ETV Bharat / city

ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు - ఈటీవీ భారత్​ టాప్​ న్యూస్​

etv bharat top news
ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు
author img

By

Published : Aug 28, 2021, 5:59 AM IST

Updated : Aug 28, 2021, 9:58 PM IST

21:51 August 28

టాప్ న్యూస్​ @10PM

  • ప్రత్యక్ష బోధన సరికాదు..

ప్రీ ప్రైమరి, ప్రైమరీ తరగతులకు ప్రత్యక్ష బోధన నిలిపివేయాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. విచారణ పూర్తయ్యే వరకూ విద్యా సంస్థల్లో ప్రత్యక్ష బోధనకు అనుమతిస్తూ జారీ చేసిన మెమో అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని పిల్​లో కోరారు.

  • ఇలా అయితే ఎలా..?

గ్రేటర్ పరిధిలో అర్హులైన ప్రతి ఒక్కరికి టీకా అందించాలన్న లక్ష్యంతో బల్దియా, వైద్యఆరోగ్య శాఖ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యాక్సిన్ డ్రైవ్​కు ఆశించిన స్థాయిలో స్పందన లభించటం లేదు. వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించి దాదాపు వారం రోజులు అవుతుండగా.. ఇప్పటి వరకు సుమారు లక్షా ముప్పై వేల మందికి మాత్రమే టీకాలు అందించారు. 

  • తల్లి, కుమార్తె దారుణహత్య..

ఏపీలోని గుంటూరు జిల్లా సత్తెనపల్లి నాగార్జున నగర్​లో దారుణం చోటుచేసుకుంది. తల్లీకుమార్తెలను ఓ దుండగుడు పాశవికంగా కత్తితో నరికి చంపాడు. సమీప బంధువే ఈ హత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

  • నియంతృత్వ పాలనకు చరమగీతం..

ప్రజాసంగ్రామ యాత్రకు(Praja Sangrama Yatra) భాజపా(BJP) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(bandi sanjay) శంఖం పూరించారు. చార్మినార్(charminar) భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం.. యాత్రకు శ్రీకారం చుట్టారు.

  • ఒక్క డోసు చాలు!

కొవాగ్జిన్​పై(covaxin india) ఐసీఎంఆర్​ చేసిన అధ్యయంలో(icmr covid) కీలక విషయాలు వెలువడ్డాయి. కొవిడ్​ సోకని వారు టీకా రెండు డోసులు తీసుకుంటే ఉత్పన్నమయ్యే యాంటీబాడీల ప్రతిస్పందనలు.. వైరస్​ బాధితుల్లో ఒక్క డోసు వేసుకుంటేనే కనిపిస్తున్నాయని తేలింది.

21:51 August 28

టాప్ న్యూస్ @9PM

  • కాబుల్ దాడికి ఆర్​డీఎక్స్..

ఉగ్రవాదులే కాదు.. ప్రమాదకరమైన పేలుడు పదార్థాల తయారీకీ కేంద్ర బిందువుగా నిలుస్తోంది పాకిస్థాన్. ఆర్​డీఎక్స్, అమ్మోనియం నైట్రేట్, నకిలీ ఏకే-47లు... ఇలా దాడులకు కావాల్సిన సామగ్రిని లేదనకుండా ఉగ్రవాదులకు సరఫరా చేస్తోంది. ఐసిస్-కే చేసిన తాజా దాడుల్లో పాక్​లో తయారైన ఆర్​డీఎక్స్ మిశ్రమాన్నే వినియోగించినట్లు తేలింది.

  • ఆస్తుల జప్తు దిశగా..

మత్తు పదార్థాల కేసులో నిందితుల ఆస్తులు జప్తు చేయడమే లక్ష్యంగా... ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈసీఐఆర్ నమోదు చేసిన ఈడీ.. డ్రగ్స్ కొనుగోలు పెట్టుబడి నుంచి అక్రమంగా ఆర్జించిన లాభాల వరకు... కూపీ లాగేందుకు సిద్ధమవుతోంది. అంతిమ లబ్ధిదారులను గుర్తించి.. స్థిర, చరాస్తులను జప్తు చేసే దిశగా విచారణ సాగుతోంది. ఈనెల 31 నుంచి సినీ ప్రముఖుల విచారణ మొదలు పెట్టనుంది.

  • అల.. నీలకంఠాపురంలో..

ఏపీ పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి.. ఆయన కుటుంబ సభ్యులు నిర్మించిన దేవాలయాలను సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తన సతీమణితో కలిసి సందర్శించారు. అనంతరం దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి.. స్వామివార్లను దర్శించుకున్నారు. భట్టికి శాలువా కప్పి పూలమాలతో రఘువీరా సన్మానించారు.

  • కొత్తగా 325 కేసులు..

రాష్ట్రంలో గడిచిన 24గంటల వ్యవధిలో కొత్తగా 325 కొవిడ్​ కేసులు వెలుగుచూశాయి. మహమ్మారి బారిన పడి ఇద్దరు మరణించారు. కరోనా నుంచి కొత్తగా 424 మంది కోలుకున్నారు.

  • సింధుకు చిరు సత్కారం..

బ్యాడ్మింటన్ స్టార్​ పీవీ సింధును ప్రత్యేకంగా సత్కరించారు మెగాస్టార్ చిరంజీవి. ఈమేరకు ఇన్​స్టాగ్రామ్​లో సింధును పొగుడుతూ పోస్ట్​ చేశారు.

19:52 August 28

టాప్ న్యూస్ @8PM

  • ప్రపంచం గుర్తిస్తుందా?

ఆగస్టు 31లోపు అమెరికా దళాలు అఫ్గాన్​ను వీడటం ఖాయం. ఆ తర్వాత తాలిబన్లు ప్రభుత్వాన్ని(taliban government news) ఏర్పాటు చేయడం లాంఛనమే! అయితే తాలిబన్ల ప్రభుత్వాన్ని ప్రపంచ దేశాలు గుర్తిస్తాయా లేదా అన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

  • తక్షణం బడులు తెరవాలి..

