1.ఎర్రగడ్డ ఛాతి ఆస్పత్రిలో కరోనాతో మరో వ్యక్తి మృతి
హైదరాబాద్ ఎర్రగడ్డ ఛాతి ఆసుపత్రిలో కరోనా మహమ్మారితో మరో వ్యక్తి మృతి చెందారు. ఆసుపత్రి సిబ్బంది మృతదేహాన్ని తమకు ఇవ్వట్లేదని బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. మృతదేహాన్ని అప్పగించాలంటే ఆసుపత్రి సూపరింటెండెంట్ మహబూబ్‌ఖాన్ ఏం చెప్పారు ? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
2. ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయండి.. కేంద్ర బృందం సూచన
కరోనాపై రాష్ట్ర అధికారులతో కేంద్ర బృందం సమావేశమైంది. సీఎస్ సోమేశ్‌కుమార్, అధికారులతో కేంద్ర వైద్యారోగ్యశాఖ ప్రత్యేక బృందం భేటీ అయ్యింది. కొవిడ్ పరిస్థితులు, చికిత్స, సదుపాయాలు, ఇతర అంశాలపై చర్చించి ఏం సూచించిందంటే. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
3. ఒకే వేదికపై ఉత్తమ్, కేటీఆర్.. పీసీసీ చీఫ్‌కు మంత్రి అభినందనలు
నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో పర్యటించిన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డితో మంత్రి కేటీఆర్ ఏం అన్నారో మీరే చూడండి ? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
4. రూ.3.46 అప్పు తీర్చేందుకు 15 కి.మీ.నడక
ఒక్క రూపాయైనా, వేల రూపాయలైనా అప్పు అప్పే. బ్యాంకు సిబ్బంది ఈ నియమాలను తప్పనిసరిగా పాటిస్తారు. ఇలాగే వారి నిబంధనల్ని అనుసరిస్తూ.. అక్షరాలా మూడు రూపాయల నలభై ఆరు పైసల బాకీ చెల్లించేందుకు ఓ వ్యక్తి ఫోన్ చేసి ఏం అన్నారో తెలుసా ? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
5. 'లబ్ధి పొందటం మాని.. తక్షణమే ధరలు తగ్గించండి'
పెట్రోల్, డీజిల్ నంచి లబ్ధి పొందడం మానుకుని.. ఇంధన ధరలను వెంటనే తగ్గించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. స్పీక్ అప్ అగైనస్ట్ ఫ్యూయల్ హైక్" లో పాల్గొన్న రాహుల్ ప్రజలకు ఏం చెప్పారో తెలుసుకోవాలనుకుంటున్నారా ? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
6.మంగళవారం భేటీ కానున్న భారత్-చైనా సైన్యాధికారులు
భారత్-చైనా మధ్య లెఫ్టినెంట్ జనరల్ స్థాయిలో మంగళవారం సమావేశం జరగనుంది. ఈ భేటీకి చుషుల్ ప్రాంతం వేదిక కానుంది. ఇరు దేశాల మధ్య ఈ తరహా సమావేశం జరగడం ఇది మూడోసారి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
7. స్వల్పంగా దిగొచ్చిన పసిడి.. నేటి ధరలు ఇవే
పసిడి, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర సోమవారం రూ.26 దిగొచ్చింది. వెండి ధర ఫ్లాట్‌గా ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
8. సీఎం ఇంటి ముందే యువకుడి ఆత్మాహుతి యత్నం
ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ నివాసం ముందు ఓ యువకుడు నిప్పంటించుకుని ఆత్మాహుతికి యత్నించడం సంచలనం సృష్టించింది. పోలీసులు వెంటనే స్పందించి.. బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. అసలు సీఎం ఇంటి ముందు ఏం జరిగింది ? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
10.తొలిసారిగా ఆన్లైన్లో షూటింగ్ పోటీలు
కరోనా పరిణామాలతో ఓ షూటింగ్ లీగ్‌ను, తొలిసారి జూమ్ యాప్ ద్వారా నిర్వహించనున్నారు. ఈ పోటీల్ని ఫేస్బుక్లో లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
9.బాలీవుడ్ ప్రముఖులకు షాకిస్తున్న 'కరెంట్ బిల్'
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా బాలీవుడ్ సెలబ్రిటీలకూ భారీ మొత్తంలో కరెంట్ బిల్లు మోత మోగుతోంది. వీటిని సోషల్ మీడియాలో పంచుకున్నారు తారలు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిసిటీ బోర్డును ఎవరేమన్నారంటే ? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి