ETV Bharat / city

Telangana top News : టాప్ న్యూస్​ @ 11AM - TELUGU TOP TEN NEWS

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు
ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు
author img

By

Published : May 17, 2022, 10:59 AM IST

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం పొందిన రోగులకు ఉచితంగా పూర్తి స్థాయి కోర్సు ఔషధాలన్నింటినీ అందించాలని వైద్యారోగశాఖ ప్రణాళికలు రచిస్తోంది. సర్కారు దవాఖానాల్లో ప్రైవేటు ఔషధ దుకాణాల మూసివేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాల రూపకల్పనకు సిద్ధమవుతోంది. ఈ ప్రతిపాదనకు సీఎం పచ్చజెండా ఊపగానే దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.

  • నెల రోజుల పాటు రైతు రచ్చబండ..

వరంగల్‌ డిక్లరేషన్‌ను జనంలోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్‌ కార్యాచరణకు శ్రీకారంచుట్టింది. ఈనెల 21 నుంచి వచ్చేనెల 21 వరకు నెల రోజుల పాటు 400 వందలమంది పార్టీ ముఖ్య నేతలతో రైతు రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించాలని పీసీసీ నిర్ణయించింది. వరంగల్‌ డిక్టరేషన్‌లోని తొమ్మిది అంశాలపై పెద్ద ఎత్తున ప్లెక్సీలు, కరపత్రాలు ముద్రింప చేసి గ్రామ, గ్రామాన, ఇంటి ఇంటికి చేరవేసేందుకు రంగం సిద్ధం చేసింది.

  • జీవచ్ఛవాలుగా మారిన బిడ్డలు..

జీవితంలో తమ పిల్లలు గొప్పగా ఎదగాలని వారి పెళ్లిళ్లు చేసి, మనవలు మనవరాళ్లతో ఆడుకోవాలనే కల ఏ తల్లిదండ్రికైనా ఉంటుంది. బిడ్డల భవిష్యత్తు కోసం సర్వం ధారపోసిన వారికి మలిదశ జీవితంలో.... పిల్లల అండఎంతో అవసరం. కానీ పచ్చగా కళకళలాడాల్సిన తమ కలల పంట కళ్ల ముందే జీవచ్ఛవాలుగా మారిపోతుంటే.... వృద్ధాప్యంలో ఆ దంపతుల అనుభవించే యాతన బహుశా నరకంలోనూ ఉండదేమో. ఉన్న పొలం అమ్మేసినా కనిపించిన డాక్టర్‌ను వేడుకున్నా.... ఆస్పత్రుల బిల్లులు మిగిలాయి తప్పితే.... బిడ్డల ఆరోగ్యం మాత్రం బాగుపడిందిలేదు.

  • 'స్తంభం ఎక్కేందుకు.. కోర్టు మెట్లెక్కెంది'

కరెంటు స్తంభాలను సాధారణంగా లైన్‌మెన్‌ ఎక్కుతారు. దీనికోసం వారు ప్రత్యేక శిక్షణ తీసుకుంటారు. ఇలాంటి సాహసోపేతమైన వృత్తిలో ఒక యువతి పని చేస్తే ఎలా ఉంటుంది. కొంచెం వినడానికి వింతగా ఉంది కదూ..! కానీ, చట్టంతో పోరాడి మరి.. తెలంగాణ విద్యుత్‌ శాఖలో లైన్‌ విమెన్‌గా అర్హత సాధించింది.

  • ముఖ్యమంత్రిపై మహిళ కామెంట్స్​ వైరల్..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్​పై ఓ మహిళ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వ పథకాలు.. పేద ప్రజలకు మేలు చేసేలా లేవని ఆమె వ్యాఖ్యానించారు. వైకాపా ప్రభుత్వంపై గుంటూరు కలెక్టరేట్​లో మహిళ చేసిన విమర్శలు సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

  • తుపాకులు, కత్తులు, శూలాలతో బజరంగ్ దళ్ ట్రైనింగ్..!

తుపాకులు, కత్తులు, త్రిశూలాలతో బజరంగ్ దళ్ కార్యకర్తలు శిక్షణ తీసుకుంటున్న ఫొటోలు, వీడియోలు రాజకీయ దుమారానికి కారణమయ్యాయి. మతం పేరిట హింస ఎలా చేయాలో నేర్పుతున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించగా.. స్వీయ రక్షణలో శిక్షణ మాత్రమే ఇస్తున్నట్లు బజరంగ్ దళ్​ ప్రతినిధులు స్పష్టం చేశారు.