పాఠశాలలను తక్షణం తెరవాల్సిన (School reopen) అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు పలువురు వైద్యులు, విద్యావేత్తలు. విద్యార్థులకు వెంటనే ప్రత్యక్ష తరగతులు నిర్వహించాలని కోరుతూ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు.

  • సినీ ఫక్కీలో చోరీ..

సమయం అర్ధరాత్రి దాటింది. రోడ్డుపై వాహనాలు వెళ్తూనే ఉన్నాయి. అవేమీ పట్టించుకోలేదు.. ఆ ఏడుగురు. ఐదుగురు దొంగతనం పనిలో ఉంటే.. మిగతా ఇద్దరు బయట కాపలా. బెడ్​ షీట్లను పరదాలుగా పెట్టి మొబైల్​ దుకాణంలోకి ప్రవేశించారు. దొరికినకాడికి సెల్​ఫోన్లను దోచుకున్నారు. సికింద్రాబాద్​ కార్ఖానా పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగిన ఈ దొంగతనం దృశ్యాలు.. సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి.

  • 'రోజా' టీచర్..

ఏపీలోని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా టీచర్​ అవతారమెత్తారు. చేతిలో పుస్తకం పట్టుకుని పిల్లలకు పాఠాలు బోధించారు. వారితో సరదాగా కాసేపు ముచ్చటించారు. ఇదేదో సినిమా షూటింగ్​ కోసం కాదండోయ్. మరి ఎక్కడంటారా..!

  • ప్రియాంక ముఖానికి గాయం..

ప్రముఖ నటి ప్రియాంకా చోప్రా తన ముఖంపై గాయాలున్న చిత్రాలను ఇన్​స్టాగ్రామ్​లో షేర్​చేసింది. 'సిటాడెల్' అనే యాక్షన్ సిరీస్​లో నటిస్తున్న ఆమె.. షూటింగ్‌ సందర్భంగా ఈ ఫొటోలను పోస్ట్ చేసింది.

18:52 August 28

టాప్ న్యూస్ @7PM

  • అర్మాన్ కోహ్లీ ఇంట్లో సోదాలు..

మాదకద్రవ్యాల కేసులో ఎన్​సీబీ విచారణ వేగంగా కొనసాగుతోంది. తాజాగా ఈ విషయంలో నటుడు అర్మాన్ కోహ్లీని విచారించేందుకు సిద్ధమయ్యారు అధికారులు. ఈ నేపథ్యంలో అతడి ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు.

  • ఖాళీ ఏటీఎంలు, ఆకలి కేకలు..

అఫ్గానిస్థాన్​పై సంక్షోభాలు దండయాత్ర చేస్తున్నాయి. కరవు, ఔషధాల కొరత, వ్యవసాయ సంక్షోభం... ఇలా అన్ని కష్టాలూ ఆ దేశాన్ని వెంటాడుతున్నాయి. దాదాపు 70 లక్షల మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. మరోవైపు, నగదు కొరతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

  • భార్య జననాంగాన్ని కుట్టేసిన భర్త..

భార్యపై అనుమానంతో(infidelity in marriage) అమానుషానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. ఆమె జననాంగాలను కుట్టేశాడు. తీవ్ర గాయలతో బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

  • మరో 1321 కరోనా కేసులు..

ఏపీలో కొత్తగా మరో 1321 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారిన పడి 19 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం 14, 853 యాక్టివ్​ కేసులున్నట్టు అధికారులు వెల్లడించారు.

  • కొత్త కబుర్లు..

కొత్త సినిమా కబుర్లు వచ్చేశాయి. ఇందులో రాజ్​తరుణ్​ కొత్త సినిమా టైటిల్, నితిన్​ 'మాస్ట్రో' విడుదల తేదీ వివరాలు ఉన్నాయి.

17:50 August 28

టాప్​ న్యూస్​ @6PM

  • కొత్త రూల్స్​..

సెప్టెంబరు నుంచి పీఎఫ్​ ఖాతాకు ఆధార్​ అనుసంధానం చేసిన ఖాతాల్లో మాత్రమే డబ్బులు జమకానున్నాయి. గ్యాస్​ ధర, జీఎస్​టీ ఫైలింగ్​లోనూ వచ్చే నెలలో కొన్ని కీలక మార్పులు రానున్నాయి. అవేంటంటే..

  • ఘోర పరాజయం..

ఇంగ్లాండ్​తో జరిగిన మూడో టెస్టులో ఘోర ఓటమి చవిచూసింది టీమ్ఇండియా. మూడో రోజు ఎంతో పట్టుదల ప్రదర్శించిన భారత బ్యాట్స్​మెన్ నాలుగో రోజు చేతులెత్తేయడం వల్ల ఇన్నింగ్స్​ 76 పరుగుల తేడాతో ఓడిపోయింది కోహ్లీసేన.

  • కొవాగ్జిన్​ ఒక్క డోసు చాలు!

  • నిర్లక్ష్యం చేయడం తగదు..

ఆంగ్లం మోజులో తెలుగును నిర్లక్ష్యం చేయడం తగదని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ(Justice Nv Ramana) వ్యాఖ్యానించారు. మాతృ భాష(mother tongue) లేనిదే మనిషికి మనుగడ లేదన్నారు. వీధి అరుగు, దక్షిణాఫ్రికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన భాషా సదస్సులో ఆయన వర్చువల్​గా ప్రసంగించారు.

  • వందశాతం అయ్యేదెప్పుడు..?

16:51 August 28

టాప్​ న్యూస్​ @ 5 PM

  • ఇక నుంచి హైకోర్టులో విచారణ.. 

హైకోర్టులో ప్రజాప్రతినిధుల కేసుల విచారణ జరగనున్నాయి. ఇక నుంచి ప్రతి గురు, శుక్రవారాల్లో మధ్యాహ్నం ఎంపీ, ఎమ్మెల్యేల కేసుల విచారణ జరపనున్నారు తాత్కాలిక సీజే జస్టిస్ ఎం.ఎస్.రామచందర్రావు

  • భాగ్యనగరంలో భారీ వర్షం..

హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా పడిన వానకు వివిధ పనుల నిమిత్తం బయటకొచ్చిన ప్రజలు తడిసిపోయారు. రహదారులపై నీరు చేరి తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. మరోవైపు రాష్ట్రంలో రేపు, ఎల్లుండి కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది.

