ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​ @9PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు.

top ten news
టాప్​ టెన్​ న్యూస్​ @9PM
author img

By

Published : Apr 18, 2021, 8:56 PM IST

1.ఘోర రోడ్డుప్రమాదం

వారంతా ఇటుక బట్టీల్లో పనిచేసే కార్మికులు. కూరగాయల కోసం మార్కెట్​కు వెళ్లారు. తమకిష్టమైన కూరగాయలు కొనుక్కున్నారు. సంతోషంగా అక్కడి నుంచి బయల్దేరారు. ఇంతలోనే వారు ప్రయాణిస్తున్న లారీ కారును ఢీకొట్టి బోల్తా పడింది. అప్పటిదాకా ఆనందంగా గడిపిన వారు చెల్లాచెదురుగా పడ్డారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృత్యువాతపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2.కరోనా కట్టడి చర్యలు

హైదరాబాద్​లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. మొదటి దశగా రానున్న 4 రోజుల్లో గ్రేటర్ వ్యాప్తంగా అన్ని రద్దీ ప్రదేశాల్లో బ్లీచింగ్‌ పౌడర్​ను చల్లాలని పురపాలక మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3.టీకా కావాలె..

టీకాల సమస్యను కేంద్రం త్వరగా పరిష్కరించాలని మంత్రి ఈటల రాజేందర్ కోరారు. మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లక్షణాలు కనిపించకపోవడం వల్లనే వైరస్ వ్యాప్తి అధికంగా ఉంటుందని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4.విజృంభిస్తున్న కొవిడ్​

రాష్ట్రంలో కరోనా కేసులు రోజుకో రికార్డు సృష్టిస్తున్నాయి. ఇవాళ ఏకంగా ఐదు వేల కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 5వేల 93 కరోనా కేసులు నమోదైనట్టు వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. అటు మరణాలు సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. నిన్న ఒక్క రోజే 15 మంది కొవిడ్‌-19కు బలయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5.ఒక్కరోజే 1500 మరణాలు

భారత్​లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా 2,61,500 మందికి వైరస్ సోకగా.. 1501 మంది మరణించారు. లక్షా 23 వేల మందికిపైగా వైరస్​ను జయించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6.ఆక్సిజన్​ సరఫరాకు ప్రత్యేక రైళ్లు

ఆక్సిజన్ కొరత తీర్చేందుకు రైల్వే శాఖ ముందుకొచ్చింది. మెడికల్ ఆక్సిజన్​ను దేశవ్యాప్తంగా సరఫరా చేసేందుకు ప్రత్యేక రైళ్లను నడిపేందుకు సిద్ధమైంది. ఈ రైళ్లకు ఆక్సిజన్ ఎక్స్​ప్రెస్​గా నామకరణం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7.రాష్ట్రాలు కఠిన ఆంక్షలు

కరోనా ఉద్ధృతిని కట్టడి చేసేందుకు వివిధ రాష్ట్రాలు కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. తమిళనాడులో రాత్రి 10 నుంచి ఉదయం 4 గంటలవరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది. ఈ నెల 20 నుంచి ప్రతి ఆదివారం పూర్తి స్థాయి లాక్​డౌన్​ ఉంటుందని చెప్పింది. మరోవైపు బిహార్​ ప్రభుత్వం కూడా తమ రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8.విలయ తాండవం

దిల్లీలో కరోనా పరిస్థితి తీవ్రంగా ఉందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. పాజిటివిటీ రేటు ఏకంగా 30 శాతానికి చేరిందని ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే రెండు-మూడు రోజుల్లో పాఠశాలలు, క్రీడా ప్రాంగణాలను ఆసుపత్రులుగా మార్చనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9.బెంగళూరు హ్యాట్రిక్​

చెన్నై వేదికగా కోల్​కతాతో జరిగిన మ్యాచ్​లో కోహ్లీ సేన 38 పరుగుల తేడాతో విజయం సాధించింది. లక్ష్య ఛేదనలో మోర్గాన్ సేన 166 పరుగుల వద్ద నిలిచిపోయింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది ఆర్సీబీ. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10.చివరి షెడ్యూల్​లో 'రాధేశ్యామ్'

మరో మూడు నెలల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న 'రాధేశ్యామ్' చివరి షెడ్యూల్​తో బిజీగా ఉంది. ప్రస్తుతం ప్రభాస్​పై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.