ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​ @9PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు.

top ten news
టాప్​ టెన్​ న్యూస్​ @9PM
author img

By

Published : Apr 3, 2021, 8:58 PM IST

1.ఎయిర్​స్ట్రిప్​లు మంజూరు చేయండి..

హైదరాబాద్ పర్యటనకు వచ్చిన కేంద్ర పౌర విమానయాన శాఖ కార్యదర్శి ప్రదీప్​సింగ్ ఖరోలా ప్రగతి భవన్​లో సీఎం కేసీఆర్​తో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయాలని నిర్ణయించిన 6 ఎయిర్​ స్ట్రిప్‌ల సత్వర మంజూరు కోసం చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రదీప్​ సింగ్​ను కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2.'వరి సాగులో మనమే టాప్​'

దేశంలోని మిగతా రాష్ట్రాలకు వ్యవసాయ పాఠాలు నేర్పేవిధంగా తెలంగాణ అభివృద్ధి చెందిందని మంత్రి కేటీఆర్‌ పునరుద్ఘాటించారు. సిరిసిల్ల నియోజకవర్గంలోని పలు మండలాల్లో కేటీఆర్‌ విస్తృత పర్యటించారు. రైతువేదిక భవనాలు, రెండు పడక గదుల ఇళ్లతోపాటు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3.అప్రమత్తంగా ఉండండి

కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాస్తున్న వేళ రాష్ట్ర ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఈటల రాజేందర్​ సూచించారు. అవసరమైతే తప్ప బయటికి రావొద్దని... విధిగా మాస్కులు ధరించాలని మంత్రి సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. ప్రచార హోరు

నాగార్జునసాగర్ ఉపఎన్నిక బరిలో 41 మంది అభ్యర్థులు నిలిచారు. మొత్తం 77 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా.. 19 మంది ఉపసంహరించుకున్నారు. మరోవైపు పోలింగ్‌ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ అభ్యర్థులు ప్రచారజోరు పెంచారు. ఇంటింటికీ వెళ్లి ఆశీర్వదించాలని ఓటర్లను కోరుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5.ఇంటర్మీడియట్​ ప్రాక్టికల్స్​ వాయిదా

కరోనా తీవ్రత కారణంగా ఈనెల 7 నుంచి రెండో సంవత్సరం విద్యార్థులకు జరగాల్సిన ప్రాక్టికల్స్ పరీక్షలను ఇంటర్మీడియట్ బోర్డు వాయిదా వేసింది. థియరీ, జేఈఈ నాలుగో విడత మెయిన్ పరీక్షలు పూర్తయిన తర్వాత ప్రయోగ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6.'అభివృద్ధికి ఆటంకం'

టీఎంసీ నేతలు, మమతా బెనర్జీ ఆలోచనా విధానం వల్ల బంగాల్​ అభివృద్ధికి ఆటంకం ఏర్పడిందని ప్రధాని మోదీ అన్నారు. హూగ్లీ అరంబాగ్​ ప్రచార సభలో పాల్గొన్న ఆయన మమతా బెనర్జీపై విమర్శలు ఎక్కుపెట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7.'భాజపా విభజన రాజకీయం'

ఎంఐఎం, ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ పార్టీలను భాజపా ప్రోత్సహిస్తోందని బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. దక్షిణ 24 పరగణాల జిల్లాలో శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఈ మేరకు వ్యాఖ్యానించారు. రెండు పార్టీలు భాజపా నుంచి డబ్బు తీసుకున్నాయని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8.అమర జవాన్లు

ఛత్తీస్‌గఢ్​ బీజాపూర్ జిల్లా అడవుల్లో ఎన్‌కౌంటర్‌లో జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు భద్రతా సిబ్బంది మృతి చెందగా.. మరికొందరు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9.హైదరాబాద్​లోనూ ఐపీఎల్​!

ముంబయిలోని వాంఖడే మైదాన సిబ్బందితో పాటు ఈవెంట్​ మేనేజర్లకు కొవిడ్ సోకినట్లు నిర్ధరణ కావడం ఐపీఎల్​ అభిమానుల్ని కలవరపరుస్తోంది. ఒకవేళ అక్కడి పరిస్థితి చేయిదాటితే, ఆ మ్యాచ్​ల్ని హైదరాబాద్​లో నిర్వహించే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10.'వకీల్​సాబ్'​ భామకు కరోనా పాజిటివ్​

నటి నివేదా థామస్​కు కరోనా పాజిటివ్​గా తేలింది. ఈ విషయాన్ని తెలిపిన ఆమె.. ప్రస్తుతం తాను స్వీయ నిర్బంధంలో ఉన్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.