  • కృష్ణా జలాలు ఏపీ వాడకుండా చూడాలి

హంద్రీనీవా నుంచి కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్‌ వాడుకోకుండా చూడాలని తెలంగాణ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌  మురళీధర్‌ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)ను కోరారు. ఈ మేరకు కేఆర్‌ఎంబీ ఛైర్మన్‌కు ఈఎన్‌సీ లేఖ రాశారు. బచావత్‌ ట్రైబ్యునల్‌ ప్రకారం శ్రీశైలం జలవిద్యుత్‌ కేంద్రం మాత్రమేనని లేఖలో ఈఎన్​సీ  పేర్కొన్నారు. హంద్రీనీవా నుంచి కృష్ణా బేసిన్‌ అవతలికి నీటి మళ్లింపునకు ట్రైబ్యునల్‌ అనుమతి లేదన్నారు. కృష్ణా బేసిన్‌ అవతలికి నీటి మళ్లింపుతో బేసిన్‌లోని తెలంగాణ ప్రాజెక్టులకు నష్టం జరుగుతుందని వివరించారు.

  • పాలిటెక్నిక్ తుది విడత సీట్లు కేటాయింపు

పాలిటెక్నిక్ తుది విడత సీట్లు కేటాయింపు ప్రక్రియ పూర్తైంది. రాష్ట్రంలోని 120 పాలిటెక్నిక్ కళాశాలల్లో 24,401 సీట్లు భర్తీ అయ్యాయి. 52 పాలిటెక్నిక్ కళాశాలల్లో సీట్లు పూర్తిగా భర్తీ అయ్యాయి. తుది విడత పూర్తయ్యేటప్పటికి రాష్ట్రంలో 4,653 పాలిటెక్నిక్ సీట్లు మిగిలాయి.  

  • తాలిబన్​ ఎఫెక్ట్​..

70వేల ఏకే-103 రైఫిళ్ల(ak-103 india) అత్యవసర కొనుగోలుకు రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంది భారత్​. తాలిబన్ల వశమైన అమెరికా ఆయుధాలు.. క్రమంగా ఇతర ఉగ్రసంస్థల చేతికి చిక్కే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండేందుకు ఈ చర్యలు చేపట్టింది భారత్​.

15:44 August 28

టాప్​ న్యూస్​ @ 3PM

టాప్​ న్యూస్​ @ 4 PM

  • 'ఐసిస్​-కే'లో 14 మంది వారే.. 

కాబుల్​ విమానాశ్రయం వద్ద దాడితో(Kabul airport blast) సర్వత్రా చర్చనీయాంశమైంది ఐసిస్​-కే ఉగ్రసంస్థ(ISKP terrorist group). మరిన్ని దాడులకు పాల్పడే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఈ క్రమంలోనే.. ఐసిస్​-కే ఉగ్ర ముఠాలో 14 మంది కేరళకు చెందినవారు ఉన్నట్లు సమాచారం. జైళ్లలో ఉన్నవారందరినీ తాలిబన్లు ఇటీవలే విడుదల చేసినట్లు తెలిసింది.

  • గణేశ్ ఉత్సవాలపై మంత్రుల సమీక్ష...

గణేశ్ ఉత్సవాలపై(ganesh chaturthi celebrations) మంత్రి తలసాని శ్రీనివాస్(talasani srinivas yadav) ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కరోనా నిబంధనల నడుమ ఈసారి వేడుకలు జరుపుకోవాలని సూచించారు. ఉత్సవాలతోపాటు శాంతిభద్రతలు కూడా చాలా ముఖ్యమని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు.

  • భారత్​లో దాడులకు పాక్​ కుట్ర!

భారత్​లో రక్తపాతాన్ని సృష్టించేందుకు ఊవిళ్లూరే జైషే మహమ్మద్​ సంస్థ మరో కుట్రకు తెరతీసింది. అఫ్గాన్​ను వశం చేసుకున్న తాలిబన్లను జైషే మహమ్మద్(jaish e mohammed news)​ నేతలు కలిశారు. భారత్​ కేంద్రబిందువుగా సాగే తమ కార్యకలాపాలకు మద్దతివ్వాలని తాలిబన్లను(taliban latest news) వారు కోరినట్టు భారత నిఘా వర్గాలకు సమాచారం అందింది.

  • భాజపా ఆదాయం 50శాతం పెరిగింది

భారతీయ జనతా పార్టీ ఆదాయం గణనీయంగా పెరిగిందని(BJP Income growth) ఓ నివేదిక పేర్కొన్న నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యంగ్యంగా స్పందించారు. తమ ఆదాయం ఎంత పెరిగిందో చెప్పాలని దేశ ప్రజలను ప్రశ్నించారు.

  • ప్రశంసల వర్షం

'శ్రీదేవి సోడా సెంటర్​' (sridevi soda center) చిత్రంలో సుధీర్​ నటన అద్భుతంగా ఉందన్నారు సుపర్​స్టార్​ మహేశ్​బాబు. ట్విట్టర్​ వేదికగా చిత్రబృందంలోని ప్రతి ఒక్కర్నీ పేరు పేరునా అభినందించారు.

14:40 August 28

టాప్​ న్యూస్​ @ 3PM

  • బ్లాక్​మెయిల్ కొత్తేమీకాదు..

టీపీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డిపై మంత్రి మల్లారెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. దొంగ పత్రాలు చూపెట్టి రేవంత్​ తనను బ్లాక్​ మెయిల్​ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఏవో కాగితాలు తీసుకొచ్చి తనపై ఆరోపణలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. రేవంత్ బ్లాక్ మెయిల్ కొత్తేమీకాదన్నారు. అప్పట్లోనే రేవంత్ గురించి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు.

  • మతాలకు భాజపా వ్యతిరేకం కాదు..

రాజకీయ మార్పునకు ప్రజా సంగ్రామ యాత్ర(praja sangrama yatra ) వేదిక కానుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​(bandi sanjay) పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల్లో విశ్వాసం, ఆత్మస్థైర్యం కల్పించేందుకే యాత్ర చేపట్టినట్లు చెప్పారు. ప్రజా సంగ్రామ యాత్రను చార్మినార్​ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి బండి సంజయ్​ ప్రారంభించారు.