  • ఐపీఎల్ చరిత్రలో అత్యల్ప స్కోర్లు ఇవే..

ఐపీఎల్​ చరిత్రలో ఇప్పటివరకు అత్యల్ప స్కోరు నమోదు చేసిన చెత్త రికార్డు రాయల్​ ఛాలెంజర్స్ బెంగళూరు పేరు మీదే ఉంది. 2017లో కోల్​కతాతో జరిగిన మ్యాచ్​లో ఆర్​సీబీ 9.4 ఓవర్లలో కేవలం 49 పరుగులకే ఆలౌట్ అయింది. కోల్​కతా నిర్దేశించిన 132 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది. ఆర్​సీబీ తర్వాత అత్యల్ప స్కోర్లు నమోదు చేసిన జట్లు ఏవో ఇప్పుడు చూద్దాం..

  • బాలీవుడ్​ను షేక్ చేసేందుకు..

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సిరీస్​తో తెలుగు సినిమా పాన్​ఇండియా స్థాయికి ఎదిగింది. ఆ తర్వాత వచ్చిన కేజీఎఫ్​-1 సౌత్​ సినిమా సత్తాను బాలీవుడ్​లో చాటింది. కరోనా తర్వాత.. విడుదలైన ఆర్​ఆర్​ఆర్​, పుష్ప, కేజీఎఫ్​-2 సినిమాలైతే.. ఏకంగా హిందీ ఇండస్ట్రీని శాసించాయి. బాలీవుడ్​ స్టార్​ హీరోల సినిమాలు బాక్సాఫీస్​ వద్ద చతికిల పడగా.. సౌత్​ సినిమాలు.. ముఖ్యంగా తెలుగు మూవీస్​ కలెక్షన్ల సునామిని సృష్టించాయి.

  • చిదంబరంపై సీబీఐ మరో కేసు..

కాంగ్రెస్​ నేత చిదంబరం కుమారుడిపై సీబీఐ మరో కేసు నమోదు చేసింది. అక్రమ లావాదేవీలకు సంబంధించిన ఈ కేసులో భాగంగా.. దేశంలోని తొమ్మిది ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. సుమారు రూ. 50 లక్షలు తీసుకుని.. చైనాకు చెందిన పలువురికి వీసా ఇప్పించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కార్తీ చిదంబంరం.

  • భారీగా తగ్గిన కరోనా కేసులు..

Coronavirus Update India: దేశంలో ఒక్కరోజే 1,569 మందికి వైరస్​ సోకింది. మరో 19 మంది చనిపోయారు. కోలుకున్నవారి సంఖ్య 98.75 శాతానికి చేరింది.

  • ఇంటికెళ్లాక ఉచితంగా ఔషధాలు..

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం పొందిన రోగులకు ఉచితంగా పూర్తి స్థాయి కోర్సు ఔషధాలన్నింటినీ అందించాలని వైద్యారోగశాఖ ప్రణాళికలు రచిస్తోంది. సర్కారు దవాఖానాల్లో ప్రైవేటు ఔషధ దుకాణాల మూసివేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాల రూపకల్పనకు సిద్ధమవుతోంది. ఈ ప్రతిపాదనకు సీఎం పచ్చజెండా ఊపగానే దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.

  • నెల రోజుల పాటు రైతు రచ్చబండ..

వరంగల్‌ డిక్లరేషన్‌ను జనంలోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్‌ కార్యాచరణకు శ్రీకారంచుట్టింది. ఈనెల 21 నుంచి వచ్చేనెల 21 వరకు నెల రోజుల పాటు 400 వందలమంది పార్టీ ముఖ్య నేతలతో రైతు రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించాలని పీసీసీ నిర్ణయించింది. వరంగల్‌ డిక్టరేషన్‌లోని తొమ్మిది అంశాలపై పెద్ద ఎత్తున ప్లెక్సీలు, కరపత్రాలు ముద్రింప చేసి గ్రామ, గ్రామాన, ఇంటి ఇంటికి చేరవేసేందుకు రంగం సిద్ధం చేసింది.

  • జీవచ్ఛవాలుగా మారిన బిడ్డలు..

