కొవిడ్‌పై సీఎం ఆరా
రాష్ట్రంలో నెలకొన్న కరోనా పరిస్థితులపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ప్రగతిభవన్‌లో వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో భేటీ అయిన సీఎం... కరోనా పరిస్థితులు, నియంత్రణ చర్యలు, వ్యాక్సినేషన్‌పై చర్చించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
టీకా ఆగొద్దు
కరోనా పరిస్థితులపై.. ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించారు. ఆరోగ్య, మౌలిక సదుపాయాల కల్పన కోసం రాష్ట్రాలకు సహకారం కొనసాగుతుందని స్పష్టం చేశారు. పలు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ వేగం పెంచాలని అధికారులకు సూచించారు ప్రధాని. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
సర్వే పథం
జీహెచ్ఎంసీ పరిధిలోని బొగ్గులకుంట అర్బన్ హెల్త్ సెంటర్‌ను సీఎస్ సోమేశ్ కుమార్ ఆకస్మికంగా సందర్శించారు. అక్కడ సిబ్బంది పనితీరు, ర్యాపిడ్ ఫీవర్ సర్వే వివరాలపై ఆరా తీశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
రేపే స్టాలిన్ ప్రమాణం
తమిళనాడు సీఎంగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ సహా మంత్రులుగా మరో 34 మంది నేతలు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఆ పది రాష్ట్రాల్లోనే..
దేశంలో కరోనా వ్యాప్తిపై కేంద్రం కీలక ప్రకటన విడుదల చేసింది. కొత్తగా నమోదైన కేసుల్లో 72 శాతం.. మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్, దిల్లీ, కర్ణాటక, కేరళ, హరియాణా, బంగాల్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ల్లోనే నమోదవుతున్నట్లు కేంద్రం తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
కేంద్ర మంత్రి కాన్వాయ్‌పై దాడి
కేంద్ర మంత్రి మురళీధరన్ కాన్వాయ్‌పై బంగాల్లో దాడి జరిగింది. 'టీఎంసీ గూండాలే' ఈ దాడికి పాల్పడ్డారని మంత్రి ఆరోపించారు. ఈ ఘటనపై స్పందించిన కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్.. నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. తృణమూల్ హింస మితిమీరిపోతోందని అన్నారు భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
స్పుత్నిక్ లైట్ పేరుతో కొత్త టీకా
రష్యాకు చెందిన గమలేయ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సరికొత్త టీకాను అభివృద్ధి చేసింది. స్పుత్నిక్ లైట్ పేరుతో తయారు చేసిన ఈ టీకా ఒక్క డోసుతోనే కరోనా నుంచి రక్షణ కల్పిస్తుందని ప్రకటించింది. రెండు డోసులు అవసరం లేనందున... వ్యాక్సినేషన్ రేటు రెండింతలు అవుతుందని వివరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
లాభాల జోరు
స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 272 పాయింట్ల లాభంతో 48,950 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 107 పాయింట్లు పెరిగి 14,725 వద్దకు చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
రైనాకు సోనూసూద్ సాయం
క్రికెటర్ సురేశ్ రైనా ట్వీట్‌కు బదులుగా, ప్రముఖ నటుడు సోనూసూద్ ఆక్సిజన్ సిలిండర్ ఏర్పాటు చేశారు. దీనిని కేవలం 10 నిమిషాల్లోనే పంపించినట్లు తన ట్విట్టర్లో పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
అథ్లెట్లకు ఫ్రీ వ్యాక్సిన్
టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే అథ్లెట్లకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందించేందుకు ఫైజర్, బయోఎన్‌టెక్ ముందుకు వచ్చాయి. ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ తెలిపింది. ఈ నెలలోనే వాటి సరఫరా మొదలవుతుందని వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.