  • నిందితులు అరెస్ట్​..

మైసూరులో కళాశాల విద్యార్థిని గ్యాంగ్​ రేప్​ చేసిన వారిని కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు కర్ణాటక హోం మంత్రి ఆరగ జ్ఞానేంద్ర వెల్లడించారు.

  • జన్​ ధన్​ ఖాతాలు@43 కోట్లు

2014లో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రధాన్​ మంత్రి జన్​ ధన్​ యోజన(PM Jan-Dhan Yojana)కు భారీ స్పందన లభించినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ పథకం కింద ఇప్పటి వరకు 43 కోట్ల మంది బ్యాంక్ ఖాతాలు తెరిచినట్లు (Jan-Dhan Yojana Account) పేర్కొంది. ఇందులో 55.47 శాతం మహిళలేనని వివరించింది.

  • అలా ఎప్పుడూ అనుకోలేదు..

తనను తాను దివ్యాంగురాలినని ఎప్పుడు అనుకోలేదని వెల్లడించింది భారత టేబుల్​ టెన్నిస్ ప్లేయర్​ భవీనాబెన్​ పటేల్ (Bhavinaben Patel). తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చని తెలిపింది. టోక్యో పారాలింపిక్స్​ టీటీ సెమీస్​లో విజయానంతరం ఆమె ఇంకా ఏయే విషయాలు చెప్పిందంటే?

13:41 August 28

టాప్​ న్యూస్​ @ 2 PM

  • మళ్లీ షురూ... ప్రభుత్వ భూముల వేలానికి సర్కారు సన్నద్ధం!

మరో దఫా భూమల వేలానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇటీవల కోకాపేట, ఖానామెట్​లోని భూములకు విక్రయించిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరోమారు ఖానామెట్, పుప్పాలగూడ భూముల వేలాన్ని చేపట్టింది. ఖానామెట్​లోని 22.79 ఎకరాల విస్తీర్ణం, పుప్పాలగూడలోని 94.56 ఎకరాల భూముల వేలం ప్రక్రియను చేపట్టింది. మొత్తం రెండు చోట్లా కలిపి 117.35 ఎకరాల విస్తీర్ణంలో 35 ప్లాట్లను వేలం వేయనున్నారు. ఇందుకోసం టీఎస్ఐఐసీ సోమవారం నోటిఫికేషన్ జారీ చేయనుంది. 

  • Kishan Reddy: 'కల్వకుంట్ల కుటుంబం ఒక్కటే బంగారు మయమైంది'

బంగారు తెలంగాణగా మారుస్తామన్న సీఎం కేసీఆర్(cm kcr)... అప్పుల రాష్ట్రంగా మార్చారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(kishan reddy) ఆరోపించారు. కేవలం కల్వకుంట్ల కుటుంబమే బంగారు కుటుంబంగా మారిందని అన్నారు. రాష్ట్రాన్ని రెండు కుటుంబాలు శాసిస్తున్నాయని ఆక్షేపించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య, నీతివంతమైన పాలన రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

  • REVANTH REDDY: పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి నాంపల్లి కోర్టు సమన్లు

ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డికి నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. అక్టోబర్ 4వ తేదీన విచారణకు హాజరవ్వాలని ఆదేశించింది.

  • వజ్రం రూపంలో రైతును వరించిన అదృష్టం

ఓ రైతుకు కాసుల పంట పండింది. రెండేళ్ల శ్రమకు ఫలితం దక్కింది. తన వ్యవసాయ భూమిలో సుమారు రూ.30 లక్షల విలువ చేసే వజ్రం దొరికింది(farmer found diamond). మధ్యప్రదేశ్​ పన్నా జిల్లాలో జరిగింది ఈ సంఘటన.

  • Yuvraj Singh: మాజీ క్రికెటర్ యువీకి హైకోర్టు హెచ్చరికలు

మాజీ క్రికెటర్​ యువరాజ్​ సింగ్ (Yuvraj Singh), తనపై పెట్టిన కేసులో సహకరించకుంటే అతడిపై చర్యలు తీవ్రంగా ఉంటాయని పంజాబ్-హరియాణా న్యాయస్థానం హెచ్చరించింది. గతంలో ఓ సామాజిక వర్గంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు గానూ గతేడాది యువీపై సామాజిక కార్యకర్త రజత్​ కల్సన్ కేసు పెట్టారు. ​

13:34 August 28

టాప్​ న్యూస్​ @ 1 PM

  • Minister KTR: హైదరాబాద్​లో పాత, కొత్త నగరం అనే తేడా లేకుండా అభివృద్ధి చేస్తున్నాం

జీహెచ్​ఎంసీ పరిధిలో పేద ప్రజల కోసం ప్రభుత్వం లక్ష రెండు పడక గదుల నిర్మించాలని నిర్ణయించింది. అందుకు అనుగుణంగా నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లను విడతల వారీగా లబ్ధిదారులకు అందిస్తోంది. దీనిలో భాగంగా మంత్రి కేటీఆర్​ చంచల్​గూడలోని రెండు పడక గదుల ఇళ్లను ప్రారంభించి... పట్టాలను లబ్ధిదారులకు అందించారు.

  • Bhavina Patel: 'ఒత్తిడిని జయిస్తే విజయం నీదే'

టోక్యో పారాలింపిక్స్​ టేబుల్​ టెన్నిస్​ ఫైనల్​కు దూసుకెళ్లిన భవీనాబెన్ పటేల్​ను (Bhavina Patel) ప్రధాని మోదీ (PM Modi) అభినందించారు. తుదిపోరులోనూ ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా విజయాన్ని అందుకోవాలని సూచించారు.

  • BH Series Registration: ఇకపై ఒకే దేశం.. ఒకే రిజిస్ట్రేషన్​!