జీవితంలో తమ పిల్లలు గొప్పగా ఎదగాలని వారి పెళ్లిళ్లు చేసి, మనవలు మనవరాళ్లతో ఆడుకోవాలనే కల ఏ తల్లిదండ్రికైనా ఉంటుంది. బిడ్డల భవిష్యత్తు కోసం సర్వం ధారపోసిన వారికి మలిదశ జీవితంలో.... పిల్లల అండఎంతో అవసరం. కానీ పచ్చగా కళకళలాడాల్సిన తమ కలల పంట కళ్ల ముందే జీవచ్ఛవాలుగా మారిపోతుంటే.... వృద్ధాప్యంలో ఆ దంపతుల అనుభవించే యాతన బహుశా నరకంలోనూ ఉండదేమో. ఉన్న పొలం అమ్మేసినా కనిపించిన డాక్టర్‌ను వేడుకున్నా.... ఆస్పత్రుల బిల్లులు మిగిలాయి తప్పితే.... బిడ్డల ఆరోగ్యం మాత్రం బాగుపడిందిలేదు.

  • 'స్తంభం ఎక్కేందుకు.. కోర్టు మెట్లెక్కెంది'

కరెంటు స్తంభాలను సాధారణంగా లైన్‌మెన్‌ ఎక్కుతారు. దీనికోసం వారు ప్రత్యేక శిక్షణ తీసుకుంటారు. ఇలాంటి సాహసోపేతమైన వృత్తిలో ఒక యువతి పని చేస్తే ఎలా ఉంటుంది. కొంచెం వినడానికి వింతగా ఉంది కదూ..! కానీ, చట్టంతో పోరాడి మరి.. తెలంగాణ విద్యుత్‌ శాఖలో లైన్‌ విమెన్‌గా అర్హత సాధించింది.

  • ముఖ్యమంత్రిపై మహిళ కామెంట్స్​ వైరల్..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్​పై ఓ మహిళ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వ పథకాలు.. పేద ప్రజలకు మేలు చేసేలా లేవని ఆమె వ్యాఖ్యానించారు. వైకాపా ప్రభుత్వంపై గుంటూరు కలెక్టరేట్​లో మహిళ చేసిన విమర్శలు సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

  • తుపాకులు, కత్తులు, శూలాలతో బజరంగ్ దళ్ ట్రైనింగ్..!

తుపాకులు, కత్తులు, త్రిశూలాలతో బజరంగ్ దళ్ కార్యకర్తలు శిక్షణ తీసుకుంటున్న ఫొటోలు, వీడియోలు రాజకీయ దుమారానికి కారణమయ్యాయి. మతం పేరిట హింస ఎలా చేయాలో నేర్పుతున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించగా.. స్వీయ రక్షణలో శిక్షణ మాత్రమే ఇస్తున్నట్లు బజరంగ్ దళ్​ ప్రతినిధులు స్పష్టం చేశారు.

  • ఐపీఎల్ చరిత్రలో అత్యల్ప స్కోర్లు ఇవే..

ఐపీఎల్​ చరిత్రలో ఇప్పటివరకు అత్యల్ప స్కోరు నమోదు చేసిన చెత్త రికార్డు రాయల్​ ఛాలెంజర్స్ బెంగళూరు పేరు మీదే ఉంది. 2017లో కోల్​కతాతో జరిగిన మ్యాచ్​లో ఆర్​సీబీ 9.4 ఓవర్లలో కేవలం 49 పరుగులకే ఆలౌట్ అయింది. కోల్​కతా నిర్దేశించిన 132 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది. ఆర్​సీబీ తర్వాత అత్యల్ప స్కోర్లు నమోదు చేసిన జట్లు ఏవో ఇప్పుడు చూద్దాం..

  • బాలీవుడ్​ను షేక్ చేసేందుకు..

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సిరీస్​తో తెలుగు సినిమా పాన్​ఇండియా స్థాయికి ఎదిగింది. ఆ తర్వాత వచ్చిన కేజీఎఫ్​-1 సౌత్​ సినిమా సత్తాను బాలీవుడ్​లో చాటింది. కరోనా తర్వాత.. విడుదలైన ఆర్​ఆర్​ఆర్​, పుష్ప, కేజీఎఫ్​-2 సినిమాలైతే.. ఏకంగా హిందీ ఇండస్ట్రీని శాసించాయి. బాలీవుడ్​ స్టార్​ హీరోల సినిమాలు బాక్సాఫీస్​ వద్ద చతికిల పడగా.. సౌత్​ సినిమాలు.. ముఖ్యంగా తెలుగు మూవీస్​ కలెక్షన్ల సునామిని సృష్టించాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.