ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​ @9PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు.

top ten news
టాప్​ టెన్​ న్యూస్​ @9PM
author img

By

Published : Apr 16, 2021, 8:50 PM IST

1.గాంధీలో కేవలం కొవిడ్​ సేవలే..

రాష్ట్రంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో మరోమారు గాంధీ ఆస్పత్రిని పూర్తి స్థాయిలో కొవిడ్ కేర్ సెంటర్​గా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతేడాది మార్చి 24న తొలిసారిగా గాంధీ ఆస్పత్రిని పూర్తిగా కొవిడ్ నోడల్ కేంద్రంగా సర్కారు మార్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2.అప్రమత్తతే రక్ష

సెకండ్ వేవ్ కరోనా వేగంగా వ్యాపిస్తున్నందున.. మహమ్మారి నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ఆరోగ్య మంత్రి ఈటల సూచించారు. అవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటకు రాకూడదని చెప్పారు. రాష్ట్రంలో లాక్​డౌన్, కర్ఫ్యూ పెట్టే ఆస్కారం లేదని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3.పవన్​కు కరోనా పాజిటివ్​

సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ కరోనా బారిన పడ్డారు. ఇటీవల ఆయన స్వీయ నిర్బంధంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా చేసిన పరీక్షల్లో ఆయనకు పాజిటివ్‌ వచ్చింది. వైద్యుల ఆధ్వర్యంలో ఆయనకు చికిత్స జరుగుతోందని జనసేన పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4.దివ్యాంగులకు అండ

ఎల్బీ స్డేడియం​లో దివ్యాంగులకు మంత్రి కేటీఆర్... ఉచితంగా​ ఉపకరణాలు పంపిణీ చేశారు. 24 కోట్ల రూపాయల విలువైన పరికరాలను దివ్యాంగులకు అందజేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5.ఆక్సిజన్ కొరతపై ప్రధాని దృష్టి

దేశంలో సరిపడా మెడికల్ ఆక్సిజన్​ సరఫరా కోసం ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆక్సిజన్​ కొరత ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులతో సమీక్ష సందర్భంగా ఆదేశించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6.బంగాల్​ పోల్స్​

బంగాల్ శాసనసభ ఎన్నికల ఐదో విడత పోలింగ్​కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం 45 నియోజకవర్గాలకు ఓటింగ్ జరగనుంది. 342 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. నాలుగో దశ పోలింగ్​లో అవాంఛనీయ సంఘటనలు జరిగిన నేపథ్యంలో.. ఎన్నికల సంఘం ఈసారి అదనపు బలగాలను మోహరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7.గాలి ద్వారా కొవిడ్​

గాలి ద్వారానూ కరోనా వ్యాప్తి చెందుతున్నట్లు అంతర్జాతీయ నిపుణుల బృందం స్పష్టం చేసింది. తాజాగా ఈ నివేదిక ప్రముఖ అంతర్జాతీయ సైన్స్‌ జర్నల్‌ 'ది లాన్సెట్‌'లో ప్రచురితమైంది. కొవిడ్‌-19కు కారణమైన 'సార్స్‌-కోవ్‌-2' వైరస్‌ గాలి ద్వారా వ్యాపిస్తుందన్న వార్తల మధ్య.. వీటిని నిర్ధరించేందుకు బ్రిటన్‌, అమెరికా, కెనడాకు చెందిన ఆరుగురు నిపుణుల బృందం నడుం బిగించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8.వారాంతంలో స్వల్ప లాభాలు

వరుసగా మూడో సెషన్​లోనూ స్టాక్ మార్కెట్లు లాభాలను గడించాయి. సెన్సెక్స్ స్వల్పంగా 28 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 36 పాయింట్ల లాభంతో 14,600 మార్క్ దాటింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9.ధోనీ మరో రికార్డు

చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోనీ రికార్డు సృష్టించాడు. ఆ జట్టు తరఫున 200 మ్యాచ్​లాడిన మొదటి ఆటగాడిగా ఘనత వహించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10.సందీప్​ కిషన్​ సినీ ప్రస్థానం

హీరో సందీప్​ కిషన్​.. ఈ పేరు వింటే 'వెంకటాద్రి ఎక్స్​ప్రెస్​', 'ప్రస్థానం' సినిమాలు గుర్తుకువస్తాయి. 'ప్రస్థానం'తో సందీప్​ సినీ అరంగేట్రం చేసి నేటికి 11ఏళ్లు. ఆ చిత్రంలో సందీప్​.. చిన్నా అనే పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.