దేశీయంగా ఒక రాష్ట్రంలో రిజిస్టర్​​ అయిన వాహనాన్ని మరో రాష్ట్రానికి తరలింపులో ఎదురయ్యే చిక్కులను అధిగమించేందుకు కేంద్రం కొత్త తరహా రిజిస్ట్రేషన్ ప్రక్రియను(New vehicle registration regime) తీసుకొచ్చింది. భారత సరీస్​ (BH-series) పేరుతో తీసుకొచ్చిన ఈ కొత్త విధానంతో దేశీయంగా ఎక్కడికెళ్లినా వాహనానికి రీ-రిజిస్ట్రేషన్​ అవసరం లేదని తెలిపింది.

  • Jabardasth latest promo: పవర్​స్టార్​ బర్త్​డే స్పెషల్​.. ఈసారి డబుల్​ ఫన్​

జబర్దస్త్​ కొత్త ప్రోమో (Jabardasth latest promo) వచ్చేసింది. అదే స్థాయిలో నవ్విస్తూ, ఎపిసోడ్​పై ఆసక్తి పెంచుతోంది. గబ్బర్​సింగ్​ గెటప్​లో హైపర్​ ఆది, సుడిగాలి సుధీర్​ చేసిన స్కిట్​ ఆకట్టుకుంటోంది.

13:25 August 28

టాప్​ న్యూస్​ @ 12 PM

  • Road Accident: పెళ్లింట విషాదం... నవవధువు, ఆమె తండ్రి దుర్మరణం

ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ఆమె ఆశలు సమాధయ్యాయి. పెళ్లి పారాణి ఆరకముందే.. ఆమె విగతజీవిగా మారింది. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురుతోనే ఆ తండ్రీ అనంతలోకాలకు పయనమయ్యాడు. పెళ్లింట విషాదం రెండు కుటుంబాల్లోనూ తీరని విషాదాన్ని నింపింది. ఈ హృదయ విదారక ఘటన నిర్మల్ జిల్లా పాత మద్ధిపడగలో చోటుచేసుకుంది.  

  • US Airstrike: అమెరికా ప్రతీకారం- ఐసిస్ స్థావరాలపై డ్రోన్​ దాడులు!

కాబుల్​ విమానాశ్రయం వద్ద ఐసిస్​-కే జరిపిన జంట ఆత్మాహుతి పేలుళ్లకు(Kabul Airport Blast ) అమెరికా ప్రతీకారం తీర్చుకుంటోంది. అఫ్గానిస్థాన్​లోని ఐసిస్ స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లతో  దాడులు(US Airstrike) చేసింది. ఈ నేపథ్యంలో కాబుల్ విమానాశ్రయాన్ని(Kabul Airport) ఖాళీ చేయాలని పౌరులను హెచ్చరించింది.

  • BCCI AGM 2021: 'సెప్టెంబర్​ తర్వాతే బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం'

ఈ ఏడాది నిర్వహించాల్సిన బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం (BCCI AGM 2021) సెప్టెంబర్​ 30లోపు ఉండదని కార్యదర్శి జై షా (BCCI Secretary Jay Shah) స్పష్టం చేశారు. కొవిడ్ నిబంధనల వల్ల ఆ కార్యక్రమం వాయిదా పడిందని వెల్లడించారు. తదుపరి కొత్త తేదీని నిర్ణయించాక అనుబంధ సంస్థలకు తెలియజేస్తామని పేర్కొన్నారు.

  • Bank Holidays In September 2021: సెప్టెంబరులో 12 రోజులు బ్యాంకు హాలిడేస్​​

సెప్టెంబరులో 12 రోజుల పాటు బ్యాంకులకు సెలవులున్నాయి(Bank Holidays In September 2021). తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే 7 రోజులు బ్యాంకు సేవలు నిలిచిపోనున్నాయి. ఆయా తేదీల్లో పనులుంటే ముందుగానే పూర్తి చేసుకోవటం ఉత్తమం.

  • Pushpa Movie Villain: 'పుష్ప' విలన్​ గుండు లుక్​ అదిరింది

దక్షిణాదిలో అన్ని భాషల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్న ఫహద్ ఫాజిల్​.. 'పుష్ప' చిత్రంలోనూ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు ఆయన ఫస్ట్​లుక్​ రిలీజ్ చేయగా, అదికాస్త అంచనాల్ని పెంచేస్తోంది.

11:10 August 28

టాప్​ న్యూస్​ @ 11 AM

  • ఏ దేశానికి ఎంత మళ్లించారు?

టాలీవుడ్ మత్తుమందుల కేసుపై ఈడీ దృష్టి సారించింది. ఇంటర్‌పోల్‌ సాయం తీసుకునైనా సరే... ఏ దేశానికి ఎంత మొత్తంలో నిధులు మళ్లించారన్నది తెలుసుకునేందుకు ప్రయత్నిస్తోంది. అమెరికాతోపాటు ఆస్ట్రియా, దక్షిణ ఆఫ్రికా, దక్షిణ అమెరికా దేశాల నుంచి కొరియర్‌ ద్వారా మత్తుమందులు దిగుమతి అయినట్లు ఆబ్కారీశాఖ ప్రాథమిక దర్యాప్తులో బయటపడింది.

  • వాట్సాప్ యూజర్లకు హెచ్చరిక!

వాట్సాప్​ తమ యూజర్లకు కీలక సూచనలు చేసింది. ఇటీవల వాట్సాప్​ను వినియోగించుకుని సైబర్ నేరాలు పెరిగిపోయిన నేపథ్యంలో.. మోడ్​ యాప్స్ (WhatsApp mods)​ వాడొద్దని సూచించింది​. ఏమిటి ఈ మోడ్​ యాప్స్​? వీటితో వచ్చే సమస్యలు ఏమిటి? అనే విషయాలు మీకోసం.

  • సాగర్ టు శ్రీశైలం లాంచీ సేవలు రద్దు..

నేటి నుంచి ప్రారంభం కావాల్సిన నాగార్జున సాగర్(nagarjuna sagar)-శ్రీశైలం(srisailam) లాంచీ సేవలు రద్దయ్యాయి. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సర్వీసులను వాయిదా వేసి వచ్చే నెల 4 నుంచి ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. సాగర్ నిండుకుండలా మారడంతో పర్యాటకులు ఈ సేవల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

  • పాఠశాలకు రాకపోయినా.. ఫుల్​ అటెండెన్స్​!

