ETV Bharat / city

ఈటీవీ భారత్​- ముఖ్యాంశాలు - ఈటీవీ భారత్ న్యూస్

etv bharat top news
etv bharat top news
author img

By

Published : Oct 2, 2021, 5:59 AM IST

Updated : Oct 2, 2021, 9:57 PM IST

21:52 October 02

టాప్​ న్యూస్​ @10PM

  • బతుకమ్మ చిరుకానుక

నేతన్నలకు గౌరవప్రదమైన ఆదాయం కల్పించడం, తెలంగాణ పండగ బతుకమ్మ(bathukamma) పూట ఆడబిడ్డలకు చీరను అందించే ఉద్దేశంతో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు మంత్రి కేటీఆర్(minister ktr)​ వెల్లడించారు. 18 ఏళ్లు నిండిన, ఆహార భద్రత కార్డ్ కింద నమోదైన ప్రతి ఒక్క ఆడబిడ్డకు బతుకమ్మ(bathukamma) చీర అందిస్తామని అన్నారు.

  • ఎమ్మెల్సీ వాణీదేవిని నిలదీసిన నిరుద్యోగులు

హైదరాబాద్ చిక్కడపల్లిలోని నగర కేంద్ర గ్రంథాలయం(city central library)లో జరిగిన జాబ్ మేళా(job mela in hyderabad 2021) కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్సీ వాణిదేవిని నిరుద్యోగులు ముట్టడించారు. నగర కేంద్ర గ్రంథాలయంలో పోటీ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున తరలి వచ్చి వాణీ దేవిని నిలదీయటంతో.. ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిరుద్యోగులను శాంతింప చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేసినా.. ప్రశ్నల వర్షంతో వాణీదేవిని ఉక్కిరిబిక్కిరి చేశారు.

  • యూపీ పోల్స్​ సీనియర్​ పరిశీలకుడిగా ఉత్తరాఖండ్​ సీఎం..

ఛత్తీస్​గఢ్​ ముఖ్యమంత్రి భూపేశ్​ బఘేల్​కు(cg cm bhupesh baghel) కీలక బాధ్యతలు అప్పగించింది కాంగ్రెస్​ అధిష్ఠానం. ఉత్తర్​ప్రదేశ్​ ఎన్నికల(up polls 2022) సీనియర్​ పరిశీలకుడిగా నియమించింది. సీఎం మార్పుపై(chhattisgarh cm change) జోరుగా ప్రచారం జరుగుతున్న క్రమంలో ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.

  • మెరుపులు మెరిపించిన గైక్వాడ్​

రాజస్థాన్​తో మ్యాచ్​లో (CSK Vs RR) మెరుపులు మెరిపించాడు చెన్నై యువ సంచలనం రుతురాత్ గైక్వాడ్. ఆకట్టుకునే షాట్లతో సెంచరీ (101*) సాధించాడు. దీంతో రాజస్థాన్​ ముందు 190 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది సీఎస్​కే.

  • మా ఎన్నికల్లో అభ్యర్థుల తుది జాబితా ఇదే..

అక్టోబర్​ 10వ తేదీన జరగనున్న మా ఎన్నికలకు (MAA ELECTIONS 2021) పోటీపడే అభ్యర్థుల తుది జాబితా ఖరారైంది. అధ్యక్ష బరిలో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణులు బరిలో నిలవగా.. అత్యంక కీలకమైన జనరల్ సెక్రటరీ పోస్టుకు పోస్టుకు జీవిత రాజశేఖర్, రఘుబాబులు తలపడనున్నారు.

20:51 October 02

టాప్​ న్యూస్​ @9PM

  • చైతూ-సామ్​ బంధానికి తెర

ప్రముఖ టాలీవుడ్ జోడీ నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు చైతూ, సమంత.

  • 'తెరాస బాక్సులు బద్దలుకొట్టుడే..' 

ప్రజాసంగ్రామ యాత్ర(praja sangrama yatra)లో ఎక్కడికి వెళ్లినా.. సమస్యలే స్వాగతం పలికాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్(Bandi Sanjay speech)​ తెలిపారు. ప్రజలు, రైతులు, నిరుద్యోగులు, భూనిర్వాసితులు... ఇలా ఎందరో తమ బాధలను చెప్పుకున్నట్టు తెలిపారు. తెలంగాణ ప్రజలకు కష్టాలు తీర్చేది భాజపానే అన్నారు. 2023లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది భాజపానే అని ధీమా వ్యక్తం చేశారు.

  • 'ఆంక్షలు, నిర్బంధాలు ఇంకెన్నాళ్లు'

తెలంగాణలో విద్యార్థులు, నిరుద్యోగులపై ఆంక్షలు, నిర్బంధాలు ఇంకెన్నాళ్లని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్‌ చేపట్టిన విద్యార్థి, నిరుద్యోగ జంగ్‌ సైరన్‌ ర్యాలీకి తనను వెళ్లనీయకుండా ఇంటి వద్దే పోలీసులు అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. నియంతలను తరిమికొట్టిన గడ్డ తెలంగాణ అని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజానీకం ఇంకెంతో కాలం కేసీఆర్‌ చేతిలో బందీగా ఉండదన్నారు.

  • 'సమన్యాయం కోసం ప్రభుత్వ సహకారం అవసరం'

ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జీల నియామకానికి కొలీజియం సూచించిన పేర్లకు సత్వరం ఆమోదం లభిస్తుందనే నమ్మకం ఉందన్నారు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్​వీ రమణ(CJI of India). ప్రజాస్వామ్య బలోపేతానికి, సమానంగా న్యాయం అందించేందుకు ప్రభుత్వం సహకారం అందించాలని కోరారు(CJI nv ramana news).

  • ఆ ఘనత సాధించిన తొలి మహిళా క్రికెటర్

మహిళా క్రికెట్​లో అరుదైన ఘనత సాధించింది ఆస్ట్రేలియా ఆల్​రౌండర్ ఎలిస్ పెర్రీ. టీమ్​ఇండియాతో (INDW vs AUSW) మ్యాచ్​ సందర్భంగా పూజ వికెట్​తో అంతర్జాతీయ కెరీర్​లో 300వ వికెట్​ను​ తన ఖాతాలో వేసుకుంది.

