ఏపీలో పాక్షిక కర్ఫ్యూ
ఏపీలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండటంపై కొవిడ్ నియంత్రణకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎల్లుండి నుంచి ఆంక్షలు, పాక్షిక కర్ఫ్యూ అమలు చేయనున్నారు. ఉ.6 నుంచి మ.12 వరకే దుకాణాలకు అనుమతిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'ఆ నివేదిక పచ్చి అబద్ధం'
ఈటల రాజేందర్ తనపై చేసిన ఆరోపణలపై మీడియా సమావేశంలో స్పందించారు. తాను ప్రేమతోనే లొంగుతాను తప్పా.. భయపెడితే లొంగిపోయే వాడిని కాదని హెచ్చరించారు. చావునైనా భరిస్తా.. ఆత్మాభిమానాన్ని అమ్ముకోనని ప్రకటించారు. త్వరలో భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఐఏఎస్‌లతో కమిటీ
మాజీ మంత్రి ఈటల రాజేందర్ సహా.. మరికొందరు దేవాలయ భూములు ఆక్రమించారంటూ వస్తున్న కథనాలపై రాష్ట్రప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట్ మండలం దేవరయాంజల్ సీతారామ ఆలయ భూముల ఆక్రమణలపై విచారణకు నలుగురు ఐఏఎస్‌లతో కమిటీని నియమించింది. అన్ని అంశాలకు సంబంధించి వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
తెరాస ఖాతాలో అచ్చంపేట
నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మున్సిపల్ ఎన్నికల్లో తెరాస విజయకేతనం ఎగరవేసింది. మొత్తం 20 వార్డుల్లో ... తెరాస 13 స్థానాలు గెలుచుకుని మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్నీ కైవసం చేసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
విజయోత్సవ ర్యాలీలపై నిషేధం
ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల విజయోత్సవ ర్యాలీలపై ఎస్‌ఈసీ నిషేధం విధించింది. కౌంటింగ్ హాల్, బయట జనసమూహాలు ఏర్పడకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. కౌంటింగ్ ప్రక్రియలో కొవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు చేపట్టామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
మాజీ ఎంపీ సబ్బం హరి మృతి
ఏపీలోని విశాఖ మాజీ ఎంపీ సబ్బం హరి(69) కన్నుమూశారు. కరోనాతో విశాఖలోని ఆపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
గవర్నర్‌తో భేటీ కానున్న మమత
తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ.. ఆ రాష్ట్ర గవర్నర్‌తో సోమవారం సాయంత్రం 7 గంటలకు భేటీ కానున్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతించాలని ఈ సమావేశంలో కోరనున్నట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
మరోసారి పాక్ వక్రబుద్ధి
భారత్-పాక్ సరిహద్దు వద్ద పాకిస్థాన్ రేంజర్లు మరోసారి కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
నడుస్తోన్న జానపదాల ట్రెండ్
టాలీవుడ్లో ఇప్పుడు జానపద గేయాల ట్రెండ్ నడుస్తోంది. తెలుగు మూలాలైన పల్లెల యాస నుంచి వస్తున్న ఈ పాటలపై దర్శకులు తమ సినిమాల్లో ఉంచేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటి సాంగ్స్ ఇప్పుడు నెట్టింట నయా ట్రెండ్‌ను సృష్టిస్తున్నాయి. ఎప్పుడూ లేని విధంగా యూట్యూబ్‌లో కొత్త రికార్డులను సొంతం చేసుకుంటున్నాయి. ఇంతకీ ఆ జానపద గీతాలేవో తెలుసా! పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
వన్డేల్లో మూడో ర్యాంకుకు భారత్
ఐసీసీ టీ20, వన్డే టీమ్‌ల వార్షిక ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది అంతర్జాతీయ క్రికెట్ మండలి. టీమ్ఇండియా పొట్టి ఫార్మాట్లో రెండో స్థానాన్ని నిలబెట్టుకోగా.. వన్డేల్లో మాత్రం ఒక స్థానాన్ని కోల్పోయి మూడో ర్యాంకులో నిలిచింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.