సెప్టెంబరు 1 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం(schools reopening in delhi) కానున్నాయి. అయితే.. కచ్చితంగా పాఠశాలకు రావాలని ఏ విద్యార్థినీ.. బలవంతపెట్టొద్దని దిల్లీ విద్యాశాఖ మంత్రి తెలిపారు. పాఠశాలలకు రానంత మాత్రాన ఆబ్సెంట్ వేయొద్దన్నారు.

  • కాస్త భిన్నంగా 'గ్రీన్​ మసాల ఇడ్లీ'

ఇడ్లీ అంటే చాలా మందికి బోరింగ్​గా అనిపిస్తుంది. అలాంటి వారికి ఇడ్లీతోనే కాస్త డిఫరెంట్​గా ట్రై చేసి.. 'గ్రీన్​ మసాల ఇడ్లీ'ని పెట్టేయండి. ఆ వంటకం ఎలా చేయాలో ఇది చదివేయండి.

09:50 August 28

టాప్​ న్యూస్​ @ 10 AM

  • పదోన్నతులకు లైన్ క్లీయర్...

సచివాలయ ఉద్యోగుల పదోన్నతుల వివాదం ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. హైకోర్టు ఆదేశాల మేరకు.. రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఉన్న పదోన్నతుల ప్యానల్​ను సవరించారు. 2014-15 నుంచి 2018-19 వరకు సహాయక, ఉప, సంయుక్త, అదనపు కార్యదర్శుల ప్యానళ్లను సవరించి సీనియారిటీ ఖరారు చేయగా.. సీఎస్ సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

  • కరోనా కేసులు

దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. తాజాగా ఒక్క రోజులో (Coronavirus India) 46వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. మరో 509 మంది మహమ్మారికి బలయ్యారు.

  • ర్యాంకుల కేటాయింపులో కీలక మార్పు

జేఈఈ మెయిన్‌, నీట్‌ ర్యాంకుల(JEE rank) కేటాయింపుల్లో ఈసారి కీలక మార్పు చేసింది ఎన్‌టీఏ. ఇప్పటివరకు వయసు ఎక్కువ ఉన్న వారికి ప్రాధాన్యం ఇచ్చి ముందు ర్యాంకు కేటాయిస్తుండగా, ఈసారి వయసును మినహాయించింది.

  • 'లవ్​స్టోరీ' లేనట్టే!

శేఖర్​ కమ్ముల దర్శత్వంలో తెరకెక్కిన 'లవ్​స్టోరీ' చిత్రం మరోసారి వాయిదా పడినట్లు సమాచారం. మరోవైపు సెప్టెంబరు 3న రిలీజ్​ కావాల్సిన 'సీటీమార్​' 10వ తేదీన విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

  • చిన్న మార్పులతో కొత్తదానిలా మీ పాత ఫోన్‌

చిన్నపాటి మార్పులతో పాత ఫోన్​ను కొత్తదానిలా తయారు చేసుకునే విధానం మీకు తెలుసా? అనవసరమైన యాప్స్​ను తొలగిస్తూ, ఎప్పటికప్పుడు అప్డేట్లు చేస్తూ ఉంటే ఫోన్​ కొత్తదానిలా పనిచేస్తుంది. ఇంకా ఏమేమి చేయాలంటే..

08:53 August 28

టాప్​ న్యూస్​ @ 9 AM

  • నెత్తురు పోటెత్తుతోంది..

‘జాతీయ ఆరోగ్య ముఖచిత్రం-2020’ విడుదల చేసిన నివేదిక తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా... దేశవ్యాప్తంగా గుబులు రప్పిస్తోంది. మలేరియా తగ్గు ముఖం పట్టడం కాస్త ఊరటనిచ్చినా... అధిక రక్తపోటు, మధమేహం, సుఖవ్యాధులు అధికంగా పెరిగి ఆందోళన కలిగిస్తున్నాయి. వీటితో పాటు ఏటేటా బలవన్మరణాలు పెరుగుతున్నాయి. మగవారే అధిక సంఖ్యలో ఆత్మహత్యలకు పాల్పడటం మరింత ఆందోళనకు గురిచేస్తోంది.

  • ఇంకా రూ.11 వేల కోట్లు కావాలి

‘హడ్కో’ నుంచి రూ.8,744 కోట్ల అప్పుతెచ్చి... రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టిన గృహనిర్మాణ శాఖకు నిధుల సమస్య ఎదురైంది. పనుల పురోగతిని బట్టి గుత్తేదారులకు చెల్లింపులు జరగాల్సి ఉండగా... మధ్యలోనే పనులు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ఇంకా రూ.11 వేల కోట్లు కావాలని గృహనిర్మాణ శాఖ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

  • కమలం పార్టీకి కాసుల పంట

ఆదాయం విషయంలో మరే జాతీయ పార్టీకి సాధ్యం కాని రీతిలో భారతీయ జనతా పార్టీ సత్తా చాటుతోంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఆ పార్టీకి రూ.2,410.09 కోట్ల ఆదాయం సమకూరగా, 2019-20లో ఏకంగా 50.34 శాతం అధికంగా రూ.3,623.28 కోట్లు(Electoral bonds Bjp) వచ్చాయి. కాంగ్రెస్‌ ఆదాయం 25.69 శాతం తగ్గిపోయింది.

  • టెస్టుల్లో ఇంగ్లాండ్ జట్టు డకౌట్లు రికార్డు

విజయవంతమైన క్రికెట్​ జట్లలో ఇంగ్లాండ్​(England) టీమ్ ఒకటి అనడంలో ఎలాంటి సందేహం లేదు​. కానీ, ఆ జట్టు ఓ చెత్త రికార్డును మరోసారి తన ఖాతాలో వేసుకునేలా కనిపిస్తోంది. సుదీర్ఘ ఫార్మాట్లో రెండో అత్యధిక డకౌట్లు నమోదు చేశారు ఆ జట్టు బ్యాట్స్​మెన్.​

  • ఉదయం పూట ఎక్కువగా తినండి.. లేకపోతే!