19:53 October 02

టాప్​ న్యూస్​ @8PM

  • 'తెలంగాణ ఓ ల్యాండ్​మైన్​లాంటిది' 

  • కాంగ్రెస్‌ కార్యకర్త ఆత్మహత్యాయత్నం

కాంగ్రెస్ పిలుపునిచ్చిన విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్ ఉద్రిక్తతకు దారితీసింది. పలువురు కాంగ్రెస్‌ నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేశాడు. పెట్రోల్‌ పోసుకుని కల్యాణ్‌ అనే విద్యార్థి బలవన్మరణానికి యత్నిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. 

  • నయా ట్రాఫిక్​ రూల్స్​

స్మార్ట్​ ఫోన్​ ఉన్నవారు హెడ్​ఫోన్స్​, బ్లూటూత్​ వినియోగించటం సర్వసాధారణంగా మారింది. ఓ వైపు బ్లూటూత్​ ద్వారా పాటలు వింటూ, ఫోన్​ మాట్లాడుతూనే.. బైక్​, కారు డ్రైవింగ్​(bluetooth earphones while driving ) చేస్తుంటారు కొందరు. ఇకపై అలాంటివి సాగవని హెచ్చరిస్తున్నారు పోలీసులు. డ్రైవింగ్​లో వాటిని వినియోగిస్తే.. రూ.1000, ఆపైన జరిమానా విధిస్తామని చెబుతున్నారు.

  • దిల్లీ విజయం

ముంబయి ఇండియన్స్​తో జరిగిన మ్యాచ్​లో 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది దిల్లీ క్యాపిటల్స్ (MI vs DC). ఈ గెలుపుతో అధికారికంగా (IPl 2021) ప్లే ఆఫ్స్​కు చేరింది.

  • టాలీవుడ్‌లోకి రజనీకాంత్‌ కుమార్తె

సూపర్​స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య తెలుగు చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వనుంది. లైకా ప్రొడెక్షన్స్‌ తెరకెక్కించనున్న ఓ సరికొత్త తెలుగు చిత్రానికి ఆమె దర్శకత్వం వహించనున్నారు.

19:08 October 02

టాప్​ న్యూస్​ @7PM

  • దళితబంధు అమలుకు అదనపు విధివిధానాలు

దళితబంధు పథకం అమలుకు అదనపు విధివిధానాలను ఎస్సీ అభివృద్ధి శాఖ జారీ చేసింది. రూ.10 లక్షల నిధులతో సాధ్యమైతే రెండు యూనిట్లకు అనుమతించాలని నిర్ణయం తీసుకుంది. 

  • హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా బల్మూరి వెంకట్‌

హుజూరాబాద్ ఉపఎన్నిక బరిలో నిలిచే కాంగ్రెస్ అభ్యర్థిపై ఉత్కంఠకు తెరపడింది. బల్మూరి వెంకట్‌ను అభ్యర్థిగా అధిష్ఠానం ప్రకటించింది. వెంకట్‌ ప్రస్తుతం ఎన్​ఎస్​యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 

  • పుట్టిన రోజు నాడే మాజీ ఎమ్మెల్యే మృతి

పుట్టిన రోజునే గుండె పోటుతో మరణించారు మాజీ ఎమ్మెల్యే(veerapandi raja death). తన తండ్రి ఫొటోకు పూలమాల వేస్తూ కుప్పకూలిపోయారు(veerapandi raja news). ఈ సంఘటన తమిళనాడులో జరిగింది.

  • టాస్ గెలిచిన రాజస్థాన్

ఐపీఎల్​ 2021లో (IPl 2021 news) భాగంగా నేడు (అక్టోబర్ 2) చెన్నై సూపర్​ కింగ్స్​, రాజస్థాన్​ (CSK Vs RR 2021) మధ్య మ్యాచ్ జరగనుంది. ముందుగా ఈ మ్యాచ్​లో టాస్ గెలిచిన రాజస్థాన్​ బౌలింగ్ ఎంచుకుంది.

  • నాగార్జున ఎమోషనల్ పోస్ట్

చైతూ-సమంత విడాకులపై (Chaysam Divorce) అక్కినేని నాగార్జున స్పందించారు. ఇరువురు విడిపోవడం దురదృష్టకరమని అన్నారు. దీనిపై మాట్లాడడం ఎంతో బాధగా ఉందన్నారు.

19:04 October 02

టాప్​ న్యూస్​ @6PM

  • 'కమలం వికసిస్తోంది' 

కరోనా సంక్షోభంలో పేదలను మోదీ ప్రభుత్వం ఎంతగానో ఆదుకుందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ(Smriti Irani in Husnabad meeting) పేర్కొన్నారు. ప్రధాని ఆవాస్​ యోజన పథకం కింద ఇల్లు నిర్మించుకునేందుకు ఆర్థిక సాయం చేస్తున్నామని తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో నిర్వహించిన భాజపా బహిరంగ సభకు స్మృతి ఇరానీ హాజరయ్యారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ చేపట్టిన తొలిదశ ప్రజా సంగ్రామ యాత్ర(Praja sangrama yatra) నేటితో ముగిసినట్లు కేంద్ర మంత్రి ప్రకటించారు.

  • ధర్మానిదే విజయం

హుజూరాబాద్​లో జరుగుతున్న కురుక్షేత్రంలో ధర్మమే గెలుస్తుందని ఈటల రాజేందర్​ స్పష్టం చేశారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ తలపెట్టిన ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభలో పాల్గొన్న ఈటల... తెలంగాణ ప్రజలంతా హుజూరాబాద్​ వాసులకు భరోసాగా నిలుస్తున్నారని తెలిపారు.

  • నాకు ఆ స్వేచ్ఛ లేదా?

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(revanth reddy news) నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్‌లో భాగంగా ఎల్బీనగర్‌ ర్యాలీ(congress rally)కి వెళ్లకుండా రేవంత్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులను రేవంత్​ రెడ్డి(Revanth reddy comments) నిలదీశారు. తన నియోజకవర్గంలో తిరగకుండా అడ్డుకోవటం సరికాదని హెచ్చరించారు. నివాళి అర్పించేందుకు వెళ్తానంటే పోలీసులే భద్రత కల్పించాల్సింది పోయి.. అడ్డుకుంటారేంటని ప్రశ్నించారు.

  • 'పదవి ఉన్నా, లేకున్నా గాంధీ కుటుంబం వెంటే!'

