24 మంది బలి
మహారాష్ట్ర నాసిక్‌లోని జాకీర్ హుస్సేన్ ఆస్పత్రిలో ఆక్సిజన్ ట్యాంక్ లీకేజీ కారణంగా 24 మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు. మరో 29 మందిని వేరే ఆస్పత్రులకు తరలించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. అనంతరం విచారణకు ఆదేశించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
కమనీయ వేడుక
భక్తుల సందడి లేకున్నా... శ్రీరామ నామస్మరణ మార్మోగకున్నా... భద్రాద్రి దివ్యక్షేత్రంలో సీతారాముల కల్యాణం... కనుల పండువగా జరిగింది. జానకీరాముల పరిణయ వేడుకతో.. స్వర్గం దిగొచ్చినట్ల్లైంది. భూలోకం వైకుంఠమైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ముఖ్యమంత్రికి సిటీస్కాన్
కరోనా మహమ్మారి బారినపడిన కేసీఆర్.. హైదరాబాద్‌లోని సోమాజిగూడ యశోదా ఆస్పత్రిలో సిటీ స్కాన్ సహా ఇతర పరీక్షలు చేయించుకున్నారు. ఆయన ఇటీవల కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
టీకా కార్యాచరణ
అందరికీ కొవిడ్ టీకాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభిస్తోంది. వచ్చే నెల నుంచి 18ఏళ్ల పైబడిన వారికి కూడా వ్యాక్సినేషన్‌కు కేంద్రం అనుమతిచ్చింది. దీంతో వీలైనంత త్వరగా అందరికీ వ్యాక్సిన్లు ఇప్పించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన కసరత్తు ప్రారంభించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
వేంకటాద్రే అంజనాద్రి
ఆంజనేయుడి జన్మస్థలం అంజనాద్రినేనని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారికంగా ప్రకటించింది. చారిత్రక, వాంజ్ఞ్మయ, భౌగోళిక, శాసనపరమైన ఆధారాలను క్షుణ్ణంగా పరిశోధించిన అనంతరం ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తున్నట్లు పండితుల కమిటీ తెలిపింది. దేశంలో వివిధ ప్రాంతాల నుంచి హనుమత్ జన్మస్థానంపై వినిపిస్తున్న వాదనలను తోసిపుచ్చుతూ అంజనాద్రిగా నిర్ధారించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఎన్నికలకే ఓటు..!
మినీ పురపోరును పూర్తిచేయాలన్న భావనతో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు వాయిదా వేయాలన్న కాంగ్రెస్, భాజపాల వినతిని పరిశీలించాలని.. ఎస్ఈసీకి హైకోర్టు సూచించింది. అటు ఎస్ఈసీ కూడా ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'కొవాగ్జిన్' 78 శాతం ప్రభావవంతం
కొవాగ్జిన్ టీకా.. కరోనా వైరస్‌ను అడ్డుకోవడంలో 78 శాతం సమర్థతను ప్రదర్శించినట్లు భారత్ బయోటెక్, ఐసీఎంఆర్ ప్రకటించాయి. మూడో దశ క్లీనికల్ ట్రయల్స్‌కు సంబంధించి రెండో విడత మధ్యంతర ఫలితాలు వెల్లడించాయి. టీకా తీసుకున్న వారికి కరోనా సోకినప్పటికీ అది ప్రాణాంతకంగా పరిణమించకుండా అడ్డుకోవడంలో కొవాగ్జిన్ టీకా 100 శాతం సమర్థతను రుజువు చేసుకుందని తెలిపాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఆరో విడత పోలింగ్
బంగాల్లో ఆరో విడత అసెంబ్లీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 43 అసెంబ్లీ స్థానాలకు గురువారం పోలింగ్ జరగనుంది. ఇదివరకు జరిగిన ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు చెలరేగిన నేపథ్యంలో ఈసీ పటిష్ట చర్యలు చేపట్టింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
సన్‌రైజర్స్ విజయం
పంజాబ్ కింగ్స్ జట్టుపై సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలుపొందింది. 9 వికెట్ల తేడాతో టోర్నీలో తొలి విజయాన్ని నమోదు చేసుకుంది వార్నర్‌సేన.ఐపీఎల్లో చెన్నై వేదికగా బుధవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలుపొందింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'ఆదిపురుష్'లో సీత పాత్ర కోసం
'ఆదిపురుష్' సినిమాలోని తన పాత్ర(సీత) కోసం ఓ పుస్తక పఠనం ద్వారా సన్నద్ధమవుతోంది నటి కృతిసనన్. బుధవారం షూటింగ్లో పాల్గొనడానికి ముంబయికి చేరుకుందీ భామ. ఆ సమయంలోనే ఆమె చేతిలో ఈ పుస్తకం కనిపించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.