మెడికల్ మొబైల్ యూనిట్ బస్సులు
హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద జరిగిన కార్యక్రమంలో... 30 మెడికల్ మొబైల్ యూనిట్ బస్సులను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. బాధితుల్ని ఆదుకునేందుకు ముందుకొచ్చిన 'ది లార్డ్స్ చర్చి' బృందాన్ని కేటీఆర్ అభినందించారు. కొవిడ్ వల్ల ఆరోగ్య సిబ్బంది గొప్పతనం మరోసారి అందరికీ తెలిసిందన్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
రాష్ట్రానికి వర్షసూచన
కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని... వాటి ప్రభావంతో రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్నట్లు వాతావరణ సంచాలకురాలు డాక్టర్ నాగరత్న తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు చోట్ల అతి భారీ వర్షాలు నమోదైనట్లు వెల్లడించారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
అప్పుడే ఆనందయ్య చుక్కల మందు
ఆనందయ్య కంటి చుక్కల మందుపై హైకోర్టులో విచారణ జరిగింది. స్టెరిలిటీ టెస్టుకు సంబంధించి పూర్తి నివేదిక రావాల్సి ఉందన్న ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. పూర్తి నివేదిక కోసం మరో 3 నెలలు పడుతుందని.. నివేదిక రాకుండా చుక్కల మందుకు అనుమతి ఇవ్వలేమని తెలిపింది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
సెల్‌ఫోన్ కోసం సూసైడ్
సెల్‌ఫోన్ కోసం అక్కాతమ్ముళ్ల మధ్య జరిగిన గొడవ.. ప్రాణం తీసింది. క్షణికావేశంతో అక్క ఆత్మహత్యకు పాల్పడింది. మంచిర్యాల జిల్లా చిన్నబుదా గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకుంది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
'నాలుగేళ్లలో ఆయుష్మాన్ భారత్‌కు 7% నిధులే'
ఆయుష్మాన్ భారత్ యోజన అమలు కోసం కేంద్రం బడ్జెట్లో భారీ స్థాయిలో కేటాయింపులు జరిపినా.. చెల్లింపులు మాత్రం అంతంతమాత్రమేనని సహ చట్టం దరఖాస్తు ద్వారా వెల్లడైంది. గత నాలుగేళ్లలో రూ.21,360కోట్లకుగాను... జాతీయ ఆరోగ్య సంస్థకు రూ.1,540 కోట్లు మాత్రమే అందాయని తెలిసింది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
ఆ చిన్నారుల సంరక్షణకు మార్గదర్శకాలు
కరోనా కారణంగా ప్రభావితమైన చిన్నారుల సంరక్షణకు కేంద్రం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ఇలాంటి చిన్నారులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి ఓ డేటాబేస్‌ను రూపొందించాలని సూచించింది. తల్లిదండ్రులకు వైరస్ సోకి తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న చిన్నారులను తాత్కాలిక పునరావాసం కింద సంరక్షణ కేంద్రాలకు పంపించాలని స్పష్టం చేసింది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
వ్యాక్సినేషన్లో చైనా జోరు
చైనాలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కాస్త ఆలస్యంగానే మొదలైంది. కానీ, ఇప్పుడు మిగతా దేశాల కంటే.. వేగంగా టీకా పంపిణీ అక్కడ జరగుతోంది. గత నెలలో ఐదు రోజుల వ్యవధిలోనే 10 కోట్లు టీకా డోసులను అక్కడి ప్రభుత్వం అందజేసింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన టీకా డోసుల్లో ఒక్క చైనాలో మూడో వంతు టీకా డోసుల పంపిణీ జరిగింది. అసలింతకీ వ్యాక్సినేషన్లో ఇంతటి వేగంతో చైనా ఎలా దూసుకెళ్తోంది? పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
సెన్సెక్స్ ప్లస్
స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. గురువారం సెషన్లో సెన్సెక్స్ (Sensex Today) 383 పాయింట్లు పెరిగి.. 52,200 మార్క్ దాటింది. నిఫ్టీ (Nifty Today) 114 పాయింట్లు బలపడి.. 15,700లకు చేరువైంది. ఆర్థిక, లోహ రంగాలు లాభాలకు దన్నుగా నిలిచాయి. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
ఇంగ్లాండ్ చేరుకున్న భారత జట్లు
సుదీర్ఘ పర్యటన కోసం భారత మహిళల, పురుషుల క్రికెట్ జట్లు(Team India off to England) ఇంగ్లాండ్ చేరుకున్నాయు. గురువారం ప్రత్యేక విమానంలో ఇరుజట్లు కలిసే అక్కడికి. యూకే చేరుకున్న వీరంతా పది రోజులు క్వారంటైన్లో ఉండనున్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మహేశ్-త్రివిక్రమ్ సినిమాలో 'వకీల్‌సాబ్' భామ!
'సర్కారు వారి పాట' తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఓ చిత్రంలో నటించనున్నారు సూపర్‌స్టార్ మహేశ్‌బాబు. 2022 వేసవిలో ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. అయితే ఇందులోని ఓ కీలకపాత్ర కోసం నివేథా ధామస్‌ను ఎంపికచేసినట్లు టాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.