పంజాబ్​ కాంగ్రెస్​ నేత (Punjab news) నవజ్యోత్​ సింగ్​ సిద్ధూ(Sidhu news).. కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు పదవి ఉన్నా, లేకపోయినా గాంధీల వెంటే ఉంటానని ట్విట్టర్​ వేదికగా వెల్లడించారు.

  • 'ది లూప్'​ మూవీ ట్రైలర్ రిలీజ్​

హీరో శింబు, కల్యాణి ప్రియదర్శన్ జంటగా తెలుగులో తెరకెక్కుతున్న చిత్రం 'ది లూప్'​. ఈ చిత్రం ట్రైలర్​ను తాజాగా విడుదల చేసింది చిత్ర బృందం. మీరూ చూసేయండి..

16:52 October 02

టాప్​ న్యూస్​ @5PM

  • పోడు సమస్య పరిష్కారానికై.. 

పోడుభూముల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని నిన్న ముఖ్యమంత్రి చేసిన ప్రకటన నేపథ్యంలో... ఇదే అంశంపై ఇవాళ మంత్రివర్గ ఉపసంఘం(cabinet subcommittee) భేటీ అయింది. హైదరాబాద్​లోని బీఆర్కే భవన్‌లో మంత్రి సత్యవతి రాఠోడ్​ అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం(cabinet subcommittee) సమావేశమైంది. పోడు భూముల సమస్య పరిష్కారానికి నివేదిక  ఉపసంఘం ఇవ్వనుంది.

  • 'దీటుగా బదులిస్తాం'

సరిహద్దుల్లో.. చైనా, పాకిస్థాన్ సైన్యాల చర్యలను దీటుగా ఎదుర్కొనేందుకు భారత సైన్యం సర్వసన్నద్ధంగా ఉన్నట్లు ఆర్మీ చీఫ్ జనరల్ ఎమ్​ఎమ్​ నరవణె(general naravane news) వెల్లడించారు. తూర్పులద్దాఖ్‌లో(army chief in ladakh) గత ఆరునెలలుగా పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నాయన్న ఆర్మీచీఫ్​ చర్చల ద్వారా ప్రతిష్ఠంభనకు ముగింపు పలుకుతామనే విశ్వాసం వ్యక్తం చేశారు. పాకిస్థాన్ సరిహద్దుల వద్ద ఫిబ్రవరి ముందు రోజులకు పరిస్థితి తిరోగమిస్తోందని తెలిపారు.

  • లద్దాఖ్‌ సిగలో 'వజ్రా'యుధం

లద్దాఖ్​లోని(Eastern Ladakh) ఫార్వర్డ్​ ఏరియాల్లో తొలిసారిగా కే9-వజ్ర శతఘ్నులను(k9 vajra howitzer) మోహరించింది భారత్​. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల వేళ సైన్యానికి అధునాతన ఆయుధాలను(k9 vajra indian army) అందిస్తోంది. 50 కిలోమీటర్ల పరిధిలో ఉన్న శత్రు స్థావరాలపై ఈ కే9 వజ్ర శతఘ్నులు(k9 vajra range) దాడి చేయగలవు.

  • 'టీ20 ప్రపంచకప్​లో భారత్​పై పాక్​దే విజయం'

టీ20 ప్రపంచకప్​లో (T20 World Cup) టీమ్​ఇండియాపై గెలిచే సత్తా పాకిస్థాన్​కు ఉందన్నాడు ఆ దేశ మాజీ క్రికెటర్ వకార్ యూనిస్. బౌలింగ్​ తమకు ప్రధాన ఆయుధమని పేర్కొన్నాడు .

  • 'బండ్ల గణేశ్​ అనర్హుడు'

'మా' ఎన్నికల్లో (MAA Elections 2021) బండ్ల గణేశ్‌ నామినేషన్‌ ఉపసంహరించుకోవడంపై నిర్మాత యలమంచిలి రవిచందర్‌ శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి బండ్ల గణేశ్‌ అనర్హుడని అన్నారు.

15:51 October 02

టాప్​ న్యూస్​ @4PM

  • ముగిసిన చైతూ-సమంత వివాహ బంధం

ప్రముఖ టాలీవుడ్ జోడీ నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించాడు చైతూ.

  • దిల్​సుఖ్​నగర్​లో హైఅలెర్ట్​

హైదరాబాద్​ జూబ్లీహిల్స్‌లోని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్‌కు కాంగ్రెస్‌ పిలుపునివ్వగా.. ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. దిల్​సుఖ్‌నగర్ రాజీవ్‌చౌక్‌ వద్ద ముందస్తుగా ర్యాలీ తీయకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

  • లోక్‌జన్‌శక్తి పార్టీ గుర్తును ఫ్రీజ్​ చేసిన ఈసీ

లోక్‌జన్‌శక్తి పార్టీ గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం స్తంభింపజేసింది. పార్టీలో చిరాగ్‌, పశుపతి కుమార్‌ మధ్య విభేదాల వల్ల ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

  • 'సాగుచట్టాలపై విపక్షాలది రాజకీయ వంచన'

నూతన సాగు చట్టాలను కొన్ని పార్టీలు వ్యతిరేకించడాన్ని 'రాజకీయ ద్రోహం'గా అభివర్ణించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. వ్యవసాయంలో సంస్కరణల కోసం ఒకప్పుడు తామే హామీలిచ్చి ఇప్పుడు మాట మార్చి, వాటిని తప్పుడు అంశాలుగా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నాయని ధ్వజమెత్తారు.

  • ముంబయి బ్యాటింగ్​

ఐపీఎల్​ 2021I(IPl 2021 news)లో భాగంగా నేడు (అక్టోబర్ 2) ముంబయి ఇండియన్స్​-దిల్లీ క్యాపిటల్స్(mi vs dc 2021) మధ్య మ్యాచ్ జరగనుంది. ముందుగా ఈ మ్యాచ్​లో టాస్ గెలిచిన దిల్లీ బౌలింగ్ ఎంచుకుంది.

