇంధన కొరత (Fuel Crisis in the World) పెరుగుతోంది. ఐరోపాలోని గ్యాస్‌ ఆధారిత కర్మాగారాలు తమ ఉత్పత్తిని తగ్గించుకుంటున్నాయి. చైనాలో బొగ్గు, గ్యాస్‌ ధరలు పెరగడం వల్ల విద్యుదుత్పత్తిపై ఆ ప్రభావం పడింది. అనేక దేశాల్లో ఈ శీతాకాలంలో విద్యుత్‌ బిల్లుల భారం పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

  • ఆస్ట్రేలియాతో వార్మప్​ మ్యాచ్

టీ20 ప్రపంచకప్​లో మరో వార్మప్​ మ్యాచ్​కు (T20 world cup 2021) టీమ్​ఇండియా సిద్ధమైంది. ఆస్ట్రేలియాతో బుధవారం ఢీకొంటుంది. వార్మప్​ మ్యాచ్​ల్లోనే తన బ్యాటింగ్​ ఆర్డర్​ను ఖరారు చేసుకోనుంది టీమ్ఇం​డియా. రాహుల్‌, రోహిత్‌, మూడో స్థానంలో కెప్టెన్‌తో టాప్‌-3 స్థానాలు ఇప్పటికే ఖాయమయ్యాయి.

  • పాటతో చరణ్ సినిమా షూటింగ్​

రామ్‌చరణ్‌-శంకర్‌(ram charan shankar movie) కలయికలో రూపొందుతున్న సినిమా ప్రారంభం కానుంది. ఈ నెల 22న పుణెలో షూటింగ్ మొదలు పెట్టనున్నారు. ఇప్పటికే కొబ్బరికాయ కొట్టిన ఈ చిత్రం.. తొలి షెడ్యూల్‌ 20 రోజులపాటు సాగనున్నట్టు తెలిసింది. పాటతో చిత్రీకరణ మొదలవనుంది. ఆ విషయాన్ని హీరోయిన్ కియారా అడ్వాణీ(kiara advani movies) స్వయంగా వెల్లడించారు.

07:17 October 20

టాప్​న్యూస్@ 7AM

  • యాదాద్రికి భారీగా బంగారం విరాళం

యాదాద్రి ఆలయ (Yadadri Temple )విమాన గోపురం స్వర్ణ తాపడం కోసం భారీగా బంగారం విరాళాలు (Gold donation to Yadadri) వెల్లువెత్తుతున్నాయి. తొలి రోజే 22 కిలోల బంగారం (22kg gold donate) విరాళంగా సమకూరింది. ముఖ్యమంత్రి (cm KCR ) తొలి విరాళం కిలో 16 తులాల బంగారం ప్రకటించిన కొన్ని గంటల్లోనే తామూ బంగారం ఇచ్చేందుకు పలువురు దాతలు ముందుకొచ్చారు. వారు ఎవరెవరంటే...?

  • పోషకాలతోనే సమతుల ఆరోగ్యం

పోషకాహార పరంగా భారత్‌ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదని పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలైన ప్రజల ఆకలిని తీర్చడం, ఆరోగ్యకరమైన జీవనాన్ని, సంక్షేమాన్ని ప్రోత్సహించాలంటే మంచి దేశంలోని పిల్లలు, కౌమార బాలికలు, గర్భిణులు, బాలింతలకు తగినంత పోషకాహారాన్ని అందించాల్సి ఉంటుంది. అప్పుడే 2030 నాటికి బలమైన, ఆరోగ్య భారత లక్ష్యాన్ని చేరుకోగలమని నిపుణులు చెబుతున్నారు.

  • జలాంతర్గామిని అడ్డుకున్నాం: పాక్‌

భారత్​కు చెందిన ఓ జలాంతర్గామిని అడ్డుకున్నట్లు పాకిస్థాన్​ (Indian Submarine Pakistan) తెలిపింది. తమ దేశ సముద్ర జలాల్లోకి ప్రవేశించబోవడమే ఇందుకు కారణం అని పేర్కొంది.

  • పన్ను ఎగవేతలో కంపెనీల పోటాపోటీ..

బడా సంస్థలు బహు తక్కువ పన్ను రేట్లు విధించే దేశాలకు తమ కార్యకలాపాలను తరలించకుండా నివారించేందుకు ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ)', జీ20 దేశాలు నిశ్చయించాయి. ఈ చరిత్రాత్మక ఒప్పందంపై సంతకాలు చేసిన 136 దేశాల్లో భారత్‌ కూడా ఒకటి. దీని వల్ల దాదాపు 100 అతిపెద్ద బహుళజాతి కంపెనీల లాభాలపై పన్ను ఆదాయాన్ని అవి వ్యాపారం చేసే దేశాలన్నీ పంచుకోవడానికి వీలు కలుగుతుంది.

  • సినిమాలు రెడీ.. కానీ రిలీజ్ ఎప్పుడు?

