ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @11AM - Telugu top ten news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్​ టెన్​ న్యూస్​ @11AM
టాప్​ టెన్​ న్యూస్​ @11AM
author img

By

Published : Jul 18, 2021, 10:59 AM IST

కొత్తగా 41 వేల కేసులు

దేశంలో కొత్తగా 41,157 ‬కరోనా కేసులు బయటపడ్డాయి. శనివారం నాటి కేసులతో పోలిస్తే స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. కరోనాతో మరో 518 మంది ప్రాణాలు కోల్పోయారు. 42,004 మంది వైరస్ నుంచి విజయవంతంగా కోలుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

జలసవ్వడి

భారీ వర్షాల నేపథ్యంలో ప్రాజెక్టులకు ప్రవాహం పెరుగుతోంది. జూరాల జలాశయానికి ఎగువ నుంచి ప్రవాహం పెరగడంతో ప్రాజెక్టు గేట్లు తెరుచుకున్నాయి. శ్రీశైలం జలాశయానికి 85వేల క్యూసెక్కులకు పైగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది ముందుగానే ఎస్సారెస్పీలోకి భారీగా ప్రవాహం వచ్చి చేరింది. ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

హుజూరాబాద్​పై గురి

హుజూరాబాద్ ఉపఎన్నిక వ్యూహాలు ఖరారు చేయడంపై కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది. చలో రాజ్ భవన్ కార్యక్రమం విజయవంతం కావడంతో మరో పోరాటానికి సిద్ధమైంది. ఎన్నికల నిర్వహణ కమిటీ, రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో టీపీసీసీ సుదీర్ఘంగా చర్చించి కార్యాచరణ సిద్ధం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

అభ్యుదయ రైతు

ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి పంటలు పండించేందుకు సిద్ధమయ్యాడు. తనకిష్టమున్న రంగంలో కాలుమోపిన అతను సేంద్రియ పంటలు పండించి లక్షలు సంపాదిస్తున్నాడు. అంతేనా జాతీయస్థాయి పురస్కారానికి కూడా ఎంపికై అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. అతనెవరో తెలుసుకుందామా...? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9 నిమిషాల్లో వెంకయ్య చిత్రం

విమానాశ్రయానికి ఉపరాష్ట్రపతి రెడీ అవుతున్నారు. ఆయన రాక కోసం శంషాబాద్​లో భద్రతా సిబ్బంది వేచిచూస్తున్నారు. ఇంతలో ఓ కుర్రాడు వచ్చి.. ఆయన్ని కలవాలని.. బహుమతి ఇవ్వాలని సిబ్బందిని కాళ్లావేళ్లా పడుతున్నాడు. చివరికి అనుమతి సాధించాడు. నేరుగా ఉపరాష్ట్రపతి దగ్గరికి వెళ్లి తన విజ్ఞప్తి చేశాడు. సమయం కావస్తోన్నా.. విద్యార్థిని ప్రోత్సహించటం కోసం.. ఏకంగా తన ప్రయాణాన్నే కాస్త వాయిదా వేసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

19 మంది బలి

కొండచరియలు విరిగిపడగా ఓ గోడ కూలి 14 మంది మృతి చెందారు. మరో ఘటనలో భారీ వర్షాల కారణంగా భవనం కూలి ఐదుగురు మృతి చెందారు. మహారాష్ట్రలో ఈ ప్రమాదాలు జరిగాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

కమలదళంలో కలకలం!

దాదాపు నాలుగేళ్లు టీఎంసీకి దూరంగా ఉన్న ముకుల్‌ రాయ్‌, తనయుడు సుభ్రాన్షుతో కలిసి ఇటీవలే సొంత గూటికి చేరారు. ఈ పరిణామం కొత్తగా ప్రతిపక్ష హోదాను సంపాదించుకున్న కమలదళం గుండెల్లో గుబులు రేపుతోంది. ఈ విషయాన్ని బయటకు కనిపించకుండా భాజపా ధైర్యం కనబరుస్తోంది. 67ఏళ్ల ముకుల్‌ దూరమైతే పార్టీకి తీవ్ర నష్టం తప్పదనే వాదనలను ఆ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ కొట్టిపడేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఆ దేశాల్లో అనుమతి

కొవిషీల్డ్ టీకాను 16 ఐరోపా​ దేశాలు అధికారికంగా గుర్తించాయని సీరం సంస్థ సీఈఓ అదర్​ పూనావాలా వెల్లడించారు. ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారిని ఆ దేశాల్లోకి అనుమతిస్తున్నట్లు తెలిపాయన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఒలింపిక్స్​ కోసం పెళ్లి వాయిదా

టోక్యో ఒలింపిక్స్​కు వెళ్లిన ఏకైక భారతీయ మహిళా ఆర్చర్​గా దీపికా కుమారి(Deepika Kumari) ఘనత నెలకొల్పింది. ఈ ఏడాది జరిగిన ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్​షిప్​లో ఒకేరోజు మూడు స్వర్ణాలను సాధించి సత్తా చాటింది. ఇదే ఉత్సాహంతో టోక్యో ఒలింపిక్స్​లో(Tokyo olympics) బంగారు పతకం సాధిస్తానంటోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

విలన్ పాత్రలకు డిక్షనరీ లాంటోడు!

ప్రతివారం ప్రముఖ నటీనటుల గురించి ఆసక్తికర విషయాలతో ముందుకొచ్చే 'ఈటీవీ భారత్'.. ఈ ఆదివారం మరో సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు జీవితాన్ని మీ ముందు ఉంచుతుంది. ఎన్నో అద్భుత పాత్రల్లో నటించి, గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి కోట శ్రీనివాస్. విలనీలో సునామీ సృష్టించారు కోట. తొలుత అతడి ఉద్యోగం.. బ్యాంకులో లక్షలు లెక్కబెట్టే పని. మరి తర్వాత!! అదే కోట సినీలోకంలో తన ఖాతాకు చేరిన కోట్లాది అభిమానులను లెక్కిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.