14:33 October 02

టాప్​ న్యూస్​ @3PM

  • జనసేనాని సవాల్​

ఏపీలోని రాజమహేంద్రవరంలో జనసేన అధ్యక్షుడు పవన్​కల్యాణ్​ పర్యటించారు. పార్టీ కార్యకర్తలతో కలిసి శ్రమదానం చేశారు. తొక్కే కొద్దీ పైకి లేస్తాం తప్ప వంగేది లేదని వైకాపా నాయకులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రాణాలు పణంగా పెట్టి ప్రజలకు అండగా ఉండాలని వచ్చినట్టు స్పష్టం చేశారు.

  • 'పోలీసుల తీరు నిరంకుశ ధోరణికి నిదర్శనం'

విద్యార్థి, నిరుద్యోగుల కోసం జంగ్ సైరన్ ర్యాలీ(Congress Jung Siren Rally) నిర్వహించాలనుకుంటే.. అనుమతివ్వకుండా పోలీసులు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాస్కీ గౌడ్(Madhu Yashki Goud) మండిపడ్డారు. భాజపా, తెరాస విద్యార్థి, నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నాయని ఆరోపించారు. పోలీసులు అనుమతి ఇచ్చినా.. ఇవ్వకపోయినా.. ఈ ర్యాలీ(Congress Jung Siren Rally) జరుగుతుందని స్పష్టం చేశారు.

  • ముఖంపై 8కేజీల కణతి

ఒడిశాకు చెందిన 31 ఏళ్ల వ్యక్తి ముఖంపై ఉన్న ఎనిమిది కేజీల కణతిని (Tumor Surgery) బెంగళూరు వైద్యులు తొలగించారు. 17 ఏళ్లుగా ఈ కణతితో (Tumor on Face) ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచి రోగిని విముక్తుడ్ని చేశారు. నిపుణులైన వైద్య బృందం ఎంతో చాకచక్యంగా వ్యవహరించి అత్యంత క్లిష్టమైన సర్జరీలను విజయవంతంగా పూర్తి చేసింది. (Manbodh Bag)

  • తొలి ఇన్నింగ్స్​ డిక్లేర్ చేసిన టీమ్ఇండియా

ఆస్ట్రేలియా మహిళలతో జరుగుతున్న డేనైట్ టెస్టు తొలి ఇన్నింగ్స్​లో 377 పరుగులకు డిక్లేర్ చేసింది భారత మహిళల జట్టు. స్మృతి మంధాన సెంచరీతో మెరిసింది.

  • మా ఎన్నికల్లో తప్పుకున్న సీవీఎల్​

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌ ఎన్నికల్లో (MAA Elections 2021)ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తానూ కూడా అధ్యక్ష రేసులో ఉన్నానని ప్రకటించిన నటుడు సీవీఎల్‌ నరసింహారావు.. తాజాగా నామినేషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు.

14:03 October 02

టాప్ న్యూస్ @2PM

  • అక్కడ కిలో ఉప్పు రూ.130, నూనె రూ.300

హిమాలయ పర్వత ప్రాంతాల్లోని పలు గ్రామాల్లో నిత్యావసరాల ధరలు కొండెక్కాయి. కొన్ని చోట్ల ఉప్పు కేజీ రూ.130, బియ్యం కిలో రూ.150, నూనె రూ.300 చొప్పున విక్రయిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ రికార్డు ధరలు చూసి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు.

  • అతనొక్కడే ఈ డబ్బంతా తీసుకున్నాడా?

తెలుగు అకాడమీ డిపాజిట్ల గోల్​మాల్​ (Fixed Deposits Scam In Telugu Academy) కేసులో రూ.60 కోట్లు కాజేసిన వ్యక్తుల నుంచి డబ్బులు రికవరీ చేసేందుకు సీసీఎస్​ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఏపీ మర్కంటైల్ సొసైటీలో తెలుగు అకాడమీ పేరుతో నకిలీ ఖాతాలు సృష్టించి.. నగదును యూబీఐ నుంచి నకిలీ ఖాతాల్లోకి మళ్లించి.. నగదును విత్ డ్రా చేసుకున్నట్లు గుర్తించారు.

  • హుజూరాబాద్​లో ఊపందుకున్న ప్రచారం

హుజూరాబాద్‌ ఉపఎన్నికల(Huzurabad by election 2021) ప్రచారం జోరందుకుంది. తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌(trs candidate Gellu Srinivas Yadav) విజయం కోసం మంత్రులు బరిలోకి దిగారు. ఇందులో భాగంగానే మంత్రి గంగుల కమలాకర్(minister gangula kamalakar campaign in huzurabad) ఇవాళ హుజూరాబాద్​లో పర్యటించారు. అక్కడి ప్రజలతో ముచ్చటిస్తూ... కేసీఆర్ చేసిన అభివృద్ధిని వివరించారు. కాగా మంత్రికి స్థానిక నాయకులు, మహిళలు ఘన స్వాగతం పలికారు.

  • ఐపీఎల్‌లో ఇలాంటివి జరగొద్దు'

కోల్​కతా, పంజాబ్​ జట్ల(PBKS vs KKR) మధ్య జరిగిన మ్యాచ్​లో అంపైర్ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేశాడు టీమ్​ఇండియా మాజీ క్రికెటర్ గంభీర్(Gambhir News). 18వ ఓవర్​లో పంజాబ్​ కింగ్స్​ కెప్టెన్ రాహుల్​ క్యాచ్​ ఔట్​ స్పష్టంగా కనిపించినప్పటికీ థర్డ్​ అంపైర్ ఔట్​గా నిర్ధరించకపోవడంపై అసహనం వ్యక్తపరిచాడు.

  • 'మా' బరి నుంచి తప్పుకొన్న నరసింహారావు

12:54 October 02

టాప్ న్యూస్ @1PM

'ర్యాలీకి అనుమతిలేదు.. అడ్డుకుంటే సహించేది లేదు'

గాంధీ జయంతి సందర్భంగా జంగ్ సైరన్​ పేరుతో శాంతియుత నిరసన తెలుపుతామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించగా.. ఆ ర్యాలీకి ఎటువంటి అనుమతి లేదని రాచకొండ సీపీ మహేశ్ భగవత్​ స్పష్టం చేశారు. పోలీసులు సహకరించినా లేకపోయినా.. ర్యాలీ చేసి తీరతామని రేవంత్ తేల్చిచెప్పారు. ఈ కార్యక్రమంలో.. కార్యకర్తలకు లాఠీ దెబ్బతగలకుండా.. తూటా తగలకుండా అడ్డుగా నిలుస్తానని భరోసానిచ్చారు.

