కేసీఆర్కు నెగెటివ్
ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా నుంచి కోలుకున్నారు. ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలో సీఎంకు కొవిడ్ నెగెటివ్ నిర్ధరణ అయింది. స్వల్ప లక్షణాలతో ఈ నెల 19న కేసీఆర్ కొవిడ్ పరీక్ష చేసుకోగా... పాజిటివ్ వచ్చింది. అప్పట్నుంచి వైద్యుల సూచన మేరకు సీఎం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ఐసోలేషన్లో ఉన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'మరింత జాగ్రత్త అవసరం'
గత వారం నుంచి రాష్ట్రంలో పరిస్థితులు కుదుటపడుతున్నాయని డీహెచ్ శ్రీనివాస్ తెలిపారు. కరోనా వేళ ప్రజలందరూ సహకరిస్తున్నారని... రాష్ట్రంలో కేసుల్లో స్థిరత్వం ఉందన్నారు. వచ్చే మూడు, నాలుగు వారాలు కీలకమన్న డీహెచ్ శ్రీనివాస్... వచ్చేది పెళ్లిళ్లు, పండగల సీజన్ కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
విజయోత్సవ ర్యాలీలపై నిషేధం
మినీ పురపోరు ఓట్ల లెక్కింపు అనంతరం విజయోత్సవ ర్యాలీలపై రాష్ట్ర ఎన్నికల సంఘం నిషేధం విధించింది. కొవిడ్ విజృంభణ నేపథ్యంలో ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. గెలుపొందిన అభ్యర్థులు, వారి పార్టీలు, అనుచరులు ఎలాంటి ర్యాలీలు చేపట్టరాదని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'బలవంతపు చర్యలు వద్దు'
ఇళ్ల స్థలాలు, భవనాల క్రమబద్ధీకరణ అంశం... ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్లపై దాఖలైన పిటిషన్లన్నింటిపైనా విచారణను హైకోర్టు ముగించింది. అనధికార లేఅవుట్‌లు, భవనాల క్రమబద్ధీకరణపై విచారణ జరపగా.. ఎల్ఆర్ఎస్పై విచారణ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. బలవంతంగా అమలుకు చర్యలు చేపట్టవొద్దని ఆదేశించిన హైకోర్టు... సుప్రీంకోర్టు నిర్ణయించే వరకు ఎల్ఆర్ఎస్ అమలు చేయొద్దని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
యువతకు టీకా
దేశవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారు కరోనా టీకా పొందేందుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. కొవిన్ పోర్టల్ సహా, ఆరోగ్య సేతు అప్లికేషన్లో అర్హులైన వారు రిజిస్టర్ చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ధర తగ్గించిన సీరం
రాష్ట్రాలకు ఇవ్వనున్న టీకాల ధరను సీరం సంస్థ తగ్గించింది. రూ.300కే టీకా అందించనున్నట్లు ప్రకటించింది. గతంలో టీకా ధర రూ.400 అని ప్రతిపాదించిన సీరం.. తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
నోటి మందు
కొవిడ్ చికిత్సలో భాగంగా నోటి ద్వారా తీసుకునే ఔషధాన్ని వచ్చే ఏడాదిలోగా తీసుకువస్తామని ఫైజర్ వెల్లడించింది. నోటి ద్వారా, ఇంజక్షన్ రూపంలో తీసుకునే రెండు ఔషధాల (యాంటివైరల్)పై ప్రయోగాలు కొనసాగుతున్నాయని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
మూడో రోజు లాభాల జోరు
వరుసగా మూడో రోజు భారీ లాభాలతో ముగిశాయి స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 790 పాయింట్లు పెరిగి 49,700 మార్క్ దాటింది. నిఫ్టీ 211 పాయింట్ల లాభంతో 14,850 పైకి చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'పంత్ భవిష్యత్ కెప్టెన్'
దిల్లీ క్యాపిటల్స్ సారథి పంత్.. ఆటగాడిగా, నాయకుడిగా అభివృద్ధి చెందుతున్నాడని అన్నాడు మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా. భవిష్యత్‌లో భారత జట్టుకు కెప్టెన్ అవుతాడని విశ్వాసం వ్యక్తం చేశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'సేవే ముఖ్యం'
కరోనా కష్టకాలంలో ఎంతోమందికి సేవచేస్తూ తన మంచి మనసు చాటుకుంటున్నారు నటుడు సోనూసూద్. తాజాగా ఓ ట్వీట్ చేస్తూ రూ.100 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించే సినిమాలో చేయడం కంటే ప్రజలకు సేవ చేయడమే ముఖ్యమని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.