చాలామంది ఉదయం అల్పాహారం తీసుకునే విషయంలో ఆశ్రద్ధ చూపిస్తుంటారు. మధ్యాహ్నం తినొచ్చులే అనుకుంటారు. కానీ అలా చేయడం వల్ల బరువు తగ్గకపోగా మరింత పెరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయట.

08:08 August 28

టాప్​ న్యూస్​ @ 8AM

  • అమెరికా ప్రతీకారం

కాబుల్​ విమానాశ్రయం వద్ద ఐసిస్​-కే జరిపిన జంట ఆత్మాహుతి పేలుళ్లకు అమెరికా ప్రతీకారం తీర్చుకుంటోంది. అఫ్గానిస్థాన్​లోని ఐసిస్ స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లతో  దాడులు(US Airstrike) చేసింది. ఈ నేపథ్యంలో కాబుల్ విమానాశ్రయాన్ని ఖాళీ చేయాలని పౌరులను హెచ్చరించింది.

  • బైక్‌ను ఢీకొన్న లారీ.. ముగ్గురు దుర్మరణం

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెం వద్ద వేకువజామునే రోడ్డు ప్రమాదం జరిగింది. అటుగా వస్తున్న లారీ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘనటలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే చనిపోయారు. 

  • నోడల్‌ ఏజెన్సీగా కృష్ణా బోర్డు

పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్​ ఇరిగేషన్​ పనుల పరిశీలనకు ఏర్పాటు చేసిన కమిటీని 8 వారాల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించినా అమలు చేయకపోవడాన్ని ఎన్జీటీ ప్రశ్నించింది. కమిటీకి నోడల్‌ అధికారిగా ఉన్న తెలంగాణకు చెందిన గనులశాఖ డైరెక్టర్‌ సహకరించడంలేదని ఏపీ ప్రభుత్వంతో పాటు, పిటిషనర్‌ న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కమిటీ నోడల్‌ ఏజెన్సీగా కృష్ణా నదీ యాజమాన్య బోర్డును నియమిస్తూ ఎన్జీటీ ఉత్తర్వులు జారీ చేసింది.

  • డ్రగ్స్​ కేసులో మరో నటుడు అరెస్ట్​

ఎన్​సీబీ దర్యాప్తు చేస్తున్న డ్రగ్స్​ కేసులో మరో నటుడు అరెస్టు అయ్యాడు. బుల్లితెర నటుడు గౌరవ్​ దీక్షిత్​ నివాసంలో సోదాలు చేసిన ఎన్​సీబీ.. డ్రగ్స్​ను స్వాధీనం చేసుకుంది.

  • పోలీసుల్లో జవాబుదారీతనంతోనే...

సాధారణ ప్రజానికానికి భద్రత కలిపించే రక్షణ భటులే నేరాలకు (crimes by police) పాల్పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అక్రమ కేసులు, రాజకీయ పార్టీలకు ఊడిగం చేయడం, దందాలు ఇలా ఎన్నో కేసుల్లో పోలీసులే దోషులుగా (police power misuse) తేలిన సందర్భాలున్నాయి. రాజకీయ ఒత్తిళ్లతో కొందరు, స్వ ప్రయోజనాలకు మరికొందరు తెలిసి కూడా తప్పటడుగులు వేస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారమేమిటి?

07:01 August 28

టాప్​ న్యూస్​ @ 7AM

  • ఎంత దోచుకున్నారో తెలుసా

సైబర్ నేరగాళ్లు రోజురోజుకు పెట్రేగిపోతున్నారు. ధనార్జనే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతూ కోట్లు కొట్టేస్తున్నారు. రోజుకు రూ.40 లక్షల వరకు స్వాహా చేస్తున్నారంటే ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. గత రెండు నెలల్లో పోలీసులకు అందిన ఫిర్యాదుల ప్రకారం ఎంత డబ్బు పోగొట్టుకున్నారో తెలిస్తే షాక్ అవ్వక తప్పదు. 

  • ఈసారీ కులగణన లేనట్లే..!

కులాలవారీ జనగణన(caste census) డిమాండ్‌తో బిహార్‌ ముఖ్యమంత్రి(Bihar CM) నీతీశ్‌ కుమార్‌ నేతృత్వంలోని అఖిలపక్ష బృందం ప్రధాని మోదీని కలిసింది. నీతీశ్‌ వెంటే, ప్రతిపక్ష ఆర్‌జేడీ నేత తేజస్వీ యాదవ్‌ కూడా ఉన్నారు. సమగ్ర అభివృద్ధి పథకాలను రూపొందించేందుకు కులాలవారీ జనాభా లెక్కలు అత్యావశ్యకమని ప్రధానికి బిహార్‌ నేతలు విజ్ఞప్తి చేశారు. దీన్ని దేశవ్యాప్తంగా చేపట్టాలని సూచించారు.

  • అఫ్గానిస్థాన్​​లో భారతీయ చిత్రాలకు ఉన్న ఆదరణేే వేరు.

తాలిబన్ల గుప్పిట్లో ఉన్న అఫ్గానిస్థాన్​లో భారతీయ సినిమాది ప్రత్యేక స్థానం. 1974 మొదలుకొని దాదాపు ఐదు దశాబ్దాలుగా ఎన్నో బాలీవుడ్‌ చిత్రాలు అఫ్గానిస్థాన్‌లో చిత్రీకరణ జరుపుకొన్నాయి. ఆయా సందర్భాల్లో భారతీయ నటులకు బ్రహ్మరథం పట్టారు అఫ్గాన్‌ వాసులు, పాలకులు.

  • పోలియోను దాటి..

పారాలింపిక్స్​లో భారత్​కు తొలి పతకాన్ని ఖాయం చేసింది భారత టీటీ ప్లేయర్​ భవీనాబెన్ పటేల్ (Bhavina Hasmukhbhai Patel). ఎన్నో సవాళ్లను దాటి జీవితంలో విజేతగా నిలిచిన ఆమె.. ఇప్పుడదే పోరాట స్ఫూర్తితో పారాలింపిక్స్​లో సత్తా చాటింది. పోలియోను దాటి పారాలింపిక్స్​ పతకాన్ని చేరుకున్న భవీనాబెన్​ ప్రయాణం స్ఫూర్తిదాయకం.