Gandhi Jayanti: బాపూఘాట్‌లో గాంధీ జయంతి వేడుకలు.. 

హైదరాబాద్​ లంగర్​ హౌస్​లోని బాపూ ఘాట్​లో (Gandhi Jayanti at Bapu Ghat )గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గవర్నర్లు​ తమిళిసై, దత్తాత్రేయ, మంత్రులు కేటీఆర్​, తలసాని, శ్రీనివాస్ గౌడ్, సభాపతి పోచారం నివాళులు అర్పించారు.

ఈసారి కొత్త ఛాంపియన్​ను చూద్దాం

ఈ ఐపీఎల్​ సీజన్​లో(IPL 2021 News) డిఫెండింగ్​ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్​ జట్టు(MI team) ట్రోఫీ గెలవడం ఇష్టం లేదని చెప్పాడు భారత మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్(virender sehwag latest news). కొత్త జట్టు కప్​ గెలిస్తే చూడాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు.

జల్​ జీవన్ మిషన్ యాప్​ ఆవిష్కరణ

జల్​ జీవన్ మిషన్ యాప్​ను (Jal Jeevan Mission app) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. దేశంలోని పలు గ్రామ పంచాయతీలు, పారిశుద్ధ్య కమిటీ సభ్యులతో మాట్లాడారు. రాష్ట్రీయ జల్ జీవన్ కోశ్ కార్యక్రమాన్ని ఆవిష్కరించారు.

మహాత్ముని శాంతి సందేశం నవ శకానికి నాంది

మహాత్మా గాంధీ 152వ జయంతి సందర్భంగా(mahatma gandhi jayanti) ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి గుటెరస్​(antonio guterres news) నివాళులు అర్పించారు. విశ్వాసం, సహనంతో కూడిన కొత్త శకానికి నాంది పలికేందుకు గాంధీ శాంతి సందేశాన్ని ప్రపంచం పాటించాలని పిలుపునిచ్చారు.

12:12 October 02

టాప్ న్యూస్ @12NOON

  • గాంధీభవన్​లో మహాత్ముడినికి నివాళులు 

గుండెల నిండా ఊపిరి పీల్చుకుని మహాత్మా గాంధీని స్మరించుకుంటే.. ఎంత గొప్ప పోరాటమైనా ఫలిస్తుందని, ఎంత పెద్ద లక్ష్యమైనా సాధిస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(TPCC Chief Revanth Reddy) అన్నారు. గాంధీ జయంతి(Gandhi Jayanthi 2021) సందర్భంగా గాంధీభవన్​లో జాతిపిత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

  • యాప్​ను ఆవిష్కరించిన మోదీ

  • బాపూఘాట్‌లో గాంధీ జయంతి వేడుకలు

  • ప్రేమ కోసం రూ.10కోట్లు వదులుకున్న రాకుమారి!

ఓ రాకుమారి తన సహాధ్యాయిని ప్రేమించింది. అయితే.. ఆర్థిక వివాదాలు వారిద్దరి మధ్యలో విలన్ పాత్ర పోషించాయి. ఎట్టకేలకు మూడేళ్ల నిరీక్షణ తర్వాత వారి పెళ్లికి రాజకుటుంబం అంగీకరించింది. కానీ, రాజకుటుంబ మహిళలు సామాన్యులను పెళ్లాడితే రాచరికాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. తన ప్రేమకోసం ఆ రాచరికాన్ని, తద్వారా వచ్చే రూ. 10కోట్లను కూడా వదులుకునేందుకు సిద్ధపడింది ఆ రాకుమారి.

  • గాంధీపై వచ్చిన ఈ పాటలు చూసేయండి!

కళ్లజోడుతో, చేతికర్రతో నడిచే సత్యాగ్రహం 'మహాత్మా గాంధీ'. నేడు ఆయన పుట్టిన రోజు(mahatma gandhi birthday). ఈ సందర్భంగా.. బాపూజీ స్పూర్తిని తెలిపే అద్భుతమైన టాలీవుడ్ గీతాలేంటో చూద్దాం.

10:46 October 02

టాప్ న్యూస్ @11AM

  • పెట్రో వాత..

దేశంలో పెట్రోల్ ధరలు (Petrol Price Today) మళ్లీ పెరిగాయి. తాజా పెంపుతో దిల్లీలో పెట్రోల్ రేట్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. (Petrol Diesel Price Hike)

  • గాంధీ బాటలోనే నడుస్తున్నాం..

గాంధీ జయంతి(Gandhi Jayanti 2021) సందర్భంగా జాతిపితకు సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి నివాళులు అర్పించారు. ఆయన సేవలను స్మరించుకుంటూ... రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని వివరించారు. తెలంగాణ అనేక రంగాల్లో అగ్రస్థానంలో ఉందని తెలిపారు.

  • సీఎం సీపీఆర్వోనూ వదల్లేదుగా?

సోషల్​ మీడియాలో నకిలీ ఫేస్​బుక్ ఖాతాల(Fake Facebook Account) ట్రెండ్ నడుస్తోంది. ఫేక్ ప్రొఫెల్ క్రియేట్ చేసి రకరకాల మోసాల(Cyber crimes)కు పాల్పడుతున్నారు. ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సీపీఆర్వో పేరుతో నకిలీ ఫేస్​బుక్ ఖాతా(Fake Facebook Account) ఉండటం సంచలనం సృష్టిస్తోంది. ఈ ఖాతా(Fake Facebook Account)తో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి డబ్బులు డిమాండ్ చేశారు. సీఎం సీపీఆర్వో జ్వాల నర్సింహరావు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటపడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • కరోనా అంతానికి భారత్​ పాత్రే కీలకం

కరోనాను అంతమొందించ కీలక పాత్ర భారత్​దేనని (India covid fight) అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి ఏజెన్సీ నిర్వాహకురాలు సమంత పవర్ (USAID Samantha power) పేర్కొన్నారు. టీకా కొరత తీవ్రంగా వేధిస్తున్న ప్రస్తుత తరుణంలో.. ప్రపంచానికి భారత్ ఆశాకిరణంగా నిలుస్తోందని అన్నారు.

  • ఆమె సోయగాలు చూస్తే ఆగమే ఇక!

