ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​ @3PM - top ten news till now

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు.

top ten news
టాప్​ టెన్​ న్యూస్​ @3PM
author img

By

Published : Apr 21, 2021, 3:00 PM IST

1.ఘోర ప్రమాదం

మహారాష్ట్ర నాసిక్​లోని డా. జాకీర్​ హుస్సేన్​ ఆసుపత్రిలో ఘోర ప్రమాదం జరిగింది. ఆక్సిజన్​ ట్యాంకర్​ లీకేజీ కారణంగా.. 22 మంది రోగులు చనిపోయారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2.'ఇంటికే వచ్చి పరీక్షలు చేస్తారు..'

మహబూబ్​నగర్​ జిల్లాలో 3 కొవిడ్​ మొబైల్​ క్లినిక్​ అంబులెన్సు సేవలను మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ ప్రారంభించారు. ఫోన్​ ద్వారా సమాచారమిస్తే ఇంటికే వచ్చి పరీక్షలు చేస్తారని తెలిపారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ప్రైవేటు టీచర్లకు మంత్రి బియ్యం పంపిణీ చేశారు. కర్ఫ్యూకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3.రాములోరి కల్యాణం

భద్రాద్రి రాములోరి కల్యాణ వేడుక కరోనా వైరస్‌ నేపథ్యంలో ఎన్నడూ లేని విధంగా కొద్దిమంది సమక్షంలోనే నిరాడంబరంగా జరిగింది. అభిజిత్‌ లగ్నంలో రాముడు, జగన్మాత సీతమ్మ మెడలో... మాంగళ్యధారణ చేశారు. ప్రభుత్వం తరపున మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి, పువ్వాడ అజయ్‌ కుమార్‌... స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఎప్పుడూ వైభవోపేతంగా జరిగే జగదభిరాముడి కళ్యాణాన్ని నేరుగా చూడలేకపోయిన భక్తులు... టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4.కొవాగ్జిన్​ పనితీరు భేష్​

కరోనాపై పోరుకు దేశీయ ఫార్మా సంస్థ భారత్‌ బయోటెక్‌ రూపొందించిన కొవాగ్జిన్‌.. కొత్తరకం మ్యుటేషన్ల పైనా సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు పరిశోధనల్లో వెల్లడైంది. ఈ మేరకు ఐసీఎంఆర్​ ప్రకటన విడుదల చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5.కొవిషీల్డ్ టీకా ధర ప్రకటన

కొవిషీల్డ్ టీకా ధరను సీరం సంస్థ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు సింగిల్​ డోసు టీకాను రూ.400కు సరఫరా చేయనున్నట్లు తెలిపింది. ప్రైవేటు ఆస్పత్రులకు సింగిల్ డోసుకు రూ.600 చొప్పున విక్రయించనున్నట్లు పెర్కొంది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6.పుదుచ్చేరిలో లాక్​డౌన్​

వైరస్​ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతున్న కారణంగా మరికొన్ని రాష్ట్రాలు ఆంక్షల దిశగా అడుగులేశాయి. పుదుచ్చేరిలో నాలుగు రోజుల పాటు లాక్​డౌన్​ విధించనున్నట్లు పేర్కొంది. 10 శాతం ఉద్యోగులే కార్యాలయాలకు వెళ్లాలని మధ్యప్రదేశ్​ సర్కారు నిర్ణయించింది. మరోవైపు వైరస్​ను కట్టడిలో భాగంగా డీఆర్​డీఓ సంస్థ.. హరియాణాలో ఆసుపత్రులను నిర్మించినట్లు పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7.ఐదుగురు మృతి

కర్ణాటక యాదగిరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు కూలీలు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8.ఉత్తమ పెట్టుబడులు ఇవే!

తక్కువ రిస్క్​తో పెట్టుబడికి అందుబాటులో ఉన్న సాధనాల్లో.. మ్యూచువల్ ఫండ్లు, గోల్డ్ ఈటీఎఫ్, ప్రభుత్వ బాండ్లు ముఖ్యమైనవి. మరి వీటిలో పెట్టుబడి పెట్టడం ఎలా? ఎలాంటి అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9.'టీకా ఇవ్వమని ఏ అథ్లెటూ కోరలేదు'

టోక్యో ఒలింపిక్స్​కు మరో 3 నెలల సమయం మాత్రమే ఉంది. వ్యాక్సినేషన్​కు సంబంధించి ఈ మెగా ఈవెంట్​లో పాల్గొనే అథ్లెట్ల నుంచి ఇప్పటివరకు అభ్యర్థనలేమీ రాలేదని ఒలింపిక్స్​ నిర్వాహక కమిటీ తెలిపింది. ఈ సారి ఖాళీ స్టేడియాల్లోనే ఒలింపిక్స్​ను నిర్వహించాల్సి వస్తుందని నిర్వాహక కమిటీ అభిప్రాయపడింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10.రష్మికకు విజయ్ దేవరకొండ ప్రపోజ్!

రౌడీహీరో విజయ్ దేవరకొండ, రష్మిక మరోసారి కలిసి నటించారు. ఇందులో భాగంగా ఓ ప్రత్యేక బహుమతిని మోకాళ్లపై కూర్చొని విజయ్ ఆమెకు ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.