  • 'ఐఓసీ రూ.లక్ష కోట్ల పెట్టుబడులు'

రాబోయే 4-5 ఏళ్లలో ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) రూ. లక్ష కోట్ల పెట్టుబడి పెట్టనుంది. అంతేకాక హరిత ఇంధనంపైనా దృష్టి పెట్టనున్నట్లు ఐఓసీ ఛైర్మన్‌ శ్రీకాంత్‌ మాధవ్‌ వైద్య తెలిపారు.

01:44 August 28

ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు

నా చివరి రక్తపుబొట్టు దాకా శ్రమిస్తా

ప్రాణత్యాగానికి సిద్ధపడి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విధంగానే దళితబంధు విజయవంతం కోసం కూడా అంతే గట్టిగా పట్టుబడతానని, "నా చివరి రక్తపుబొట్టు దాకా దళితుల సమగ్రాభివృద్ధి కోసం పోరాడుతా"నని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. కరీంనగర్ కలెక్టరేట్‌లో దళితబంధు అమలుపై సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

సంజయ్​ పాదయాత్ర

రాష్ట్రంలో భాజపాను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నేటి నుంచి ప్రజా సంగ్రామయాత్రకు శ్రీకారం చుట్టారు. తెరాస ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లో ఎండగట్టే విధంగా పాదయాత్రకు పూనుకున్నారు. చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆశీస్సులు తీసుకున్న తర్వాత జరిగే సభతో పాదయాత్ర ప్రారంభమవుతుంది. తొలివిడత యాత్ర ఇవాళ్టి నుంచి అక్టోబర్‌ 2 వరకు 35 రోజులపాటు సాగనుందని పార్టీ వర్గాలు తెలిపాయి.

దళిత బంధు సర్వే

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దళితబంధు లబ్ధిదారుల గణన యుద్ధ ప్రాతిపదికన సాగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుక్రవారం అధికారులతో సమీక్ష నిర్వహించి... సర్వే, పథక అమలు తీరుతెన్నులపై దిశానిర్దేశం చేశారు. సీఎం ఆదేశాల మేరకు లోతుగా అధ్యయనం చేస్తూ హుజూరాబాద్‌లో 450 మంది సిబ్బంది ఇంటింటా వివరాలు సేకరిస్తున్నారు.

ఘనంగా వీడ్కోలు

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన జస్టిస్ హిమా కోహ్లికి రాష్ట్ర హైకోర్టు, బార్ అసోసియేషన్ ఘనంగా వీడ్కోలు పలికాయి. తెలంగాణ హైకోర్టు, హైదరాబాద్ మధుర జ్ఞాపకాలను మిగిల్చాయని జస్టిస్ హిమా కోహ్లి పేర్కొన్నారు. హైకోర్టు న్యాయమూర్తులుగా మరో 13 మంది పేర్లను సిఫార్సు చేసినట్లు తెలిపారు.

మరో వెయ్యి కోట్లు

 ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 20 వేల కోట్ల రూపాయలు రుణంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా మరో వెయ్యి కోట్ల రూపాయల రుణం కోసం బాండ్లు జారీ చేసింది. బాండ్ల వేలం ద్వారా వెయ్యి కోట్ల రూపాయలను సమీకరించుకోనుంది.

డీపీఆర్​లు సిద్ధం చేయండి

కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం... అనుమతుల్లేని ప్రాజెక్టులకు ఆర్నెళ్లలోగా అనుమతులు తెచ్చుకోవాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కృష్ణా, గోదావరి నదులపై వివిధ దశల్లో ఉన్న ప్రాజెక్టుల సవివర నివేదికలు సిద్ధం చేయాలని నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ ఇంజినీర్లను ఆదేశించారు.

మృతులు 180 మంది పైనే!

కాబుల్ విమానాశ్రయం ఆత్మాహుతి దాడుల్లో మృతుల సంఖ్య 180 మందికి పైనే ఉండొచ్చని స్థానిక అధికారులు వెల్లడించారు. వీరిలో 169 మంది అఫ్గాన్లే ఉన్నారన్న అధికారులు మృతుల్లో 28 మంది తాలిబన్లు కూడా ఉన్నట్లు తెలిపారు. మరిన్ని దాడులు జరగొచ్చంటూ అమెరికా తాజా హెచ్చరిక జారీచేసింది.

రహస్య భేటీ!

మహారాష్ట్ర ప్రతిపక్షనేత దేవేంద్ర ఫడణవీస్, సీఎం ఉద్ధవ్​ ఠాక్రే రహస్యంగా సమావేశమయ్యారు. కేంద్రమంత్రి నారాయణ్ రాణే.. ఉద్ధవ్‌ ఠాక్రేను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన క్రమంలో వీరివురి భేటీ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

 స్నేహబంధాన్ని కోరుకుంటున్నారు

భారత్​ సహా ఇతర దేశాలతో తాలిబన్లు స్నేహ సంబంధాలు కోరుకుంటున్నట్లు ఆ సంస్థ ప్రతినిధి జైబుల్లా ముజాహిద్​ తెలిపారు. అఫ్గాన్​ ప్రజల ప్రయోజనాలకు సంబంధించి భారత్​ తమ విధానాన్ని ప్రకటించాలని కోరారు.

బ్యాటింగ్​కు దిగిన ఫ్యాన్..

భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు మైదానంలో మళ్లీ నవ్వులు పూశాయి. ఓ ఇంగ్లాండ్​ అభిమాని మరోసారి భారత జెర్సీ ధరించి బ్యాటింగ్​కు దిగబోయాడు. వైరల్​గా మారిన ఈ వీడియో కడుపుబ్బా నవ్విస్తోంది.

అద్భుత దృశ్య కావ్యాలివే!

'ఆజాది కా అమృత్' మహోత్సవాన్ని పురస్కరించుకుని చిత్రాంజలి@75 అనే ఈ-ఫోటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించింది కేంద్రం. దీనిలో భాగంగా ప్రజల్లో దేశభక్తిని నింపి.. స్ఫూర్తిని కలిగించిన 75 సినిమాల జాబితాను విడుదల చేసింది.

Last Updated : Aug 28, 2021, 9:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.