అనైకా సోతి.. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేసింది. 2013లో 'సత్య 2' చిత్రంతో వెండితెర అరంగేట్రం చేసిన ఈ భామ స్టార్​డమ్​ తెచ్చుకోకపోయినా సోషల్​మీడియాలో చురుగ్గా ఉంటూ అభిమానులను అలరిస్తూనే ఉంది. నేడు(అక్టోబరు 2) ఆమె ఫొటోలపై ఓ లుక్కేద్దాం..

09:49 October 02

టాప్ న్యూస్ @10AM

  • తెలంగాణ పల్లెల్లో మద్యం ఏరులు..

గ్రామాల్లో మద్యం చిచ్చు రేపుతోంది. ఊరురా గొలుసు దుకాణాల యథేచ్ఛగా ఏర్పాటు కావడంతో, ప్రజలు మద్యానికి బానిసలవుతున్నారు(Alcohol addicts in Villages). చేజేతులా అనారోగ్యాన్ని కొనితెచ్చుకుంటున్నారు. కుటుంబాల్లో గొడవలు జరిగి విచ్ఛినమవుతున్నాయి. మండలాలు, పట్టణాలు, గ్రామాలు, తండాలు ఇలా ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లినా అక్కడ ఇదే దుస్థితి. కొన్నిప్రాంతాల్లో కిరాణా దుకాణాలు కేవలం మద్యం అమ్మకాలనే నమ్ముకుని వ్యాపారాలు నడిపిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

  • పీఠాలు కదులుతున్నాయి.. 

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న తెలుగు అకాడమీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల గోల్‌మాల్‌ (Telugu academy scam) వ్యవహారంలో పీఠాలు కదులుతున్నాయి. ఎఫ్‌డీల మాయాజాలంపై తెలుగు అకాడమీ సంచాలకుడి(Telugu Academy Director Suspension on Fixed Deposits Scam)పై ప్రభుత్వం వేటు వేసింది. ఏపీ మర్కంటైల్‌ సొసైటీ ఛైర్మన్‌ సహా ముగ్గురిని అరెస్ట్‌ చేసింది. యూబీఐ మేనేజర్​ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

  • సూర్యనారాయణుడిని తాకిన సూర్యకిరణాలు

శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలోని శ్రీ సూర్యనారాయణ స్వామిని (arasavalli Suryanarayana Swamy Temple) భానుడి కిరణాలు రెండోరోజు తాకాయి. ఆ సమయంలో స్వామి నామస్మరణ చేస్తూ భక్తులు పులకరించిపోయారు.

  • అమెరికాలో మృత్య విలయం..

మూడు నెలల వ్యవధిలోనే అమెరికాలో (Covid USA) లక్ష మంది కరోనాకు బలయ్యారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య ఏడు లక్షలు దాటింది. అయితే, ప్రస్తుతం కేసులు తగ్గుముఖం పడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

  • 'పుష్ప' విడుదల తేదీ ఖరారు

అల్లు అర్జున్​ హీరోగా తెరకెక్కుతున్న 'పుష్ప'(Pushpa Release Date) విడుదల తేదీ ఖరారైంది. డిసెంబరు 17న రిలీజ్​ చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.

08:55 October 02

టాప్ న్యూస్ @9AM

  • మహాత్మా గాంధీకి ప్రముఖుల నివాళులు

జాతిపిత మహాత్మా గాంధీకి (Gandhi Jayanti) రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, నివాళులు అర్పించారు. రాజ్​ఘాట్​ను సందర్శించి పుష్పాంజలి అర్పించారు.

  • విచారణార్హతపై అఫిడవిట్ వేయండి..

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనుల్లో పర్యావరణ ఉల్లంఘనలు జరిగాయని సంయుక్త కమిటీ నివేదిక ఇచ్చింది. మరోవైపు ఏపీకి చెందిన రైతులూ ఎన్జీటీ(National Green Tribunal)కి ఫిర్యాదు చేశారు. ఈ రెండింటి విచారణార్హతపై అభ్యంతరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఎన్జీటీ(National Green Tribunal) తెలంగాణను ఆదేశించింది. విచారణార్హత లేదన్న తెలంగాణ వాదనతో సంతృప్తి చెందితే కేసు పూర్వాపరాల్లోకి వెళ్లమని స్పష్టం చేసింది.

  • ఉప్పుడు బియ్యానికి మోక్షం

ఉప్పుడు బియ్యం కొనుగోలు(uppudu biyyam Purchase Issue)పై ముఖ్యమంత్రి కేసీఆర్ వినతిని కేంద్రం అంగీకరించింది. అదనంగా మరో 20 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తీసుకునేందుకు కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒప్పుకొంది. ఈ ఒక్కసారి మాత్రమే అదనంగా తీసుకుంటామని స్పష్టం చేసింది.

  • యాషెస్‌ ఆగదు

ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్(Tim Paine News) మాటల యుద్ధానికి తెరలేపాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ సహా ఎవరొచ్చినా రాకున్నా యాషెస్ సిరీస్(Ashes Series)​ ఆగదని ఘూటు వ్యాఖ్యలు చేశాడు.

  • ఆయన​ గెలిస్తే నా సమస్యలు బయటపెడతా

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల్లో(Maa elections 2021) ప్రకాశ్‌రాజ్ గెలవాలని ఆశించారు నటి పూనమ్​ కౌర్​. అప్పుడే ఇంతకాలం తాను ఎదుర్కొన్న సమస్యల్ని చెప్పగలిగే అవకాశం ఉందని చెప్పారు.

07:42 October 02

టాప్ న్యూస్ @8AM

  • దిల్లీ వెళ్దాం.. 'పోడు'పై ప్రధానిని కలుద్దాం...

పర్యావరణానికి పరిణమిస్తున్న ముప్పు, వాతావరణంలో వస్తున్న మార్పుల దృష్ట్యా.... హరితహారం నిరంతరం కొనసాగాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి కేసీఆర్ (cm kcr) పేర్కొన్నారు. ఇందుకోసం నిధుల సమీకరణ ఎంతో ముఖ్యమన్న ఆయన.... హరితహారానికి తోడుగా రాష్ట్రంలో 'హరితనిధి'ని (haritha nidhi) ప్రతిపాదిస్తున్నట్లు వెల్లడించారు. అంతే కాకుండా 'పోడు'పై ప్రధానిని కలుద్దామని తెలిపారు.

