ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​ @5PM

author img

By

Published : Jun 25, 2021, 4:57 PM IST

Updated : Jun 25, 2021, 5:03 PM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్​ టెన్​ న్యూస్​ @5PM
టాప్​ టెన్​ న్యూస్​ @5PM

'చెత్త నుంచి సంపాదన'

చెత్త నుంచి సంపాదన సృష్టించేలా కృషి జరుగుతోందని మంత్రి కేటీఆర్​ అన్నారు. చెత్తను పునర్వినియోగించేలా ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌ నాగోల్‌ సమీపంలో నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్‌ ప్లాంట్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ రీసైక్లింగ్​ ప్లాంట్​ ఏర్పాటుతో.. దిల్లీ, అహ్మదాబాద్‌, సూరత్‌, విశాఖపట్నం నగరాలతో పాటు సీ అండ్‌ డీ ప్లాంట్‌ను కలిగిన ఐదో నగరంగా హైదరాబాద్ నిలిచింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

హాజరు కాని నామా..

రాంచీ ఎక్స్‌ప్రెస్ హైవే ప్రైవేట్ లిమిటెడ్‌ రుణాల కేసులో ఈడీ విచారణ చేపట్టింది. ఇవాళ విచారణకు హాజరు కావాలని ఎంపీ నామా నాగేశ్వర రావుకు ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ ఆదేశాలు జారీ చేసింది. కానీ ఈడీ ఎదుట విచారణకు ఎంపీ నామా హాజరు కాలేదు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

కేంద్రమంత్రికే ఝలక్​

కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్​ ప్రసాద్​కు ట్విట్టర్ షాక్​ ఇచ్చింది. గంట పాటు మంత్రి ట్విట్టర్​ అకౌంట్​ను యాక్సెస్ చేసుకునే వీలు లేకుండా చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'ఆక్సిజన్' రగడ

కరోనా రెండో దశ ఉద్ధృతిలో దిల్లీకి ఆక్సిజన్​ సరఫరాపై రాజకీయంగా దుమారం రేగింది. కేజ్రీవాల్ సర్కార్ తప్పుడు లెక్కలు చెప్పి, అవసరానికి మించి ప్రాణవాయువు పొందిందని భాజపా ఆరోపించగా.. ఆప్ తిప్పికొట్టింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఆత్మనిర్భర్​ భారత్​కు నిదర్శనం

భారత్​ స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మిస్తున్న విమాన వాహక నౌకను వచ్చే ఏడాది అందుబాటులోకి తీసుకురానున్నట్లు రక్షణ మంత్రి రాజ్​నాథ్​ తెలిపారు. ఆత్మనిర్భర భారత్​లో భాగంగా దీనిని రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

టీకా తీసుకుంటేనే జీతం

టీకాకు, నెల జీతానికి ముడి పెడుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జారీ చేసిన ఉత్తర్వులపై అసోం ప్రభుత్వ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీకా తీసుకోవడం అనేది స్వచ్ఛందంగా జరగాలని, ఒకరు ఒత్తిడి చేయకూడదని అంటున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

తగ్గిన బంగారం ధర

పసిడి ధర కాస్త తగ్గింది. శుక్రవారం పది గ్రాముల మేలిమి పుత్తడి (Gold rate in India) ధర దిల్లీలో రూ.46,350 దిగువకు చేరింది. కిలో వెండి (Silver rate in India) ధర మాత్రం రూ.330కుపైగా పెరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

లాభాల జోరు

ఒడుదొడుకుల సెషన్​ను లాభాలతో ముగించాయి స్టాక్ మార్కెట్లు. వారాంతపు సెషన్​లో సెన్సెక్స్ (Sensex Today) 226 పాయింట్లు లాభపడి.. 52,900 ఎగువకు చేరింది. నిఫ్టీ (Nifty Today) 70 పాయింట్ల లాభంతో.. 15,850 పైన స్థిరపడింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

కండోమ్​ తయారీదారులకు నిరాశ

కరోనా నిబంధనల్లో భాగంగా జపాన్​ కండోమ్​ తయారీదారులకు ఆంక్షలు జారీ చేసింది ఒలింపిక్ నిర్వాహక కమిటీ. ప్రీమియం కండోమ్​ల పంపిణీని చేపట్టవద్దని సూచించింది. తాజా నిబంధనలు తమ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని వారు ఆందోళన చెందుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

హీరోయిన్​కు చేదు అనుభవం

కథానాయిక నివేదా పేతురాజ్​(Nivetha Pethuraj) చెన్నైలోని ఓ హోటల్​పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆన్​లైన్​లో ఆమె ఆర్డర్​ చేసిన ఫుడ్​లో బొద్దింక(cockroach in food) రావడమే అందుకు కారణం. దీనిపై ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్​ పెట్టిన ఆమె.. ఇలాంటి రెస్టారెంట్లపై జరిమానా విధించాలని ఆమె పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Last Updated : Jun 25, 2021, 5:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.