తెలుగు చిత్ర సీమలో(telugu cinema news) సినిమాలు ప్రేక్షకుల ముందుకు క్యూ కట్టేందుకు రెడీ అయిపోతున్నాయి. కానీ కొన్ని చిత్రాలకు సంబంధించిన పని మొత్తం పూర్తయినప్పటికీ, రిలీజ్​ డేట్​లు(cinema release) మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఇంతకీ అవి ఎప్పుడొస్తాయి?

05:56 October 20

టాప్​న్యూస్@ 6AM

టాప్​న్యూస్@ 6AM

  • డ్రగ్స్​పై ఉక్కుపాదం..

రాష్ట్రంలో డ్రగ్స్ నివారణపై కార్యాచరణ రూపొందించేందుకు సంబంధిత అధికారులతో నేడు.. సీఎం కేసీఆర్(CM KCR meeting on drugs issue) సమావేశం కానున్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు సీఎం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ మేరకు ఆయా జిల్లాల పరిధిలో అధికారులు తీసుకుంటున్న చర్యలను కేసీఆర్ పరిశీలించనున్నారు.

  • షర్మిల ప్రజాప్రస్థానం..

చేవేళ్ల మరో పాదయాత్రకు వేదికైంది. వైతెపా అధ్యక్షురాలు వైఎస్​ షర్మిల ఇవాళ ప్రజా ప్రస్థానం పేరిట పాదయాత్రను చేపట్టనున్నారు. శంకర్ పల్లి క్రాస్ రోడ్ వద్ద బహిరంగ సభ నిర్వహించిన అనంతరం పాదయాత్ర ప్రారంభిస్తారు. అభిమానులు, ప్రజలు ఆదరించాలని షర్మిల కోరారు.

  • ఇక నుంచి స్కాన్​ చేస్తే చాలు..

తెలంగాణ ప్రగతి రథ చక్రాలను ఆర్టీసీ ఎండీ సజ్జనార్​ పరుగులు పెట్టిస్తున్నారు. అందుకోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలో.. అన్నింటినీ పక్కాగా తీసుకుంటున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజలకు పలు సౌకర్యాలు కల్పిస్తూ.. మరింత జనాల్లోకి ఆర్టీసీని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.

  • నేడు ఏపీ బంద్​..

  • కెప్టెన్​ కొత్త పార్టీ..

పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్(Captain Amarinder Singh).. నూతన పార్టీ ప్రకటన చేశారు. భాజపాతో పొత్తుకూ సిద్ధమేనని ప్రకటించారు. కలిసొచ్చే పార్టీలతో కూటమి ఏర్పాటు చేస్తామన్నారు. (Amarinder Singh new party).

  • లఖింపుర్‌ ఖేరిపై విచారణ..

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరిలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరగనుంది. అక్టోబర్ 3 నాటి ఈ ఉద్రిక్తతల్లో నలుగురు రైతులు సహా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.

  • ఆహార భద్రతలో భారత్​ స్థానం..

ప్రపంచ ఆహార భద్రత సూచీలో భారత్ 71వ స్థానంలో నిలిచింది. 113 దేశాలతో కూడిన ఈ జాబితాలో పొరుగు దేశాలైన పాకిస్థాన్, శ్రీలంకల కంటే భారత్ వెనుకబడి ఉండటం గమనార్హం.

  • డెల్టాలో కొత్త రకం వైరస్​..

ఇంగ్లాండ్​లో కరోనా విజృంభిస్తోంది. డెల్టా ప్లస్​గా చెబుతున్న ఏ.వై.4.2(AY.4.2) క్రమంగా విస్తరిస్తోంది. దీనితో దేశంలో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గతకొన్ని రోజులుగా యూకేలో క్రమంగా కరోనా కేసులు, మరణాలు పెరుగుతున్నాయి.

  •  శార్దూల్​కు అవకాశం ఇవ్వండి

టీ20 ప్రపంచకప్​లో పాకిస్థాన్​తో(Ind vs Pak T20 World Cup) జరగనున్న మ్యాచ్​లో ఆల్​రౌండర్ శార్దూల్ ఠాకూర్​కు అవకాశం ఇవ్వాలని మాజీ పేసర్ అజిత్ అగార్కర్(Ajit Agarkar News) కోరాడు. ఫాస్ట్​ బౌలర్ భువనేశ్వర్​ ఫామ్​లో లేకపోవడం, హార్దిక్ పాండ్యా బౌలింగ్​ చేయకపోవడం జట్టుకు పెద్ద లోటని తెలిపాడు.

  • బన్నీ థ్యాంక్స్​..

అక్కినేని అఖిల్, పూజా హెగ్డే ప్రధానపాత్రల్లో తెరకెక్కి ఘనవిజయం సాధించిన చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్​లర్'(most eligible bachelor movie). ఈ నేపథ్యంలో గ్రాండ్ సక్సెస్ సెలబ్రేషన్స్​ను నిర్వహించింది. ఈ వేడుకకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యక అతిథిగా విచ్చేశారు.

Last Updated : Oct 20, 2021, 10:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.