  • 4 బిల్లులకు ఆమోదం

తెలంగాణ శాసనసభ శుక్రవారం రోజున నాలుగు బిల్లుల(Four Bills passed in Telangana Legislature)కు ఆమోదం తెలిపింది. గృహ నిర్మాణ మండలి చట్ట సవరణ, నల్సార్ చట్ట సవరణ, కొండా లక్ష్మణ్‌ బాపూజీ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయ (సవరణ) బిల్లు, పంచాయతీరాజ్‌ చట్టసవరణ బిల్లులు(Four Bills passed in Telangana Legislature) శాసనసభ ఆమోదం పొందాయి.

  • '12 మంది కళ్లలో మట్టి కొట్టాడు'!

దిశ నిందితుల ఎన్‌కౌంటర్ ( Disha Encounter Case News) కేసుపై సిర్పుర్కర్ కమిషన్ (Sirpurkar Commission Enquiry Continues on Disha Encounter) విచారణ కొనసాగుతోంది. ఎన్​కౌంటర్​ ఉదంతంపై అబ్దుల్​ రవూఫ్​ అనే ప్రత్యక్ష సాక్షిని సిర్పూర్కర్​ (sirpurkar commission) కమిషన్​ ప్రశ్నించింది.

  • స్వచ్ఛతే జీవన సంస్కృతిగా..!

దేశవ్యాప్తంగా నగరాలన్నింటా పరిశుభ్రత, జలభద్రతలను లక్షిస్తూ స్వచ్ఛ భారత్‌(పట్టణ)(Swachh Bharat 2.0), అమృత్‌ (అటల్‌ పట్టణ రూపాంతరీకరణ పునరుజ్జీవన యోజన)(Amrut Scheme) రెండో దశ కార్యాచరణకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. వీటి కోసం మొత్తం రూ.4.28 లక్షలకోట్ల మేర వ్యయీకరించనున్నట్లు అధికారిక ప్రకటన వెల్లడిస్తోంది. అయితే.. ఏడేళ్ల స్వచ్ఛభారత్‌, ఆరేళ్ల అమృత్‌ తొలిదశ ఫలితాలనుంచి ప్రభుత్వ యంత్రాంగం విలువైన పాఠాలు నేర్చి ముందడుగు వేస్తే- మలి అంకంలో మెరుగైన ఫలితాల సాధన సాకారమవుతుంది.

  • రిక్త చరిత్ర..

దోమల రొద చెవినపడగానే మనకు చికాకు కలుగుతుంది. వాటి తాకిడి ఎక్కువగా ఉండే సీజన్లో ఆరు బయటకు వెళ్లామంటే మన చుట్టూ ముసురుకోవడం ఖాయం. అయితే ఇలా చుట్టుముట్టే దోమలన్నీ మనల్ని కుట్టవు. ఆడవి మాత్రమే కుడతాయి. మగవి ఆ పనిచేయవు. (Male Mosquitoes news) అయినా అవి మనుషులను చుట్టుముడతాయని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు గుర్తించారు. అందుకు కారణాలను విశ్లేషించారు.

06:42 October 02

టాప్ న్యూస్ @7AM

  • గాంధీ యంగ్​స్టర్​గా ఎలా ఉండేవారో తెలుసా?

ఒక్కచుక్క రక్తం చిందించకుండా అహింసే మార్గం, సత్యాగ్రహమే ఆయుధంగా దేశాన్ని ఆంగ్లేయుల చెర నుంచి విడిపించిన స్వాతంత్య్ర సమరయోధుడు బాపూజీ (Mahatma Gandhi Jayanthi). ఆ మహానీయుడి జన్మదినం సందర్భంగా జాతికి ఆయన సేవలను స్మరించుకోవడం, ఆయన వ్యక్తిత్వాన్ని, నడిచిన బాటను అనుసరించటమే మనం ఆయనకిచ్చే ఘనమైన నివాళి. హైదరాబాద్ శిల్పారామంలో మహాత్మా గాంధీ జీవిత విశేషాలతో ఛాయా ప్రదర్శన ఏర్పాటు చేసి మూడు రోజులపాటు నగరవాసుల సందర్శనకు అవకాశం ఇవ్వనున్నారు.

  • విద్యార్థి, నిరుద్యోగ జంగ్‌ సైరన్‌..

కాంగ్రెస్​ పార్టీ 'విద్యార్థి, నిరుద్యోగ జంగ్‌ సైరన్‌' (Vidyardhi Nirudyoga Jung Siren)పేరిట నిరసన కార్యక్రమం చేపట్టనుంది. ఈ కార్యక్రమం గాంధీ జయంతి ( Gandhi Jayanti) సందర్భంగా నేడు ప్రారంభం కానుంది. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ జన్మదినం (Sonia Gandhi's birthday) డిసెంబరు 9 వరకు 'విద్యార్థి, నిరుద్యోగ జంగ్​ సైరన్'​ కొనసాగనుంది.

  • జర జాగ్రత్త!

అయిదేళ్లలో రాష్ట్రంలో 8 శాతం మంది అధిక రక్తపోటు బాధితులు పెరిగారు. షుగర్‌ వ్యాధిగ్రస్తులు ఒక శాతం తగ్గడం కాస్త ఊరటనిస్తోంది. రక్తహీనతతో బాధపడే అయిదేళ్లలోపు చిన్నారులు 9 శాతం పెరగడం కాస్త ఆందోళనను పెంచుతోంది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ(Ministry Of health and Family Welfare) .. రాష్ట్ర పౌష్టిక ముఖచిత్ర నివేదిక (National Family Health Survey 2019-20)లో ఈ విషయాలు వెల్లడించింది.

  •  వాట్సాప్​ అకౌంట్లు బ్యాన్​

భారత్​లో ఆగస్టు ఒక్కనెలలోనే 20 లక్షలకుపైగా ఖాతాలను బ్యాన్​ చేసినట్లు సామాజిక మాధ్యమం వాట్సాప్(WhatsApp banned) పేర్కొంది. ఈ మేరకు ఆగస్టు నెలకు సంబంధించిన కంప్లియన్స్ రిపోర్ట్​ను విడుదల చేసింది.

  • ప్రపంచ ఫ్యాక్టరీకి కరెంటు దెబ్బ

తీవ్ర విద్యుత్తు కొరతతో చైనా పరిశ్రమలకు(China Power Shortage) ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పలు బొగ్గు సంస్థలు ఉత్పత్తి తగ్గించడం వల్ల సరఫరా పడిపోయి ఒక్కసారిగా విద్యుత్​ సమస్యలు ఏర్పడ్డాయి.

05:50 October 02

ఈటీవీ భారత్​- ముఖ్యాంశాలు

  • అహింసా సిద్ధాంతమే 

సాయుధ ఉద్యమాల కంటే గాంధీ అహింసా సిద్ధాంతమే ప్రభావవంతమైనదని, ప్రపంచవ్యాప్తంగా అనేక నిరసనోద్యమాలు ఇప్పుడు ఇదే మార్గంలో నడుస్తున్నాయని, గాంధీ గురించి భారతదేశంలో కంటే వెలుపలి దేశాల్లోనే లోతైన అధ్యయనం జరుగుతోందని అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ కరుణ మంతెన అభిప్రాయపడ్డారు.

  • కుటుంబాల్లో పేచీలు

నేటి వాణిజ్య ప్రపంచంలో భూమి అంటే ఉత్పాదక సాధనం కాదు.. వ్యాపార వస్తువు! పొలం అంటే దుక్కిదున్నితే పంట పండేది కాదు.. దున్నకుండానే కాసులు కురిపించేది!! అందుకే పొలాలు పగలు రేకెత్తిస్తున్నాయి.. ఆస్తుల విలువ మానవీయ విలువల్ని తెంచేస్తున్నాయి. కలిసి పెరిగిన అన్నదమ్ములే హత్యలదాకా వెళుతున్నారు. గ్రామాల్లో భూవివాదాలు.. వాటి తాలూకూ నేరాలు పెరిగిపోతున్నాయి.

  • బతుకమ్మ చీరల పంపిణీ

తెలంగాణ సంబురం బతుకమ్మ పండుగ(Bathukamma Sarees distribution)ను పురస్కరించుకుని రాష్ట్ర సర్కార్ అందించే చీరలను ఈరోజు నుంచే పంపిణీ చేయనున్నారు. గ్రామ, వార్డు స్థాయి కేంద్రాలతో పాట ఇళ్ల వద్ద వీటిని అందజేస్తామని అధికారులు తెలిపారు. కరోనా దృష్ట్యా పంపిణీ విధానాన్ని నిర్ణయించే స్వేచ్ఛను జిల్లా కలెక్టర్లకు ఇచ్చినట్లు వెల్లడించారు.

  • వేడెక్కిన హుజూరాబాద్ బై పోల్

హుజూరాబాద్‌ ఉపఎన్నిక (Huzurabad By Election) నేపథ్యంలో తెరాస, భాజపాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తొలిరోజు నామినేషన్ వేసిన అధికార తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్ (Gellu Srinivas Yadav) తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు.

  • తొలిదశ ముగింపు సభ

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన పాదయాత్ర 'ప్రజాసంగ్రామ యాత్ర' (prana Sangrama yatra) తొలిదశ హుస్నాబాద్‌లో ముగియనుంది. ఈరోజు హుస్నాబాద్‌లో నిర్వహించే ముగింపు సభకు ముఖ్యఅతిథిగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీ హాజరుకానున్నారు. లక్ష మందితో బహిరంగ సభను నిర్వహించనున్నట్లు కమలనాథులు ప్రకటించారు. బహిరంగ సభ విజయవంతం కోసం బండి సంజయ్‌.. జిల్లా అధ్యక్షులు, ఇంఛార్జిలకు దిశానిర్దేశం చేశారు.

  • అవమానాలకు గురిచేసినా

పంజాబ్​ ముఖ్యమంత్రిగా అమరీందర్​ సింగ్(Amarinder Singh News) రాజీనామా చేసిన మరుసటి రోజే ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఇంఛార్జి హరీశ్ రావత్ స్పందించారు. ఏదో ఒత్తిడిలో ఉన్నందుకే కెప్టెన్​.. సీఎం పదవికి రాజీనామా చేశారని అన్నారు. ఈ వ్యాఖ్యలపై మండిపడ్డారు అమరీందర్ సింగ్. కాంగ్రెస్​ పార్టీపై విధేయతతో ఉన్నందునే ఎవరెన్ని అవమానాలకు గురిచేసినా భరించానని తెలిపారు.

  • పెట్టుబడులకు మోదీ ఆహ్వానం

అన్ని రంగాల్లో పెట్టుబడులకు భారత్​ సరైన దేశం అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. దుబాయ్​ ఎక్స్​పోలో(Dubai Expo 2021) భారత్​ పెవిలియన్​ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. 1080 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ ఎక్స్​పోలో 190కిపైగా దేశాలు పాల్గొంటున్నాయి.

  • వెంటనే తొలగించొద్దు

మహిళా అధికారులను వెంటనే తొలగించొద్దని సైన్యానికి ఆదేశించింది సుప్రీంకోర్టు(SC Order on Army). 72 మంది మహిళా షార్టు సర్వీసు కమిషన్‌ అధికారులను(Women Army) పర్మినెంట్‌ కమిషన్‌ అధికారులుగా తీసుకోవడానికి సైన్యం నిరాకరించిన నేపథ్యంలో.. జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌, జస్టిస్‌ బివి.నాగరత్నలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

  • చివరి పాట ఇదేనా?

సూపర్​స్టార్​ రజనీకాంత్​ నటించిన 'అన్నాత్తే'(Rajinikanth Annaatthe) సినిమాలోని తొలి లిరికల్​ సాంగ్​(Annaatthe Song) విడుదలకు సిద్ధమైంది. దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతాన్ని అక్టోబరు 4న(Annaatthe First Single Release Date) విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అయితే బాలు ఆలపించిన చివరి సినిమా పాట ఇదేనేమో అని నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు.

  • ప్లే ఆఫ్స్​ రేసు లక్ష్యంగా!

ఐపీఎల్ 2021(IPL 2021 News)లో భాగంగా నేడు (అక్టోబర్ 2) ముంబయి ఇండియన్స్- దిల్లీ క్యాపిటల్స్(mi vs dc 2021) మధ్య మ్యాచ్ జరగనుంది. ప్లే ఆఫ్స్ రేసులో నిలిచేందుకు ముంబయికి ఈ మ్యాచ్ చాలా కీలకం.

Last Updated : Oct 2, 2021, 9:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.